అందానికి ప్రతిరూపం మహిళ అంటారు. పల్చటి చర్మం ఉంటే అందం మరింత ఇనుమడిస్తుంది. చర్మాన్ని అందంగా ఉంచుకోవడమే కాదు. శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఆధునిక కాలంలో చాలామంది మహిళలు తమ చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడానికి సమయం దొరకడం లేదని తెగ ఆందోళన చెందుతున్నారు. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించలేని వారు తక్కువ సమయంలోనే మెరుగెైన అందాన్ని పొందడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు బ్యూటీషియన్లు.
- చర్మాన్ని వీలయినంత వరకు రోజుకు రెండు, మూడుసార్లు శు భ్రపరుస్తుండాలి. దీంతో ముఖంపెైనున్న స్వేద గ్రం థులు శుభ్రమై మరింత చర్మం నిగారింపు సంతరించు రించు కుంటుంది. రాత్రి పడుకునే ముందు కూడా ముఖాన్ని క్లెనర్స్‌తో శుభ్ర పరుచుకోవాలి.
- ముఖంపెై మొటిమలుంటే చాలామంది అమ్మాయిలు వాటిని గోళ్లతో గిల్లుతుం టా రు. అలా చేయకుండా రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా యాంటీ బ్లెమిష్ సొల్యూషన్ లేదా యాంటీసెప్టిక్ క్రీమ్ వాడాలి. వయసుతో పాటు సౌందర్యం... చిన్న పిల్లలుగా ఉన్నపుడు ముద్దుగా ఉండే అమ్మాయిలు యుక్తవయస్సు రాగానే వివిధ రకా ల సమస్యలతో బాధపడుతుంటారు. ఎండ, దుమ్ము వంటి వాటితో శరీరంపెై దుమ్ము, దూళి చేరి ముఖం నల్లగా మారుతుంటుంది. అందుకే వయసుకు తగినట్లు ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటున్నారు సౌందర్య నిపుణులు. 25 సంవత్సరాలు దాటి న తర్వాత చర్మంలో ప్రకృతి పరంగా వచ్చే నిగారింపు తగ్గుతుంది. దీంతో అప్పుడే తమ వయ సుపెైబడినట్లు కనిపిస్తున్నామని తెగ బాధపడుతుంటారు. దీన్ని నివారించడానికి క్రమం తప్పకుండా మాయిశ్చరెైజర్ వాడాలి. స్వేదరంధ్రాలు శుభ్రంగా ఉండేందుకు వీలుగా యాస్ట్రింజెంట్ లోషన్ ముఖానికి రాస్తూ ఉండాలి. సమయంలో మెరుగెైన అందాన్ని పొందడానికి అవసరమైన అన్నీ రకాల చిట్కాలను పాటిస్తే చర్మం ఎప్పుడు తాజాగా కనిపిస్తుంది. 40 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి చర్మంలో నిగారింపు మరింత తగ్గడంతో పాటు చర్మంలో గతంలో ఉండే నూనె శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. కాబట్టి ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత విటమిన్ ఇతో కూడుకున్న క్రీమును ప్రతిరోజు ముఖానికి మాలిష్ చేస్తు ఉండాలి. ప్రతి పక్షం రోజుల కొకసారి ఫేషియల్ చేయించాలి. దీంతో చర్మం నిగారింపును సంతరించుకుని వయస్సును కప్పి పుచ్చుతుంది.యాభెై సంవత్సరాల తర్వాత చర్మం పటుత్వం కోల్పోతుంది. దీంతో చర్మంపెై ముడతలు ఏర్పడడం మొదలవుతుంది. కాబట్టి చర్మాన్ని క్లె న్సింగ్ జెల్‌తో శుభ్రపరుస్తూ ఉండాలి. నియమానుసారం టోనింగ్‌తో పాటు చర్మంపెై క్రీముతో మాలిష్ చేయాలి. అయిల్ థెరపీ : నెలకు ఒకసారి ఆయిల్ థెరపీ చేస్తుండాలి. ఆయిల్ థెరపీ కోసం 2 చెం చాల బాదం నూనె, 2 చెంచాల కొబ్బరినూనెను కలుపుకుని వేడి చేసుకోవాలి. కాటన్‌తో ముఖాకృతిని తయారు చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ఈ మిశ్ర మంతో ముఖా కృతిగా తయారుచేసుకున్న కాటన్‌ను తడపాలి. నూనెలో తడిపిన కాటన్‌ను ముఖంపెై మెల్లగా పెట్టుకోవాలి. కాటన్ చల్లగా తయారయ్యేవరకు ముఖంపెై అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన కాటన్‌ను ముఖంపెై ఉంచాలి. దీంతో ముఖారవిందం మరింత నిగారింపు వస్తుం దన డంలో సందేహం లేదు. ఎక్కువగా ఎండలో తిరగడం మూలంగా చర్మానికి చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీర చర్మాన్ని ఎండనుంచి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ పూస్తుండాలి. ఇలా చేయ డం వల్ల నాజుకుదనంతో పాటు నిగారింపు వస్తుంది.
No comments:
Post a Comment