కాస్త లావుగా ఉంటే చాలు...తిండి తగ్గించమని సలహాలు ఇస్తుంటారందరూ. దాంతో చాలామంది పొట్టమాడ్చుకునే పనిలో పడతారు. లావు తగ్గడానికి ఉపవాసం పరిష్కారం కాదంటారు పోషకాహార నిపుణులు బి. జానకి. తింటూ కూడా బరువు తగ్గొచ్చంటారు ఆమె. అందుకు కొన్ని ప్రత్యేక వంటలు ఉన్నాయని చెప్పారు. అటువంటి వంటలకు సంబంధించి నగరంలోని కొందరు డైటీషియన్లకు ఆమె వంటల పోటీలు కూడా నిర్వహించారు. ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వంటలపోటీల్లో నుంచి కొన్ని వంటలు మీ కోసం ఇస్తున్నాం చూడండి.
స్వీట్ కార్న్ పనీర్ సలాడ్...
కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ - 100 గ్రా, పనీర్ - 50 గ్రా, క్యారెట్ - 20 గ్రా, టమోట - 10 గ్రా, క్యాప్సికం - 10 గ్రా, ఉల్లిపాయముక్కలు - 10 గ్రా, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మకాయ చెక్క - ఒకటి, మిరియాల పొడి - అర టీ స్పూను, చాట్ మసాలా - అర టీ స్పూను, ఉప్పు - తగినంత,
తయారుచేయు విధానం: ముందుగా స్వీట్‌కార్న్, క్యారెట్, కాప్సికమ్‌ని విడివిడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి. తరువాత పనీర్‌లో వీటిని కలిపి వేగించుకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, మిరియల పొడి, ఉల్లిపాయముక్కలు, టమోట ముక్కలు, చాట్ మసాలా, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మకాయ పిండాలి. అంతే స్వీట్‌కార్న్ పనీర్ సలాడ్ తయారయినట్టే. కాలరీలు: 240, ప్రొటీన్లు : 10
రెయిన్‌బో చపాతీ
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 15 గ్రా, సోయాపిండి - 10 గ్రా, రాగిపిండి - 5 గ్రా, శెనగపిండి - 5 గ్రా, అవిసలు - 2 గ్రా, పాలకూర - 25 గ్రా, క్యారెట్ తురుము - ఒక టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ -ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, గరంమసాల - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - రెండు టీ స్పూన్లు. మొలకెత్తిన గింజలు - రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు.
తయారుచేయు విధానం: ఒక గిన్నెలోకి గోధుమపిండి, సోయాపిండి, రాగిపిండి, శెనగపిండి, అవిసలు, పాలకూర తురుము, క్యారెట్ తురుము, గరం మసాలా, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతిపిండిలా కలుపుకోవాలి. ఒక అరగంట నానిన తర్వాత చపాతీలు ఒత్తుకుని పెనంపై కాల్చుకోవాలి. పెరుగులో మొలకెత్తిన గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అన్ని రకాల పిండితో చేసిన ఈ రెయిన్‌బో చపాతీలను పెరుగులో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. క్యాలరీలు : 231, ప్రొటీన్లు: 15, ఫైబర్ : 2
రాగి డంప్లింగ్...
కావలసిన పదార్థాలు: రాగిపిండి - ఒక కప్పు, చికెన్ - పావుకిలో, ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, పచ్చిమిరపకాయలు - నాలుగు, గరం మసాలా - అరటీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీరతురుము - ఒక టేబుల్ స్పూను, పసుపు - చిటికెడు, నూనె - తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా రెండు కప్పుల నీళ్లను మరిగించాలి. అందులో కొద్దిగా ఉప్పు, రాగిపిండి వేసి ఉడికించాలి. గట్టిగా అయ్యాక దించేయాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి - బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కోసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగించాలి. తరువాత చికెన్ వేయాలి. తగినంత ఉప్పు, గరంమసాలా, కారం కూడా వేసి బాగా కలిపి మూతపెట్టాలి. సన్ననిమంటపై ఓ పావుగంట ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటతో కలుపుతుండాలి. ముక్క మెత్తగా ఉడికన తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి. ఇప్పుడు ఉడికించిన రాగి ముద్దని ఉండలుగా చేసుకోవాలి. ఉండని వెడల్పుగా చేసి మధ్యలో చికెన్‌ముక్కలు పెట్టి చుట్టూ మూసివేయాలి. ఇలా చేసిన రాగి ఉండల్ని ఓవెన్‌లో ఉడికించాలి. రుచికరమైన రాగి డంప్లింగ్స్ తయారయినట్టే. క్యాలరీలు: 280, ప్రొటీన్లు - 18, కాల్షియం - 235, ఫైబర్ - 3
ఎగ్‌వైట్ నెస్ట్...
కావలసిన పదార్థాలు: గుడ్లు - మూడు, పచ్చిబఠానీలు -100గ్రా, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఉల్లిపాయలు - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా గుడ్లని ఉడికించుకోవాలి. ఉడికిన గుడ్లని నిలువుగా కోసి మధ్యలో పచ్చసొన తీసేయాలి. తరువాత బఠానీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి బాగా కాగాక ఆవాలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా వేగించాలి. తరువాత ఉప్పు, పసుపు, ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసి వేగించాలి. సన్ననిమంటపై ఓ ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూరని ఉడికించి పెట్టుకున్న గుడ్డు ముక్కల్లో వేయాలి. క్యాలరీలు: 245
లాకి టోఫు బటన్స్...
కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు - 100 గ్రా, పనీర్ - 50 గ్రా, క్యారెట్ - 50 గ్రా, ఓట్స్ - 10 గ్రా, ఉసిరికాయ రసం - ఒక టేబుల్ స్పూను, గోధుమ పిండి - 10 గ్రా, జొన్న పిండి - 10 గ్రా, శెనగపిండి - 10 గ్రా, ఆలివ్ఆయిల్ - 10 గ్రా, జీలకర్ర, ఆవాలు - అరటీ స్పూను, పుదీన - రెండు కట్టలు, మిరపకాయలు - నాలుగు, ఉప్పు - తగినంత.
జ్యూస్‌కోసం తయారి: ముందుగా ఆనపకాయ, కారెట్ మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవాలి. దీంట్లో ఉసిరికాయ రసం కలుపుకోవాలి. పచ్చడి తయారి: స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి పుదీన ఆకులు, పచ్చిమిరపకాయలు వేసి వేగించాలి. చల్లారిన తర్వాత ఉప్పు కలిపి మిక్సిలో వేసి పచ్చడి చేసుకోవాలి.
బటన్స్ తయారి: పనీర్ ముక్కల్ని నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. గోధుమపిండి, జొన్నపిండి, శెనగపిండి, ఆవాలు, జీలకర్ర, వేగించిన పనీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకుని ఓ పదినిమిషాలు జున్నుని ఉడికించినట్టు ఉడికించాలి. తరువాత వీటిని పెనంపై కొద్దిగా నూనె వేసి వేగించాలి. వీటిని పుదీన చట్నీలో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. చివర్లో ఆనపకాయ, క్యారెట్ జ్యూస్ తాగాలి. క్యాలరీలు: 270, ప్రొటీన్లు : 16.5, ఫైబర్: 5.8, కాల్షియం: 22