‘నిత్యం పని
ఒత్తిడి..శారీరకంగా..మానసికంగా ఎంతో అలసిపోతున్నాం ..పెరుగుతున్న పోటీతత్వం
కారణంగా ఎప్పటికప్పుడు సామర్ధ్యం పెంచుకుంటూ పోటీ పడాల్సి వస్తోంది. ఇంటి
బాధ్యతలు..బంధుత్వాలు .. స్నేహాలు ఇలా ప్రతిక్షణం మనిషిని చుట్టే ఆలోచనలు
జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారుు. మనసులు మానసిక సంఘర్షణలకు
లోనవుతున్నారుు. ఈ బాధ్యతలన్నీ సరైన ప్రణాళిక లేకుంటే ఏ పనీ సరిగా చేయలేం.
అనుకున్నవన్నీ సాధించలేం. దీని నుంచి ఎలా బయటపడాలి ? జీవితంలో విజయం ఎలా
సాధించాలి ? ఆనందంగా ఎలా ఉండాలి ? సమాజ నిర్మాణంలో మన బాధ్యత ఏంటి ? ఇలా
ఎప్పుడైనా ఆలోచించామా ? అనేక శారీరక రుగ్మతలకు మానసిక దుర్బలత్వమే కారణం.
మరి మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండా లంటే తగిన వ్యాయామం చేయాలి. మానసికంగా
ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడుకు పదును పెట్టాలి. అంటే మనసును ప్రక్షాళన
చేసుకోవాలి. ఇందుకు ధ్యానం చక్కటి మార్గం. ప్రస్తుతమున్న జీవన విధానం కన్నా
ఉన్నతంగా ధ్యానం ద్వారా జీవితాన్ని గడపవచ్చని ధ్యానేకంద్రాల నిర్వాహ కులు
చెబుతున్నారు.
ఏదైనా
పవిత్ర లక్ష్యాన్ని నిర్థారించుకుని దానిపైనే దృష్టి నిలపడం ధ్యానం. ఇది
ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. ధ్యానం యోగాలో ఒక భాగం. మన పూర్వీకులు అనేక
సంవత్సరాలు పరిశో ధన చేసి మానవ శరీరం యోగా రూపంలో గొప్ప ఆద్యాత్మిక శక్తిని
సాధించే ప్రక్రియను ప్రపంచానికి అందించారు. యోగాకు ఆద్యుడు పతంజలి
సూచించిన ప్రకారం ఎనిమిది నియమాలతో కూడుకుంది . భౌతిక శాస్తప్రరంగా,
సాంకేతిక విజ్ఞానపరంగా ఎంతో వృద్ధి సాధించినప్పటికీ సంతోషంగా మనం
జీవించలేకపోతున్నాం. ఈ దిశగా ఆలోచిస్తే యోగా అవసరమే అని చెప్పక తప్పదు.
ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా, ధ్యానం
సాధనచేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సాధకులు చెబుతున్నారు.
యోగా ప్రయోజనాలు ఇవీ...
యోగా ప్రయోజనాలు ఇవీ...
మనం
సాధన చేసే తీరును బట్టి ఫలితాలు ఉంటాయి. మనం ప్రతి రోజూ భౌతిక విధులు
నిర్వర్తిస్తున్నట్లుగానే ధ్యానాన్ని కూడా నిత్యకృతగా మార్చుకుంటే మంచి
ఫలితాలు బోధపడతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. కేవలం శారీరక, మానసిక
ఆరోగ్యా లకే ఈ ధ్యానం పరిమితం కాదు. మనం ప్రశాంతంగా జీవిస్తూ, మన చుట్టూ
ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే ధ్యానం. నిర్మాణాత్మక సమాజం దిశగా మనం
పయనించేందుకు ధ్యానం గొప్ప వరం. సాంప్రదాయ యోగా క్రమేణా అనేక పద్ధతుల్లో
ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నో సంస్థలు పలు రకాలుగా యోగా, ధ్యానంలో శిక్షణ
ఇస్తూ వాటి కేంద్రాలను విస్తరిస్తున్నాయి. 
విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...
యోగా మన దేశంలో పుట్టినప్పటికీ విదేశా ల్లోనే ఎక్కువ ఆదరణకు నోచుకుంటోందని యోగా గురువు ఎ.ఎల్వీ కుమార్ చెబుతున్నారు. అన్నారు. అమెరికా, స్వీడన్, కెనడా, యుకె, పోలెండ్ దేశాలకు చెందిన 20 మంది పాశ్చాత్యులు యోగా నేర్చుకోవడానికి ఇటీవల భాగ్యనగరానికి విచ్చేశారు. యోగా హీలింగ్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ సాంప్రదాయయోగా (ట్రెడిషనల్ యోగా) లో టీచర్లకు గత కొద్ది కాలంగా శిక్షణను అందిస్తోంది. శిక్షణలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామ, శ్వాస పద్ధతులు, మెడిటేషన్ తదితర అంశాలపైన క్లాసులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యోగా పరిచయం, ఎక్‌స్టర్నల్ (బహిర్గత), ఇంటర్నల్ (అంతర్గత) యోగా, ఇతర ప్రత్యామ్నాయ శాస్తల్రను బోధిస్తున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో శిక్షణ...

విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...
యోగా మన దేశంలో పుట్టినప్పటికీ విదేశా ల్లోనే ఎక్కువ ఆదరణకు నోచుకుంటోందని యోగా గురువు ఎ.ఎల్వీ కుమార్ చెబుతున్నారు. అన్నారు. అమెరికా, స్వీడన్, కెనడా, యుకె, పోలెండ్ దేశాలకు చెందిన 20 మంది పాశ్చాత్యులు యోగా నేర్చుకోవడానికి ఇటీవల భాగ్యనగరానికి విచ్చేశారు. యోగా హీలింగ్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ సాంప్రదాయయోగా (ట్రెడిషనల్ యోగా) లో టీచర్లకు గత కొద్ది కాలంగా శిక్షణను అందిస్తోంది. శిక్షణలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామ, శ్వాస పద్ధతులు, మెడిటేషన్ తదితర అంశాలపైన క్లాసులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యోగా పరిచయం, ఎక్‌స్టర్నల్ (బహిర్గత), ఇంటర్నల్ (అంతర్గత) యోగా, ఇతర ప్రత్యామ్నాయ శాస్తల్రను బోధిస్తున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో శిక్షణ...
ప్రధానంగా
ధ్యానం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. రిథమిక్ టైప్ ఆఫ్ బ్రీథింగ్‌లో
ఆరు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు మూడు గంటలపాటు ప్రాణా యామం
బస్ర్తిక, సుదర్శన్ క్రియల్లో శిక్షణ ఇస్తారు. ఈ ధ్యానం వల్ల శరీరానికి 72
నుంచి 80 శాతం వరకు గాలి అదనంగా అందుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి
ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
దీనిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందిస్తోంది. కోర్సు పూర్తయిన తరువాత ప్రతి
రోజూ 20 నిముషాల పాటు దీనిని కొనసాగిస్తే సరిపోతుంది.
-ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ ఫీచర్స్ ప్రతినిధి
‘సూర్య’ ఫీచర్స్ ప్రతినిధి


మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.
కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు.
ద్రోణంరాజు వెంకటచలపతి శర్మ జర్మనీ భాషలో ఉన్న ప్రకృతి చికిత్సా విధానానికి సంబంధించిన పుస్తకాలను తెనిగించి ఆ చికిత్సను 1890లోనే మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత 1933లో గుంటూరు జిల్లాలో ప్రకృతి ఆశ్రమాన్ని డా. వేగిరాజు కృష్ణంరాజు స్థాపించారు. అది 1944 నుంచి భీమవరంలో శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమం పేరిట స్థిరపడి శాఖోపశా ఖలుగా విస్తరించింది. ఇప్పుడు వేగిరాజు కుటుంబీకులైన డా.రవివర్మ, డా. కమలాదేవి, డా.గోపాలరాజు మొదలైనవారు సేవలందిస్తున్నారు.ప్రకృతి నుంచి దూరం జరిగే కొద్ది మనిషిలో వికృతి పెరుగుతుంది. ఈ వికృతి శరీరంలోనూ, మనసులోనూ చోటు చేసుకోవడంతో అనారోగ్యం మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్యం అంటే ఏంటో నిర్వచించింది.కేవలం రోగం లేకపోవడం లేదా వైల్యం లేకపోవడమే ఆరోగ్యం అనిపించుకోదు. భౌతికంగా, సామాజికంగా కూడా సంపూ ర్ణంగా స్వస్థత కలిగి ఉండడమే ఆరోగ్యం.
ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి వైద్యవిధాన శాస్త్ర అంశాలను మేళవించి చాలా వరకు సంఘసేవా దృష్టితో ప్రజలకు సేవలందిస్తున్న అసలైన ఆరోగ్య కేంద్రాలు ప్రకృతి చికిత్సాలయాలు. గత కొని సంవత్సరాలుగా యోగా కూడా ఈ వైద్యవిధానంలో ఒక భాగమైంది.ముందులు వేయకుండా జబ్బులను నయం చేయడం వల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని ప్రకృతి చికిత్స అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇది ఒక జీవిత విధా నంగా మారింది. ఇది ఒక దేశానికో, జాతికో మతానికో పరిమితమైంది కాదు అంతర్జాతీయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. ఈ వైద్య చికిత్స క్రింది మూడు అంశాలు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతుంది.
పై మూడు అంశాలను దూరం చేసే సహజ చికిత్సలను ప్రకృతి వైద్యం అందిస్తుంది. అలోపతి వైద్యవిధానం సూక్ష్మజీవుల మూలంగా జబ్బులు కలుగుతాయని చెప్తుంది. కాని శరీరంలో మలినాలు పేరుకుపోవడం మూలంగానే సూక్ష్మజీవులు ఏర్పడతాయని ప్రకృతి వైద్యం చెప్తుంది. వీటిని తొలగించే క్రమంలోనూ ప్రాణశక్తిని పెంచే మార్గంలోనూ ప్రకృ తిలోని పంచభూతాలను నీరు, మట్టి, సూర్యరశ్మి, వాయువు, ఆకాశం ...వినియోగంలోకి తెస్తుంది.
పటకంలో నుంచి సూర్యుని కిరణాలు ఏడు రంగులుగా విడుదల అవుతాయి. వీటిలో ఒక్కో రంగుకు ఒక్కో శక్తి ఉంటుంది.ఎరుపు రంగు శక్తినిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. నీలంరంగు నాడీ మండలాన్ని ప్రేరేపిస్తుంది.బిపిని తగ్గిస్తుంది. ఆకుపచ్చరంగు పిట్యూటరీ గ్రంథిని క్రమబద్ధం చేస్తుంది. మానసికమైన డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. తెలుపురంగు రుతువులు మారి నపుడు వచ్చే జబ్బుల మీద పనిచేస్తుంది. మంచి నిద్రకు దోహదపడుతుంది. పసుపు రంగు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆల్ట్రా వయోలెట్ కిరణాలు విట మిన్ డిని అందజేస్తాయి.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బిపిని తగ్గిస్తుంది. ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. రక్దప్రసరణను క్రమబద్ధం చేస్తాయి.
వమన క్రియను వారానికి ఒకసారి చేయిస్తుంటారు. ఐదారు గ్లాసుల ఉప్పు నీటిని తాగించి వమనం చేయించడం ద్వారా కడుపులోనూ ఇతరాత్రా వున్న మలినాలు కఫం, బయటకు వచ్చేస్తాయి. పైత్యం తగ్గుతుంది. దీంతో పాటుగా జలనేతి ప్రక్రియను చేప డతారు. నీటిని ఒక రంధ్రం నుంచి పంపి మరోరంధ్రం ద్వారా బయటకు వచ్చేట్టు చేస్తారు. దీనివల్ల ముక్కుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
ఏ జంతువునైనా కరకరా నమిలి జీర్ణం చేసుకుంటుంది సింహం. ఎంతటి విషంకక్కే పాములను మింగినా సరే, నెమలి నిగనిగలాడుతూనే ఉంటుంది. మెరుపు వేగంతో పరిగెత్తే కుందేలుకు అలసట అంటే తెలీదు. మైళ్లదూరం ప్రయాణమంటే గద్దకు లెక్కేలేదు. తలకు మించిన బరువును సైతం లాగిపడేస్తుంది వృషభం. నిప్పుల కొలిమిలాంటి ఎడారిలో ఒంటె హాయిగా జీవించేస్తుంది. ఇరుకైన ప్రదేశానికి తగ్గట్టు పాము తన శరీర పరిమాణాన్ని మార్చుకుంటుంది. ఏమిటీ జీవ రహస్యం..? ఒక్కో జంతువుకు ఒక్కో అపురూప జీవలక్షణాలను అందించిన ప్రకృతి మహత్యమది. అలాంటి అన్ని లక్షణాలు మనుషులకూ వస్తే, ఇంకెంత ఆరోగ్యంగా ఉంటారు..? అన్న ఆలోచన నుంచే పుట్టాయి ఈ యోగాసనాలు.... వీటిని మనకు వివరించారు భారతీయ యోగా సంస్థాన్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రకాష్‌రావు.
ఊష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసనంలో శరీరం ఒంటెలాగ ఒంకరటింకరగా కనిపిస్తుంది. ఒంటె సాధు జంతువైనా బలిష్టంగా ఉంటుంది. మన శరీరం కూడా ఒంటెలాగ బలంగా ఉండేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఫొటోలో ఉన్నట్లు.. మోకాళ్ల మధ్యన భుజాల మధ్య ఉన్నంత వెడల్పు ఉంచాలి. పాదాలు ఆకాశం వైపు చూడాలి. తల వెనక్కి వంచాలి. అరచేతులు అరికాళ్లపైన ఉంచాలి. కళ్లు మూసుకొని వెన్నెముక మీద కలిగే ప్రభావాన్ని గమనించాలి.
సింహం అడవికి రాజు. అది ఎంత కఠినమైన ఆహారం తిన్నా అరిగించుకుంటుంది. సింహం తరచూ గర్జించడం వల్ల దాని లోపలి అవయవాలు చురుగ్గా తయారవుతాయి. సింహ ఆసనం వేసేవాళ్లకూ ఆ ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఫోటోలో చూపిన విధంగా కాళ్లు మడిచి కూర్చున్నాక, చేతులు ముందుకుచాపి నిటారుగా వంగాలి. నోరు పెద్దగా తెరిచి, నాలుకను బయట పెట్టి సింహంలా గర్జించాలి. కంఠం, ఛాతీ పూర్తిగా తెరుచుకోవాలి.
పాముకు శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకొనే సౌకర్యం ఉంటుంది. పాము శరీరానికి ఉన్న లాభం మన శరీరానికి కూడా కలిగేలా చేస్తుంది భుజంగాసనం. రెండు చేతులనూ భూమికి ఆనించి, తలపైకెత్తి చూడాలి. వెన్నుపూసను కొద్దిగా వంచాలి.
