Showing posts with label hair. Show all posts
Showing posts with label hair. Show all posts

Friday, July 8, 2011

అందమైన కురుల కోసం ఆహారంలో కొన్ని మార్పులు

జుత్తు పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్న ఒత్తుగా ఉండాలని కోరుకోని మహిళలు ఉండరు. పెరిగిపోతున్న కాలుష్యం, ఆధునిక జీవన శైలి కారణంగా అనేకమంది జుత్తు చిన్న వయసులోనే పల్చబడడమే కాదు రంగు కూడా మారిపోతున్నది. నెత్తి మీద దువ్వెన పెడితే తుట్టెలు తుట్టెలుగా వెంట్రుకలు ఊడొస్తుంటే బెంగపడిపోతుంటారు మహిళలు. అయితే ఊరికే బెంగపడకుండా తమ ఆహారపు అలవాట్లను ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆహారంలో కొన్ని మార్పులను చెప్తున్నారు.

కారెట్లు...
carrots 
విటమిన్‌ ఎ అధికంగా ఉండే కారెట్లను తీసుకోవడం వల్ల కేవలం కంటికే కాదు జుత్తకు కూడా మంచిదంటున్నారు నిపుణులు. మాడు ఆరోగ్యంగా ఉంటే నల్లగా మెరిసే, బలమైన జుత్తు పెరుగుతుందిట. ప్రోటీన్లు, పళ్ళు, కాయగూరలు, పప్పులు, చేపలు, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా జుత్తు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి.

ఎండుద్రాక్షలు...
prunes 
జుత్తు ఎండిపోయినట్టు గడ్డిలా ఉండి, పల్చబడిపోయి, రంగు వెలిసిపోయినట్టు ఉంటే లేదా తెగ ఊడిపోతుంటే అందుకు కారణం శరీరంలో ఐరన్‌ శాతం తగ్గిపోవడమే. ఎండు ద్రాక్షలలో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండడమే కాక జుత్తు క్వాలిటీ పెరిగేలా చేస్తుంది. దీనితో పాటుగా ఆకుకూరలు, బీట్‌రూట్‌లు కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

పచ్చి బఠాణీలు...
_green-peas 
పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉన్నా, నిర్దిష్టమైన విటమిన్‌ లేదా మినరల్స్‌ ఎక్కువగా లేకపోయినా వాటిలో విటమిన్లు, మినరల్స్‌, ఐరన్‌, జింక్‌, బి గ్రూప్‌ విటమిన్లు సమతులంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన జుత్తుకు మంచివి.

ఓట్స్‌...
oats-photos 
ఓట్లలో ఫైబర్‌ అధికంగా ఉం టుంది. ఇది గుండెకు సంబం ధించిన ఆరోగ్యాన్ని సంరక్షించి, విసర్జనను క్రమబద్ధం చేస్తుంది. ఫైబర్‌తో పాటుగా జింక్‌, ఐరన్‌, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. వీటన్నింఇనీ పాలి అన్‌ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్లని అంటారు. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి, జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది కేవలం ఆహారం ద్వారానే లభ్యమవుతుంది కనుక బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

చిన్న రొయ్యలు...
shrimp 
చిన్న రొయ్యలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.ఇందులో ఉండే విటమిన్‌ బి12, ఐరన్‌, జింక్‌ జుత్తు ఊడిపోకుం డా కాపాడుతుంది. రెడ్‌ మీట్‌ను అతి గా తీసుకోవడం మాని అందుకు ప్రత్యామ్నాయంగా వీటిని ఎంచుకోవచ్చు.

గుడ్లు...
egg 
ఒతైన నల్లని ఆరోగ్యవంతమైన జుత్తు కోసం కోడిగుడ్లను ఉంచుకోవడం మంచిది. ప్రోటీన్లు, విటమిన్‌ బి 12, ఐరన్‌, జింక్‌, ఒమేగా 6 ఆమ్లాలు అధికంగా ఉంటాయి. విటమిన్‌, మినరల్‌ లోపాలు ఉన్నప్పుడు జుత్తు ఆరోగ్యంగా కనుపించదు. గుడ్లలో ఉండే బయోటిన్‌ (విటమిన్‌ బి7) అనే పదార్ధం జుత్తు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.

కొవ్వు తక్కువ పాలు, పెరుగు...

కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పెరుగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనితో పాటుగా హైక్వాలిటీ ప్రోటీన్లైన వే, కేసిన్‌లు ఇందులో ఉంటాయి.

Friday, May 27, 2011

వంటిల్లే బ్యూటీపార్లర్


జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే... కొప్పు పెట్టుకునేంత జుట్టు లేకపోయినా అందంగా ఉండొచ్చంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. కేశాలంకరణ అనగానే పాపిటబిళ్ల, సూర్యచంద్రులు, జడ గంటలు గుర్తుకువస్తాయి. ఇప్పుడా మాట అంటే ఏ కాలంలో ఉన్నారు మీరు? అని అంటారు నేటి తరం అమ్మాయిలు. ఎందుకంటే...కేశాలకు కొత్త కళను తెచ్చే రకరకాల ఆభరణాలు మార్కెట్‌లో మెరిసిపోతున్నాయి. డిజైనర్లు పాత ఆభరణాలకి కొత్త రూపాన్నిచ్చి అమ్మాయిల మనసుల్ని దోచుకుంటున్నారు. హెయిర్‌బ్యాండ్, కొప్పుకు పెట్టుకునే పువ్వులు, కిరీటం డిజైన్లు, చంపసరాలు, చెంపలపై వేలాడే పాపిటబిళ్లలు...ఇలా రకరకాల ఆకారాలతో రంగురంగుల హెయిర్ జ్యువలరీ ప్రస్తుతం ఫ్యాషన్ వరల్డ్‌లో మెరుస్తోంది. అందులో కొన్ని డిజైన్లు ఇక్కడ చూడండి.
ప్రతిసారీ బ్యూటీపార్లర్ చుట్టూ తిరగకుండా, క్రీములు రుద్దకుండా వాడిన వెంటనే ఫలితమిచ్చే సౌందర్య సాధనాలు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటి వాడకం, ఉపయోగం గురించిన వివరాలే ఇవి...

పెరుగు

ఎండ వేడికి నల్లకప్పేసిన చర్మానికి పెరుగు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల కమిలిపోయిన చర్మంపై పెరుగు పూసుకోవాలి. అయితే జిడ్డు చర్మం, సున్నిత చర్మతత్వం ఉన్న వాళ్లు, యాక్నె ఉన్న వాళ్లు పెరుగు వాడకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే బ్యాక్టీరియా యాక్నె పెరిగేందుకు దోహద పడుతుంది. అందుకని నిమ్మరసం, గ్లిజరిన్‌లు సమ భాగాలుగా తీసుకుని ముఖానికి రాసుకోవాలి వాళ్లు. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ట్యాన్ పోవడమే కాకుండా చర్మం రంగు తేలుతుంది.

నిమ్మరసం

నిమ్మరసం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని జుట్టు రంగు మార్చుకోవాలనుకుంటే మూడు కప్పుల నీళ్లలో, పావుభాగం నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టుపై పోసుకుంటే హెయిర్ కలరింగ్ ప్రొడక్ట్‌ల కంటే బాగా పనిచేస్తుంది.

కీరదోసకాయ

అలసిపోయి, ఉబ్బిపోయిన కళ్లు కాంతివిహీనంగా కనిపిస్తుంటే బాగా నిద్రపోతే సరిపోతుంది. కాని అది వీలుకానప్పుడు కీరదోసకాయ ముక్కల్ని గుండ్రంగా కోసుకుని కళ్ల పై ఓ 20 నిముషాల పాటు ఉంచాలి.

