Thursday, September 9, 2010

బరువు తగ్గాలంటే

అందమైన, నాజూకైన శరీరాకృతి ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటుంది. కోరిక ఉన్నంతమాత్రాన సరిపోదు. దానికీ కొన్ని పద్ధతులున్నాయి.. తేలికగా బరువు తగ్గాలనుకునే వారి కోసమే ఈ చిట్కాలు.


Slimబరువు తగ్గాలనుకునేవారికి సూర్య నమస్కారాలు చాలా చక్కని వ్యాయామం. సూర్య నమస్కారాల ద్వారా అనుకున్న సమయంలో అనుకున్నంత బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారికి అబ్డామినల్‌ ఎక్సర్‌ సైజులు బాగా ఉపకరిస్తాయి. నిటారుగా నిల్చుని, మోకాళ్లు ఏ మాత్రం వంగకూడదు ఈ విధంగా ప్రతి రోజూ కనీసం పావుగంట అయినా చేసినట్లయితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును నెమ్మదిగా కరిగించవచ్చు.

నాట్యం క్యాలరీలను కరిగిస్తుది. ఇంట్లోనే టేప్‌ రికార్డర్‌ లేదా, డివిడిలు పెట్టుకుని ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు డ్యాన్స్‌ చేసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు సూచి స్తున్నారు. అదే విధంగా ప్రతి రోజూ కొంత సేపు సైకిల్‌ తొక్కడం ద్వారా కూడా అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చని వారు అంటున్నారు.

నడక చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయినా భోజనం చేసిన వెంటనే బ్రిస్క్‌ వాక్‌ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం వలన గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేవారు భోజనానికి కనీసం అరగంట ముందే దాన్ని పూర్తి చేయాలని వారు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూరగాయలు మంచి ఛాయిస్‌. మాంసాహారం జోలికి పోకుండా కూరగాయలు తీసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. నీరు తాగడం మంచిదే అయినా భోజనానికి ముందు లేదా, తరువాత మాత్రమే తాగాలి. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.

articleషుగర్‌ పేషెంట్లు మాత్రం వ్యాయామం చేసే సమయాన్ని ఎప్పుడు చేయాలి? అన్న విషయాలను నిపుణులను అడిగి వారి సలహా ప్రకారం చేయాలి. 40 సంవత్సరాలు దాటిన మహిళలు వ్యాయామం జోలికి పోకుండా యోగా ప్రాక్టీస్‌ చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిన తరువాత గ్లాసు గోరువెచ్చని నీటిని తాగినట్లతే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును క్రమేపీ కరిగించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఉలవలను పప్పు లేదా చారు రూపంలో వారంలో కనీసం రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో సన్నగా, నాజూకుగా తయారుకావాలనుకునే వారు బ్లాక్‌ కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు.

No comments: