Showing posts with label గుండె. Show all posts
Showing posts with label గుండె. Show all posts

Friday, December 24, 2010

మంచి కొలెస్ట్రాల్ పెరిగేదెలా?

నానాటికీ పెరిగిపోతున్న గుండె జబ్బులూ, పక్షవాత సమస్యలు మానవాళిని కలవరపెడుతున్నాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు శరీర శ్రమలేకపోవడమే ఈ స్థితికి ప్రధాన కారణంగా ఉంటున్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగించడమే ఈ సమస్యలకు పరిష్కారం. సమస్యకు గురయ్యాక అందులోంచి బయటపడేందుకు యాతన పడేకన్నా రాకుండా నివారించుకోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. 
ఆ వివరాలు  మీకోసం..

కొలెస్ట్రాల్ అనగానే బెంబేలె త్తిపోతాం కానీ, అందులో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది. అది మనకు మంచే చేస్తుంది. సమస్య అంతా చెడు కొలెస్ట్రాల్‌తోనే. కొలెస్ట్రాల్ ను ఉత్తత్తి చేయడం అన్నది శరీరంలోని ఒక సహజ ప్రక్రియ. అలా సహజంగానే దాదాపు 60 నుంచి 70 శాతం కొలెస్ట్రాల్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇది కాక 30 నుంచి 40 శాతం కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లోంచి తయారవుతుంది. నిజానికి శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆ 70 శాతం కొలెస్ట్రాలే ఎక్కువ. అలాంటిది ఆహార పదార్థాల ద్వారా కూడా అధికంగా కొలెస్ట్రాల్ తయారయితే పరిస్థితి ప్రమాదానికి చేరువైనట్లే.

ఎందుకీ అతి ?

ఆహార పదార్థాలతో ప్రమేయం లేకుండానే కొందరిలో సహజంగానే అవసరానికి మించి కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటుంది. దీనికి జన్యుపరమైన మూలాలే ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే లక్షణం ఉంటే అది వారి పిల్లల్లోనూ ఉంటుంది. దానికి తోడు ఆహారపు అలవాట్లు, శరీర శ్రమ లేకపోవడం, జీవ న శైలి ఇవన్నీ ఇతర కారణాలుగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచీ దాదాపు 20 ఏళ్లు వచ్చేదాకా కొలెస్ట్రాల్ 100 నుంచీ 130 మిల్లీ గ్రాముల దాకా ఉంటుంది. అందుకే ఆ దశలో కొలెస్ట్రాల్ మూలంగా ఉండే ఏ గుండె జబ్బులూ రావు. చాలా మందిలో 20 ఏళ్లు దాటాకే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. పెద్ద వారిలో 200 మిల్లీ గ్రాముల దాకా వెళ్లవచ్చు.

ఎలా తెలుస్తుంది ?

రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు పెరిగిపోతున్నప్పుడు మామూలుగా అయితే ఏ లక్షణాలూ కనిపించవు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడి, వాటి వైశాల్యం తగ్గిపోయి రక్తప్రసరణలో అంతరాయంగా మారిన తరువాతే సమస్య తెలుస్తుంది. ఒక్కోసారి గుండెపోటో లేదా పక్షవాతమో వ చ్చేదాకా ఏమీ తెలియకపోవచ్చు. అందుకే అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

కొలిచేదెలా ?

కేవలం రక్తపరీక్ష ద్వారానే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. 20 ఏళ్లు దాటిన వారంతా ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ సాధారణ పరిమాణంలోనే ఉన్నట్లు రిపోర్టు వస్తే ఆ తరువాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటూ ఉంటే చాలు. ఒకవేళ ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే ఏటా ఒకసారి చేయించుకోవడం తప్పనిసరి. ఇలా ఏటా పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఇప్పుడున్న 75 శాతం గుండె జబ్బులు చాలా వరకు తగ్గుముఖం పడపడతాయి.