పాములు నెమలికి ఆహారం. అయినా పాముల్లోని విషం నెమళ్లను ఏమీ చేయలేదు. విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగల శక్తిని మయూరాసనం ఇస్తుంది. రెండు అరిచేతులను నేల మీద ఆన్చాలి. చేతులు పాదాల వైపు తిరిగుండాలి. నాభికి చెరోవైపు రెండు మోచేతులను ఉంచాలి. శరీరం కేవలం రెండు అరిచేతుల మీద నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో మెల్లగా శ్వాసను పీల్చాలి.
శరీరాన్ని గరుడ పక్షి (గద్ద) ఆకారంలో ఉంచితే అది గరుడాసనం అవుతుంది. గద్ద ఎంత దూరం ప్రయాణించినా ఆయాసపడదు. ఆ లక్షణం మనకూ రావాలంటే ఈ ఆసనం వేయాలి. రెండు చేతులు, కాళ్లు మెలితిరిగినట్లు, పెనవేసుకున్నట్లు శరీరాన్ని ఉంచాలి. శ్వాసను బయటికి వదిలి సాధ్యమైనంత వరకు ఆపాలి. ఇదే ఆసనాన్ని తిరిగి రెండవకాలు, చేయితో చేయాలి.
ఆవు ఆకారంలో ఈ ఆసనం ఉంటుంది. ఫొటోలో ఉన్నట్లు కుడికాలును ఎడంవైపుకు.. ఎడం కాలును కుడివైపుకు మడవాలి. రెండు చేతులను వెనక్కి తీసుకొచ్చి, ఇంటర్‌లాక్ చేయాలి. సాధారణ శ్వాస తీసుకోవాలి. కొంతసేపయ్యాక వ్యతిరేక దిశలో రిపీట్ చేయాలి.
వృషభం (ఎద్దు) ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు. సుఖాసనంలో కూర్చున్నట్లే ఒక కాలు అటు, మరొక కాలు ఇటు మడిచి కూర్చోవాలి. రెండు చేతులను మోకాలిమడమ దగ్గర పెట్టుకోవాలి.
మార్జాలం అంటే పిల్లి. దాని ఆకారం వచ్చేలా ఈ ఆసనాన్ని వేయాలి. మోకాళ్లు, అరచేతుల మీద వంగి ఉండాలి. తలను కిందికి వంచాలి. ప్రయోజనం : మధుమేహాన్ని చక్కగా నియంత్రిస్తుంది. పొత్తి కడుపు భాగాలు గట్టిపడతాయి.
శశాంకం అంటే కుందేలు. కుందేలు ఎంత వేగంగా, ఎంత దూరం పరిగెత్తినా ఊపిరి తీసుకొనేందుకు ఇబ్బంది పడదు. ఈ ఆసనం వేస్తే మీరు కూడా శ్వాసలో స్వేచ్ఛను అనుభవిస్తారు. మోకాళ్ల మీద కూర్చుని నెమ్మదిగా చేతులు ముందుకు చాపాలి. నిదానంగా చేతులను నేలకు తాకిస్తూ ఈ ఫొటోలో ఉన్నట్లు ముందుకు వంగి కాసేపు అలాగే ఉండాలి.
కప్ప ఆకారాన్ని పోలిన ఈ ఆసనంతో ఎన్నో ఉపయాగాలున్నాయి.మోకాళ్ల మీద కూర్చోవాలి. రెండు పిడికిళ్లు బిగించి పొట్టదగ్గర పెట్టుకోవాలి. మెల్లగా ముందుకు వంగి తలను నేలను తాకించే ప్రయత్నం చేయాలి.
హాస్యం టెన్షనును తొలగించేందుకు ఉపయోగపడుతుందని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా అంగీకరించారు. కనుకనే ప్రపంచమంతా హాస్య క్లబ్బులు(లాఫింగ్) ఏర్పడుతున్నాయి. యోగా శిక్షణా కేంద్రాల్లోనూ దీనిని ఆనందాసనం రూపంలో సాధకులు అభ్యసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆసనం గురించి తెలుసుకుందాం.. 



