మ్యూజిక్ థెరపీ అనేది క్లినికల్ థెరపీ, బయో మ్యూజికాలజీ, మ్యూజికల్ అకౌస్టిక్స్, మ్యూజిక్ థీరీ, సైకో అకౌస్టిక్స్, కంపే రిటివ్ మ్యూజికాలజీల మధ్య సంబంధా లను అధ్యయనంచేసే శాస్ర్తీయ పరిశోధన. ఈ చికి త్సా క్రమంలో సుశిక్షితుడైన మ్యూజిక్ థెర పిస్టు భౌతిక, భావాత్మక, మానసిక, సామా జిక, సౌందర్య, ఆధ్యాత్మిక కోణాల్లో సంగీతా న్ని ఉపయోగించి వ్యక్తులు ఆరోగ్యాన్ని పొంద డానికి సహాయపడతాడు. వివిధ సంగీత రీతు లను ఉపయోగించి వివిధ రంగాల్లో జీవిత నాణ్యతను, పనిచేసేతీరును మెరుగు పరు చుకోవడానికి మ్యూజిక్ థెర పిస్టులు ప్రధానంగా సహాయ పడతారు. ఫలితంగా అంచనా వేయదగ్గ చికి త్సా లక్ష్యాలను సాధిస్తారు. డాక్టరుగానీ, సైకా లజిస్టులు, ఫిజికల్ థెరపిస్టులు, వృత్తిపర మైన థెరపిస్టులున్న ఇంటర్ డిసిప్లినరీ టీమ్ మ్యూజిక్ థెరపీ సేవలను సిఫార్సు చేయ వచ్చు. సహాయపడే వృత్తుల్లో దాదాపు ప్రతి అంశంలో మ్యూజిక్ థెరపిస్టులు వున్నారు. టర్కో-పెర్షియన్ సైకాలజిస్టు, మ్యూజిక్ సిద్ధాంతవేత్త అయిన అల్-ఫరాబీ (872- 950) యూరోప్‌లో ‘అల్‌ఫరాబియస్’గా సుప్రసిద్ధుడు.
‘మీనింగ్ ఆఫ్ ఇంటెలెక్ట్’ అన్న తన పుస్తకంలో మ్యూజిక్ థెరపీ గురించి చర్చించాడు. ఈ రచనలో సంగీతం ఆత్మపై కలిగించే చికిత్సాపరమైన ప్రభావాలను వివరించాడు. 17 శతాబ్దపు రాబర్ట్ బర్టన్ తన రచన ‘ది అనాటమీ ఆఫ్ మెలాంకొలీ’ లో మానసిక జబ్బును ముఖ్యంగా మెలొంకొలి యా వ్యాధి చికిత్సకు సంగీతం నాట్యం ఎంతో ఉపయోగకరమైనవని అభిప్రాయపడ్డాడు.
చివరికి సంగీతరహితం గా చికిత్సపొందుతున్న వారిని ఎలా ప్రభావి తం చేస్తుందో పరిశీలిస్తుంది. ‘‘ఈ విధానంలో మెదడును సంగీతంలో లీనం చేసి మార్చుతా రు’’ అని అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రొఫె సర్, పరిశోధకుడు డా థాట్ అంటున్నారు.
కొందరు పిల్లలు వాయిద్యాలను వాయించగలరు, కొందరు వాయించలేరన్న విషయం గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. కనుక పిల్లలకు వారికి తగిన వాయిద్యం ఇవ్వాలి. ఈ అంశాలన్నీ మ్యూజిక్ థెరపీ సఫలమవడానికి సత్ఫలితాలివ్వడానికి దోహ దపడతాయి. నిజానికి పిల్లల మ్యూజిక్ థెరపీ మాతృగర్భంలోనే మొదలవుతుందంటారు డానియెల్ లెవిటిన్. ఏమ్నియోటిక్ ఆసిడ్‌లో చుట్టుకొనివున్న గర్భస్థ శిశువు తల్లి గుండె చప్పుడు వింటుంది. అదే కాక సంభాషణలు, పర్యావరణపనమైన శబ్దాలు వింటుంది. పిండం సంగీతం వింటుందని యుకెలోని కీల్ విశ్వవిద్యాలయంకు చెందిన అలెగ్టాండ్రా లమోంట్ అంటున్నారు. పుట్టిన ఏడాది తర్వాత పిల్లలు సంగీతాన్ని గుర్తిస్తారని, కోరుకుంటారని కూడా అంటున్నారు. ఆకృతి దాల్చిన తర్వాత 20 నెలలు నిండిన గర్భస్థ శిశువు వినికిడి వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయనారంభిస్తుందని వారంటున్నారు.
