Showing posts with label ప్రకృతి వైద్యం. Show all posts
Showing posts with label ప్రకృతి వైద్యం. Show all posts

Saturday, November 12, 2011

ఫ్రెష్‌గా ఉండండి ఇలా...

 http://gerry.ws/files/2008/10/beautiful-face-by-tony.jpg
ముఖ సౌందర్యం, వర్చస్సు ఎక్కువగా, శరీర ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఆరోగ్యం బాగానే ఉన్నా, వాతావరణ కాలుష్యాల వల్ల కూడా కొందరి ముఖం మీద కొన్ని మచ్చలు, మరకలూ ఏర్పడవచ్చు. వీటిని నివారించడంలో తులసి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోకి తీసుకునే తులసి రసం, రక్తశుద్ధికి దివ్యంగా పనిచేస్తుంది. అలాగే, ముఖం మీద లేపనంగా వాడితే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. బ్యాక్టీరియాను నశింపచేసే లక్షణం ఉన్నందున,ఆరోగ్య పరిరక్షణలో అనాదిగా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం వేళ కాసేపు తులసి ముందు కూర్చుని ఆ వాసనను బలంగా పీలిస్తేనే రక్తశుద్ధి అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాంటిది కడుపులోకి నేరుగా ఆ రసాన్ని, లేదా ఆకు ముద్దను తీసుకుంటే ఇక చెప్పేదేముంది!http://www.kacha-stones.com/images/Tulasi1.gif
* ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం సౌందర్యవంతంగానూ, కాంతివంతంగానూ మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.

* రోజూ కొన్ని తులసి ఆకుల్ని, నమలి తినేస్తే, రక్త శుద్ధి ఏర్పడుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి గానీ, ఒక పేస్ట్‌లా ముఖానికి పట్టిస్తే, అక్కడున్న గుంటల్లో నిలిచిపోయిన అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి వర్చస్సు పెరగడంతో పాటు ముఖం, సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.

*ముఖం తాజాగా ఉండడానికి , ఏదైనా పాత్రలో కాసిని మంచి నీళ్లు తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అందులో ఓ పిడికెడు తులసి ఆకులు, పిడికెడు మెంతెం ఆకులు వేసి కాసేపు మరగించాలి. జత్తును టవల్‌తో కట్టేసుకుని ముఖానికి మాత్రమే ఆ ఆవిరి పట్టాలి. కొన్ని నిమిషాల తరువాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.
http://www.dyeli.com/wp-content/uploads/2010/07/face-skin1.jpg
* ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నవారు, నిమ్మరసం లేదా అల్లం రసం కలిపిన తులసి పేస్టును ముఖానికి పట్టించి అది ఎండిపోయిన దాకా అలాగే ఉంచాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మచ్చలు తొలగిపోవ డంతో పాటు ముఖం కాంతి వంతంగా, అందంగా  మారుతుంది.
*తులసి, మెంతి ఆకులతో చేసినడికాక్షన్ రోజూ తీసుకుంటే శరీరంలో నూతనోత్తేజం వస్తుంది.

Tuesday, June 14, 2011

నడుస్తున్న వైద్యం '' మూలికోపతి ''

అజీర్తి, ఎసిడిటీ, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, అల్సర్లు, జుట్టు రాలడం, చర్మ రోగాలు, దంతసమస్యలు, మానసిక ఆందోళనలు, మధుమేహం, రక్తపోటు, ప్రాణాంతక క్యాన్సర్లు... లైఫ్‌స్టయిల్ కారణంగా వచ్చిన రుగ్మతలు కావచ్చు, శరీర రసాయన ధర్మంలో మార్పుల కారణంగా తగులుకున్న రోగాలూ కావచ్చు. ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే వాత, పిత్త, కఫ సంబంధ రుగ్మతలన్నింటికీ జనామోదం లభిస్తున్న పరిష్కారం హెర్బల్ ట్రీట్‌మెంట్. మూలికావైద్యం. ఒకప్పుడు అది ప్రాచీన వైద్యం.. ఇప్పుడదే ఇన్‌థింగ్. ఆధునికత అంగీకరించి ఆహ్వానిస్తున్న పురాతన విధానం.

ఇంగ్లీష్‌లో హెర్బ్స్, హిందీలో జరీబూటి, తెలుగులో మూలికలు - వీటితో వైద్యమే ఇప్పుడు ప్రపంచాన్నంతా ఊపేస్తోంది. వేల కోట్ల డాలర్ల అలోపతి వైద్యానికి సవాలు విసురుతోంది. మూలికావైద్యం, దేశీయ వైద్య విధానాలు ఆగినచోట అలోపతి పుట్టిందని ఒకనాటి భావన. అలోపతి ఆగిపోయిన చోట మూలికావైద్యం ప్రస్థానం ప్రారంభమైందన్నది నేటి కొత్త విశ్వాసం. మూలికావైద్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లిన ప్రతి నాగరికత మూలాల్లోనూ మూలికల విజ్ఞానం నిబిడీకృతమై ఉంది. ప్రతి సమాజంలోనూ ప్రకృతి శరీరధర్మంపై చూపే ప్రతికూల ప్రభావాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మూలవాసులు మూలికలనే ఆశ్రయించారు. అయితే శాస్త్రీయ పునాదులతో అలోపతి వైద్య విధానం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత దేశీయవైద్యవిధానాల్లో 'శాస్త్రీయత' కొరవడిందనే పేరుతో ముప్పేట దాడులు మొదలయ్యాయి. ఆ దాడుల తొలి విక్టిమ్ మూలికా వైద్యం.

వ్యాపారం - లాభం నిండి ఉన్న అలోపతిని ఫార్మాసంస్థలు, ఆధునిక వైద్యులతో పాటు సోకాల్డ్ హేతువాదులు, 'జనవిజ్ఞానులు' నెత్తికెక్కించుకుని సంప్రదాయ విజ్ఞానంపై దాడులకు దిగుతున్నారు. దీనివల్ల సంప్రదాయ విజ్ఞానం సమసిపోకున్నా మసకేసిపోయింది. థాంక్ గాడ్. కొన్ని రకాల రుగ్మతలకు విషయంలో అలోపతి వైద్య విధానంలో పరిష్కారాలు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా మళ్లీ సంప్రదాయ, దేశీయ వైద్యవిధానాలకు ఆదరణ పెరుగుతున్నది. ఈ వైద్య విధానాలకు పాతవైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నవారు సాధిస్తున్న విజయాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మూలికావైద్యం అనూహ్యమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నది. ఆధునిక జీవితంలో హెర్బ్స్ అంతర్భాగంగా మారిపోతున్నాయి. హెర్బల్ టీ, హెర్బల్ బాత్ పౌడర్, హెర్బల్ టూత్‌పేస్ట్ మొదలు చిన్నా, పెద్ద శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే పలురకాల హెర్బల్ ఉత్పత్తులు ఇప్పుడు ప్రతి ఇంటా దర్శనమిస్తున్నాయి.

అశ్వగంధ, సర్పగంధ, శతావరి, ఆమ్లా, అలోవెరా, బ్రహ్మి, వేప, ఆల్ఫాల్ఫా, నేల ఉసిరి, అడవిచామంతి, పసుపు, వెల్లుల్లి, అల్లం, అవిశెలు, జీలకర్ర, మెంతులు, కరివేప... ఇవి అరుదైన మూలికలూ కావచ్చు, పోపు పెట్టెలో కనిపించే దినుసులూ కావచ్చు.

వేదకాలం నుంచే...

రుగ్వేదంలో తొలుత మూలికల ప్రస్తావన కనిపిస్తుంది. సోమ గురించి ఎక్కువ ప్రస్తావించినా రావి, పలాస వంటి ఇతర మూలికల పేర్లు కూడా రుగ్వేదంలో కనబడతాయి. ఇంద్రునికి అత్యంత ఇష్టమైన సోమపానం తయారీకి ఉపయోగించిన మూలికే సోమ. ఆధునిక వృక్ష శాస్త్రవేత్తలు ఈ సోమ మూలికను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమ మూలికకు సంబంధించి ఆయుర్వేద వైద్యుల్లోనూ ఏకాభిప్రాయం లేదు. బహుశా ఇది అంతరించి పోయిన మొక్కల జాతికి చెంది ఉండవచ్చని కొందరి భావన. అధర్వణవేదంలో దాదాపు 100 మూలికల ప్రస్తావన ఉన్నా వాటిలో అనేకం ఇప్పుడు లభ్యం కావడం లేదు. వాటిని పోల్చేందుకు వృక్షశాస్త్ర నామం ఏమిటో తెలియడం లేదు. దేశీయ వైద్య పద్ధతులను క్రమబద్ధీకరించిన ఘనత చరకునిది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో చరకుడు మూలికా వైద్యాన్ని భారతదేశంలోని జానపదుల వైద్య విధానాలను గ్రంథస్థం చేశారు. ప్రాచీన భారతంలో చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు అసమానవైద్యులుగా గుర్తింపు పొందారు.

ప్రపంచవ్యాప్తంగా పేరున్న 100 మూలికల్లో 50 మూలికలు భారతీయులు తరతరాలుగా వినియోగిస్తున్నారు. ప్రపంచమంతటా గుర్తింపుపొందిన చైనా మూలికల్లో 20 మూలికలు మన దేశీయ వైద్యంలో కూడా విరివిగా వినియోగంలో ఉన్నాయి. చైనా ప్రభుత్వం అలోపతి పరిమితులను గుర్తించి ప్రజారోగ్య సంరక్షణ కోసం సంప్రదాయ వైద్య విధానాలకు పెద్దపీట వేయడంతో చైనా సంప్రదాయ వైద్యం అంతర్జాతీయంగా పాపులర్ అయింది. నిజానికి మన బలవర్ధక, అశ్వగంధ, తిప్పతీగ, బోడతరము, నేలతంగేడు, గుంటకలగర, చిత్రమూలము, పల్లేరు వంటి ఔషధ మొక్కలు, పసుపు, వేప, కానుగ, వావిలి, జిల్లేడు.. ఇదే కోవకు చెందిన చైనీస్ మొక్కల కంటే శక్తిమంతమైనవి. యూరప్, అమెరికాల్లో లభించే మూలికలతో పోలిస్తే కూడా అదే జాతికి చెందిన భారతీయ మూలికలను ఎక్కువ శక్తిమంతమైనవిగా భావిస్తారు. మరీ ముఖ్యంగా హిమాలయాల్లో లభించే మూలికలను మహిమాన్వితమైనవిగా విశ్వసిస్తారు.

ఈజీగా ఇంటిలోనే...

దేశీయ వైద్యంలో ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి, నాచురోపతి విధానాలున్నాయి. వీటన్నిటిలోనూ ఔషధ మూలికలను వినియోగించినప్పటికీ మూలికావైద్యానికి ఈ వైద్య విధానాలకు తేడా ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదానికి మూలికా వైద్యానికి తేడా లేదనుకుంటారు. అది సరికాదు. ఆయుర్వేదం కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైన ప్రక్రియలతో కూడింది. ఒకటి కంటే ఎక్కువ మూలికల సంయోజనం, విలీనం వంటివి అందులో జరుగుతాయి. జంతు, ఖనిజ, లోహ సంబంధమైన వాటిని కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదానికి ప్రామాణిక గ్రంధాలున్నాయి. ఒకరకంగా ఇవి సాధారణ మూలికలకు వాల్యూ యాడెడ్ ప్రాడక్ట్స్. మూలికావైద్యంలో నేరుగా లభించే మూలికలనే ఉపయోగిస్తారు. వాటిని తయారు చేయడంలో రకరకాల ప్రక్రియలు ఉన్నప్పటికీ అవి సులభమైనవే. నాలుగైదు కంటే మూలికలను సంయోజనపరిచే అవకాశం మూలికావైద్యంలో లేదు. కావలసిన మూలికలు లభిస్తే ఎవరికి వారు ఔషధాలను తయారు చేసుకునే వెసులుబాటు ఈ విధానంలో ఉంది.

మూలికా వైద్యంలో మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను... ఔషధ పదార్ధాలుగా ఉపయోగిస్తారు. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా ఉపయోగించవచ్చు.. వగైరా విషయాలకు సంబంధించిన సాధారణ జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి వందల సంవత్సరాలుగా అందుతూ వస్తున్నది. మధ్యలో 'శాస్త్రీయ విప్లవం' సృష్టించిన అంతరం వల్ల ఒకటి రెండు తరాలకు ఈ జ్ఞానం దూరమైంది. వివిధ గిరిజన తెగల్లో మూలికలకు సంబంధించిన అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. వారు సాధారణ, అసాధారణ వ్యాధులను సైతం అందుబాటులో ఉన్న మూలికలతోనే నయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గిరిజనుల నుంచి ప్రాచీన రుషుల నుంచి పల్లెల నుంచి క్రమంగా మూలికా వైద్యం విస్తరిస్తూ వచ్చింది. ఔషధాలుగా వాడే చాలా మూలికలు ఆహారంగానూ, మసాలా దినుసులు గానూ, సుగంధ ద్రవ్యాలుగానూ మారి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. పసుపు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలాంటివే.

అదిరిపోతున్న ప్రచారం..

యోగ గురువు బాబా రామ్‌దేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణ మహరాజ్ యోగతో పాటు ఆయుర్వేదాన్ని మరీ ముఖ్యంగా మూలికల ప్రశస్తిని విస్త­ృతంగా ప్రచారంలోకి తెచ్చారు. పొద్దున్నే ఆస్తా టీవీలో జరీబూటీపై బాలకృష్ణ చెప్పే విషయాలు మూలికల సామర్థ్యాన్ని సామాన్యులకు చేరవేశాయి. ఆ తర్వాత దాదాపు అన్ని టీవీఛానళ్లు, ఇతర ప్రచార సాధనాలు దీనిని అందిపుచ్చుకున్నాయి. మధ్యాహ్నం వంటిల్లు కార్యక్రమంలో వంటలను పరిచయం చేయడం ప్రతి టీవీ ఛానెల్లోనూ ఎంత సాధారణమైందో ఇప్పుడు పొద్దున్నే ఒక అరగంట వైద్యం-ఆరోగ్యం పేరుతో రకరకాల మూలికలను పరిచయం చేయడం, వాటి ఉపయోగాలను వివరించడం అంతే సాధారణమైంది. చాలామంది వీటిని నోట్‌బుక్‌లో రాసుకుని బంధుమిత్రులకు చేరవేయడం కూడా వర్తమాన దృశ్యం.

టీవీల్లో ప్రచారాలకు తోడుగా ఆయుర్వేదం, మూలికా వైద్యంపై తెలుగులోనే ఇటీవల కాలంలో డజన్ల సంఖ్యలో పుస్తకాలొచ్చాయి. రకరకాల మూలికలు, వాటి లక్షణాలు, ఉపయోగాల గురించి వివరించే పుస్తకాలతో పాటు, రకరకాల వ్యాధులు వాటి చికిత్సలో ఉపయోగపడే మూలికలను గురించి వివరించే పుస్తకాలూ ఉన్నాయి. డాక్టర్ కొప్పుల హేమ్రాది 'వనమూలికా ప్రభావం' డా. జి. లక్ష్మణరావు 'మూలికా వైద్యంతో ఆరోగ్యం', డాక్టర్ ఏల్చూరి ఆయుర్వేద పత్రిక ఇంకా అనేక పుస్తకాలు, మేగజైన్లు మార్కెట్లో ఉన్నాయి. అంతేకాక చిట్కా వైద్యంపై ప్రతి పత్రికలోనూ కాలమ్ ఉంటున్నది. ఇంట్లో అందుబాటులో ఉండే దినుసుల్లో దాగి ఉన్న ఆరోగ్య ర హస్యాలపై విరివిగా రాసే వారి సంఖ్య పెరుగుతున్నది.

మూలికలపై పరిశోధనలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. అసంఖ్యాకమైన మూలికాధార ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. నేరుగా మూలికలనే విక్రయిస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలతో పాటు వ్యవస్థీకృత రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. హిమాలయ డ్రగ్స్ సంస్థ అర్జున, అశ్వగంధ, బ్రహ్మి, హరీద్ర, కపికచ్చు, పునర్నవ, శొంఠితో సహా దాదాపు 30 వరకు మూలికలను శుద్ధంగా మాత్రల రూపంలో అందిస్తున్నది. అనేక ఆయుర్వేద ఔషధ దుకాణాల్లో ఇటీవల కాలంలో చిన్నచిన్న ప్యాకెట్స్‌లో రకరకాల మూలికల పౌడర్లను విక్రయిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త..

ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ, ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు ఆదరణ పెరుగడంతో వీటి వ్యాపారం 12000 కోట్ల డాలర్లకు చేరింది. 2050 కల్లా ఈ వ్యాపారం 7 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. భారత్‌లో దేశీయ మూలికా వ్యాపారం 10,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాతో సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో హెర్బల్ వైద్యం పుంజుకుంటున్నది. భారత్ నుంచి ఏటా 3000 కోట్ల రూపాయల విలువైన మూలికలు ఎగుమతి అవుతున్నాయి. భారత్‌తో పోలిస్తే చైనా ఎగుమతులు ఇంకా చాలా ఎక్కువ. దాదాపు 20 వేల కోట్ల రూపాయల విలువైన హెర్బ్స్‌ను చైనా ఎగుమతి చేస్తున్నది. దేశంలో మొత్తం 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి.

ఈ జోన్స్‌లో మొత్తం 18000 రకాల పుష్పజాతులున్నాయి. అందులో 7000 రకాల మొక్కలను వైద్యంలో వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా 960 రకాల మొక్కలను వైద్య చికిత్సలో విరివిగా వాడుతున్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా కూడా భారీ ఎత్తున ఈ మొక్కల ట్రేడింగ్ జరుగుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రధానంగా 178 జాతుల మొక్కల వినియోగం దేశీయంగా కొన్ని వందల టన్నుల్లో ఉంది. అయితే ఈ విధానాల కారణంగా భారత్‌కు శతాబ్దాలుగా గర్వకారణంగా ఉన్న అమూల్యమైన ఔషధ మొక్కల జాతులు అంతరించిపోతున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి. అదొక కోణమైతే తాత్కాలికమైన అభివృద్ధి కోసం అరణ్యాలను, కొండలను ధ్వంసం చేస్తున్న కారణంగా, ఏజెన్సీ ప్రాంతాలను చదును చేస్తున్న కారణంగా స్వీయ అవసరాలకు సరిపడా ఔషధ మొక్కలు కూడా భవిష్యత్‌లో మనకు అందుబాటులో ఉండకపోవచ్చు.

దివ్యౌషధాలు

ఆల్పాల్ఫాకు వ్యాధినిరోధక శక్తిని ప్రసాదించే గుణం ఎక్కువ. ఆల్ఫాల్ఫాను గింజల పొడిగా, మొలకలుగా, టీ ఆకు పసరుతో చేసిన కషాయంగా... ఇలా రకరకాల రూపంలో తీసుకోవచ్చు. ఆల్ఫాల్ఫా గింజలను వంటకాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. దంతాలను, చిగుళ్లను, ఊపిరితిత్తులను, రక్తధమనులను, గుండెను అది శక్తిమంతంగా ఉంచుతుంది.
మన రాష్ట్రంలో విరివిగా కనిపించే కలుపుజాతి గడ్డి చేమంతి అనే మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా ఉపయోగించవచ్చని అంటున్నారు. దీనిని రైతులు పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
రోడ్డుపక్క కనిపించే నేలఉసిరిని పచ్చకామెర్ల చికిత్సలో ఉపయోగిస్తారు. అలోపతిలో పచ్చ కామెర్లకు మందులేదు. మానసిక రుగ్మతల చికిత్సలో జటామాంసి, అశ్వగంధి, బ్రహ్మి, జలబ్రహ్మి, వృద్ధదారు, శంఖపుష్పిని చాలా కాలంగా వాడుతున్నారు.

మూర్కొండ, తగిరిశ, తుప్ప తంగేడు, కసివింద, తెల్ల ఈశ్వరి, ఉత్తరేణి, పర్ణయవాని, నేల ములక, ఉచ్చింత.. ఇవన్నీ వినియోగంలో ఉన్న మొక్కలే. ప్రాణాంతకమైన హెర్పస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ఎస్‌వి) కారణంగా వచ్చే వ్యాధులను శక్తిమంతంగా అరికట్టే రెండు మొక్కలను ఇండియాలో కనుగొన్నారు. హైపరికమ్ హుకెరనమ్, హైపరికమ్ మైసోరెన్స్ అనే ఈ రెండు మూలికలు నీలిగిరి కొండల్లో విస్తారంగా దొరుకుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆవిష్కరణ. ఎందుకంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు అలోపతిలో ఔషధాలు ఇప్పటికీ లేవు. వైరల్ వ్యాధులకు మూలికా వైద్యంలో వున్న పరిష్కారాలు అలోపతిలో లేవని నిపుణుల అభిప్రాయం. అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, వచ, వెల్లుల్లి, అడ్డసర... హెచ్ఐవి రోగుల్లోనూ జవసత్వాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.

రక్తపోటుకు వాడే రిసెర్ఫిన్‌ను సర్పగంధి నుంచి రూపొందించారు. కార్డియోటానిక్ డిటిటాలిస్‌ను ఫాక్స్ గ్లోవ్ మొక్క నుంచి తయారు చేశారు. పిల్లల్లో వచ్చే లుకేమియా చికిత్సలో ఉపయోగించే విన్‌క్రిస్టిసిస్, విన్‌బ్లాస్టిన్‌సిన్‌లోను రోసి పెరివింకిల్‌గా చెప్పే బిళ్లగన్నేరు నుంచి తయారు చేశారు. మిరపకాయలు, పచ్చిబొప్పాయి ముక్కలు, అల్లం, యష్టమధు, రుబాబ్ మూలికలు లాలాజల ఉత్పత్తిని పెంచి పిండిపదార్థాలు జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. బర్బెరీ, సెంటావరి, జెంటియన్, గ్లోడెన్ సీల్, దవనం వంటి మూలికలు ఆకలిని పెంచుతాయి. జామ ఆకుల కషాయంతో పుక్కిలిస్తే చిగుళ్ల వ్యాధులు, మాయం అవుతాయి. అజీర్తి వ్యాధులకు బొప్పాయి దివ్య ఔషధంగా చెబుతారు. మాంసాహార పదార్ధాలను తేలిగ్గా జీర్ణం చేసుకోవడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. వాము గింజలను నెమ్మదిగా నములుతూ రసాన్ని మింగుతూ ఉంటే అజీర్తి, కడుపుబ్బరం తగ్గుతాయి. పసుపు కలిపిన నీళ్లతో జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది.

వెల్లుల్లి :
వెల్లుల్లి సూక్ష్మజీవులను అతి సూక్ష్మజీవులను కూడా సంహరిస్తుంది. గాయాలకు చీము పట్టకుండా చేస్తుంది. చర్మవ్యాధులను, సుఖవ్యాధులను కూడా నయం చేస్తుంది. రక్తంలో కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని, మెదడులో రక్తస్రావ, రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిలో ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తుంది. జీర్ణవాహికలో అన్నిరకాల హానికర సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. చైనాలో టీబీ చికిత్సలో కూడా వెల్లుల్లిని ప్రధాన ఔషధంగా వాడిన దాఖలాలున్నాయి. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటి వైద్య గ్రంథాల్లోనూ వెల్లుల్లి ప్రస్తావన ఉంది. మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్, రష్యా సైనికులు యుద్ధంలో క్షతగాత్రుల చికిత్స కోసం యాంటిబయోటిక్‌గా వెల్లుల్లిని వివరీతంగా వాడారు.
అర్జున :
ఇది ఉపఖండంలో పెరిగే వృక్షం. కార్డియాలజీ సమస్యలకు ఔషధంగా క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది గుండెకు బలాన్నిస్తుంది. ఒత్తిడిని, మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. గుండెకు రక్త ప్రసరణను క్రమబద్దం చేస్తుంది. కడుపులో అల్సర్లు, ఇంటర్నల్ బ్లీడింగ్, ఆస్తమా, విరేచనాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు. చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. లివర్ వ్యాధులనూ నివారిస్తుంది.
అశ్వగంధ :
అశ్వగంధ అంటే గుర్రం వాసనలను వెదజల్లేదని అర్ధం. శారీరక శక్తిసామర్థ్యాలను పెంచే ఔషధంగా చెబుతారు. అకాల వృద్ధాప్యాన్ని అరికడుతుంది. లైంగిక సామర్థ్యం ఉద్దీపనకేకాక, తీవ్రమైన మానసిక వత్తిడి కారణంగా తలెత్తే కీళ్లనొప్పులు, రక్తపోటు, మధుమేహం చికిత్సలోనూ దీనిని విరివిగా వాడతారు. వ్యాధినిరోధక సామర్థ్యాన్ని పెంచే అశ్వగంధ అనేక ఆయుర్వేధ ఔషధాల తయారీలో కూడా వాడతారు. ప్రపంచాన్ని ఊపేస్తున్న చైనా, కొరియా ఔషధ మొక్క జిన్‌సింగ్‌కు ధీటైన భారతీయ వెర్షన్‌గా అశ్వగంధను చెబుతారు.
మేషశృంగి :
తెలుగులో పొడపత్రిగా వ్యవహరించే మేషశృంగికి మధుమేహ వ్యాధిని అరికట్టే సామర్థ్యం ఉంది. అందువల్లే మధునాశిని అని కూడా అంటారు. స్వీట్స్‌పై ఆసక్తిని కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. విదేశాల్లో ఈ ఔషధంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచే విషయంలో ఈ ఔషధం శక్తిని అందరూ అంగీకరించారు.
అలోవెరా :
కలబందపై ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. దీన్ని మిరకిల్ ప్లాంట్‌గా వ్యవహరిస్తారు. వ్యాధులను నయం చేసే సహజసిద్ధమైన స్వభావం గల మొక్కగా చెబుతారు. శరీరానికి అవసరమైన అమినో యాసిడ్స్ కలబందలో పుష్కలంగా ఉన్నాయి. అనేకరకాల చర్మవ్యాధులకు దివ్యౌషధం.
శతావరి :
స్త్రీలవ్యాధులకు దివ్యౌషధం. హార్మోన్ల వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళల గర్భాశయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. తరుచు అబార్షన్లయ్యే మహిళలకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తున్నట్టు చెబుతారు.
................................................
* వి.శ్రీనివాస్ - సెల్ : 99854 11006

Thursday, January 6, 2011

Pranayama - Breathing Therapy

Important:This is only for the people who are breathing with their nose.
Not for people who are breathing with mouth.

Breathing Theraphy
Pranayama - Breathing Therapy - Phani Kiran: World Informatives

The nose has a left and a right side; we use both to inhale and exhale.

Actually they are different; you would be able to feel the difference.

The right side represents the sun, left side represents the moon.

During a headache, try to close your right nose and use your left nose to breathe.

In about 5 min, your headache will go. If you feel tired, just reverse, close your left nose and breathe through your right nose.

After a while, you will feel your mind is refreshed.

Right side belongs to 'hot', so it gets heated up easily, left side belongs to 'cold'.

Most females breathe with their left noses, so they get "cooled off" faster.

Most of the guys breathe with their right noses, they get worked up.

Pranayama - Breathing Therapy - Phani Kiran: World Informatives

Do you notice the moment we wake up, which side breathes faster? Left or right?

If left is faster, you will feel tired.

So, close your left nose and use your right nose for breathing, you will get refreshed quickly.

This can be taught to kids, but it is more effective when practiced by adults.

My friend used to have bad headaches and was always visiting the doctor.

There was this period when he suffered headache literally every night, unable to study.

Pranayama - Breathing Therapy - Phani Kiran: World Informatives

He took painkillers, did not work.

He decided to try out the breathing therapy here: closed his right nose and breathed through his left nose.

In less than a week, his headaches were gone! He continued the exercise for one month.

This alternative natural therapy without medication is something that he has experienced.

So, why not give it a try?

Sunday, January 2, 2011

మర్దన చికిత్స (మసాజ్‌ధెరపీ)

aromatherapy_massage 
నొప్పి, అసౌకర్యం, పట్టుకుపోవడం వంటి బాధలను నివారించడం కోసం మెత్తటి కణజాలాన్ని మర్దన చేయడంతో కూడుకున్నదే మసాజ్‌ థెరపీ లేక మర్దన చికిత్స. ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఈ చికిత్స ఎంతోదోహదపడుతుంది. ఈ చికిత్సా విధానాన్ని ‘అమెరికన్‌ మసాజ్‌ థెరపీ అసోసియేషన్‌’... చేతులతో మెత్తటి కణజాలాన్ని మర్దన చేసే ప్రక్రియగా అభివర్ణించింది. ఈ వృత్తిలో ప్రాక్టీషనర్‌ శారీరకమైన, మెళకువలను, సంబంధిత వైద్య విధానాలను ఉపయోగించి ఆరోగ్యాన్ని చేకూ ర్చే ప్రక్రియగా కూడా మర్దన చికిత్సను నిర్వ చించారు. శరీరం మీద థెరపిస్టు చేతులు కదిలిస్లూ వివిధ శరీరపరమైన ప్రభావాలను కలిగించడం మర్దనలో వున్నాయి. కండరాలను, లిగమెంట్లను, టెండన్లను, ఫేషియాను వివిధ కదలికలు భౌతికంగా సాగదీయ గలవు.

కణజాలంలో రక్తప్రసారం మెరుగవుతుంది. కండారాల నొప్పులు తగ్గి నాడీమం డల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. నిద్రను ప్రసాదిస్తుంది. చికిత్సాపరమైన మర్దన రక్తప్ర సారం, కండరాలు, ఎముకులు, నాడీమండ ల వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. గాయాల నుంచి, జబ్బునుంచి దేహం కోలు కునే క్రమాన్ని వేగవంతం చేస్తుంది. వివిధ రకాల స్ట్రోకులు, తైలాలపై మసాజ్‌ థెరపీ ఆధారపడివుంది. ఇవి ఒత్తిడి పేరుకుపోయిన భాగాలపై పనిచేసి మనసుకు శరీరానికి విశ్రాంతిని ప్రసాదిస్తాయి. వెన్ను మర్దన, మెడ భుజాల మర్దన, ఛాతీ మర్దన, పొట్ట మర్దన, ముఖం, తల మర్దన, చేతుల మర్దన, కాళ్లు, పాదాల మర్దన పిల్లలకు... పసికందులకు మర్దన గర్భిణీల మర్దన... ఇలా మసాజ్‌ థెరపీలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా థెరపిస్టులకు తెలిసిన 200 పైగా మెళకువలను ఉపయో గించి మర్దన చేయవచ్చు. ఇక్కడ మనం కొన్ని రకాల మర్ధనల గురించి తెలుసుకుందాం...

  • క్రీడల మసాజ్‌
  • స్వీడిష్‌ మసాజ్‌
  • థాయ్‌ మసాజ్‌
  • ఇన్ఫెంట్‌ మసాజ్‌
  • రిలాక్సేషన్‌ మసాజ్‌
  • జీరో బ్యాలెన్సింగ్‌
    ఇవే కాకుండా... ఆక్యుప్రెషెర్‌, షియాటుస, లోమి లోమి, జిన్‌ షిన్‌ జిట్సు, అమ్మ థెరపీ, చినే ట్సాంగ్‌ వగైరా ప్రాచ్య పద్ధతులు మసాజ్‌లో చికిత్సా విధానాలుగా ఉన్నాయి. అనేక అనుబంధ థెరపీల్లో అనేక మర్దన మెళకువలు కూడా చేర్చారు. అరోమా థెరెపీ, రెఫ్లెక్సాలజీ, రికీ, హెల్లెవర్క్‌, ఆస్టియోపతీ వీటిలో ముఖ్యమైనవి.

