Saturday, September 4, 2010

‘బ్రౌన్ రైస్’... మీ ఛాయస్

‘వైట్ రైస్’ తినడంకంటే.. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదట. ఓ స్టడీ ప్రకారం బ్రౌన్ రైస్ శరీరంలో షుగర్ తగ్గిస్తుంది.
బ్రౌన్ రైస్ అంటే ఏదో కాదు.. దంపుడు బియ్యమే.. రంగు గోధుమ వర్ణం ఉండటంవల్ల ‘బ్రౌన్ రైస్’ అంటారు.
రెండు లక్షల మంది అమెరికా వైద్యులు, నర్సులు 2 సంవత్సరాల పాటు ఈ బ్రౌన్ రైస్ ఆరగించి ‘బ్రేవ్’మని తేన్చి.. మా ఆరోగ్యాలన్నీ సలక్షణంగా ఉన్నాయ్... మీరు తినండి అని సైన్స్ జర్నల్స్‌లో రాసి మరీ క్లాస్ తీసుకుంటున్నారు.

‘వైట్ రైస్’ వారానికి ఐదుసార్లన్నా తినేవారిలో 17 శాతం షుగర్ వస్తుందట. అల్సర్స్ తగ్గిపోతాయి.
విటమిన్ బి కాంప్లెక్సు ఎక్కువ. థైమిన్, రైబోప్లేవిన్, సయనకోబాలమిన్ అనే విటమిన్లు వుంటాయి. ఇవి నరాల శక్తి పెరుగుదలనిస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

బ్రౌన్ రైస్.. గ్రీన్ చట్నీ.. రెయిన్ బో కర్రీస్. వైట్ కర్డ్.. మీ ఆహారమిక కలర్‌ఫుల్.. ఆరోగ్యం ఫుల్..

-డా. కె.సంధ్యారాణి

No comments: