Thursday, September 16, 2010

చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే .... కారణాలు - పరిష్కారం * బాధించే చుండ్రు.. * నిగనిగలాడే జుట్టు కోసం...


చుండ్రుతో బాధా..?!
టీవీలో యాడ్‌... దువ్వుకుంటుంటే పొట్టులా రాలి బ్లాక్‌ కోట్‌ మీద తెల్లగా పొడి రాలుతూ ఉంటుంది.తలలో విపరీతమైన దురదా? అయితే చుండ్రే కారణం అంటూ మోడల్‌ ఓ షాంపూను చేతిలో పెడుతుంది. ఇది నిత్యం మనం టీవీల్లో చూసేవి. కానీ కేవలం షాంపూలు వాడితేనే తగ్గిపోయే సమస్య కాదు ఇది. ఈ చుండ్రు అనేది ఆడ, మగ భేదం లేకుండా బాధించే సమస్యలలో ఒకటి. కాకపోతే ఎక్కువ శాతం ఈ చుండ్రుతో బాధపడేవారి సంఖ్య పురుషుల కన్నా స్ర్తీలలోనే ఉంటుంది.అసలు చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే కారణాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి... వాటికి పరిష్కారం ఏంటీ అంటే...

aloe-showerసరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకపోవ డం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌...లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. అయి తే చాలా మంది చుండ్రు నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. అలాంటి వైద్యం కన్నా మనమే సొంతంగా ఇంటి వద్దే చుండ్రు నివారణ మందును తయారు చేసుకొని వాడవచ్చు.

పొట్లకాయరసంతో :

సహజసిద్ధంగా చుండ్రు నివారణ మందును ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు ను. మార్కెట్లో దొరికే పొట్లకాయను ఒకటి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి జ్యూస్‌ మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొట్లకాయరసంలో వేరే ఏదీ కలపకుండా దానిని వడగట్టి ఆపళంగా తలంతా వెంట్రు కల మొదళ్ల నుంచి చివరిదాకా పట్టించా లి. అవసరం అనుకుంటే మరో పొట్లకా యను జ్యూస్‌ చేసుకుని మొత్తాన్ని వాడాలి.ఇరవై నిమిషాలపాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన క్రమంగా చుం డ్రు మటుమాయం అవుతుంది. చుండ్రు నివారణకు పొట్లకాయ రసం బాగా పనిచేస్తుంది.పైగా వెం ట్రుకలు నిగనిగలాడేలా చేయడం లోనూ పొట్లకాయ రసం బాగా ఉపకరిస్తుంది.

శనగపిండి:
శనగపిండి నాల్గు స్పూన్లు తీసుకుని ఒక కప్పు పెరుగులో ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కల పాలి. మెత్తగా పేస్ట్‌ మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత పల్చ గా వచ్చిన పిండిని వెంట్రుకల మొదళ్లనుంచి చివళ్ల దాకా వచ్చేలా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయా లి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.

నిమ్మ, జామరసం మిశ్రమంతో:
నిమ్మకాయరసంలో జామ ఆకుల రసాన్ని మేళవించి రెండూ కలి పి వెంట్రుకల లోపల దాకా వేళ్లేట్లుగా పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నా నం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చొప్పున చేస్తుంటే చుండ్రు మటుమాయం అవుతుంది.

హెన్నా :
వెంట్రుకల రంగు మార్చుకోవడానికి హెన్నాను వాడుతుంటారు. అయితే మార్కెట్లో మంచి బ్రాండ్‌ హెన్నాను వాడితే చాలా మంచిది. హెన్నా చుండ్రును అరికట్టడంలో దివ్యంగా పనిచేస్తుంది.

మెంతులు, పెరుగు పేస్ట్‌ :
మెంతులు ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి గుజ్జులా చేసుకుని వెంట్రుకలకు పట్టించాలి. మెంతులు చుండ్రు నివారణలో దివ్యంగా పని చేస్తాయి.

గోరింటాకు :
గోరింటాకు కోసుకురాగానే ఆ ఆకుల రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది.అందులోకి ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కలుపుకుంటే మరింత అనుకూలమైన ఫలితం వస్తుంది.

వెనిగర్‌ :
మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్‌ బాటిల్‌ను తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్‌ చొప్పున కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది.

ఉసిరికపొడి :
పెద్ద ఉసిరికాయలను తెచ్చి నూరి వాటిని ఎండబెట్టి ఆ తర్వాత పొడిచేసుకోవాలి. లేకపోయినా ఉసిరిక పొడి అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరిక పొడిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత ఎవరిచేతనైనా తల మాలిష్‌ చేయించుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కొన్నాళ్లలో తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.

పోషకాహారం :
ఇవన్నీ ఒక ఎత్తయితే... మనం తీసుకునే పోషకపదార్ధాలు ఒక ఎత్తు. ఎక్కువగా ఏ కాలంలో వచ్చే పండును ఆ కాలంలో తప్పక తీసుకోవాలి. చుండ్రు నివారణలో మనం తీసుకునే పండ్లు, వాటి రసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. చుండ్రు ఉన్నవాళ్లు ఎక్కువగా సిట్రస్‌ పండ్లు తీసుకోకపోవడమే మంచిది. అలాగే చుండ్రు తగ్గేదాకా అరటిపండును కూడా తినవద్దు. ఎక్కువ ఆయిలీ పదార్థాలు, పిజ్జాలు, బర్గర్ల వంటివి తగ్గించాలి.



 
బాధించే చుండ్రు.. 

అందాన్ని రెట్టింపు చేసే శిరోజాలు అస్తమానం ఊడిపోతుంటే, మీ అందం అడవి కాచిన వెన్నెల అవుతుంది కదూ! దానికి కారణం చండ్రు. తలలో దురద పెట్టి చికాకు పెట్టడం కారణం కావడమే కాకుండా మాటిమాటికీ తలలో చెయ్యి పెట్టడం చూసే వారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దీని కారణంగా చేసే పనిలో ఏకాగ్రత కూడా తగ్గుతుంది.చుండ్రు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్‌, చర్మతత్త్వాలు అంతర్గతంగా ప్రధానపాత్ర వహించే కారణాలు.

dandruff 
వెంటనే తొలగించాలి...
చుండ్రువల్ల జుట్టు బాగా రాలిపోతుంది. బాగా దురద పెడుతుంది. ముఖం, వీపు, మెడలపై పడి చికాకు పుట్టిస్తుంది. ముఖం పై మొటిమలు కావడం, తలనొప్పికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుం ది. చుండ్రుతో పాటు మొఖం పై అవాంఛిత రోమాలు, స్థూలకా యం, రుతుక్రమంలో తేడాలు కనిపిస్తే పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ సిం డ్రోమ్‌ ఉందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాలి. చండ్రుతో తరుచు ఇబ్బంది పడేవారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీ డాండ్రఫ్‌ షాంపూ వాడకాన్ని ఆపేస్తారు. కానీ ఇలా చేయకూడదు.

చుండ్రు నివారణకు...
చుండ్రు తొలగించడానికి పార్లర్లకు వెళ్ళి చికిత్స తీసుకో అవసరం లేదు. ఇంట్లోనే పాటించే అనేక చిట్కాలవల్ల చుండ్రు తగ్గే అవకాశం ఉంది.
- అరకప్పు పెరుగులో రెండు టేబుల్‌ స్పూన్ల పెసరపిండి కలిపి జుట్టుకు పట్టించాలి. ఆరగంటాగి కడిగేయాలి. ఈ విధంగా వారానికోసారి చేస్తుండాలి.
- ఒక టీ స్పూన్‌ నిమ్మపండు రసంలో రెండు టీ స్పూన్‌ల వెనిగర్‌ని కలపాలి, దానితో తలని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
-వెనిగర్‌ రెండు టేబుల్‌స్పూన్లు మాడుకు పట్టించి అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. తేలిగ్గా తలను మసాజ్‌ చేసుకుని కడిగేయాలి.
- మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయాలి. తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకోండి. మసాజ్‌ అయ్యాక ఓ అరగంట తరువాత షవర్‌ బాత్‌ చేస్తే చుండ్రు ఉండదు.
-ఒక మగ్గు నీటిలో ఒక టీ స్పూన్‌ తాజా నిమ్మరసం కలిపి తలస్నా నం అయ్యాక ఈ నీటితో జుట్టు కడుక్కోవాలి. దీనివల్ల చుండ్రు తాలూకు పొట్టు రేగడం తగ్గిపోవడమే కాకుండా జుట్టుకు మెరుపు చేకూరుతుంది.
- సెలీనియా, సలె్ఫైడ్‌ లేదా స్యాలి సిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాం పులను వాడాలి.ఇవి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.
- మలస్సేజియా గ్లోబస్తా అనే ఫం గస్‌ తాలూకు జన్యువు 50,90 శా తంమందికి చర్మంపై పెరుగుతుంది. ఈ జన్యువు చుండ్రు, ఇతర చర్మసంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. వీటిలో సహజీవనం సా గించే కొన్ని జన్యువులు కూడా ఉండ డం వల్ల మలస్సేజియాసెక్స్‌కు అనుకూలంగా ఉంటుందని, దీని వల్ల వీటి విస్తరణకు అవకాశం అధికం గా ఉంటుందని నిపుణులు అం టున్నారు. దీనిని అరికట్టేం దుకు యాంటీ డాండ్రఫ్‌ షాంపూలు ఉపకరిస్తాయి.
-ప్రపంచలో 90 శాతం మంది ప్రజల్ని చుండ్రు బాధిస్తున్నదని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం వారు పది లీటర్ల ఫంగస్‌ను వృద్ధి చేశారు. ఇది కోటిమంది ప్రజల తలపై ఉండే ఫంగస్‌కు సమమైంది.

నిగనిగలాడే జుట్టు కోసం...
హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు సొంతం అవుతుంది.

No comments: