Thursday, September 2, 2010

రుచి - ఆరోగ్యం

కేవలం మార్పు అనేది ఏ ఒక్క విషయానికో పరిమితం కాదు. ప్రతి నిమిషం.. ప్రతి క్షణం కూడా మారిపోతూనే వుంటాయి. ఇందులో కొన్ని మార్పులు మంచి పరిణామాలకు దారితీస్తే మరికొన్ని చెడు ప్రభావాలను చూపిస్తాయి. ఆహార విషయం కూడా అంతే. సమయాల్లో తేడాలు.. తినేతిండిలో మార్పులు.. రోజు రోజుకూ పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతి.. అనుకరించే విధానాలు అన్నీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలకు దారి తీస్తున్నాయి. అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. అప్పటికప్పుడు అది బాగానే వున్నా సమయం గడిచేకొద్దీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


cup 
బయట దొరికే ఆహారం తక్కువ ధరతో...  చాలా సులువుగా లభిస్తుంది. ఇంట్లో కష్టపడి చేసుకునే వాటికన్నా వీటికి రుచి కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. బయట దొరికే ఆహారంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ కాస్త ఎక్కువే ప్రాధాన్యతనే సంపాదించుకున్నాయి. ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌లో చాలా వరకు ఎక్కువగా ఫ్రై రూపంలోనే ఇష్టపడతారు. వీటిని రుచి కోసం కానివ్వండి.. లేదా ఇంకేదైనా సరే.. ఎక్కువగా వేయిస్తారు. ఇలా చేసే వాటిలో పైబర్‌ చాలా తక్కు వగా వుంటుంది. కాలరీస్‌ శాతం చాలా ఎక్కువగా వుంటుంది. అన్ని సందర్భాల్లోనూ ఇదే నిజం కాకపోవచ్చు. కొన్నిటి వల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా దొరక వచ్చు. కానీ చాలా వరకు వీటి వల్ల నష్టమే ఎక్కువగా వుంటోంది.

ఎంత వరకు...
ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవడంలోనూ కొన్ని పరిధులు వుంటాయి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి మాత్రమే ఆహారం ఒక మార్గంగా చూడాలి. ఆకలి లేకున్నా దొరికినది తినడం సరికాదు. దీని వల్ల అదనపు కేలరీస్‌ ఒంట్లో చేరి ఒబెసిటీకి దారితీయవచ్చు. స్నాక్స్‌ తీసుకునే సమయంలోనూ ఎంత తీసుకుంటున్నాం అన్నది మననంలో వుండాలి. అన్నిటినీ సమం చేసుకోవాలి. ఆరోగ్య నియమాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్నాక్స్‌ శరీరానికి కేవలం బలాన్ని ఇచ్చేవిగా వుండేలా ఎంచుకోవాలి.

అనారోగ్య సమస్యలు..
brad 
డయాబెటీస్‌తో బాధపడేవారు స్నాక్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ పదార్థాలు తీసుకునే సమయంలో కాస్త ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇన్సులిన్‌ తీసుకునే వారు మరింత జాగ్రత్తలు పాటించాలి. పైబర్‌ శాతం అధికంగా వుండి, ఫ్యాట్‌ తక్కువగా వుండే పదార్థాలను ఎంచుకోవాలి. కాంప్లెక్స్‌ కార్పొహైడ్రేట్స్‌ ఎక్కువగా వుండే ఓట్స్‌, కూరగాయలు ఎక్కువగా వుండేది కూడా ఫాస్ట్‌ ఫుడ్‌ల రూపంలో దొరుకుతున్నాయి. వాటిని కొంత వరకు తీసుకున్నా నష్టం ఏమీ వుండదు. దీనికితోడు పండ్లు కూడా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో రక్త క్రియలు అన్నీ అదుపులో వుండేలా అవి చేస్తాయి.

ఏం చేయాలి..
ఆకలి లేకుండా తినడం మాత్రం మార్చుకోవాలి. కొన్ని పదార్థాలు రుచి పరంగా ఎంత తిన్నా ఇంకా తినే విధం గా వుంటాయి. ఉదాహరణకు చిప్స్‌ వం టివి. వీటిని తీసుకునేప్పుడు ముందుగా ఎంపికలోనే మార్పుచేసుకోవాలి. ఇప్పుడు అనేక రకాల స్నాక్స్‌ మంచి చేసే విధంగా కూడా తయారవుతున్నాయి. కాస్త ధర ఎక్కువ అయినా అవి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఇటువంటి పదార్థాలను ఎంపిక చేసుకోవడం మంచిది. టివీ చూస్తూ, లేదా కబుర్లు చెప్పుకుంటూ తినేప్పుడు కాస్త జాగ్రత్త లు తీసుకోవాలి. లేకపోతే ఎక్కువగా తినే అవకాశం వుంటుంది.

No comments: