రోజూ వ్యాయామం చేయాలనే అనుకుంటున్నా కానీ టైమ్ దొరకట్లేదు... అనుకునే కంప్యూటర్ ఉద్యోగులకు నాలుగు నిమిషాల్లో పూర్తిచేయగలిగే చిన్న చిన్న వ్యాయామాలు సూచిస్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. వీటిని మీ డెస్క్ ముందే ఆఫీసులోనే చేయవచ్చు కూడా. అలాగని ఈ వ్యాయామాలను తీసిపడేయలేం. ఆఫీసులో ఉన్నప్పుడు గంటకోసారి వీటిని చేస్తే మెడనొప్పి, నడుంనొప్పి, కండరాలు పట్టేయడం లాంటి సమస్యలకు ఇవి దివ్యౌషధాలు. అవేంటో చూద్దాం మరి.
* రెండు చేతులను ముందుకు చాచి రెండు అరచేతులను కలిపి వుంచండి. అలా 10 నుంచి 20 సెకన్ల పాటు ఉండండి. చేతులు రెండూ స్ట్రెయిట్‌గా ఉండేలా చూడండి.
* ఇప్పుడు లేచి నిలబడి రెండు చేతులను అదేవిధంగా పైకి తీసుకురండి. మీ తల భాగం నుంచి నిటారుగా పైకి ఎత్తి పట్టుకోండి. ఇలా 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండండి.
* ఇప్పుడు రెండు చేతులను మడిచి అంటే ఒకదాని అరచేతిని మరోదాని మోచేతిపై ఉంచండి. అలా పైకే ఉంచండి. ఇప్పుడు మెడ, భుజం భాగాలను కుడివైపు కొద్దిగా వంచి, 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి. తిరిగి ఎడమవైపు కూడా ఇలాగే చేయండి.
* చేతులు కిందకి దించేసి భుజాలను పైకీ, కిందకీ ఎగరేయండి. ఇలా 3 నుంచి 5 సెకన్లు చేయండి. * కిందికి ఉన్న చేతులను వెనకాల ఒకదాన్ని ఒకటి పట్టుకోండి. మెడ, భుజాలను కుడి వైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి వంచి, ఒక్కోవైపు 10 నుంచి 12 సెకన్లు కేటాయించండి.
* దండం పెడుతున్నట్టుగా రెండు అరచేతులను కలిపి ఉంచండి. ఇలా 10 సెకన్లు ఉన్న తరువాత పైకి కలిపివున్న అరచేతులను కిందివైపు దించండి. ఇలా మరో 10 సెకన్లు ఉండండి.
* కుర్చీలో కూర్చుని ఒక చేయి నడుము మీదుగా కిందకి వేలాడదీసి, మరో చేతిని పైకి నిలబెట్టి పట్టుకోండి. రెండు చేతులనూ ఇలా చేయండి. ప్రతిసారీ 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి.
* కూర్చునే ఉండి నడుం భాగాన్ని మాత్రం పైకి లేపి, తలను ఎత్తి ఉంచండి. దీనికి 10 నుంచి 15 సెకన్లు కేటాయించండి.

1 comment:
నమస్తే .....
చాల బాగుంది 4 నిమిషాల వ్యాయామం ... ఇది మా ఆయనకు చాల ఉపయోగకరంగా ఉంది. మాకు ఇంకో విషయం కావాలండి....
1 వ్యాయామం ఎలా మొదలు పెట్టాలి
2 ఎంతసేపు చేయాలి
3 ఎప్పుడు చేయాలి
నా వయసు 27 . పొట్ట తగ్గడానికి ఇంకా ఆరోగ్యం భాగుండడానికి వ్యాయామం కొత్తగా మొదలు పెట్టలనుకున్తున్నాము, దయచేసి ఈ విషయాలు తెలుపగలరు....
ధన్యవాదాలు
Post a Comment