    మర్దన చికిత్స వల్ల ఎన్నో లాభాలు...
    వీటిలో ప్రతి మర్దన చికిత్సకు ఎన్నెన్నో లాభాలున్నాయి. చెప్పాలంటే... సమగ్ర ఆరోగ్యం ఫలితం... మర్దన చికిత్స. ఇది బాడీవర్క్‌ రక్త ప్రసారాన్ని పెంచుతాయి. కను క దేహం అధికంగా ప్రాణవాయువును, పోష కాలను కణాల్లోకి, ప్రధానాంగాల్లోకి పంప్‌ చేస్తుంది. థెరపిస్టు చేసే మాసాజ్‌ వల్ల లింఫ్‌ వ్యవస్థకు ఉత్తేజం లభిస్తుంది. శరీరం సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ. బలోపేతమై మన ఆరోగ్యంపై దాడిచేసే టాక్సి ఇన్వేడర్సును సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ఉదాహర ణకు, రొమ్ము క్యాన్సర్‌ రోగులకు చేసే మసాజ్‌ వల్ల కాన్సర్‌ను నిరోధించే కణాలు పెరుగుతాయి.

    massage-face 
  • శరీరంలోని సహజసిద్ధమైన నొప్పి నివారణ పదార్థం ఎండోర్ఫిన్స్‌ను విడుదల చేయడానికి దోహదపడుతుంది. ఉదాహరణ కు మసాజ్‌ టెక్నిక్‌ అయిన ఆక్యుపంక్చర్‌ థెరపీ నొప్పి తగ్గించే ఎండోర్ఫిన్స్‌ ఉత్పత్తి చేసేట్టు శరీరాన్ని ఉత్తేజపరచగలదు. ఆక్యు పంక్చర్‌ చికిత్స నొప్పితగ్గంచే ఓపియడ్స్‌ అనే పదార్థాలను కూడా విడుదల చేస్తుందని అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధు లు, గాయాలు, ఆపరేషన్‌ నుంచి కోలుకో వడం, నొప్పి తగ్గించడం వంటి చికిత్సలో ఆక్యుపంక్చర్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. మైగ్రే యిన్‌ తలనొప్పిని తగ్గించి మందులు అంతగా అవసరం లేకుండా సహాయపడు తుంది.

    తల్లులు కాబోయేవారికి నొప్పులు తగ్గిస్తుంది. మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. డిప్రెషన్‌, ఆందోళనను ఆసుపత్రిలో ఉండవలసిన కాలా న్ని తగ్గిస్తుంది. బిగుసుకుపోయిన ఉద్రిక్త కండరాలకు విశ్రాంతినిస్తుంది. దిగువ వీపు నొప్పి, మెడ నొప్పిని చికిత్సగా మసాజ్‌ థెర పిస్టు తరచూ మసాజ్‌ చేస్తాడు. మొత్తం మాన సిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కో ర్టిసాల్‌ వంటి స్ట్రెస్‌ హార్మోన్ల స్థాయి తగ్గించి శరీరం ఒత్తిడిని ఎదురుకోవ డానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌, టెండి నైటిస్‌ వంటి వాపు పరిస్థిలకు చికిత్సగా కూ డా మర్దన చికిత్సను ఉపయోగించవచ్చు. కండరాల ఉద్రిక్తత, బిగుసుకు పోవడానికి వైద్యంగా తోడ్పడుతుంది.

    massagae-oli 
  • దెబ్బతిన్న కండరా లకు బెణుకుపట్టిన లిగమెంట్సు సత్వరం మా నడానికి తోడ్పడుతుంది. కండరాలు బిగుసు కుపోవడాన్ని తగ్గిస్తుంది. కీళ్ళకు వెసులుబాటు ను, కదలికలను ప్రసాదిస్తుంది. క్రీడల్లో సామ ర్థ్యాన్ని పెంచుతుంది, క్రీడల్లో, పనిలో అయ్యే గాయాలను మాన్పుతుంది. రక్తపోటు (బిపి) తగ్గిస్తుంది. ఉద్రిక్తతకు సంబంధించిన తల నొప్పులనుంచి, కంటి అలసట నుంచి ఉపశ మనం కలిగిస్తుంది. భంగిమల్ని మెరుగుపరు స్తుంది. శరీరం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.కండరాలు- ఎముకల వ్యాధులను నయం చేస్తుంది. ఆపరేషన్‌, గాయాలయిన తర్వాత కోలుకోవడానికి తోడ్పడుతుంది.

    మర్దన చికిత్స వల్ల ఒనగూరే భావోద్రేకపరమైన లాభాలు...
  • మానసిక అప్రమత్తతలో విశ్రాంతిని పెంపొందిస్తుంది.
  • ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని సృజనాత్మక శక్తిని పెంచుతుంది.
  • సంరక్షణ అవసరాలను తీరుస్తుంది.
  • ఆరోగ్యంగా ఉన్నామన్న అనుభూతిని పెంపొందిస్తుంది.
  • ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది.
  • శరీరం గురించి అవగాహన పెంపొందిస్తుంది.
  • మనసు-శరీరాల మధ్య లింకు గురించి అవగాహన పెంపొందిస్తుంది.
  • * మర్దన తైలం... చరిత్రలో మర్దన తైలం మర్దన చికిత్సలో అంతర్భాగంగా ఉంటూవచ్చింది. తైలం పూసి నొప్పి తగ్గించడానికి రుద్దడం గురించి ప్లాటో, సోక్రటీస్‌ ఆనాడే తమ రచనల్లో పేర్కొన్నారు. ్రపూ 1000 నాడే మర్దన చేయడానికి తైల పదార్థం గురించి హోమర్‌ రాశాడు. మర్దన చేయించుకునే వారి చర్మంపై సున్ని తంగా నాజూకుగా జారడానికి మర్దనలో తైలం వాడుతారు. వివిధ రకాలుగా ఉపయో గపడే ఎన్నో తరహాల తైలాలు ఈనాడు అందుబాటులో ఉన్నాయి. చర్మాన్ని శుద్ధిచేసి పోషణనివ్వడానికి వివిధ రకాల తైలాల్లో పోషకాలున్నాయి. మొక్కలు, చెట్లు, మూలాలు, విత్తనాల నుంచి తీసిన సుగంధ తైలాలు (ఎసెన్షియల్‌ ఆయిల్స్‌) మర్దన చికిత్సలో మెరుగైన ఫలితాలకోసం ఈ తైలాలను వినియోగిస్తారు. aromatherapy_massage 
    ఇవే అరోమా థెరపీగా ప్రసిద్ధి చెందాయి. మూలికల్లో ఉండే మందుగుణాలు ఎసెన్షియల్‌ తైలాల్లో ఉన్నాయి, వీటికి ఏంటీసెప్టిక్‌ గుణముండి ఒకవ్యక్తి మూడ్‌ను ఆల్ఫాక్టరీ నరాల ద్వారా సరిదిద్దు తాయి. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఎంతో చిక్కనయిన వైనప్పటికీ సరిగా వాడితే ఎలాటి చెడు ప్రభావాలు కలగవు. మర్దనలో వాడే మర్దన తైలాలు, వాటి ముఖ్యమైన గుణాల పట్టిక ఈ కింద ఇచ్చారు. స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ తేలికైంది, తియనైంద కాస్త కరుకుగా ఉండే తైలం. ఇది వాపులకు వాడే తైలం. లోపలకు చొచ్చుకుపోయి చర్మానికి పోషణ అందిస్తుంది. ఈ తైలం కారియర్‌ ఆయిల్స్‌ ప్రముఖమైందిగా కూడా ప్రసిద్ది చెందింది. చెమ్మనిచ్చి, పోషించి, పునఃజవసత్వాలను ప్రసాదించే గుణాలు ఆప్రికాట్‌ ఆయిల్‌కు ఉన్నాయి. ఎండిపోయిన, సున్నితమైన చర్మానికి ఎంతో మంచిది. వాపులకు కూడా ఈ తైలం పనిచేస్తుంది. అవొకాడో ఆయిల్‌... పొడి చర్మం, ఎక్జిమా, సోరియాసిస్‌ లేక అలాంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు తరచూ ఈ తైలం వాడుతారు. ఎండ వాతావరణం వల్ల దెబ్బతిన్న చర్మం, పగిలిన చర్మానికి, పోషణలేని చర్మానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చర్మానికి జీవంపోసి మెత్తపరుస్తుంది. జొజొబా ఆయిల్‌ అన్ని రకాల చర్మానికి మంచిది. ఎలాటి ఇబ్బందులు లేకుండా మచ్చలు పడ్డ చర్మానికి ఈ తైలాన్ని వాడవచ్చు. ఇది మొటిమల్ని నియంత్రించడానికి తోడ్పడుతుంది. జొజొబాను అరోమా థెరపీలో కారియర్‌ ఆయిల్‌గా కూడా వాడతారు. ఇది సులువుగా చర్మాన్ని చొచ్చుకుపోతుంది. జొజొబా క్రిమిసంహారిణి పూడుకుపోయిన రంధ్రాల్లో సెబమ్‌ను తొలిగంచడానికి సహాయపడుతుంది. వీట్‌ జెర్మ్‌ ఆయిల్‌లో ఎక్కువ మోతాదులో విటమిన్‌-ఇ ఎసెన్షియల్‌ ఫాటీ ఆసిడ్స్‌ ఉన్నాయి. అరోమాథెరపీ మసాజ్‌లు కలిపిచేసే చికిత్సలో దీన్ని విస్తారంగా వినియోగిస్తారు. మెత్తనైన, యవ్వనంతో తొణికిసలాడే చర్మాన్ని పెంపొందిస్తుందని తెలుస్తోంది. గాయం మానిన మచ్చలు, సాగిన మచ్చలు మాన్పడానికి సహాయపడుతుంది. హాజెల్‌నట్‌ ఆయిల్‌ తైలం మెత్తగా ఉంటుంది. చర్మానికి చెమ్మనిచే గుణాలు న్నాయి. చర్మాన్ని టోన్‌ చేసి గట్టిపరచడానికి ఈ తైలం సహాయపడుతుంది. కాపిలరీస్‌ను బలోపేతం చేయడానికి కళాలు పునరుజ్జీవిం పచేయడానికి తోడ్పతుంది. సిసేమ్‌ ఆయిల్‌ అన్ని తరహాల చర్మానికి మంచిది. రింగ్‌వర్మ్‌, స్కాబీస్‌, ఫంగల్‌ చర్మవ్యాధులను నిర్మూలిస్తుంది. దీన్ని ఏంటీసెప్టిక్‌గా భావిస్తారు. చెడకుండా ఎక్కువకాలం మన్నుతుంది.హోలీ ఆయిల్‌ మంచి కారియర్‌ ఆయిల్‌గా పరిగణిస్తారు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోయేలా తోడ్పడుతుంది. మంచి సుకుమారమైన, వాసనలేని హైపో ఎలెర్జిక్‌ ఆయిల్‌.

Saturday, January 1, 2011

తైలాలతో దేహానికి మెరుపు

చర్మ సంరక్షణలో సుగంధ తైలాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సుగంధ తైలాలను అరోమా, ఎసెన్షియల్, వోలటైల్ ఆయిల్స్ అని అంటారు. ఇవి మొక్కలు, వృక్షాలకు సంబంధించిన శుద్ధమైన, సహజసిద్ధమైన నూనెలు. ఆహ్లాదాన్ని కలిగించే వాసనలు ఉండటంతో అరోమా అని, అణువణువూ పిండి, వడగాచి తీయడంతో ఎస్సెన్షియల్ అని, ఇగిరిపోయే గుణం ఉండటం వల్ల వోలటైల్ అని పిలుస్తారు. ఈ తైలాలను వనమూలికలకు సంబంధించిన వేరు, కాండం, ఆకు, పూవు, తొక్క, గింజ భాగాల నుంచి సేకరిస్తారు.

మెదడుకు సంబంధించిన దాదాపు అన్ని నాడులూ చర్మంపైకి చేరుకునేవే. చర్మంలోనికి తెరుచుకున్న ఇతర జ్ఞాన కర్మేంద్రియాల ఉపరితల భాగం (ఎపిథీలియం, మ్యూకస్ పొరలు) కూడా చర్మంలో అంతర్భాగమే. అలాగే మెదడుకు మనసుకు ఉన్న సంబంధం విడదీయరానిది. ఆహ్లాదంగా ఉన్న మెదడు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే చాలా రకాల చర్మవ్యాధులు మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తీవ్రమవుతాయి. మనసుకు ఆహ్లాదం కలిగించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించి, తద్వారా చర్మ వ్యాధులను నివారించడం సుగంధ తైలాల ప్రత్యేకత.

సుగంధ తైలాలు ఎంత ఆహ్లాదకరమైనవో అంతే తీక్షణమైనవి. కాబట్టి వీటి వాడకానికి ఆవిరికాని, ఇగిరిపోని గుణాలుండే వెజిటబుల్ ఆయిల్స్‌ను వాహక తైలాలుగా వాడాల్సి ఉంటుంది. అలాకాకుండా నేరుగా తీసుకుంటే శ్వాసతీసుకోవడం కష్టంగా మారవచ్చు. అందుకే ముందుగా తైలాన్ని ప్యాచ్ టెస్ట్ చేసి చూసుకోవాలి. అరోమా అయిల్స్‌తో ఆల్మండ్, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆలివ్ నూనెలను క్యారియర్ ఆయిల్స్‌గా వాడతారు. ఒక్కోసారి ముక్కు ద్వారా ఈ తైలాలను ఉపయోగించాల్సి వచ్చినపుడు నీళ్లలో కలిపి ఆవిరిగా పట్టడం, స్ప్రే చేస్తారు. కడుపులోనికి తీసుకోవాల్సి వచ్చినపుడు ఆల్కహాల్, నీటిలో కలిపి టింక్చర్‌గా తీసుకోవచ్చు.

చర్మవ్యాధులకు చికిత్సగా అరోమా తైలాలు (అరోమా థెరపీ) మూడు రూపాలలో వాడతారు. 1) చర్మ సంరక్షణ(బాడీకేర్) 2) సౌందర్య సంరక్షణ(బ్యూటీ కేర్) 3) కేశ సంరక్షణ(హెయిర్ కేర్). ఈ రకమైన చికిత్సలు అందించేటప్పుడు అరోమా తైలాలు యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెల్యూలైట్, యాంటీ సెప్టిక్ వంటి ఫార్మకలాజికల్ గుణాలలో ఒకటి కంటే ఎక్కువ రూపాలలో పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సూక్ష్మరూపంలో ఉండటంతో చర్మం నుంచి రక్తంలోకి త్వరగా చేరుతుంది.

చర్మ సంరక్షణ(బాడీకేర్)

చర్మ సంరక్షణలో భాగంగా తైలాలను నీళ్లలో కలిపి స్నానం రూపంలో గానీ, వెజిటబుల్ నూనెల్లో కలిపి అభ్యంగం రూపం(మసాజ్)లో గానీ ఉపయోగించాల్సి ఉంటుంది.
పొడి చర్మం : 50 మి.లీ అరోమా ఆయిల్ కాంపౌండ్ తయారు చేసుకోవడానికి.. (ఎసెన్షియల్ ఆయిల్) జిరేనియమ్ - 8 చుక్కలు, కెమొమిల్ - 6 చుక్కలు, మంచి గంధం - 6 చుక్కలు, వర్టివెర్ట్ - 8 చుక్కలు (బే సాయిల్), ఆల్మండ్ - 30 మి.లీ, అప్రికాట్ - 20 మి.లీ జిడ్డు చర్మం : 50 మి.లీ అరోమా ఆయిల్ కోసం (ఎస్సెన్షియల్ ఆయిల్) జనిఫెర్ బెర్రీ - 6 చుక్కలు, లెమన్ - 7 చుక్కలు, రోజ్‌వుడ్ - 6 చుక్కలు, ఇలాంగ్ ఇలాంగ్ - 5 చుక్కలు (బే సాయిల్), గ్రేప్ సీడ్ - 40 మి.లీ, జోజోబ - 10 మి.లీ, ముడుతల చర్మం : (ఎస్సెన్షియల్ ఆయిల్) ఫాకిన్ సెన్స్ - 6 చుక్కలు, క్యారట్ సీడ్ - 8 చుక్కలు, పట్ చవులీ - 8 చుక్కలు, స్పికెనార్డ్(జటామాంసి) - 4 చుక్కలు (బే సాయిల్), అప్రికాట్ - 35 మి.లీ, ఈవెనింగ్ ప్రైమ్‌రోజ్ - 5 మి.లీ, క్యారట్ సీడ్ - 5 మి.లీ, అశ్వగంధ - 5 మి.లీ

ఒబెసిటీ

50 మి.లీ యాంటీ సెల్యూలైట్ తయారీకి.. (ఎస్సెన్షియల్ ఆయిల్) ఫెన్నెల్ - 5 చుక్కలు, జనిఫెర్ బెర్రీ - 5 చుక్కలు, పట్ చవులీ - 5 చుక్కలు, రోజ్‌మెరీ - 5 చుక్కలు, గ్రేప్‌సీడ్ - 5 చుక్కలు (బే సాయిల్) , నువ్వుల నూనె - 50 మి.లీ
కేశ సంరక్షణ(హెయిర్‌కేర్) :

శిరోజాలు రాలడాన్ని తగ్గించుటకు :(50 మి.లీ తయారీకి), (ఎస్సెన్షియల్ ఆయిల్) స్పికెనార్డ్ - 5 చుక్కలు, రోజ్‌మెరీ - 6 చుక్కలు, సుగంధ్ కోకిల - 6 చుక్కలు, కర్రీ లీవ్స్ - 6 చుక్కలు, (బేసాయిల్) నువ్వుల నూనె - 45 మి.లీ, ఆముదం నూనె - 5 మి.లీ చుండ్రు నివారణకు : (50 మి.లీ తయారీకి) (ఎస్సెన్షియల్ ఆయిల్) పట్ చవులీ - 6 చుక్కలు, రోజ్‌మెరీ - 6 చుక్కలు, టీ ట్రీ - 6 చుక్కలు, సెడార్ వుడ్ - 6 చుక్కలు (బేసాయిల్), నువ్వుల నూనె - 45 మి.లీ, ఆలివ్ ఆయిల్ - 5 మి.లీ,

ముఖం శుభ్రపరచుకోవడానికి(క్లెన్సింగ్): శుభ్రమైన నీటిలో గానీ, క్లెన్సింగ్ మిల్క్‌లో (1-2 స్పూన్‌లు)గానీ రెండు చుక్కల మోతాదులో క్లేరీసెజ్, లెమన్, లైమ్, రోజ్‌మెరీ, కామెమైల్, లావెండర్, జిరానియమ్, టర్మరిక్.. వీటిలో ఏదైనా ఒకదానిని కలిపి ముఖానికి పట్టించి, మెత్తటి గుడ్డతో తుడిచినట్లయితే మేకప్ మరకలు తొలగి ముఖం నిగనిగలాడుతుంది.