బంగాళా దుంప
బంగాళా దుంప తురుము కంటికింద ఉండే నల్లటివలయాలను మాయం చేస్తుంది. బంగాళా దుంపల్లో కాటెకొలేజ్ ఉంటుంది. ఇది సౌందర్య సాధనంగా పనిచేసి చర్మంపై ఉండే నలుపును తగ్గించేస్తుంది. పచ్చి బంగాళాదుంపను తురిమి రసం తీసి కంటికింద రాసుకోవాలి. పదిహేను నిముషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. తేడా మీకే కనిపిస్తుంది.

టీ బ్యాగ్స్

అలసిన కళ్లు కాంతివంతంగా కనిపించాలంటే మరో టెక్నిక్ టీబ్యాగ్స్. టీబ్యాగ్స్‌ను గోరువెచ్చటి నీటిలో కొన్ని నిమిషాల పాటు నానపెట్టి ఆ తరువాత వాటిని రెండు కళ్లపై 20 నిమిషాల పాటు ఉంచాలి. టీబ్యాగ్స్ కళ్లకే కాకుండా కాళ్లకు కూడా బాగా పనిచేస్తాయి. కొందరి పాదాలు ఎంత శుభ్రం చేసుకున్నా దుర్వాసన వస్తుంటాయి. ఇటువంటి వాళ్లు నాలుగైదు టీ బ్యాగులను లేదా మూడు స్పూన్ల తేయాకు పొడిని నీళ్లలో వేసి ఉడికించాలి. గది ఉష్ణోగ్రత వరకు వచ్చిన తరువాత ఈ నీళ్లలో కొన్ని చల్లటి నీళ్లు కలపాలి. అందులో పాదాలను 30 నిమిషాల పాటు నానపెట్టాలి. పాదాలు ఆరిన తరువాత మెడికేటెడ్ ఫుట్ పౌడర్‌ను వేసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉందనిపిస్తే ఈ పద్ధతిని రోజుకి రెండుసార్లు పాటించాలి. దుర్వాసన రావడం తగ్గిన తరువాత వారానికి రెండుసార్లు చేస్తే చాలు.

కమలా పండు రసం

ఇందులో ఉండే విటమిన్-సి మంచి టోనర్‌గా పనిచేస్తుంది. ఈ రసంతో మసాజ్ చేస్తే సబ్బు వల్ల కూడా పోని దుమ్ము, జిడ్డు వదిలిపోతాయి. టోనర్ తయారీకి అరచెక్క కమలా పండును ఒకటిన్నర స్పూను నిమ్మరసం, పావుకప్పు నీళ్లు కలిపి మెత్తగా అయ్యేవరకు మిక్సీ చేయాలి. ఆ తరువాత ఇందులో దూదిని నానపెట్టి ఆ దూదిని ముఖంపై మృదువుగా రుద్దాలి.

పెరుగు, శెనగపిండి, పసుపు

ఈ మూడు కలిపి వాడితే చర్మం రంగు నిగారింపు వస్తుంది. మూడు స్పూన్ల పెరుగులో ఒక స్పూను శెనగపిండి, చిన్న స్పూను పసుపు వేయాలి. గట్టిగా మెత్తటి పేస్ట్‌లా చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

వెనిగర్

చుండ్రు తొలగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా మాల్ట్ వెనిగర్ తీసుకుని మాడుపై మసాజ్ చేయాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో కడిగేయాలి. చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే వారానికి మూడుసార్లు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే చుండ్రు మటుమాయం అవుతుంది.