* సాధారణంగా 25 లేదా 30 ఏళ్ల లోపు వారిలోనే కండరాలు పెరుగుతాయి. వ్యాయామం చేసే వారైతే ఆ తరువాత కూడా కొంతమేరకు కండర కణజాలంలో ఉండే పీచుపదార్థం (సెల్ ఫైబర్) పెరుగుతుంది. వ్యాయామాలు చేయనివారిలో 30 ఏళ్ల తరువాత ఎవరైనా బరువు పెరుగుతున్నారూ అంటే ఆ పెరిగేది కొవ్వు మాత్రమే. బాగా వ్యాయామం చేసే వారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటారు. ఆ తరువాత ఎప్పుడైనా వీరు వ్యాయామం చేయడం మానేస్తే అదే క్రమంలో తీసుకునే క్యాలరీలు కూడా తగ్గించుకోవాలి. అలా తగ్గించకపోతే తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగం కొవ్వుగా మారుతుంది. అది కొలెస్ట్రాల్‌గా రక్తంలో చేరిపోతుంది.

* శరీరంలోని ఏ భాగంలో కొలెస్ట్రాల్ చేరిపోతే ఆ భాగంలో రక్తనాళాలు సన్నబడతాయి. మెదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే పక్షవాతం వస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డుపడితే గుండెపోటు వస్తుంది. కిడ్నీకి వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడితే కిడ్నీ దెబ్బ తినడంతోపాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. కాళ్లలోని రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే కాళ్ల జబ్బులు వస్తాయి.

నివారించేదెలా ?

* ఆహారంలో నూనె పదార్థాలు బాగా తగ్గించాలి. పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్ తినడం బాగా తగ్గించాలి. * గడ్డకట్టని నూనెల కన్నా గడ్డకట్టే నూనెలు ఎక్కువ ప్రమాదకరం. ప్రత్యేకించి నెయ్యి, వనస్పతి వంటి వాటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆహారంలో వాటిని తగ్గించాలి.
* శాకాహారులు కొందరు తమకు ఈ కొలెస్ట్రాల్ సమస్యలే ఉండవన్న భ్రమలో ఉంటారు. నిజానికి అతిగా నూనెలు వాడే వారు శాకాహారులైనా అంతే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.
* కూరగాయలను సహజంగా అంటే సలాడ్స్‌గా తీసుకున్నప్పుడు ఏ సమస్యలూ ఉండవు. కానీ, వాటిని వండినప్పుడే సమస్యలు వస్తాయి. అందుకే నూనె వాడకాన్ని మొత్తంగా నివారించలేకపోయినా అతి తక్కువ నూనెతో వంట చేయడం మేలు చేస్తుంది. అయితే ఒక్కోరకం నూనెలో ఒక్కో లోపం ఉంటుంది. అందుకే నిరంతరం ఒకే నూనెను వాడకుండా వేరు వేరు నూనెలు వాడటం మేలు.
* మాంసాన్ని కాల్చిగానీ, నీటిలో ఉడికించి గానీ తినడం చాలా ఉత్తమం. అలా కాకుండా బాగా నూనెల్లో ఉడికించడంలోనే అసలు ప్రమాదం మొదలవుతుంది. రొయ్యల్లో తప్ప మిగతా చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందుకే చేపలకు ప్రాధాన్యత నివ్వడం మేలు.
వ్యాయామంతో...

చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)తగ్గడమే కాకుండా వ్యాయామంతో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) పెరుగుతుంది. అందుకే మానవ శాస్త్రం వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి నిత్యం వాకింగ్ చేసే వారు గుండె జబ్బులకు చాలా దూరంగా ఉంటారు. అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా జన్యుకారణాలతో కొందరిలో చెడు కొలెస్ట్రాల్ పెరగవచ్చు అలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి కొలెస్ట్రాల్‌ను తగ్గించే మాత్రలు వేసుకోవాలి.

వీటిని జీవితకాలమంతా వేసుకున్నా ఏ దుష్ప్రభాలూ ఉండవు. ఇవే కాకుండా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్‌ను రక్తం గ్రహించకుండా చేసే మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రదించి ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సలహాలూ, చికిత్సలూ తీసుకుంటూ ఉంటే జీవిత కాలమంతా కొలెస్ట్రాల్ సమస్యలను అడ్డుకోవచ్చు.

Sunday, October 31, 2010

విటమిన్‌‘బి’తో నిరాశ దరిచేరదు

vitamin-b12-deficiency
గుండెనొప్పికి గురైన వారు క్రమం తప్పకుండా విటమిన్‌ ‘బి’ టాబ్లెట్స్‌ వాడితే నిరాశ(డిప్రెషన్‌) ఛాయలు వారి దరిచేరే అవకాశం చాలా తక్కువుగా ఉంటుంది. అంతేకాకుండా మళ్లీ గుండెనొప్పి వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు ఒక నూతన అధ్య యనంలో కనుగొ న్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా నేతృ త్వంలోని అంతర్జా తీయ పరిశోధకుల జట్టు ఈ విషయాన్ని స్పష్టంగా రుజువు చేయగలి గారు. డిప్రెషన్‌ నుంచి నిశ్చి తమైన కొన్ని విటమిన్లు మాత్రమే సంరక్షిస్తా యని గతంలో చేసిన పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెపోటు నుంచి బయటపడి, ప్రతిరోజూ ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి6, విటమి న్‌ బి12 టాబ్లెట్లను తీసుకునే వారిలో సగం మందికి డిప్రెషన్‌కు గుర య్యే అవకాశము లేకపోలేదు. ‘గుండెపోటు వచ్చిన వారు డిప్రెషన్‌కు లోనవటం సర్వ సాధారణం.ముగ్గురిలో ఒకరు దీని బారిన పడ తారు.


VITAMIN-B-COMPLEX-EU
మళ్లీ గుండెపోటు రాకుండా, డిప్రెషన్‌ దరిచేరకుండా ఉండేం దుకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని’ పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ ఆస్వాల్డ్‌ అల్‌మిదా పేర్కొన్నారు. ఎక్కువ మోతాదులో విటమిన్‌ ‘బి’ తీసుకునే గుండె రక్తనాళాల వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిం చారు. ఎందుకంటే అధిక గాఢత గల అమినో యాసిడ్లు వల్ల డిప్రె షన్‌ పెరిగే అవకాశముంది. ఒక్కొక్కసారి విటమిన్‌ ‘బి’ ఎక్కువుగా తీసుకుంటే గుండె రక్తనాళాల సం బంధిత సమస్యలు వచ్చే అవకాశము ఉంది. ఈ విటమిన్‌ టాబ్లెట్లు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరేళ్ల పాటు విటమిన్‌ టాబ్లెట్లు వాడితే రక్తనాళమయ వ్యవస్థలో క్రమేపి మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.

Saturday, August 21, 2010

గుండె గుట్టు తెలుసుకోండి

గుండె ఎలా పనిచేస్తుంది...
గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరమంతటి నుంచి రక్తం గుండెకు వెళ్ళి, అక్కడ నుండి ఊపిరి తిత్తులకు వెళ్ళడం ద్వారా రక్తంలోని కార్బన్‌డై ఆకై్సడ్‌ బయటకు నెట్టివేయబడుతుంది.అలాగే ఆక్సిజన్‌ ఊపిరితిత్తులనుండి గుండెకు చేరి అక్కడినుండి రక్తంద్వారా ఆహార పదార్ధాలతో కలిసి శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది.ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆ భాగం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడాన్ని గాంగ్రిన్‌ అంటారు.

Heartఎందుకంటే ఆ ప్రాంతానికి రక్తం అందక పోవడంతో ఆహారం, ఆక్సిజన్‌ అందదు కదా! గుండె ముడుచుకుపోవడం ద్వారానే రక్తనాళాల ద్వారా ఇలా రక్తం శరీరమంతటికీ చేరుతుంది. కాబట్టి గుండె చేసే కార్యం చాలా గొప్పదే కదా! శరీరమంతటికి వెళ్ళే రక్తం గుండెద్వారా వెళ్తున్నా, గుండెకు ఎంత రక్తం తగ్గినా ఆ రక్తంలోంచి తీసుకోదు. తనకి రక్తం సరఫరా చేసే నాళాల నుంచి వచ్చే రక్తాన్నే గుండె పనిచేయడానికి తీసుకుంటుంది. అంటే గుండె ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో గమనించారా ? అదే నిస్వార్ధ బుద్ధి ని, నిర్విరామ కృషిని మనం గుండె నుండి నేర్చుకోవాలి.

గుండె దెబ్బతినేందుకు కారణాలు...
గుండె దెబ్బతిన్నా గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా ఇతర రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా కూడా శరీరంలో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. గుండె దెబ్బతిన్నా, ఏ ప్రాంతంలో రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా మందులతో కాక పోతే శస్తచ్రికిత్సల ద్వారా సరిచేయవచ్చు. గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే హార్ట్‌ ఎటాక్‌ (గుండెపోటు) వస్తుంది. మెదడుకు సరఫరా చేసే కెరోటిడ్‌ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే స్ట్రోక్‌ (పక్షవాతం) వస్తుంది. గుండె నిర్విరామంగా కొట్టు కోవాలంటే దాని గోడలు బలంగా ఉండాలి.

గుండె గోడలు నీరసిస్తే గుండె సరిగా కొట్టుకోలేక హార్ట్‌ ఫెయి ల్‌ అవుతుంది. పుట్టుకతోనే గుండె నిర్మాణంలో కొన్ని లోపాలు ఏర్పడవచ్చు. వీటిని కంజెనైటల్‌ హార్ట్‌ డిసీజెస్‌ అంటారు. వీటిని శస్త్ర చికిత్సలతో సరిచేయవచ్చు. కాబట్టి పుట్టగానే పిల్లల్లో గుండెలోపాలుంటే నిర్లక్ష్యం చేయక వైద్యులను కలవాలి. ఇది వంశ పారంపర్య అనారోగ్యం. సిగరెట్లు తాగడం, క్రొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకుండా ఉండటం, ఒత్తిడి ఎక్కువ కావడం లాంటి జీవన విధానాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. దాంతో గుండె దెబ్బ తింటుంది. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.గుండె కవాటాల లోపం రావచ్చు, గుండె గోడలలో చిల్లులు ఏర్పడవచ్చు. ఇలా రకరకాల గుండె అనారోగ్యాలు కలుగవచ్చు.

భయపడక్కరలేదు...
గుండె శస్త్ర చికిత్సలనగానే ఛాతీలో ఎముకలు కత్తిరిస్తారు, గుండె కొట్టుకోవడాన్ని ఆపి, కృత్రిమ గుండెకు కలిపి శస్త్ర చికిత్సలు చేస్తారు. కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.చాలామందికి భయం ఉంటుంది.అది నాటి మాట. మరినేడు గుండెను ఆపకుం డా... బీటింగ్‌ హార్ట్‌మీదే శస్తచ్రికిత్సల్ని విజయవంతంగా నిర్వహిస్తు న్నారు. అదీ పెద్ద పెద్ద కోతలు లేకుండా ఒక సన్నటి కీహోల్‌ ద్వారా ఆపరేషన్‌ చేస్తున్నారు.గుండెకి శస్త్ర చికిత్సల్ని కీ హోల్‌ ద్వారా నిర్వహిస్తుండడంతో పెద్దకోతలు చేయాల్సిన పనిలేదు.చిన్న కోతలే కాబట్టి త్వరగా నయం అవుతుంది. రక్తస్రావం బాగా తక్కువ వుతుంది. నొప్పి తక్కువ .

హాస్పటల్‌లో ఉండే సమయం తక్కువ. ఖర్చూ తక్కువే. బైపాస్‌ సర్జరీ, కవాట మార్పిడి లాంటి శస్త్ర చికిత్సల్ని కీ హో ల్‌ ద్వారా గ్లోబల్‌ ఆసుపత్రిలో నయం చేస్తున్నాం. గుండె శస్త్ర చికి త్స లంటే ఇప్పుడు భయపడాల్సిన పని లేదు.బైపాస్‌ చేయడానికి రక్తనాళం కాలులోంచి తీసు కోవడానికి కుడా పెద్ద గాయం చేయనవసరం లేదు. చిన్న కోతతో ఇప్పుడు కాలులోంచి రక్తనాళాల్ని తీస్తున్నాం.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది...
గుండె అరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకు వంశపారంపర్యంగా వచ్చే వాటిని మనం ఏమీ చేయలేము కానీ, మన అలవాట్లను మాత్రం మానుకోగలం. అలా మానుకుంటూ కొత్త జీవన విధానాన్ని అలవర్చుకోవడం, గుండె ఆరో గ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఇప్పుడు జీవన విధానం వల్ల యువతీ యువకుల్లో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.

చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు మన పద్ధతులే దానికి కారణం. అందుకని మన జాగ్రత్తతో ఆరోగ్యాన్ని కాపాడు కుందాం. ఒక వేళ అనారోగ్యాలున్నా ప్రథమ దశలోనే గుర్తించాలి. అందుకు ఆరోగ్య అవ గాహనా సదస్సులు తోడ్పడ తాయి. వ్యాధిని ప్రథమ దశలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స పొందవచ్చు. ఒకవేళ ఆలస్యంగా గుర్తించినా ఇప్పుడు భయ పడాల్సిన పనిలేదు. అన్నిరకాల చికిత్సలను ఇపుడు దిగ్వి జయంగా నిర్వహిస్తు న్నాం... కీ హోల్‌ లాంటి నూతన విధానాలూ అందు బాటు లో ఉన్నాయి. గుర్తించుకోండి.మీ గుండె ఆరోగ్యం మీచేతుల్లో ఉంది.

- డాక్టర్‌. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే
గుండె శస్తచ్రికిత్సా నిపుణులు,
గ్లోబల్‌ హాస్పటల్స్‌,లకిడికాపూల్‌,
హైదరాబాద్‌-4, మొబైల్‌:98480 45810

Thursday, July 8, 2010

వ్యాయామంతో ఆరోగ్యం

ప్రతి రోజూ ఓ గంట లేదా అరగంట పాటు సేపు చేసే వ్యాయామం ఎన్నో రోగాలను దరి చేయనీయకుండా కాపాడుతుంది. చిన్న చిన్న వ్యాధుల నుండి, అసాధారణ వ్యాధుల వరకూ వ్యాయామం చేసే వారి దగ్గరకు రావా లంటే కాస్త జంకుతాయి. ఎందుకంటే వ్యాయామంతో శరీరంలోని ప్రతి అవ యవానికి ఎంతో లాభం చేకూరుతుంది. అది రోగాలను దూరంగా వుంచడంలో సాయపడుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని ఏ ఏ భాగానికి ఏవిధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

గుండె :
yoga క్రమం తప్పకుండా చేసే వ్యాయామం హై బ్లడ్‌ ప్రెషర్‌ రాకుండా నిరో దిస్తుంది. లోబీపీ ఉన్న వారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేందుకు డాక్టర్‌ సలహా మేరకు వ్యాయామాన్ని ఆశ్రయించవచ్చు. అధి శాతం హై కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ హృద్రోగాలకు, హార్ట్‌ ఎటాక్‌లకు మూలకారణంగా నిలు స్తాయి. క్రమం తప్పని వ్యాయామం ద్వారా వీటికి దూరంగా వుండొచ్చు. వ్యాయామం చేసే వారితో పోలిస్తే వ్యాయామం చేయని వారిలోనే గుండె సంబంధిత వ్యాధులకు ఎక్కువగా అవకాశం వుంటుంది.

ఎముకలకు బలం : వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనమ వుతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌ దశ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇతరత్రా కూడా శరీరం బలహీనం కావడం వంటి కారణాల వల్ల కింద పడి ఎముకలు విరగొట్టుకునే అవకాశం వుంటుంది. వ్యాయామం చేసే వారితో పోలిస్తే, వ్యాయామం చేయని వారిలోనే ఈ రక మైన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం కండర పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఎముకలు కాల్షి యాన్ని నిలిపి వుంచుకునేలా చేస్తుంది. శరీరం శక్తిని కోల్పోకుండా చూస్తుం ది. తద్వారా సాధారణ ప్రమాదాల బారిన పడే అవకాశాన్ని ఒక వేళ ప్రమాదా లకు గురైనా వాటి తీవ్రతనూ తగ్గిస్తుంది.

మధుమేహం :
మధుమేహంతో బాధపడేవారికి ఇచ్చే చికిత్స ఫలితం రోగుల స్థూల కాయం తదితర అంశాల కారణంగా ప్రభావితం అవుతుంది. ఈ నేప థ్యంలో చికిత్స తీసుకునే వారు బరువు తగ్గితే చికిత్స ప్రభావ పూరితంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మైల్డ్‌ డయాబెటిస్‌ను మందు ద్వారా కన్నా కూడా ఆహారం, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం సులభం.

క్యాన్సర్‌ :
శారీరకంగా చురుగ్గా ఉండని వారిలో పెద్దపేగు సంబంధిత క్యాన్సర్‌ వచ్చే అవకాశం అధికంగా వుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, లైంగిక అవయవాల సంబంధిత క్యాన్సర్లు క్రీడాకారిణులకు రావడం తక్కువే.

Tuesday, December 30, 2008