ముఖానికి లేపనము : (ఫేషియల్ ప్యాక్)

పొడి చర్మానికి: గంధం నూనె - 2 చుక్కలు, మీగడ, తేనె - 1 స్పూన్, శనగపిండి, ముల్తాన్ మట్టి - అర స్పూన్ వీటన్నింటినీ ఒక గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కాసేపు ఆరిన తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. జిడ్డు చర్మానికి : ఇలాంగ్ ఇలాంగ్ - 1 చుక్క, జిరేనియమ్ - 1 చుక్క, పుచ్చకాయ లేక టమాట గుజ్జు - 2 స్పూన్‌లు, ముల్తానిమట్టి - అర స్పూన్, వీటన్నింటినీ ఒక గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు ఆరిన తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.


డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్,
ఫోన్: 9848750720.

Friday, December 31, 2010

పసుపుతో ఆరోగ్యం * పసుపే ఆరోగ్యానికి పసిడి

* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
* చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
* పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
* వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
* చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.
* చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.
* వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్‌లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.
* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

Tuesday, December 7, 2010

కండర పుష్టికి కావాలా తైలాలు?

సౌష్టవమైన ఆకృతిని, దృఢత్వాన్నీ కలిగించేవి కండరాలే. చర్మం లోపల సన్నని దారాల్లా ఉండడంతో మొదలు, శరీరంలోని అన్ని అవయవాల నిర్మాణం దాకా కండరాలే కీలక పాత్ర వహిస్తాయి. సిక్స్ ప్యాక్, ఎయిట్‌ప్యాక్ బాడీ బిల్డింగ్‌లోనూ ముఖ్య భూమిక కండరాలదే.కండరాలు బలహీనపడిన వ్యక్తి బక్కచిక్కిపోతాడు. చర్మం సైతం తన ప్రభను కోల్పోయి ముడుతలు పడుతుంది. పైగా ఏపనీ చేయలేని అశక్తత, నిరుత్సాహం వెంటాడతాయి. ఇదంతా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు.

లేదా రక్తహీనత, క్షయ, గ్రహణి (ఐబిఎస్), తరుచూ వచ్చే జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్లనూ కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏర్పడిన పోషకలోపాల కారణంగా పుట్టిన బలహీన శిశువు మొదలు, «వృద్ధుల దాకా అందరూ కండరాల సమస్యను ఎదుర్కొనే వారే. ఇలాంటి వారికి కొన్ని ప్రత్యేక తైలాలతో మర్ధన చికిత్స చేస్తే ఆరోగ్యంతో పాటు కండర పుష్టీ పెరుగుతుంది. రక్తప్రసరణా వ్యవస్థ బలపడి చర్మంతోపాటు శరీర అవయవాలన్నీ తమతమ కార్యకలాపాలను సవ్యంగా జరుపుకోగల్గుతాయి. ఫలితంగా ఆరోగ్యమూ కుదుటపడుతుంది.

చందన బలా లాక్షాది తైలం :
చందనం, బలామూలం, లాక్ష్యానిర్యాసం, ఉశీర అనే నాలుగు వనౌషదుల కషాయం కాచిపెట్టుకుని దీనికి తగినన్ని పాలు కూడా కలుపుతారు. ఈ మొత్తానికి నాలుగో వంతు నువ్వుల నూనె చేరుస్తారు. నూనెలో నాలుగోవంతు చందన చెక్క, వట్టివేర్లు, సోంపు, దేవదారు చెక్క, పసుపు, కోష్టు, మంజిష్టా, అగరు, సుగంధిపాల, అశ్వగంధ, బలామూలాలు, కస్తూరి పసుపు, మూర్వా, తుంగ ముస్తలు, ముల్లంగి, ఏలకులు, దాల్చిన, నాగకేసరాలు, రాస్నా, లాక్షా, అజమోద, చంపక, చోరపుష్టి మొదలగు వాటి చూర్ణాలను ముద్దగా చేసి పైన తెలిపిన కషాయం, పాలు, నూనెలు ఉన్న పాత్రలోకి చే ర్చి 'తైలపాక విధి' లో ఆయుర్వేద ఫార్మసిస్టులు తయారు చేస్తారు.

ఉపయోగాలు
|* స్త్రీలలో రక్తస్రావ లక్షణాలు ఉండే గర్భకోశ వ్యాధులు (మెనొరేజియా, మెట్రోరేజియా), రక్తస్కందన లోపాలు ఉండే హీమోఫిలియా, మెటికియల్ హెమరేజ్ వంటి సమస్యలకు ఈ తైలంతో మర్ధన చికిత్స చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

* దగ్గు, దమ్ము, క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఛాతిపనైన, ముందూ వెనుక మర్ధన చేస్తే ఛాతీలో కండరరపట్లు పోయి కసమస్యలు తేలిగ్గా ఉపశ మిస్తూ ఔషధ చికిత్సలో సహకరిస్తాయి.

* ఒంటిపైన పొడిదురదలు లేదా మంటలు ఉన్నప్పుడు ఈ తైలంతో మర్ధన చేస్తే తక్షణమే ఉపవమనం లభిస్తుంది. * రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వాపులు గానీ, రక్తకణాల క్షీణతతో వచ్చే కామెర్ల జబ్బు ( హీమోలైటిక్ జాండిస్)లో గానీ, ఈ తైౖలాన్ని వాడుకోవచ్చు.

* తలపోటు, కళ్ల మంటలు ఉన్నప్పుడు తలకు మర్ధించుకోవచ్చు. * కాళ్లు, చేతులు పట్టేస్తున్నప్పుడు ( క్రాంప్స్) ఈ తైలంతో మర్ధనచేస్తే ఉపశమనమే కాకుండా సమస్యలు శాశ్వతంగా తగ్గిపోతాయి.
* తరుచూ వచ్చే కొన్ని దీర్ఘకాలిక జ్వరాలకు ఈ తైలంతో అభ్యంగనం చేస్తే శరీరం శక్తిని పుంజుకోవడంతో పాటు జ్వర సమస్యలు కూడా పూర్తిగా పోతాయి.
ఈ ప్రొటీన్, క్యాల్షియం లోపాలతో చిన్న పిల్లల్లో వచ్చే ' ఫక్కా'( రికెట్స్, మరాస్మస్, క్యాషియోర్కర్) వంటి వ్యాధులు, పుట్టుకతోనే వచ్చే మెదడు ఎదగకకుండా పోయే సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మజిల్ డిస్ట్రోఫీ వ్యాధకులకు కూడా ఈ ఈ తైలంతో అభ్యంగనం చేస్తే ప్రయోజనం ఉంటుంది.
మహా మాష తైలం
అశ్వగంధ, శ ఠీ, దేవదారు, బలా, రాస్నా, ప్రసారణీ, కుష్ఠం, భారంగీ, విదారీకంద, పునర్నవా, శతావరీ, జీరక, హింగు, శతపుష్పీ, గోక్షురా, పిప్పలీ మూల, చిత్రక, సైందవ లవణం, జీవనీయ గణం వంటి వనౌషధుల చూర్ణకల్కం ఒక భాగం తీసుకుని దానికి నాలుగు రె ట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మినుముల ( మాష) కషాయం, పాలు కలుపుతారు. ఆ తరువాత అన్నిటినీ ఒక పాత్రలో చేర్చి 'తైలపాక విధి' లో నువ్వుల నూనె మిగిలేట్లు కాచి తయారు చేస్తారు. ఆయుర్వేద ఫార్మసిస్టులు కొందరు కల్క భాగంలో కొంత మేక మాంసాన్ని కూడా కలుపుతారు.

ఉపయోగాలు
ఈ దీర్ఘకాలిక పక్షవాతాలు లేదా నరాల సంబంధ వ్యాదుల్లో కండరాలు, స్నాయువులు (లిగమెంట్లు ) బలహీనపడుతూ ఉంటాయి. వీరికి మహా మాష తైలంతో మర్ధన చేస్తే కండరాలు, స్నాయువులు తిరిగి పుష్టిగా తయారవుతాయి.
* మాటిమాటికీ మూర్ఛలు వచ్చే వారికి, దవడలు పట్టేసే వారికి ఈ తైల మర్ధన ఎంతో మేలు చేస్తుంది.
* అపబాహుక, విశ్వాచీ, ఖంజ, పంగుతా, అర్థితం వంటి నరాల జబ్బుల్లో కండరాలు ఎండిపోతుంటాయి. ఆ స్థితి రాకముందే ఈ తైలంతో మర్ధన చే స్తూ ఉంటే కుంటి, గూని, మూతివంకర, చేతివాతం వంటి సమస్యలు తొలగిపోతాయి.
* పురుషుల్లో ధాతుక్షయం, ప్రత్యేకించి శుక్రక్షయం కారణంగా సంతానం కలగనప్పుడు మహా మాష తైలంతో మర్ధన చేసుకోవడతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
సూచనలు:
పైన పేర్కొన్న వ్యాధులకు తైల మర్ధన ంతో మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణ లో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకున్నప్పుడు ఆ ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. ఇక ఈ వ్యాధులకు అల్లోపతి వైద్య చికి త్సలు తీసుకునే వారు కూడా మర్ధన కోసం మహామాష తైలాన్ని నిస్సంకోంచంగా వాడుకోవచ్చు.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

Saturday, November 6, 2010

అడవిలో ఆసుపత్రి ..... మూలికలే మందులు !

mulikalu5అక్కడ కార్పొరేట్‌ వైద్యానికి సైతం లొంగని వ్యాధులు మటు మాయమవుతాయి. ఆయన హస్తవాసిని చూసి మొండి రోగాలు కూడా తోకముడుస్తాయి. అలా అని ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ వైద్యుడేమీకాదు. ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో ఈ సత్కార్యాన్ని చేపట్టారు. ఇప్పటివరకు కొన్ని వేలమంది రోగులకు వైద్యసేవలందించి వారికి స్వాంతన చేకూర్చిన... చేకూర్చుతున్న ఆ వైద్య‘నారాయణుడే’ జమాల్‌ ఖాన్‌. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని ఓ కుగ్రామం నిమ్మలగూడెంలో... వారసత్వ సంపదగా వచ్చిన వైద్య విధానంతో జమాల్‌ తన ప్రకృతి చికిత్సాలయం ద్వారా ఎంతో మందికి వైద్య సేవ చేస్తున్నాడు. ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితం చెట్లలోని మందు గుణాన్ని క్రోడీకరించింది. ఆయుర్వేదం పరిధిలోకి రాని చెట్టు, మొక్క, తీగ అంటూ ఏదీలేదు. ఆలాంటి అపార వృక్షసముదాయంలోంచి వైద్య సంపదను సృష్టిస్తున్నాడాయన. మన్నెం అటవీ ప్రాంతంలో బీదబిక్కి జనానికి సహజమైన ఓషధులతో తన ప్రకృతి వైద్యశాల ద్వారా సేవ చేస్తున్నాడు. మన రాష్ట్రం నుండే కాక... చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి వచ్చే రోగులకు కూడా తన వైద్య సేవలు అందిస్తున్న జమాల్‌ఖాన్‌... ‘వైద్యో నారాయణో హరి’ అనే ఆర్యోక్తికి అక్షరాల అర్హుడు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చుచేసినా తగ్గని మొండి వ్యాధులను వనమూలికలతో... అదీ ఉచితంగా అందిస్తూ... తన సేవా తత్పరతను చాటుకుంటున్న ప్రకృతి వైద్య నిపుణుడు జమాల్‌ నిస్వార్థ సేవల కథనం.

- మహత్తర వనమూలికలతో మొండి రోగాలకు వైద్యం
- రెండు దశాబ్దాలకు పైబడిన వంశపారంపర్య ఉచిత వైద్య సేవలు
- మూడు రాష్ట్రాల రోగుల ఆశాజ్యోతి ఎండి.జమాల్‌ఖాన్‌
అనాది నుంచి ప్రకృతిలో మమేకమైన మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఆ ప్రకృతికి దూరమయ్యాడు. వైద్యరంగం అభివృద్ధి చెందుతున్న కొద్ది మానవుని ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది. అయితే వైద్యరంగంలో అనేక రకాల వైద్య విధానాలతో రకరకాల చికిత్సలు జరుగుతున్నప్పటకీ, అన్నింటికీ మించి, ప్రకృతిలో దొరికే మహత్తర వన మూలికలే మేలైన రోగ వినాశకారులని గుర్తించిన జమాల్‌ఖాన్‌ కుటుంబం వంశ పారంపర్యంగా ఏజెన్సీలో వైద్యం చేస్తూ, ఎందరో రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అడవి నుండి ఔషద గుణాలు ఉన్న మొక్కలను, వేర్లను, దుంపలను సేకరించి, వాటి ద్వారా చికిత్స నిర్వహిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండల కేంద్రానికి సరిగ్గా మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న నిమ్మలగూడెం జమాల్‌ఖాన్‌ మూలికా వైద్య ప్రకృతి కేంద్రం.

mulikaluచుట్టూ గుట్టలు, పచ్చటి ప్రకృతి, ప్రక్కనే జలజలా పారుతున్న శబరి నది ఒడ్డున తనకున్న కొద్దిపాటి భూమిలోనే అనేక రకాల వన మూలికలను పెంచుతూ, దాన్ని కుటీర పరిశ్రమగా చేసి వనమూలికలతో మందులు తయారు చేస్తున్నారు. సుమారు 20 మంది సహాయకులతో ఈయన వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జమాల్‌ఖాన్‌ సేకరించే అరుదైన వన మూలికా ఔషధాలైన తెల్ల మద్ది, ఎర్రచిత్రమూలం, తెలియకండ, బొమ్మల మర్రి, పీడాకుల పాల, అశ్వగంధ, పాతాల గరిడి, అడ్డసార, సత్తావరి తదితర ప్రకృతి నుంచి లభించే చెట్లు, వేళ్లతో ఎన్నో నయం కాని రోగాలను తగ్గించవచ్చని ఆయన రుజువు చేశారు. ఈ వైద్యశాలలో పాము కాటుకు గురై వచ్చే రోగులకు ఉచితంగా చికిత్స నిర్వహించి, అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఈయన వద్దకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది రోగులు వస్తుంటారు. క్యాన్సర్‌, అస్త్మా, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, బిపి, షుగర్‌ వంటి రోగాలను సైతం జమాల్‌ఖాన్‌ నయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అనేక మంది రోగులు తమ రోగాలు పూర్తిగా ముదిరిన తర్వాత చివరి దశలో రావడం, మందులు పనిచేసే వరకు ఓపికగా ఉండలేకపోవడంతో ఈ ప్రకృతి వైద్యం అంతగా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఈ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అందుకనే మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో మహత్తర వన మూలికలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలగలతో వినూత్న చికిత్స...
mulikalu1 శరీరంపై... ఎన్నో యేళ్లుగా మానకుండా, చికాకు కలిగించి, జీవితంపై విరక్తి పుట్టించే దీర్ఘకాలిక గాయాలకు ఈయన చేసే చికిత్స వినూత్నంగా ఉంటుంది. దీర్ఘకాళికంగా ఉన్న పుండ్ల ప్రదేశంలో బురద నీటి నుండి తెచ్చిన జలగలను వదిలి పుండ్లలో పేరుకుపోయి ఉన్న చెడు రక్తాన్ని పీల్పించడం ద్వారా చికిత్స మొదలుపెడతారు. అలా జలగలు చెడు రక్తాన్ని పీల్చివేసిన అనంతరం వైద్యుడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి మందుల ద్వారా 10-15 రోజులలో గాయం మానేటట్లు వైద్యం చేస్తారు. ఈ ప్రక్రియలో చికిత్స కోసం జలగలను ఒక రోగికి ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు.


