Thursday, January 27, 2011

బాధల నివారిణి బాదం

బాదం గురించి తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా బాదం వాడకం ఎక్కువే. అందం, ఆరోగ్యం ఇలా అనేక రకాలుగా బాదం మనిషికి మేలు చేస్తుంది. అత్యధిక పోషకాలున్న బాదం పప్పు వల్ల అనేక లాభాలున్నాయి. బాదం మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాటియాసిడ్లు, విటమిన్‌ ఇఉంటాయి.ఈ రెండూ గుండెజబ్బుల బారి నుంచి కాపాడుతాయి. రోజూ కనీసం ఐదారు బాదం పప్పులు తప్పనిసరిగా తీసుకోవాలి.

badam1
  • అన్ని రకాల ఖనిజలవణాలు, విటమిన్లు వెరసి సూక్ష్మ పోషకాలు బాదం సొంతం. ఎముకలు ఆరోగ్యంగా, పటుత్వంగా ఉండేందుకు బాదంలోని ఫాస్ఫరస్‌, కాల్షియం తోడ్పడుతాయి. ఆస్టియోపొరోసిస్‌కు ఇది మంచి నివారణ.
  • ప్రతి వందగ్రాముల బాదం పప్పులో రాగి 1.15 మిల్లీగ్రాములు ఆర్గానిక్‌ రూపంలో లభిస్తుంది. ఈ రాగితో పాటు ఇనుము.. ఇతర పోషకాలు కూడా అధికం. బాదం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను పోగొడుతుంది.
  • కడుపునొప్పి, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా బాదం తింటే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు వైద్య నిపుణులు.
  • బాదంలో విరేచనాన్ని కలిగించే గుణం ఉండడమే అందుకు కారణం.
  • బాదంలోని మెగ్నీషియం, బి6 విటమిన్‌- జీవక్రీయకు శక్తినందించి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతాయి.
  • పాయసం చేస్తున్నపుడు బాదం పేస్టును రెండుచెంచాలు కలిపి చూడండి. పాయసం చిక్కబడుతుంది. రుచి పెరుగుతుంది. బలవర్థకం కూడా.
    badam
  • వారానికోసారి కొద్దిగా బాదం నూనె, ఉసిరిరసం కలిపి తలకు రాసుకుని మర్దనాచేయాలి. జుట్టు రాలడం, చుండ్రు, రంగు మారే సమస్యలన్నింటికీ దీనివల్ల పరిష్కారం లభిస్తుంది.
  • గజ్జి, తామర వంటి చర్మ సంబంధ సమస్యలకు బాదం దివ్యౌషధంలా పనిచేస్తుంది. బాదం ఆకులను మెత్తగా పేస్టులాగా చేసి వాడటం వల్ల మొటిమలను నివారించుకోవచ్చు.

No comments: