ఉల్లాసంగా..ఉత్సహంగా
అందం అంటే శ్రద్ద చూపించని ఆడవారుండరు. కొంచెం ఒళ్లు వచ్చినట్లు కనిపిస్తే ఏకంగా భోజనం చేయడం కూడా మానేస్తారు. రకరకాల క్రీములు వాడుతూ తమ అందాన్ని మరింత పెంచుకు నేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కేవలం సౌందర్యసాధనాల మూలంగా మహిళల అందం పెరగదని, మంచి అహారం తీసుకోవడంతో పాటు ఎప్పుడూ ఆనందంగా ఉంటే అందం దానంతటే అదే పెరుగుతుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు అత్యుత్తమమైన పోషక విలువలు ఉన్న ఆహారం తప్పకుండా తీసుకోవాలి. వీలైనంత మేరకు నూనెతో కూడిన ఆహార పదా ర్థాలకు దూరంగా ఉండడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఆహారం లో రైస్ ఐటమ్స్ కూడా తగ్గించాలట. ఎక్కువగా పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం చేస్తూ కార్బో హైడ్రేట్‌లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి, అందానికి కూడా మంచిదని వారి అభిప్రాయం. శాఖాహారులు ఎక్కువగా పీచు పదార్థాలుండే ఆహారం తీసుకుంటే, మాంసాహారులు మాత్రం కోడిగుడ్డులోని తెల్లసొన, కోడికూర, చేపలు తప్పకుండా తీసుకోవాలి. పొట్టేలు, మేకపోతు మాంసానికి కాస్త దూరం వుండటం మంచిదంటున్నారు.
ఆనందం తోడుంటే...
అయితే కేవలం ఆహారం తీసుకున్నంత మాత్రన్నే అందంగా ఉంటామనుకుం టే పొర పాటు. ఆహారపు అల వాట్లు మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడి తే సంతోషం అందాన్ని ఇనుమడింపజేస్తుందట. అందుకే ఎప్పుడూ ప్రశాంతవ దనంతో ఉండడానికి ప్రయత్నించాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎల్లప్పు డూ ఆహ్లాదకరంగా ఉంటే మన మనసు సంతోషంగా ఉంటుంది. కనుక పనిచే సే చోట, ఇంట్లో ప్రశాంత వాతవరణం ఉండేలా జాగ్రత్తతీసుకోవాలి. చిన్నచి న్న సమస్యల గురించి పెద్దగా ఆలోచించకుండా వాటిని త్వరితగతిన పరిష్కరిం చుకునేందుకు ప్రయత్నించాలట. దీని వలన మానసిక ఒత్తిడి తగ్గిపోతుందట.ఎప్పుడైతే మానసిక ఒత్తిడి శరీరంలో ఉండ దో అప్పుడు మీ అందం ద్విగుణీ కృతమౌతుంది.
శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి...
శారీరక ఒత్తిడి మూలంగానే మానసిక పరమైన సమస్యలు తలెత్తు తాయని, అందుకే శరీరానికి ఎప్పుడూ విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నించమంటున్నా రు. వారానికి ఒకసారి మసాజ్ చేయించు కోవడం, అలసిపోయిన సమయం లో నిద్రకు ముందు మంచి సంగీతాన్ని వినడం, వీలును బట్టి సాయంత్రం పూ ట వివిధ సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లి సేద తీరడం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందట. ఇలా చేయడం వల్ల మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని, అప్పుడు మరింత అందంగా కనిపిస్తారని నిపుణులు అంటున్నారు.
No comments:
Post a Comment