రోగుల క్షేమమే కోట్ల ఆస్తితో సమానం...: మూలికా వైద్యుడు జమాల్‌ఖాన్‌
mulikalu3 ఒరిస్సాలోని మల్కా న్‌గిరి జిల్లా మోటు ప్రాంతం, మా నాన్నగారికి నేను 23వ సంతానం. నా తర్వాత తమ్ముడు ఖాలిక్‌ఖాన్‌తో కలిసి వంశపారంపర్యంగా వస్తున్న ఈ మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. మా తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ గారు 1920వ సం లోనే శబరి పరివాహక ప్రాంతాలలో వచ్చిన కలరా, డయేరియా వంటి అంటువ్యాధులను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. దాంతో ఆనాడే మా వైద్య విధానానికి మంచి గుర్తింపు లభించింది. మా తాతల కాలం నుండి నేటివరకు వైద్యసేవలకు గాను ఎప్పుడూ, ఎవరి దగ్గర ఒక నయా పైసా కూడా ఫీజు తీసుకోలేదు. 2002లో శబరి నది దాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మూలికలు సేకరించి తెచ్చిన గిరిజనులకు... కూలీ రూపేణా ఇవ్వడానికి మాత్రమే నామ మాత్రపు డబ్బు తీసుకుంటున్నాం. నాకు కాంట్రాక్టులు, వ్యవసాయం తదితర ఆదాయ మార్గాలు ఉన్నాయి. వైద్య సేవలకు ఎటువంటి రుసుము అవసరం లేదు. ఎందరో దేవుళ్లకు మొరపెట్టుకొని నా దగ్గరకు వచ్చే రోగులకు నయమై క్షేమంగా ఉంటే చాలు, అదే నాకు కోట్ల ఆస్తితో సమానం.

mulikalu2 ఏజెన్సీ ప్రాంతంలో ఆయుర్వేద వైద్య సేవల ద్వారా పక్షవాతం, మధు మేహం, కిడ్నిలో రాళ్లు, కిడ్ని ఫెయిల్యూర్‌, కీళ్లవాతం, కీళ్లనొప్పులు, టి.బి., కాలేయ సంబంధిత వ్యాధులు, రకరకాల కామెర్లు, గర్భసంచి క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, సైనస్‌, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, తెల్లపొడ, శూలబాధలు, అల్సర్‌, అర్ష మొలలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, ఎర్రబట్ట, సెక్స్‌ సంబంధ మైన సమస్యలు, హై, లో బి.పి., కుష్టు, ఇంకా అనేక రకమైన వ్యాధులకు చికిత్స వనమూలికల (గింజలు, బెరడు, వేర్లు, కాయలు, పువ్వు, ఆకులు) ద్వారా నయం చేస్తాం. మాకున్న కొద్దిపాటి ఆవరణలోనే ఎన్నో రకాల ఔషద మొక్కల ను పెంచుతున్నాం. సేకరించిన వాటిల్లో చాలావరకు బట్టీల ద్వారా ఆవిరి రూపంలో కషాయం (లిక్విడ్‌) తీస్తాం. అందులో తెల్లమద్ది, వాకుడు, ఉత్త రేణి, తామెరతీగ, పాషానంబేది, కొండపిండి ఆకు, నేల ఉసిరి, బొమ్మల మర్రి, నల్ల ఉమ్మెత్త, తెల్ల చిత్రమూలం, ఎర్ర ఉల్లి, ముల్ల గోరింక, నిమ్మగడ్డి అంజీరా, జీరా, నేలతాడి, పారీజాత, తిప్పతీగ, అడవినాబి, అడ్డసారా, మామి డి అల్లం, తెల్లగన్నేరు ఇలా వందలాది అడవి వన మూలికలతో పొడులు, లేహ్యాలు, ఔషదగుళికలు తయారు చేసి వ్యాధులను నయం చేస్తుంటాం.ఎందరో మేధావుల సందర్శన...

mulikalu4 భద్రాచలం మన్నెంలో ప్రకృతి వైద్యంతో పలు దీర్ఘకాలిక రోగాలను ఎలా నయం చేస్తున్నారో తెలుసుకోవాలని, ఎందరో మేధావులు, విద్యావేత్తలు, విదేశాల నుంచి సైతం ప్రొఫెసర్లు వచ్చి ఇక్కడి వైద్య విధానాన్ని తెలుసుకొని వెళ్లారు. డబ్బు ప్రధానంగా ఈ వృత్తిని ఎంచుకోకుండా, జమాల్‌ఖాన్‌ చేసే వైద్య సేవలు పలువురు కొనియాడారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వనమూలికల సేకరణ చాలా కష్టమైన విషయమని, దానిని ఇంతకాలంగా కొనసాగిస్తూ ఉండటం నిజంగా ప్రశంసనీయమని పలువురు వైద్యులు కొనియాడారు.


ఎన్నో రోజులుగా రాని మార్పు గమనించాను...: కోటగిరి మురళి, ఉద్యోగి, హైదరాబాద్‌
muraliనేను చాలా కాలంగా వెరికోస్‌వెయిన్స్‌ (చీలమండ వద్ద పుండు) అనే వ్యాధితో బాధపడు తున్నా, ఎన్నో రకాల వైద్య చికిత్స ద్వారా రాని మార్పు నాకు ఈ వైద్య విధానం ద్వారా వచ్చింది. గత సెప్టెంబర్‌ 16న ఒక న్యూస్‌ ఛానల్‌ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. జమాల్‌ఖాన్‌ చేసే వైద్యం, ఆయన రోగులతో మెలిగే తీరు నాకు ఎంతగానో నచ్చింది. అందుకే కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండి వైద్యం చేయించుకోవడానికి వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం వుంది.

జన్మజన్మలకు ఋణపడి ఉంటా...: వాసం నాగేశ్వరరావు, నర్సిపట్నం
nageshwaraoనాకు లివర్‌ దెబ్బతిన్నది. గ్యాస్‌ట్రబుల్‌ వల్ల హెచ్‌.బి.ఎస్‌ పాజిటివ్‌ అనే వ్యాధితో ఇక్కడికి వచ్చాను. లివర్‌పై ఉండే పొర పూర్తిగా చెడిపోయిందని, ఇక బ్రతకడం కష్టమని, చాలామంది చెప్పారు. కానీ, ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న తర్వాత, అంతకు ముందు ఉన్న రేచీకటి కూడా పోయింది. ఇప్పుడు నాకు కళ్లు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. జన్మజన్మలకు డాక్టర్‌గారికి రుణపడి ఉంటాను.

మాకు జమాల్‌ ఖానే దేవుడు...: మడివి విజయ్‌, స్థానికుడు
వారం రోజుల కిందట నన్ను కట్లపాము కరి చింది. అదే వేరేచోట అయితే నేను చచ్చిపోయేవాడినే. కానీ మా ప్రాంతం వాళ్లకు పాముకాటు భయం లేదు. ఎందుకంటే మాకు దేవుడు లాంటి జమాల్‌ఖాన్‌ ఉన్నాడు.

జమాల్‌ లేకుంటే అవిటిదాన్న య్యేదాన్ని...: సిద్దోజి పద్మ, చల్లగరిగ గ్రామం, వరంగల్‌ జిల్లా
padmaబోన్‌ క్యాన్సర్‌తో నా కుడికాలి మడమపై పుండు వచ్చింది. హన్మకొండలోని అమృత హాస్పటల్‌కి కూడా వెళ్లి చూపించుకున్నా. నిమ్స్‌ కూడా వెళ్లి చూపిస్తే మోకాలు వరకు తీసేయాలని చెప్పారు. ఇక్కడి రాకుంటే నా కాలు కోల్పోయేదాన్ని. 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకు సుమారు 70 శాతం నాకు ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా నయమవుతుందనే విశ్వాసం ఉంది. ఈ ఆవరణ, మొక్కలతో ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది.

జమాల్‌గారివద్ద పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం: ముఖ్య సహయకుడు, ఎస్‌కె.సుభానీ
subaniజమాల్‌ఖాన్‌తో నాకు బంధుత్వం ఉంది. బావగా నాకు చుట్టమే అయినా, ఆయన నాకు గురువుతో సమానం. ఆయన తో కలిసి వైద్య సేవల్లో పాలుపంచుకోవడం నా పూర్మజన్మ సుకృతం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఆయన దగ్గర మిగిలే ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు ఎన్ని రకాల పనులున్నా... వైద్యా న్ని, వైద్యసేవలను ఎంతో గౌరవంగా భావి స్తారు. అది నాకు, మా సహాయకులందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఏదో ఒకరోజు చిరాకు పడటం, అశ్రద్ధగా ఉండడం మనం చూస్తుంటాం... కాని మా జమాల్‌ఖాన్‌ గారిలో అది మేం ఇంతవరకు చూడలేదు.

ఇక్కడికి వచ్చే రోగుల్ని చూస్తే... మనసు చలిస్తుంది...:  -  రమణ, కాంపౌండర్‌
mulikalu6 జమాల్‌ఖాన్‌గారితో 15సంలుగా ఉంటున్నా. ఎన్నో వేలమంది రోగులకు సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కోసారి... బాగా రోగం ముదిరిన తర్వాత వచ్చే రోగులను, వారు పడే బాధలు చూస్తే మనసు చలిస్తుంది, రోగం ముదరక ముందే ఇక్కడికి వస్తే త్వరగా నయం చేస్తాం. కాబట్టి బాగుపడ్డ రోగులు ఇతరులకు చెప్పి, వారి వంతు సహకారాన్ని అందిస్తే... ఈ వైద్యానికి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది.

ఆయన సేవల్లో పాలుపంచుకోవడం మా అదృష్టం : సహాయకులు... సోయం ముత్తమ్మ, సోడే రాములమ్మ, సోడే అచ్చమ్మ, సోడే లక్ష్మి (విద్యార్థిని)
మా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రతి బుధవారం గిరిజనులు సంతకు వచ్చేటప్పుడు, జమాల్‌ఖాన్‌గారు చెప్పినటువంటి వేర్లు, బెరడులు, చెట్లు, ఆకులు తీసుకొస్తారు. వారు తెచ్చిన వాటిని మేం శుభ్రపరుస్తాం. ఎన్నో యేళ్లుగా ఈ పనిలో ఉన్నాం. డాక్టర్‌ గారు చెప్పినట్లు ఆవిరితీయడం, ఔషధ గుళికలు తయారు చేయడం, లేహ్యాలు తయారు చేయడం చేస్తుంటాం. డాక్టర్‌ గారు రోగులకు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పటికీ మాకు మాత్రం కూలీ ఇస్తుంటారు. ఆయన చేసే వైద్యంలో మా వంతు సేవ చేస్తూ, ఆయన వెంట ఉండటం పరమానందంగా ఉంటుంది.

వైద్య సదుపాయాలు ఎన్ని ఉన్నా...:మన్నెంలో వనమూలికా వైద్యానికే పెద్దపీట
mulikalu7 మన్నెంలో వనమూలికా వైద్యం చేస్తున్న జమాల్‌ఖాన్‌ వైద్యశాలకు 3 కిలోమీటర్ల దూరంలోని చింతూరు మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా (100 పడకల) హస్పటల్‌ లు అన్నిరకాల అల్లోపతి చికిత్సలు అందిస్తున్నప్పటికీ, నిమ్మలగూడెంలో యం.డి జమాల్‌ఖాన్‌ చేస్తున్న వనమూలికా వైద్యానికే రోగులు, వారి బందువులు పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటిడిఎ సంస్థద్వారా నిత్యం ఈ పరిసర ప్రాంతాల గిరిజన, గిరిజనేతరులను అనునిత్యం అభివృద్ది పరుస్తూ, అన్ని రకాల వైద్యసేవలను వారి వారి ముంగిటకు తెచ్చినా, వనమూలికా వైద్యమే ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల వారందరికి శ్రీరామరక్ష. ఈయన చేసే వైద్యంతో పాటు, పలకరింపు, రోగులతో ఈయన ఉండే వ్యవహర శైలి ప్రతిఒక్కరికి హత్తుకునే విధంగా ఉండడమే దీనికి కారణమని స్థానికులంటారు. హస్తవాసి, వంశపారంపర్య వైద్య విధానముతో జమాల్‌ఖాన్‌ చేసే విన్నూతన ప్రయోగాలతో (జలగలతో చికిత్స) చేస్తున్న వైద్యం కూడా మంచి ఫలితాలను ఇవ్వడం, ఇక్కడకి వచ్చే రోగులకు ఎంతో త్వరగా నయం అవ్వడమే జమాల్‌ఖాన్‌ వైద్య రహస్యమని, పలువురు స్వస్థత చేకూరిన వ్యక్తులు చెప్పడం గమనార్హం.
- మల్లేల సత్యనారాయణ, భద్రాచలం

Tuesday, November 2, 2010

ఆయుర్వేదంలో రసాయన చికిత్స

ayurveda-mసుదీర్ఘ కాలం జీవించడం ఎలా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తూ వచ్చిన ప్రశ్న. కేవలం సుదీర్ఘ కాలం జీవించడమే కాదు జీవితంలో అన్ని సంతోషాలనూ అనుభవిస్తూ జీవించాలని కోరుకుంటాడు. మానవుడు 125-150 ఏళ్ళ వరకూ భౌతికంగా జీవించగలడు. అంత సుదీర్ఘ కాలం మనుషులు జీవించినట్టు రికార్డులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వయసు మీద పడడానికి ప్రాథమిక కారణాలు జన్యుపరమైనవి. వాటిని తప్పించుకోలేం. జన్యుపరంగా భౌతిక స్వరూపం, శరీర తత్వం వ్యక్తులకు ముందస్తుగా నిర్ణయించిన జీవితకాలం ఉంటుంది. నివారించగల ఇతర కారణాలలో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, విటమిన్లు, ఎంజైములు, హార్మోన్లు, ఇతర కీలక పదార్ధాల లోటు. వీటివల్ల ప్రాణాలకు భంగం నేరుగా వాటిల్లకపోయినప్పటికీ కణజాలాన్ని, ధాతువులకు సరిచేయలేని హాని కలిగించి తద్వారా జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.

రసాయన చికిత్స శరీరానికి బలాన్ని, ఉత్తేజాన్ని కలిగించి వ్యాధులను నివారించే చికిత్స. శరీరంలోని రసాది సప్త ధాతువుల సమగ్రతకు దోహదం చేస్తూ సుదీర్ఘ కాలం జీవించేందుకు తోడ్పడుతుంది. జీవక్రియలలో మార్పులను సవరించే సామర్ధ్యం కలిగిన రసాయనం మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతుంది. అది జీవిత కాలాన్ని పొడిగించడమే కాదు జీవితాన్ని గుణాత్మకంగా మెరుగుపరుస్తుంది.

rasayana-chikitsaరసాయన చికిత్సలో ఉపయోగించేందుకు అనేక మందులను సూచించారు. వైద్యపరమైనవి కాని వాటిలో నిత్యం ఆహారంలో నెయ్యి తీసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం వ్యక్తి సుదీర్ఘ కాలం జీవించడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. అష్టాంగ ఆయుర్వేదలో రసాయన చికిత్స కీలకమైన శాఖ. ఆరోగ్యమైన వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, వ్యాధుల బారిన పడిన వారికి శరీర బలం, ఉత్తేజం పెంచడం ద్వారా వ్యాధిని చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. రసాయన చికిత్సలో భాగంగా రస, ఇతర ధాతువులను పరిపుష్టం చేస్తారు. నిర్వహణ దృక్కోణం నుంచి చూస్తే రెండు రకాల రసాయన చికిత్సలు ఉంటాయి:

1. కామ్య రసాయన: ఒక నిర్ధిష్ట లక్ష్యం కోసం చేపట్టినది
2. నైమిత్తిక రసాయన: వ్యాధి తగ్గిన తరువాత కోలుకోవడానికి ఇచ్చే పునరుద్ధరణ టానిక్కులు
3. ఆజస్రిక రసాయన : రోజువారీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
ఆయుర్వేదంలో పేర్కొన్న రసాయన ఓషధులు, సమ్మిళిత ఔషధాలు ఎన్నో ఉన్నాయి. 1.హరితకి 2. ఆమ్లకి 3. విభితకి
దిగువన ఒకటి లేదా రెండు లేదా ఈ మూడు ప్రధాన వస్తువులను మేళవించి చేసిన ఔషధాలు:
బ్రహ్మ రసాయ చ్యవన ప్రాస, ఆమలకా రసాయన, హరితక్యాది రసాయన, హరితక్యాది యోగ, త్రిఫల రసాయన.

విదంగ - విదంగ అవలేహ------------ నాగబల - నాగబల రసాయన
భల్లాతక - భల్లాతక సర్పి, భల్లాతక క్షీర, గుడ భల్లాతక, భల్లాతక తైలం,
లోహ - లోహాది రసాయన, బ్రాహ్మ రసాయన పిప్పలి - పిప్పలి రసాయన, పిప్పలి వర్ధమాన రసాయన
మండూక పర్ణి స్వరస --- యష్టిమధు చూర్ణ --- శంఖపుష్పి కల్క శిలాజిత్‌ --- బాల - బాలకల్ప --- వరాహి కంద
బ్రాహ్మి రసాయ, ---బ్రాహ్మి కల్ప-- వచ వచ రసాయన సువర్ణ ----- శతావరి - శతావరి ఘృత---- అరవింద రసాయన ---- గోక్షుర రసాయన
తువారక రసాయన ---- పునర్నవ, భృంగరాజ రసాయన నరసింహ ఘృత.
వాత ప్రకృతి ఉన్న వ్యక్తులను పాలు, పిత్త ప్రకృతి ఉన్నవారిని నెయ్యి, కఫ ప్రకృతి ఉన్న వ్యక్తులను తేనె, రక్త ప్రకృతి ఉన్నవారిని చల్లటి నీటినీ ఆహారానికి ముందు తీసుకోమని సూచిస్తారు. ఇది అవసరమైన రసాయన ప్రభావాన్ని చూపి వార్ధక్యాన్ని నిరోధించేందుకు ఈ సూచనలు చేస్తారు.
సుదీర్ఘ జీవితానికి, పటిష్టతకు ముందుగా శరీర శుద్ధి చేసుకోవాలని సూచిస్తారు. ఇందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ ఎంతో ఉపయోగపడుతుంది. రసాయన ఔషధాలను ఇచ్చే ముందు శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. వమన, విరేచన, బస్తి, రక్తమోక్షన, స్వేదన అనేవి పంచకర్మలోని శుద్ధి ప్రక్రియలు. శరీర మసాజ్‌లు, పిండ స్వేద, ధారా, పదాభ్యంగన అనేవి శరీరానికి పునశ్శక్తినిచ్చే చికిత్సలు.

గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను, ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు..
డా స్వాతి, ఎం.డి. (ఆయుర్వేద)
డా ప్రసాద్‌, ఎం.డి.(ఆయుర్వేద)

Sunday, October 24, 2010

వృద్ధాప్యంలో వేధించే ఆస్టియోపోరోసిన్‌

వయసులో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించనప్పుడు దాని ప్రభావం వృద్ధాప్యంపై పడుతుంది. వయసుతో పాటు వచ్చే సమస్యలకు తోడుగా ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అక్టోబర్‌ 20వ తేదీని ప్రపంచ ఆస్టియోపొరోసిస్‌ దినంగా పాటిస్తున్నాం.అంతర్జాతీయ ఆస్టియోపొరోసిస్‌ ఫౌండేషన్‌ 1997 నుంచి దీనిని జరుపుతుండగా 1998-99 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ కో స్పాన్సరర్‌ అయింది.

ఆస్టియోపొరోసిస్‌ వల్ల అయ్యే తుంటి దగ్గర ఫ్రాక్చ ర్లు ప్రస్తుతమున్న 1.66 మిలియన్‌ నుంచి 2050 నాటికి 6.26 మిలియన్లకు పెరుగుతాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. ఒక్క భారత దేశంలోనే సుమారు 60 మిలియన్ల మంది ఈ వ్యాధితో బారిన పడుతున్నారు. ఇందుకుతోడుగా ఒక లక్ష మంది వరకూ తుంటి ఫ్రాక్చర్లకు గురవుతున్నారు.

osteoవృద్ధాప్యం, వ్యాధులతో ఒకదానిని మించి ఒకటి ముందుకు పరుగులు తీస్తుంటాయి. ఆస్టియోపొరోసిస్‌ కూడా అటువంటి వృద్ధాప్య సమస్యే. ఎముక సాంద్రత తరిగిపోవడంతో ఫ్రాక్చర్‌లు అతి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి మధ్య వయస్సు, వృద్ధాప్యంలో కనిపించినప్పటికీ మహిళల్లో ఇది ఎక్కువగా కనుపిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళలలో తుంటి, వెన్నుముక, మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. తుంటికి ఫ్రాక్చర్‌ అయినప్పుడు ఆసుపత్రిలో చేరడం, మేజర్‌ సర్జరీ అవసరం అవుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి కారణంగా వ్యక్తి వేరే ఆధారం లేకుండా తనంతట తాను నడిచే శక్తిని కోల్పోతాడు. ఇది సుదీర్ఘకాలం కొనసాగవచ్చు లేదా మరణానికి కూడా దారి తీయవచ్చు.

వ్యాధి లక్షణాలు:
1. చేతులు, కాళ్ళు నొప్పులు 2. తీవ్రమైన కీళ్ళ నొప్పి 3. బలహీనత 4. నిద్రలేమి 5. నొప్పి శాశ్వతంగా ఉండడం 6. ఎముకలలో సూదులు గుచ్చినట్టుగా నొప్పి 7. పళ్ళు ఊడిపోవడం. 8. జుట్టు ఊడిపోవడం 9. గోళ్ళు పెళుసుబారిపోవడం 10. ఒంటిమీద ఉండే వెంట్రుకలు రాలిపోవడం 11. కంటిరెప్పలు రాలిపోవడం 12. పళ్ళు విరగడం 13. గోళ్ళు విరగడం 14. జాయిం ట్లలో తీవ్రమైన నొప్పి 15. ఎముకలు నొప్పి 16. జాయింట్ల నొప్పి 17. ఎముకలు బలంగా లేని భావన 18. గూని 19.నడక కుంటిగా మారడం 20. తల తిరగడం 21. కళ్ళు బైర్లు కమ్మడం 22. ఎముకలు బలహీనం కావడం 23. ఎముకలు క్షీణించడం 24. ఎముకలు తేలిక కావడం 25. నోరు పొడారిపోవడం 26.ఎనీమియా 27. అలసట 28. చర్మం పొడిబారడం 29. ప్రధాన జాయింట్లన్నీ వదులుకావడం 30.కండరాలు చిక్కిపోవడం 31. వాత వ్యాధి లక్షణాలు కనుపించడం.

ఆస్టియోపొరోసిస్‌ వచ్చినప్పుడు ఆహారం ద్వారా మందుల ద్వారా ఎంత కాల్షియం ఇచ్చినప్పటికీ ఎము క ధాతువుకు పీల్చుకునే లక్షణం ప్రభావితమైనందున ఒంటపట్టదు. దీనితో ఎముక ధాతువులో కాల్షియం తరగిపోతుంది. జీవక్రియ అస్తవ్యస్తం కావడంతో ఎముక ధాతువులోని కాల్షియం ఛిద్రమైపోయి అయాన్ల బదిలీ వ్యవస్థ మార్పుకు గురవుతుంది.శరీరంలో కాల్షియంను పీల్చుకునే స్తరాలు రెండు ఉంటాయి. ఒకటి జీర్ణమైన ఆహారం రక్తంలో కలిసినప్పుడు, రెండవది ఎము క ధాతువులకు రక్త ప్రవాహం నుంచి లభించేది. ఇది సరిగా జరిగేందుకు పీల్చుకున్న కాల్షియం జీర్ణ ప్రక్రియలో ఏడు స్తరాలనూ దాటాలి. ఈ ప్రక్రియలోనే మినరల్‌ కాల్షియం జీవ ఏకీకరణ కాల్షియం అయాన్లగా పరివర్తన చెందుతుంది. ఇలా పరివర్తన చెందిన కాల్షియం అయాన్లను ఎముక ధాతువులు పీల్చుకొని వాటిని పటిష్ఠం చేస్తాయి.

చికిత్స:
ఆస్టియోపొరోసిస్‌ను నియంత్రించేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. వాతం కారణంగా సంభవించే ఈ వ్యాధికి స్నేహన (తైలమర్దనం), స్వేదన, మృదు శోధన, గోరువెచ్చటి నూనెతో మర్దన, ఎనీమా థెరపీ వంటి చికిత్సలను ఉపయోగిస్తారు. ఈ చికిత్స రెండు భిన్న రకాలుగా పని చేస్తుంది. 1. కాల్షి యం పూర్తి స్థాయిలో శరీరానికి ఒంటపట్టేలా చేయడం 2.వాతాన్ని కొన్ని రకాలైన ఆయుర్వేద తైలాలను తాగిం చడం ద్వారా తగ్గించడం.

ఆహారం:
ఆయుర్వేద సూత్రాల ఆధారంగా సంపూర్ణాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వేరే చెప్పనవసరం లేదు.ఎముక ధాతువు స్థాయిలో మైక్రో న్యూట్రియంట్లను అందించడంలో ఆయుర్వేద సామర్ధ్యం సర్వ విదితమే. మాంసాహారం తీసుకునే వారు ఎక్కువగా తీసుకోవలసినది బోన్‌ సూప్‌ కాగా శాకాహారులు ములక్కాడ ఆకు, పువ్వు, కాడలను, అరటి దూట ఎక్కువగా తీసుకోవాలి.

ఆస్టియొపొరోసిస్‌ రావడానికి వాతమే ప్రధాన కారణమైనందున రోజువారీ ఆహారంలో వాతాన్ని తగ్గించే పదార్ధాలు తీసుకోవాలి. ఆస్టియోపొరోసిస్‌ను అదుపు లో ఉంచడంలో నెయ్యి, పాలు, పాల ఉత్పత్తులు, మాంసపు సూపులు బాగా పని చేస్తాయి. అలాగే తాజా పళ్ళు, కాయగూరలు కూడా ఆ వ్యాధిని నిరోధించడానికి దోహదం చేస్తాయి.


Dr. P.N.V.R. Prasad
Asst. Professor
Govt. Ayurvedic College
Vijayawada
Ph: 9666649665/ 9390957168

Sunday, October 17, 2010

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

usiri
ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.

ఉసిరితో ఎంతో మేలు :
  • ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ
    సమస్యలను తొలిగిస్తుంది.
  • ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
  • లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
  • హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
  • మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  • విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
  • కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత
  • ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా...

ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు. అక్టోబర్‌ వృద్ధుల మాసం. ప్రతి సంవత్సరం ఈ నెల మొదటి తారీకును ప్రపంచ వయోధికుల లేదా వృద్ధుల దినంగా పాటిస్తున్నారు. ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. అంటే వ్యాధి నిరోధక, స్వయం సంరక్షక చర్యలు అని అర్ధం. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్ళు దాటిన సంవత్సరానికి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. కానీ నలభై దాటినప్పటి నుంచే వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం కావడం నేటి అనుభవం. శక్తి, బలం క్షీణించి, జీవితాన్ని చురుకుగా గడపలేకపోతారు. ఈ దశలో వ్యక్తిని అలసట, నిస్సత్తువ ఆవరిస్తాయి. భౌతిక, మానసిక కార్యకలాపాలు కుంటుపడతాయి. జ్ఞాపకశక్తి, మేధస్సు క్షీణించడం ప్రారంభమై వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తుంటాయి.

Happiesఆయుర్వేదం ప్రకారం రస, రక్త, మాసం, మేధస్‌, అస్థి, మజ్జ, శుక్ర ధాతులతో కూడినది మానవ శరీరం. శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ ధాతువులు క్షీణిస్తాయి. ఈ ధాతువులలో సారంతరగిపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా సంక్రమించే సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వృద్ధాప్యంలో ఈ ధాతువుల సామర్ధ్యాన్ని పెంచలేం కానీ వాటిని సంరక్షించి పునరుజ్జీవింపచేయవ చ్చు. రసాయన చికిత్స లాభాలను ఆయుర్వేద గ్రంథాలు సవివరంగా పే ర్కొంటాయి. జీవితాన్ని పొడిగించడం, జ్ఞాపకశక్తిని పెంచడం, ఇన్ఫెన్లు, వ్యాధులు రాకుండా నిరోధక శక్తిని, మనస్సును యవ్వన స్థితిలో ఉంచేం దుకు సాయపడడం, వ్యక్తి ఛాయతో పాటు గొంతును మెరుగుపరచడం ద్వారా సమాజంలో గౌరవనీయంగా జీవించేందుకు, సంపూర్ణ ఆరోగ్యా న్ని సాధించేందుకు ఈ ప్రత్యేక చికిత్స అభివర్ణిస్తుంది. ఆయుర్వేదం వృద్ధాప్య సమస్యలను గుర్తించడమే కాదు అటువంటివి సంభవించకుండా నిరోధించే చికిత్సలను రూపొందించింది.

వృద్ధాప్య సమస్యలు:
అశక్తత, నిస్సత్తువ, వ్యాధులు, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు. వయోధికులలో కనుపించే ఇతర సమస్యలు-
కేంద్ర నరాల వ్యవస్థ, మెదడు: పక్షవాతం, సయాటికా, అల్జీమర్స్‌ వ్యాధి, పార్కిన్సన్స్‌ వ్యాధి, మూర్ఛ, న్యూరోసిస్‌, సైకోసిస్‌, మానసిక సమస్యలు, నిద్రలేమి.
గుండె, రక్త నాళాలు: ఆంజినా పెక్టోరిస్‌, హృదయదమని లోపాలు, హైపర్‌టెన్సివ్‌ గుండె జబ్బులు, గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలే కాకుం డా జన్యుపరమైన, జీవక్రియా సంబంధ సమస్యలైన మైలాయిడ్‌ లుకేమియా.
కాలేయం, పిత్తాశయ సమస్యలు: తీవ్రమైన హెపటైటిస్‌, పిత్తాశయంలో రాళ్ళు, సిరోసిస్‌.
జీర్ణాశయ సమస్యలు: మలబద్ధకం, ఊబకాయం, చక్కెర వ్యాధి
ఊపిరితిత్తులు: బ్రాంకైటిస్‌, ఎంఫిసీమా, ఆయాసం వంటి సమస్యలు
కీళ్ళు: రుమెటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌, ఆస్టియో పొరాసిస్‌, సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.
మూత్రవాహిక: పురుషులలో ప్రోస్ట్రేట్‌ గ్రంధి పెరగడం, నెఫ్రైటిస్‌, చక్కెర వ్యాధి వల్ల రీనల్‌ సమస్యలు రావడం వంటిపలు సమస్యలు వస్తాయి.
చర్మం, కండరాలు: సొరియాసిస్‌, హెర్పిస్‌, డెర్మటోసెస్‌, జుట్టు, గోళ్ళ వ్యాధులు, మోటార్‌ న్యూరాన్‌ వ్యాధివల్ల సంక్రమించే రోగాలు ఉంటాయి.
వినాళగ్రంధి (ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌): హైపో, హైపర్‌ థైరాయిడిజమ్‌, నపుంశకత్వం, స్ర్తీ, పురుషులలో మెనోపాజ్‌ సిండ్రోమ్‌ తదితర సమస్యలు.
ఇంద్రియాలు : చత్వారం, గ్లకోమా, పాక్షిక లేదా పూర్తి చెవుడు, మెనీర్స్‌ సిండ్రోమ్‌, వెర్టిగో వంటివి సంభవిస్తాయి.
సులువైన చర్యల ద్వారా వృద్ధాప్యాన్ని, దానికి సంబంధించిన వ్యాధులను నిరోధిం చడం సాధ్యమని ఆయుర్వేదం చెప్తుంది. సరళమైన, నిరాడంబర జీవనమే దాని రహస్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాలే వ్యాధిరహిత జీవితాన్ని గడిపేందుకు మూలమైన స్తంభాలు. మితాహారం శరీర జీవసంబంధ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది.

