Friday, January 7, 2011

శక్తి తగ్గుతోంది..!

woman-going...
కొందరు మహిళలు ఇంటి పని, వంట పని.. ఇలా అన్నీ ముగించుకుని ఆఫీసుకు వెళ్లినప్పటికీ నిస్సత్తువుగా ఉంటారు. ఏ పనిచేయలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్కరికో వుండే సమస్య కాదు.. చాలా మంది మహిళలు ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటూనే వున్నారు. దీనికి పూర్తిగా కారణం మాత్రం ఆహారం బాధ్యత మాత్రమే కాదు. శరీరానికి కావలసినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

రోజూ కనీసం ఓ అరగంట పాటై నా నడక అలవాటు చేసుకోవాలి. లేదా చిన్న పాటి ఏరోబిక్స్‌ చేసినా పర్వాలేదు. వీటికి తోడు తగిన ఆహారం తీసుకోవాలి. దీని వల్ల స్టామి నా కూడా పెరుగుతుంది.
నీరసం తగ్గాలంటే కార్బోహైడ్రెడ్స్‌, ప్రోటీన్స్‌, మినరల్స్‌, విటమిన్లు సమపాళ్లలో వున్న ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తీసుకోవాలి. చలికాలం అయినా సరే నీరు తప్పకుండా తీసు కోవాలి.

నిదానంగా చేసే యోగా సనాల వల్ల శారీరక దారుఢ్యం పెరుగుతుంది. కాబట్టి నిపుణుల శిక్షణలో అటు వంటి ఆసనాలను కనుక్కోని రోజూ చేయాలి. అలాగే మానసిక ఆనం దానికి కూడా తగిన ఆసనాలు వుంటాయి. వాటిని రోజూ చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా కూడా వుంటుంది.

ఉదయం నడవాలని అనుకున్నప్పుడు మొదట ఒకేసారి కాకుండా పది నిమిషాలు, పదిహేను ఇలా పెంచుకుంటూ పోవాలి. కనీసం అరగంట పాటు వాకింగ్‌ చేసేలా వుండాలి. తరువాత జాగింగ్‌ కూడా చేసు కోవచ్చు. దీని వల్ల రోజంతా ఎంతో ఉల్లాసంగా వుంటుంది.

ఆరోగ్యం ఎలా వుందో....
ఆరోగ్యంగా వున్నారా లేరా అని కూడా అప్పుడప్పుడూ చెక్‌ చేసు కుంటూ వుండాలి. అందుకోసం ఎవరి దగ్గరికో వెళ్లాల్సిన పనిలేదు. ఎవరికి వారే చూసుకోవచ్చు. కాస్త నెమ్మదిగా కాకుండా మీడియంగా నడుస్తూ కొంతదూరం వెళ్లడం లేదా మెట్లు ఎక్కడం వంటివి చేయాలి. ఓ పదినిమిషాలు చేసిన తరువాత ఊపిరి ఎలా వుందో చూసుకోవాలి. గాలి పీల్చుకోవడం గనుక కష్టమైతే మాత్రం డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చెక్‌ చేయించుకోవడం మంచిది. అలా కాకుండా కొద్దిగా అలసట వస్తే మాత్రం పర్వాలేదు. కానీ జాగ్రత్త తీసుకోవాలి. రోజూ ఉదయం పూట వాకింగ్‌ వంటివి చేయడం వల్ల ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. అయితే అందుకు తగ్గ ఆహారాన్ని కూడా తీసుకోవడం మరువరాదు.

No comments: