
టొమాటో + పాలకూర
టొమాటోలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. పాలకూరలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చాలామందిలో అపోహ. కాని వంశపారంపర్యం, నీళ్లు తక్కువ తాగడం.. వంటి కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అంతే తప్ప టొమాటో-పాలకూర కలిపి తినడం వల్ల కాదు.
పొట్లకాయ + గుడ్డు
పొట్లకాయలో నీటి శాతం ఎక్కువ. అలాగే పీచుపదార్థాలు, బి-విటమిన్లు ఉంటాయి. దీని నుంచి వచ్చే శక్తి కూడా తక్కువే. గుడ్డు తెల్లసొనలో అత్యధికంగా ప్రొటీన్లు, పచ్చసొనలో పిండిపదార్థాలు, ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్స్, ఐరన్, లెసిథిన్ ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి వండి తినడం వల్ల ఎలాంటి హాని జరగదు.
చేపలు + పెరుగు చేపలు తిన్న తర్వాత పెరుగు తింటే రుచిగా ఉండదు అనే తప్ప ఇది రాంగ్‌కాంబినేషన్ ఎంత మాత్రం కాదు. చేపల్లో ఉండే ప్రొటీన్లు చర్మం, గుండె, శిరోజాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో క్యాల్షియం, పిండిపదార్థాలు, విటమిన్ ‘సి’... ఉంటాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.
భోజనం + పండ్లు
అన్నంతో పాటుగా పండ్లు తీసుకుంటే అజీర్తి చేస్తుందని చాలా మంది అపోహపడుతుంటారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. అన్నం, కూరలు, స్వీట్లు, పండ్లు ఒకేసారి మోతాదుకు మించి తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ విషయం తెలియక భోజనంలో పండ్లు తీసుకోకూడదు అనుకుంటారు.
నూనెలు + నూనెలు

ఆకుకూరలు + కూరగాయలు + పప్పు దినుసులు
ఆకుకూరల వేర్లలో మట్టితో పాటు ఉండిపోయిన బ్యాక్టీరియా స్పోర్‌లా తయారవుతుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత హాని చేస్తుంటుంది. సరిగ్గా శుభ్రపరచకుండా వేరే పదార్థంతో వండితీసుకున్నప్పుడు ఇబ్బంది తలెత్తుతుంది. ఈ విషయం తెలియక ఫలనా ఆకుకూరను కూరగాయలను కలిపి వండడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటారు. అందుకని ఆకుకూరలను కట్‌చేయడానికి ముందు పదినిమిషాల సేపు ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టాలి. పప్పులతో పాటు ఆకుకూరలను ఉడకబెడితే వాటిలో ఉండే పోషకాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆకుకూరలను విడిగా తగినంత ఉష్ణోగ్రతలోనే మగ్గించి, పప్పు ఇతర కూరగాయల్లో కలుపుకోవాలి.
పడని పదార్థాలు

ఆహారం తినగానే వాంతులు అవడం, కడుపునొప్పి, తలనొప్పి, ఒళ్లంతా దద్దుర్లు వస్తే ఫుడ్ ఫాయిజనింగ్‌కి ఇవి సాధారణ లక్షణాలని గమనించాలి. పడని పదార్థాలు ప్రభావం 48 గం.ల వరకు ఉంటుంది. కొన్ని జాగ్రత్తలతో సమస్యను నివారించుకోవచ్చు. దద్దుర్లు వచ్చి ముఖం వాచడం, విరేచనాలుతీవ్రంగా గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తితే విషాహార ప్రభావం చాలా తీవ్రంగా ఉందని గమనించి వైద్యుల సలహా తీసుకోవాలి.
విషాహారానికి విరుగుడు...
మితంగా పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యం పట్ల తీసుకునే ముందు జాగ్రత్త. ఫుడ్ పాయిజనింగ్‌కి వందల రకాల బాక్టీరియా కారణం అవుతుంటుంది. తిన్న ఆహారం పడకపోవడం జరిగితే లక్షణాల బట్టి వెంటనే ప్రథమ చికిత్స చేయాలి.
గ్లాస్ నీటిలో టీ స్పూన్ ఉప్పు కలిపి తాగితే తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది.
నీళ్లు ఎక్కువగా తాగాలి. దీని వల్ల ఆహారంలో చేరిన రసాయనాలు నీళ్లలో కలిసిపోయి బయటకు వస్తాయి.
పల్చని మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగాలి. లేదా పెరుగు తినాలి. పెరగులో ఉండే లాక్టోబాసిలై బ్యాక్టీరియా అజీర్తిని నివారిస్తుంది.
అజీర్తిగా అనిపిస్తే అరటిపండు తినడం మంచిది.
ఆహారం తిన్న తర్వాత గుండె దడగా అనిపించినా, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, కళ్లు తిరిగి పడిపోయినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

No comments:
Post a Comment