మితాహారం, నిరాడంబర జీవనశైలే వ్యాధి రహిత సుదీర్ఘ జీవితానికి మంత్రం. జీవనశైలి విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఆయుర్వేదంలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అది ఒక ప్రత్యేకశాఖగా ఉంది.సంపూర్ణాహారాన్ని తీసుకొని, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన మాటలలో, చేతలలో సమతులంగా ఉంటూ, కోరరానివి కోరకుండా, నిజాయితీగా, క్షమాబుద్ధితో పెద్దల ఎడల గౌరవంతో జీవించే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. పంచకర్మతో పాటుగా జీవన శైలిలో మార్పులతో పాటు అనేక ఆయుర్వేద మందుల తయారీని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి.

వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు:
ఆముదం: ఆముదం విరేచనకారి అని అందరికీ తెలుసు.అయితే వృద్ధాప్య సమస్యలను నిరోధించడం, చికిత్స చేయడంలో ఈ మొక్కకున్న ఉపయోగాలు కొద్ది మందికే తెలుసు.
1. ఆముదం వేరును నాలుగు భాగాల నీళ్ళలో అది ఒక వంతు వచ్చే వరకు మరిగించి రోజూ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే వాత సంబంధ వ్యాధులను నిరోధించవచ్చు.
2. 8-10 ఆముదం గింజలను పొట్టుతీసి 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బెల్లం వేసి మరిగించి, ప్రతి రోజూ సాయంత్రం ఈ పాయసాన్ని తీసుకుంటే వృద్ధాప్య సంబంధమైన ఆర్థరైటిస్‌ సమస్యలను నివారించవచ్చు.
3. గోధుమపిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకొని తింటే డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలే కాక మలబద్ధకం కూడా తగ్గుతుంది.
తామరపువ్వు: వృద్ధులకు అత్యంత ఉత్తమమైన టానిక్‌ ఇది. అనేక ప్రాంతాలలో ప్రజలు అందుకే తామర కాడలను కూరలాగా చేసుకుంటారు. తామరాకును విస్తరిగా ఉపయోగిస్తారు. ఇది కణాలను సంరక్షిస్తుందని జపాన్‌లో చేసిన పరిశోధనలలో రుజువైంది. తామర రేకులు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాక గుండె, మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.
ఏలక్కాయి: వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద మందులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మంచి ఆంటాసిడే కాక వాయుహరి కూడా. జీర్ణక్రియను పెంచడమే కాక అసిడిటీ, కళ్ళె వంటి వ్యాధులలో ఉపశమనాన్ని ఇస్తుంది.
ఉసిరికాయ: ఆరోగ్యాన్ని పెంపొందించే, వయసును నిరోధించే మూలిక ఇది. కొలెస్ట్రాల్‌ వల్ల వచ్చే గుండె వ్యాధుల, రక్త ప్రసరణ సమస్యల బారి నుంచి కాపాడుతుంది. చలికాలంలో అవసరమైన కేలరీ డైట్‌ సప్లిమెంట్‌ను అందిస్తుంది.
తులసి: రోగనిరోధక శక్తిని పెంచడమే కాక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.
కరక్కాయ: ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో అత్యున్నతమైన మందు ఇది. కరక్కాయపొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. అలాగే పైల్స్‌ వంటి వ్యాధులను తగ్గించడంలో ఇది గొప్పగా పని చేస్తుంది.
త్రిఫల: ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఇది ఉత్తమమైన వయో నిరోధక చికిత్స. అయితే దీనిని వివిధ రుతువుల్లో వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవాలి.
1. వర్ష రుతువులో - సైంధవ లవణంతో కలిపి
2. శరత్‌ రుతువు - పంచదారతో కలిపి
3. హేమంత రుతువు - శొంఠితో కలిపి
4. శిశిర రుతువులో - పిప్పళ్ళతో కలిపి
5. వసంత రుతువు - తేనెతో కలిపి
6. గ్రీష్మ రుతువు - బెల్లంతో కలిపి
తానికాయ: ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్‌ ఉన్నప్పుడు, లివర్‌, స్ల్పీన్‌ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు.
తిప్ప సత్తు:రోగనిరోధక శక్తిని కాపాడడంలో పెంచడంలో ఇది ప్రముఖమైనది. వాత తత్వం ఉన్నప్పుడు నెయ్యితో కలిపి, పిత్త తత్త్వంలో పటిక బెల్లం, కఫ తత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలిపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి.
మండూక పర్ణి: దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనికి ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్‌ వంటి వ్యాధులలో ఉపయుక్తం.
అతిమధురం: పిల్లలలో వచ్చే జలుబు, దగ్గులకు దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇది మంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు.
గలిజేరు: ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్‌ అధికంగా ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధు చికిత్సలో ఉపయోగపడుతుంది.
పిప్పళ్ళు: ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్‌, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది.
జీడి గింజలు: ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా ఉపయోగపడుతుంది. దీనిలో కాన్స ర్‌ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిష్యూల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్యలను నివారించేందుకు సూచిస్తారు.
వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం:
మెంతులు: 100 గ్రా, జీలకర్ర : 50 గ్రా, మిరియాలు - 05 గ్రా
మూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వర కూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు.

Sunday, October 3, 2010

శరీరానికి సూర్యరశ్మి

అరగంట ఎండ తప్పనిసరి

ఎండ తగిలితే చర్మం పాడయిపోతుందని, కందిపోతుందని, నల్లబడిపోతుందని...ఇలా ఒకటేమిటి పది సాకులు చెప్పి ఎండ చూసి పారిపోతాం మనం. ఎండకు దూరంగా నీడపట్టునుంటే నిగనిగలాడొచ్చని కూడా చెబుతారు. ఇలా చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఎంతో తెలియదు గాని నష్టం మాత్రం పెద్ద ఎత్తునే ఉందంటున్నారు పరిశోధకులు.

ఎండకు భయపడి నీడనే కూర్చుంచే ఊబకాయం రావడం ఖాయమంటున్నారు. ప్రతి రోజు కనీసం ముప్పైనిమిషాలు మన ఒంటికి ఎండ తగలకపోతే మన శరీరానికి కావలసిన డి విటమిన్ అందదు. డి విటమిన్ అనేది శరీరానికి కాల్షియాన్ని గ్రహించే శక్తినిస్తుంది.

సూర్యరశ్మి తగలక ఒంట్లో డి విటమిన్ తయారవకపోతే మనలో కాల్షియం లోపిస్తుంది. ఫలితంగా శరీరం దృ«ఢత్వం కోల్పోతుంది. డి విటమెన్ లోపం వల్ల మధుమేహం, గుండె జబ్బులు కూడా త్వరగా వస్తాయని చైనాలో జరిగిన ఒక పరిశోధనలో తేలింది. వీటంన్నిటినీ ఎదుర్కొవాలంటే ఎండలో తిరగడమొక్కటే మార్గమంటున్నారు పరిశోధకులు.

Wednesday, September 22, 2010

'మహానారాయణ తైలం' * ఈ తైలంతో నొప్పులకు కళ్లెం

శరీరంలోని కండరాలు బలహీనపడితే కీలక భాగాల పనితీరు కూడా కుంటుపడుతుంది. ఆ స్థితి రాకుండా నివారించే శక్తి తైల మర్ధనకు ఉంది. ఈ ప్రక్రియలో ఆయుర్వేద మూలికలతో తయారు చేసే తైలాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆయుర్వేద తైలాల గురించి  తెలుసుకుందాం. అందులో భాగంగా 'మహానారాయణ తైలం' గురించి తెలుసుకుందాం.
ఈ తైలం తయారీలో 'శతావరి' అనే మూలికను ప్రధానంగా వాడతారు. శతావరికి నారాయణి అనే పర్యాయపదం ఉండడం వల్ల ఈ తైలాన్ని నారాయణ తైలమని, మహానారాయణ తైలమని పిలుస్తారు. చర్మంపైన అభ్యంగ (మసాజ్) రూపంలోగానీ, కడుపులోకి తీసుకోవడానికి గానీ ఈ తైలాన్ని వాడతారు. అయితే తాగడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే వస్తి (ఎనిమా) రూపంలోనూ శరీరానికి అందించవచ్చు. చెవి, ముక్కు వ్యాధుల్లో, ఆ భాగాల్లో వేసే చుక్కల మందుగా కూడా ఈ తైలం వాడుకలో ఉంది.

తైలంలో...
ఇందులోని అంశాలు మూడు రూపాల్లో ఉంటాయి .
కల్కాంశం :
దోష్టు, ఏలకులు, మంచిగంధం, బలా మూలాలు, జటామాంసీ, ఛఠీలా, సైందవ లవణం, అశ్వగంధ, వచా, రాస్నా, సోంపు, దేవదారు, సుగంధిపాల, పాఠా, మాషపర్ణీ, ముద్గపర్ణీ, తగర వీటన్నిటినీ పొడిచేసి, నీటితో కలిపి ముద్దగా (కల్కం) చేసి పెట్టుకోవాలి.

తైలాంశం:
తయారు చేసుకున్న ముద్ద తూకానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకోవాలి.
ద్రవాంశం:
అశ్వగంధ, బలామూలాలు, బిల్వమూలాలు, బృహతీద్వయం, పల్లేరు, సంబరేణు, పాఠామూలాలు, పునర్నవా, ముద్గ, రాస్నా, ఏరండమూలం, దేవదారు, ప్రసారణీ, అరణీ ఈ మూలికలకు నీళ్లు చేర్చి సిద్ధం చేసిన కషాయద్రవం ఒక భాగం, శతావరీ రసం ఒక భాగం, పాలు ఒక భాగం. ఇవన్నీ కలిపి తైలాంశానికి మళ్లీ నాలుగు రెట్లు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక పెద్ద పాత్రలో కలిపేసుకుని, ద్రవాంశం పోయి, తైలాంశం మాత్రమే మిగిలేలా పొయ్యి మీద ఉడికించాలి.

తైలగుణాలు:
తైలం తయారీలో ఉపయోగించిన ఈ మూలికలన్నీ శరీరంలో విషమించే వాతదోషాల్ని ఉపశమింపచేసేవి, శక్తిని ప్రసాదించేవి. మూలికల గుణాలను శరీరానికి అందించడంలో తైలం ఒక వాహకంలా పనిచేస్తుంది. ఈ తైలంతో చర్మం మీద మర్దన చేసినప్పుడు చేష్టానాడులు, రక్త వహి సిరా ధ మనులు, స్నాయు, పేశీకండరాలు ప్రేరణ పొంది మరింత శక్తివంతమవుతాయి.

బలహీనపడిన అవయవాలు బలపడి తమ విధులను శక్తివంతంగా నిర్వహిస్తాయి. మర్ధనలోని హస్తలాఘవం (మానిప్యుటేషన్ స్కిల్స్) ప్రభావంతోనే ఈ శరీర క్రియలు సాధ్యమవుతాయి. ఫిజియోథెరపీలో వివిధ తైలాలతో చేసే 'మసాజ్' ప్రాచుర్యానికి రావడానికి ఈ విధానమే కారణం.

ఈ మసాజ్‌కు నారాయణ తైలం కూడా తోడైతే ఫలితాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవయవాల శక్తిసామర్థ్యాన్ని పెంచడంతో పాటు నొప్పులను త గ్గించడంలో నారాయణ తైలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పైపూతగానే ఈ తైలం ఎక్కువగా వాడుకలో ఉంది.

అయితే ఈ తైలాన్ని కడుపులోకి తీసుకున్నప్పుడు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చుక్కలుగా వేయడం వల్ల చెవినొప్పి, ముక్కులో వేయడం వల్ల తలనొప్పి, తలకు సంబంధించిన మరికొన్ని ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. రోగి పక్షవాతం వంటి సమస్యలతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు మర్ధన గానీ, కడుపులోకి ఇవ్వడం గానీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నారాయణ తైలాన్ని ఎనీమాగా పేగుల్లోకి ఎక్కించ వచ్చు.ఇలా చేయడం వల్ల పేగుల్లోని పొర (మ్యూకోజా) ద్వారా ఔషధ గుణాలు శరీరానికంతా వెళ్లే అవకాశం ఉంది.

ఏ వ్యాధులకు..?
వాత వ్యాధులకు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడంలో నారాయణ తైలానికి ప్ర«థమ స్థానం ఉంది. వీటితో పాటు పక్షవాతం, అర్థత వాతం (ఫేషియల్ పెరాలిసిస్), దవడ-మెడ పట్లు, భుజాలు పడిపోవడం (బ్రేకియల్ పాల్సీ) కటిశూల (డిస్క్, బ్యాక్‌పెయిన్) పార్శ్వశూల, కుంటడం, నడుము వంగిపోవడం, గృధసీ వాతం (సయాటికా) వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఈ తైలం బాగా పనిచేస్తుంది.

వీటితో పాటు అవయవాలు ఎండిపోవడం, చెవినొప్పి, వినికిడి లోపం, వృషణాల నొప్పి, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఈ తైలంతో తగ్గుముఖం పడతాయి. సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు మర్ధనంతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తి (ఎనిమా) కూడా చేయించుకుంటే లామినెక్టమీ శస్త్ర చికిత్స అవసరమే లేకుండా పోతుంది.

పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ నారాయణ తైలంతో మర్ధన చేసి ఆ తరువాత వేడినీళ్లతో స్నానం చేయడం గానీ, నొప్పిగా ఉన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది. నారాయణ తైలంతో పాటు ఆయుర్వేద పైద్యుడి పర్యవేక్షణలో చంద్రప్రభావటి, యోగరాజ గుగ్గులు వంటి సాధారణ ఔషధాలు కూడా తీసుకుంటే అద్భుత ఫలితాలు మీ సొంతమవుతాయి.

డాక్టర్ చిలువేరు రవీందర్ ఎండి (ఆయుర్వేద)
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్, ఫోన్: 9848750720.

Saturday, September 18, 2010

ఆయురారోగ్యాల చిరునామా ప్రకృతి వైద్యం

మహాత్మాగాంధీ ‘ గ్రామస్వరాజ్‌’ ‘స్వాతంత్రోద్యమం’,‘అస్ప్రశ్యత’, ‘ఖాదీ’ వంటి ఎన్నో అంశాలను ప్రపంచం దృష్టికి తెచ్చినవారు. అట్లాగే ‘ప్రకృతి చికిత్స’కు వారే‘ అంబాసిడర్‌’గా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వయంగా మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రకృతి చికిత్స అందజేసి సమకాలికులకు ఆదర్శ నాయకులయ్యారు.


housesద్రోణంరాజు వెంకటచలపతి శర్మ జర్మనీ భాషలో ఉన్న ప్రకృతి చికిత్సా విధానానికి సంబంధించిన పుస్తకాలను తెనిగించి ఆ చికిత్సను 1890లోనే మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత 1933లో గుంటూరు జిల్లాలో ప్రకృతి ఆశ్రమాన్ని డా. వేగిరాజు కృష్ణంరాజు స్థాపించారు. అది 1944 నుంచి భీమవరంలో శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమం పేరిట స్థిరపడి శాఖోపశా ఖలుగా విస్తరించింది. ఇప్పుడు వేగిరాజు కుటుంబీకులైన డా.రవివర్మ, డా. కమలాదేవి, డా.గోపాలరాజు మొదలైనవారు సేవలందిస్తున్నారు.ప్రకృతి నుంచి దూరం జరిగే కొద్ది మనిషిలో వికృతి పెరుగుతుంది. ఈ వికృతి శరీరంలోనూ, మనసులోనూ చోటు చేసుకోవడంతో అనారోగ్యం మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్యం అంటే ఏంటో నిర్వచించింది.కేవలం రోగం లేకపోవడం లేదా వైల్యం లేకపోవడమే ఆరోగ్యం అనిపించుకోదు. భౌతికంగా, సామాజికంగా కూడా సంపూ ర్ణంగా స్వస్థత కలిగి ఉండడమే ఆరోగ్యం.

Nasyaఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి వైద్యవిధాన శాస్త్ర అంశాలను మేళవించి చాలా వరకు సంఘసేవా దృష్టితో ప్రజలకు సేవలందిస్తున్న అసలైన ఆరోగ్య కేంద్రాలు ప్రకృతి చికిత్సాలయాలు. గత కొని సంవత్సరాలుగా యోగా కూడా ఈ వైద్యవిధానంలో ఒక భాగమైంది.ముందులు వేయకుండా జబ్బులను నయం చేయడం వల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని ప్రకృతి చికిత్స అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇది ఒక జీవిత విధా నంగా మారింది. ఇది ఒక దేశానికో, జాతికో మతానికో పరిమితమైంది కాదు అంతర్జాతీయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. ఈ వైద్య చికిత్స క్రింది మూడు అంశాలు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతుంది.

1.శరీరంలో పేరుకు పోయిన మలినాలు
2.శరీరంలోని రక్తం మలినం కావడం
3.శరీరంలోని ప్రాణశక్తి తగ్గిపోవడం

walkపై మూడు అంశాలను దూరం చేసే సహజ చికిత్సలను ప్రకృతి వైద్యం అందిస్తుంది. అలోపతి వైద్యవిధానం సూక్ష్మజీవుల మూలంగా జబ్బులు కలుగుతాయని చెప్తుంది. కాని శరీరంలో మలినాలు పేరుకుపోవడం మూలంగానే సూక్ష్మజీవులు ఏర్పడతాయని ప్రకృతి వైద్యం చెప్తుంది. వీటిని తొలగించే క్రమంలోనూ ప్రాణశక్తిని పెంచే మార్గంలోనూ ప్రకృ తిలోని పంచభూతాలను నీరు, మట్టి, సూర్యరశ్మి, వాయువు, ఆకాశం ...వినియోగంలోకి తెస్తుంది.

జలచికిత్స: ఎనిమా, తొట్టిస్నానం, ఆవిరిస్నానం, మొదలైన విధానాల ద్వారా కడుపులోని,ఇతరత్రా వున్న మలినాలను తొలగించే చికిత్స ఇది.

మట్టి చికిత్స: రోగికి కడుపుమీద శుభ్రమైన తడి మట్టి ఉన్న గుడ్డను పెట్టడం వల్ల కడుపులోని అవయవాల పనితనం పెరుగుతుంది. శరీర మంతా తలనుంచి అరికాళ్లదాకా శుభ్రమైన మట్టిని బురదగా మార్చి పూయడం మూలంగా శరీరంలోని వేడిని తీసివేయగలుగుతుంది.

రంగుచికిత్స/ భిన్న వర్ణ చికిత్స:
scan పటకంలో నుంచి సూర్యుని కిరణాలు ఏడు రంగులుగా విడుదల అవుతాయి. వీటిలో ఒక్కో రంగుకు ఒక్కో శక్తి ఉంటుంది.ఎరుపు రంగు శక్తినిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. నీలంరంగు నాడీ మండలాన్ని ప్రేరేపిస్తుంది.బిపిని తగ్గిస్తుంది. ఆకుపచ్చరంగు పిట్యూటరీ గ్రంథిని క్రమబద్ధం చేస్తుంది. మానసికమైన డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. తెలుపురంగు రుతువులు మారి నపుడు వచ్చే జబ్బుల మీద పనిచేస్తుంది. మంచి నిద్రకు దోహదపడుతుంది. పసుపు రంగు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆల్ట్రా వయోలెట్‌ కిరణాలు విట మిన్‌ డిని అందజేస్తాయి.కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. బిపిని తగ్గిస్తుంది. ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. రక్దప్రసరణను క్రమబద్ధం చేస్తాయి.

మర్ధన చికిత్స: శిరస్సునుంచి అరికాలు దాకా తైలమర్థనం చేయడం ద్వారా శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. పట్టుకున్న నరాలు కీళ్లు వదులవుతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాదు రక్త ప్రసరణ క్రమబద్దమై మలినాలు విడుదలకు దోహదం చేస్తుంది. సాధారణంగా మర్థన చికిత్సతో పాటు ఆవిరిస్నానం చేయిస్తారు. దీంతో శరీరం లోని మలినాలు చెమట ద్వారా బయటకు వస్తాయి. దీన్ని స్వేదన చికిత్స అంటారు.

వమనక్రియ:
bead వమన క్రియను వారానికి ఒకసారి చేయిస్తుంటారు. ఐదారు గ్లాసుల ఉప్పు నీటిని తాగించి వమనం చేయించడం ద్వారా కడుపులోనూ ఇతరాత్రా వున్న మలినాలు కఫం, బయటకు వచ్చేస్తాయి. పైత్యం తగ్గుతుంది. దీంతో పాటుగా జలనేతి ప్రక్రియను చేప డతారు. నీటిని ఒక రంధ్రం నుంచి పంపి మరోరంధ్రం ద్వారా బయటకు వచ్చేట్టు చేస్తారు. దీనివల్ల ముక్కుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

ఉపవాసం: సహజంగా ప్రతి మనిషిలో ప్రాణశక్తి వుంటుంది. మాలిన్యాలు, ఇతర కారాణాలు దాన్ని సూర్యున్ని మేఘం లాగా కప్పెస్తాయి. అందువల్ల ప్రకృతివైద్య విధానంలో ఉపవాసం ద్వారా ఆ అడ్డంకులను పక్కన నెట్టి ప్రాణశక్తిని మేల్కోలుపు తారు.

ఆహారచికిత్స: ప్రకృతి వైద్యంలో మనం తీసుకునే ఆహారానికి ఉన్నతస్థానం ఉంది. ఆహారం అన్నది రోగం రాకుండా నివారించేందుకు ఉన్న రోగాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

పంచకర్మ చికిత్స: మానసిక వత్తిడిని కంప్యూటర్‌ సంబంధించిన ఉద్యోగులకు ఏర్పడే సమస్యల నివారణకు శిరోధార చికిత్సను అందజేస్తారు.

ఫిజియోథెరపి: కీళ్లనొప్పులు, ఇతరాత్రా జబ్బులకు ఫిజియోథెరపి విధానాలను కూడా ప్రకృతి వైద్యం ఆమోదిస్తుంది. పై చికిత్సలకు చౌకధరలకు అందజేసే ప్రకృతి చికిత్సాలయం హైదరాబాదులోని రాజేంద్రనగర్‌ పరి సరాలలో నెహ్రూ జూ పార్కుకు 3 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవేకు వందగజాల దూరంలో ఉంది. ఇది కస్తుర్బా ప్రకృతి చికిత్స యోగ సంస్థ 1964 నుంచి సేవలందిస్తోంది. గాంధేయ విశ్వాసాలలో పనిచేసే సర్వోదయ ట్రస్ట్‌ పది ఎకరాల ప్రశాంత వాతావరణంలో దీన్ని ఏర్పరిచింది. ఇది 60 పడకలున్న వైద్యాలయం. బయటి రోగులకు కూడా చికిత్స అందజేస్తారు. ఇంట్లో ఉంటూనే ప్రకృతి వైద్య చికిత్సా పద్ధతులను అనుసరించి జీవించడానికి వీలుగా మార్గదర్శకత్వం వహి స్తారు. జనరల్‌ వార్డులతో పాటు ఎ/సి రూములు కూడా అందు బాటులో ఉన్నాయి. ఈ సంస్థ అధికబరువు,బి,పి, షుగరు, కీళ్లనొప్పులు, మెడ, నడుమునొప్పులు, ఎసిడిటి, మల బద్ధకం, సైనసైటిస్‌, ఆస్తమా, పక్షవాతం, చర్మవ్యాధులు, మానసిక వ్యాధులు మొదలగు వాటికి చికిత్సలు అందిస్తుంది.

chari
- డా. జె.వి.ఎన్‌. చారి
ఎన్‌డి(ఉస్మానియా), సిఎచ్‌ఓ

ఔషధం కానిదేదీ ఈ జగత్తులో లేదు

ఆరోగ్య పరిరక్షణ, రోగనివారణ అనేవి ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యాలు. ఆయువు నిర్వహణలో సహజసిద్ధమైన వనమూలికల పాత్ర నిర్వివాదం. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధం కూడా. మానవుడు ప్రాణవాయువు, నీరు, ఆహారం, వస్త్రం, వసతి మొదలైన సర్వ అవసరాలకు మొక్కలపైనే ఆధారపడి ఉన్నాడు. మొక్కలే లేకుంటే మనిషి మనుగడే లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కల ఆధారంగా జీవించే మానవుడు రోగగ్రస్తుడైనప్పుడు అతడి శరీరం సహజంగానే వనమూలికలను కోరుకుంటుంది. అందువల్లనే వనమూలికలతో తయారైన ఔషధాలు ఎలాంటి విపరీత లక్షణాలు కలుగనీయకుండా రోగాలను నివారించగలుగుతున్నాయి. వనమూలికలు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధినిర్మూలనలో మేలు చేస్తాయని, వాటి ఉపయోగం అత్యంత లాభదాయకమని ఆధునిక అభిప్రాయం. ఈ నేపథ్యంలో అందరికీ పరిచయం ఉండి, సులభంగా అందుబాటులో ఉండే మొక్కలు, వాటిలో ఆరోగ్య విలువలను తెలియచేయడం ద్వారా సాధారణ ఆరోగ్య సమస్యలకు సులభమైన నివారణోపాయాలు తెలియచేస్తున్నాం. ఆహార ధాన్యాలన్నింటికీ కొన్ని ఉపయోగాలు ఉంటాయి.

ఆహార ధాన్యాలు - ఔషధీ విలువలు
good-rice 
వరి, బియ్యం - బలాన్ని కలిగిస్తాయి.. జ్వరం తగ్గాక శక్తిని కలిగిస్తాయి. వాంతులు నోటిపూత, కుసుమ వ్యాధులను నివారిస్తాయి.
గోధుమలు - పుష్టినిస్తాయి.జ్వరంలో వాడతగినవి.మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
రాగులు - పుష్టినిస్తాయి. చిన్న పిల్లలకు, వృద్ధులకు మంచిది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి
bitterGourd 
జొన్నలు- మధుమేహం కలవారికి మంచి ఆహారం.ఎండాకాలంలో తక్షణ శక్తి ఇస్తుంది.
కందులు - పుష్టినిస్తాయి, రక్తాన్ని శుభ్రపరుస్తాయి
పెసర్లు - పప్పు ధాన్యాలు అన్నింటికన్నా ఎక్కువ మేలు చేస్తుంది
మినుములు - వీర్యవృద్ధిని, మూత్రపిండాలకు బలము కలుగచేస్తుంది
black-grams 

శనగలు - స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కడుపులో క్రిములను చంపుతుంది. నూనెతో వేయించి తనడం మంచిది కాదు. సౌల్యం ఉన్నవారు తినరాదు.
ఉలువలు - మూత్రంలో రాళ్ళు, క్షయ, అతి మూత్రం, రుతుబద్ధతను తగ్గిస్తాయి.
వేరుశనగలు - చిన్న పిల్లలకు పుష్టికరం. మొలకలు తీసి వాడాలి. శరీర పుష్టిని కలిగిస్తుంది.
బఠాణీలు - శరీర పుష్టిని కలిగిస్తాయి
brinjelsమసూరపప్పు - విరోచనాలు, అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది
నువ్వులు - వీర్యవృద్ధిని, చర్మ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. పండ్లను గట్టి పరుస్తుంది, ఋతు బద్ధాన్ని విప్పుతుంది
అలసందలు- స్తన్యవృద్ధిని, వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
కాయగూరలు - ఔషధీ విలువలు
తోటకూర/ పెరుగు తోట కూర - స్ర్తీలలో ఎర్రబట్ట, ఆర్శమొలలు,వాతవ్యాధులు నివారించబడతాయి
carrot

పుదీనా - అజీర్ణాన్ని తొలగించి ఆకలిని కలిగించును
కొత్తిమీర - ఆకలిని కలిగించును, నోటిపూత, పంటినొప్పి, మానసిక వత్తిడిని నిర్మూలిస్తుంది
కరివేపాకు - జిగట విరేచనాలు, రక్తవిరేచనాలు తగ్గిస్తుంది
పొన్నగంటికూర - నేత్ర వ్యాధులు కలవారికి, కడుపులో క్రిములు కలవారికి మేలు చేస్తుంది
అవిశ ఆకు - రేచీకటి, మలబద్ధకాన్ని తొలగిస్తుంది
Curry_Leaves
మునగాకు, కాయ - చెవి వ్యాధులు, ఆర్శ మొలలు తగ్గిస్తుంది. స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది.
ముల్లంగి - దుంపలలో ఉత్తమమైనది, మూత్రములో రాళ్ళు పుట్టకుండా చేస్తుంది
గాజర - రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది
కంద - ఆర్శ మొలలు, కడుపులో క్రిములు కలవారికి మంచిది
అరటికాయలు - శిశువులలో అజీర్ణం, జిగట విరేచనాలు తగ్గిస్తుంది. ఆయువును పెంచుతుంది. green-chellisకడుపులో పుండ్లను మాన్పుతుంది.
బూడిద గుమ్మడి - శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బలాన్నిస్తుంది. మూత్రంలో రాళ్ళు, జిగట విరేచనాలు తగ్గిస్తుంది.
అల్లం - ఆకలి కలిగిస్తుంది. అజీర్ణం, జలుబు తగ్గిస్తుంది
ఉల్లి (నీరుల్లి) - ఆకలి కలిగిస్తుంది. వడదెబ్బ తొలిగిస్తుంది.
potao
కాకరకాయలు - మధుమేహం, కడుపులో క్రిములు తగ్గిస్తుంది
కామంచికూర - కడుపులో క్రిములు, హృదయరోగాలు గలవారు వాడదగినది
బీరకాయలు - వేడిని తగ్గిస్తుంది. అన్ని రకాల వ్యాధులకు పథ్యం
కొబ్బరికాయ - పుష్టినిస్తుంది, వడదెబ్బను అలసటను పోగొడుతుంది.
చింతపండు- వాతవ్యాధులు, మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది. సంవత్సరం పాతది మంచిది.
Pudina
చింతచిగురు - ఆర్శ మొలలు కలవారికి మంచిది
మెంతికూర- వేడిని, ఆర్శమొలలను, మధుమేహం, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.
పాలకూర - పొట్టలో జబ్బులు కలవారికి మంచిది
చుక్కకూర - ఆకలిని కలిగిస్తుంది. కీళ్ళ నొప్పులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
బచ్చలి - ఆకలిని పెంచుతుంది. జ్వరం కలవారు తినరాదు
గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది
red-grantes
వంకాయలు- ఆకలిని, రక్తాన్ని వృద్ధి చేస్తాయి. లేతవి మేలు
చిలగడ దుంపలు- వేడిని తగ్గిస్తాయి. రక్త వృద్ధి చేస్తాయి
సొరకాయ - రుచిని కలిగిస్తుంది. మూత్రమును జారీ చేస్తుంది.
పచ్చి మిరపకాయలు - ఎక్కువగా తింటే వీర్య నష్టం కలుగుతుంది
పొట్లకాయ - అందరు రోగులకు మంచిది. వీర్యపుష్టిని కలిగిస్తుంది
wheats

బుడ్డ కాకర కాయ - ఆకలిని కలిగిస్తుంది. చర్మవ్యాధులు, కడుపులో పుండ్లు తగ్గిస్తుంది
చామకూర- ఆర్శ మొలలు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
చామదుంపలు - మూత్రపిండాలకు బలాన్ని చేకూరుస్తుంది.
ఆలుగడ్డలు - పుష్టికరం, బలకరం, ఎక్కువగా తినరాదు
whiteradish
ఇంకా మనం వంటలో ఉపయోగించే పదార్ధాలనేకంలో పోషక విలువలు ఉంటాయి. ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారం మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అది పప్పు ధాన్యాలైనా, కాయగూరలైనా, పళె్ళైనా, వంట దినుసులైనా, మూలికలైనా. అయితే ఈ ఆహారాన్ని కూడా మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మారుతున్న ఋతువులకు అనుగుణంగా తీసుకోవలసిన ఆహారం, ఆహార ధాన్యాలలో ఉన్న పోషకాలు వీటి గురించి తదుపరి తెలుసుకుందాం.

Dr.Swathi 
- డా స్వాతి, ఎం.డి (ఆయుర్వేద)
ఫోన్‌: 9390957168, 08956156961