‘మీనింగ్ ఆఫ్ ఇంటెలెక్ట్’ అన్న తన పుస్తకంలో మ్యూజిక్ థెరపీ గురించి చర్చించాడు. ఈ రచనలో సంగీతం ఆత్మపై కలిగించే చికిత్సాపరమైన ప్రభావాలను వివరించాడు. 17 శతాబ్దపు రాబర్ట్ బర్టన్ తన రచన ‘ది అనాటమీ ఆఫ్ మెలాంకొలీ’ లో మానసిక జబ్బును ముఖ్యంగా మెలొంకొలి యా వ్యాధి చికిత్సకు సంగీతం నాట్యం ఎంతో ఉపయోగకరమైనవని అభిప్రాయపడ్డాడు.
మ్యూజిక్ థెరపీ - రకాలు...
మ్యూజిక్ థెరపీ ఆధారాల గురించి విభిన్న ఆలోచనా ధోరణులున్నాయి. ఒకటి విద్యపై ఆధారపడినది. రెండు సరాసరి మ్యూజిక్ థెర పీ పైనే ఆధారపడినవి. ఇదే కాక సైకాలజీ పై ఆధారపడిన ధోరణులు కూడా వున్నాయి. న్యూరోసైన్స్‌పై ఆధారపడిన చికిత్సా ధోరణి కూడా ఉంది. ప్రవర్తనా పరమైన-భావోద్రేక పరమైన రుగ్మతలకు లోనైన వ్యక్తులకు మ్యూ జిక్ థెరపిస్టులు వైద్యం చేయవచ్చు. ఈ తర హా ప్రజానీకం అవసరాలను నెరవేర్చడం కోసం సమకాలీన మనస్తత్వ సిద్ధాంతాలను తీసుకుని మ్యూజిక్ థెరపిస్టులు వివిధ తరహా ల మ్యూజిక్ థెరపీకి ఆధారంగా వాటిని విని యోగించారు. బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ వీటిలో వివిధ నమూనాలు. న్యూరోసైన్సు పై ఆధారపడిన థెరపీ నమూనాను న్యూరలాజిక ల్ మ్యూజిక్ థెరపీ (ఎన్‌ఎంటి) అంటారు. సంగీతం లేనప్పుడు మెదడు ఎలా వున్నదీ, సంగీతం వున్నప్పుడు మెదడు ఎలావున్నదీ, తేడాలను అంచనా వేసి మ్యూజిక్ ద్వారా మెద డులో మార్పులు తీసుకురావడానికి ఆ తేడాల ను వినియోగిస్తారు. చివరికి సంగీతరహితం గా చికిత్సపొందుతున్న వారిని ఎలా ప్రభావి తం చేస్తుందో పరిశీలిస్తుంది. ‘‘ఈ విధానంలో మెదడును సంగీతంలో లీనం చేసి మార్చుతా రు’’ అని అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రొఫె సర్, పరిశోధకుడు డా థాట్ అంటున్నారు.
పిల్లలకు మ్యూజిక్ థెరపీ...
పిల్లలకు చేసే మ్యూజిక్ థెరపీలో రెండు విధానాలున్నాయి. ఒక గ్రూపు సిట్టింగులో చికిత్స చేయయడం ఒకటి కాగా, ప్రత్యేకిం చి ఒకరికి కూడా ఈ చికిత్స ఇవ్వవచ్చు. భావప్రసార (కమ్యూనికేషన్) సమస్యలు న్న బాలలకు, ప్రేరణ, ప్రవర్తనాపరమైన సమస్యలున్న పిల్లలకు మ్యూజిక్ థెరపీ సహాయపడగలదు. ఇందులో చికిత్స చేసే గది ఏర్పాటు చాలా ప్రధానమైంది. పిల్లలు సౌకర్యంగా వుంటూ వారు సరైన సంగీతం వినిపించడానికి ఇదెంతో అవసరం. అలాంటి గది పూర్తిగా సంగీతానికే కేటాయించిన గదై వుండాలి. గదిలో దృష్టిని మళ్ళించే ఇతర వస్తువులుండకూడదు. గదిలో వెలుతురు బాగుండాలి, వాతవరణం సమశీతోష్ణంగా వుండాలి. మరీ వేడిగా లేక మరీ చల్లగా ఉండ కూడదు. గదిలోకి సులువుగా రాకపోకలకు వెసులుబాటు వుండాలి. కుర్చీలు మంచివై వుండాలి. జాగిలపడేలా వుండకూడదు. ఇక వాయిద్యాల విషయానికి వస్తే వివిధ ప్రాంతాల కు చెందిన భిన్న వాయిద్యాలుండడం మంచి ది. వివిధ రంగులు, రకాల వాయిద్యాలుండ డం మంచిది. థెరపిస్టు పియానోగానీ గిటార్ గానీ వాయించాలి. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మంచి నాణ్యమైన వాయి ద్యాలు వినియోగించాలి. వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. కొందరు పిల్లలు వాయిద్యాలను వాయించగలరు, కొందరు వాయించలేరన్న విషయం గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. కనుక పిల్లలకు వారికి తగిన వాయిద్యం ఇవ్వాలి. ఈ అంశాలన్నీ మ్యూజిక్ థెరపీ సఫలమవడానికి సత్ఫలితాలివ్వడానికి దోహ దపడతాయి. నిజానికి పిల్లల మ్యూజిక్ థెరపీ మాతృగర్భంలోనే మొదలవుతుందంటారు డానియెల్ లెవిటిన్. ఏమ్నియోటిక్ ఆసిడ్‌లో చుట్టుకొనివున్న గర్భస్థ శిశువు తల్లి గుండె చప్పుడు వింటుంది. అదే కాక సంభాషణలు, పర్యావరణపనమైన శబ్దాలు వింటుంది. పిండం సంగీతం వింటుందని యుకెలోని కీల్ విశ్వవిద్యాలయంకు చెందిన అలెగ్టాండ్రా లమోంట్ అంటున్నారు. పుట్టిన ఏడాది తర్వాత పిల్లలు సంగీతాన్ని గుర్తిస్తారని, కోరుకుంటారని కూడా అంటున్నారు. ఆకృతి దాల్చిన తర్వాత 20 నెలలు నిండిన గర్భస్థ శిశువు వినికిడి వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయనారంభిస్తుందని వారంటున్నారు.
భారత్‌లో మ్యూజిక్ థెరపీ...
మన భారతీయ శాస్ర్తీయ సంగీత రాగాలకు చికిత్సాపరమైన గుణాలున్నాయని వేదాలు చెబుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే సంగీ తాన్ని చికిత్సాపరమైన సాధనంగా మన పూర్వీ కులు ఉపయోగించారు. భారతదేశంలో సంగీ తం ఒక యోగా పద్ధతి. శ్రావ్యతకు ఆధారం రాగం. భారతీయ సంగీతానికి శ్రావ్యతే మౌ లిక స్వరం. కేంద్ర నాడీ మండలానికి సంబం ధించిన ఎన్నో వ్యాధులు మాన్పడంలో వివిధ రాగాలు ఎంతో ప్రభావవంతమైనవని వెల్లడైం ది. సంగీతాన్ని ఒక చికిత్సగా వినియోగించే ముందు ఏ విధమైన సంగీతం వాడాలో నిర్ధా రించుకోవాలి. సంగీతం మౌలిక గుణగణా లను సరిగా వినియోగించడం, స్వరం సవ్యం గా పలకడంపై సంగీత చికిత్స భావన ఆధారప డివుంది. ఒక్కో రాగం వైవిధ్యం అనూహ్యమైం ది. కను క ఒక నిర్ణీత వ్యాధికి ఒక నిర్దిష్టమైన రాగం పనిచేస్తుందని చెబుతారు. మ్యూజిక్ థెరపీ అన్న మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతికి వర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో భార తీయ శాస్ర్తీయ గాత్ర సంగీతానికి సంబంధిం చిన లిఖిత సాహిత్యం తగినంతగా లేదు.
No comments:
Post a Comment