తేనె - ఆలివ్ ఆయిల్

మంచి హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది ఇది. రెండు స్పూన్ల తాజా తేనెను ఒక స్పూను ఆలివ్ నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మర్దనా చేయాలి. మాడులోకి ఈ మిశ్రమం బాగా ఇంకేంత వరకు అంటే దాదాపు ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

బ్లాక్ టీ బ్యాగ్స్ - కొత్తిమీర ఆకులు
పెదవుల్ని మృదువుగా, అందంగా ఉంచుతాయి ఇవి. ఒక బ్లాక్ టీ బ్యాగును గోరు వెచ్చటి నీటిలో నానపెట్టాలి. తరువాత దాన్ని పెదవులపై ఉంచి పది నిమిషాల పాటు నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. అవసరమనుకుంటే ఇంకా ఎక్కువసేపు కూడా చేయొచ్చు. బ్లాక్ టీలో ఉండే టానిన్ వల్ల పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి. ఇదే కాకుండా కొత్తిమీర ఆకులు కూడా పెదవులకు బాగా పనిచేస్తాయి. పెదవులపై కొత్తిమీర రసాన్ని రుద్దితే గులాబీ రంగు సంతరించుకుని, మృదువుగా అవుతాయి.

Thursday, January 13, 2011

జుట్టు రాలడాన్ని నిరోధించేదెలా?

మా అమ్మకి అరవై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు. నాకేమో ఉన్న జుట్టుకు రంగు వేయాల్సి వస్తోంది. మా అమ్మాయికి అప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతోంది. నా సంగతి సరే! మా అమ్మాయికి జుట్టు ఊడకుండా, తెల్లజుట్టు రాకుండా ఉండటానికి ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి.
- బృంద, వైజాగ్

ఈ మధ్యకాలంలో మీరు చెబుతున్న సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ, బ్యూటీ క్లినిక్‌ల చుట్టూ తిరిగే వారి సంఖ్య చాలా పెరిగింది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే జుట్టురాలే సమస్య ఇప్పుడు యుక్త వయస్కుల్లోనూ కనిపిస్తోంది. ఇరవై ఏళ్లకే జుట్టు తెల్లబడుతోందని, తలస్నానం చేస్తే జుట్టంతా ఊడిపోతోందంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

బట్టతల వంశపారపర్యంగా సంక్రమించేదే అయినా జుట్టు రాలడానికి పోషకాహారలోపం, మానసిక ఆందోళన, నిద్రలేమి, కాలుష్యం, హార్మోన్ల సమస్య వంటివి కారణమవుతున్నాయి. చర్మం కిందిపొరను ఎపిడెర్మిస్ అంటారు. ఎపిడెర్మిస్‌లో రక్తనాళాలు ఉండవు.

స్వేదగ్రంథుల నాళాలు, రోమాలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకుని చర్మం పైకి వస్తాయి. రోమాల మూలంలో ఒక గ్రంథి ఉంటుంది. దీన్ని కేశమూలము లేదా హెయిర్ ఫాలికల్ అంటారు. కేశము ఒక సన్నని ప్లాస్టిక్ నాళం వంటి నిర్మాణము. దీని నాళికలో ఉండే రంగుపదార్థాన్ని మెలనిన్ అంటారు. దీని కారణంగానే జట్టుకు రంగు వస్తుంది.

కారణాలు
వయస్సు : వయసు పైబడుతున్న కొద్దీ కేశమూలాలు కుంచించుకుపోతాయి. కొత్త వెంట్రుకల ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది వంశపారంపర్యంగా ఒక్కో కుటుంబంలో ఒక్కో రకంగా ఉంటుంది.
ఆహారం : వెంట్రుకలు రాలిపోవడానికి పోషకాహార లోపం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మందిలో శిరోజాలు రాలడానికి పోషకాహార లోపమే కారణం.
హార్మోన్ సమస్యలు : థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు అధికంగా లేక తక్కువగా విడుదలకావడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.
స్త్రీలలో..: గర్భిణిలు డెలివరీ అయ్యాక మూడు నెలలకు జుట్టు రాలే సమస్య కనిపిస్తుంది. గర్భం దాల్చినపుడు అధికంగా విడుదలయిన హార్మోన్ల మూలంగా ఈ సమస్య వస్తుంది.
మందుల ప్రభావం: గౌట్, అధిక రక్తపోటు, గుండె, నాడీ సమస్యలకు వాడే మందుల ప్రభావం జుట్టుపై ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో ఎ-విటమిన్ తీసుకోవడం వల్ల, గర్భనిరోధక మాత్రలు, యాంటీడిప్రెషన్ మందుల కారణంగా కూడా జుట్టు రాలవచ్చు.

ఇన్‌ఫెక్షన్లు : తలలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా శిరోజాలు రాలిపోయే అవకాశం ఉంది.
మానసిక ఒత్తిడి : శారీరక, మానసిక ఒత్తిడి, ఐరన్ లోపం వంటి అంశాలు కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతాయి.
కాలుష్యం : వాహన కాలుష్యం వల్ల శిరోజాలు బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది.
దీర్ఘకాలిక వ్యాధులు: క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న వారిలో జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.

డయాబెటిస్‌ను నిర్ధారించేందుకు చేసే పరీక్షలు, సి.బి.పి(కంప్లీట్ బ్లడ్ పిక్చర్), థైరాయిడ్ హార్మోన్ల శాతాన్ని నిర్ధారించే పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి టెస్టులు జుట్టు రాలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి.

హోమియో చికిత్స
ముందుగా వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించి, తద్వారా శరీరతత్వానికి సరిపోయే మందులను ఇస్తారు. జన్యులోపాలను, హార్మోన్ల సమస్యలను తగ్గించడంలో హోమియో మందులు చక్కగా ఉపకరిస్తాయి. ఈ సమస్యను నివారించడానికి చక్కని మార్గాలున్నాయి.

* హెయిర్ డైలను, కృత్రిమ రంగులను జుట్టుకు ఉపయోగించకూడదు. కృత్రిమ రంగులు వాడటం వల్ల అందులో ఉండే రసాయనాలు శిరోజాలను బలహీనపరుస్తాయి.
* వారంలో ఒకటి, రెండు సార్లు షాంపూతో తలస్నానం చేయాలి. తరువాత తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. షాంపూలు తరుచుగా మార్చడం మంచిది కాదు. ఎప్పుడూ ఒకే బ్రాండ్ షాంపూ ఉపయోగించాలి.
* పోషకాహారం తీసుకోవాలి. రోజువారీ మెనూలో ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. జుత్తు బలంగా ఉండాలంటే కాల్షియం, ఐరన్ ప్రొటీన్లు సమంగా అందాలి.
* తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడమూ అవసరమే. మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి.
* తలలో ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లయితే వెంటనే చికిత్స తీసుకోవాలి.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం ఉంటేనే శిరోజాలు బాగుంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

డా. శ్రీకాంత్. యం
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
ఆంధ్రప్రదేశ్-కర్ణాటక,
ఫోన్ : 9550001144, 9550001188

Thursday, September 16, 2010

చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే .... కారణాలు - పరిష్కారం * బాధించే చుండ్రు.. * నిగనిగలాడే జుట్టు కోసం...


చుండ్రుతో బాధా..?!
టీవీలో యాడ్‌... దువ్వుకుంటుంటే పొట్టులా రాలి బ్లాక్‌ కోట్‌ మీద తెల్లగా పొడి రాలుతూ ఉంటుంది.తలలో విపరీతమైన దురదా? అయితే చుండ్రే కారణం అంటూ మోడల్‌ ఓ షాంపూను చేతిలో పెడుతుంది. ఇది నిత్యం మనం టీవీల్లో చూసేవి. కానీ కేవలం షాంపూలు వాడితేనే తగ్గిపోయే సమస్య కాదు ఇది. ఈ చుండ్రు అనేది ఆడ, మగ భేదం లేకుండా బాధించే సమస్యలలో ఒకటి. కాకపోతే ఎక్కువ శాతం ఈ చుండ్రుతో బాధపడేవారి సంఖ్య పురుషుల కన్నా స్ర్తీలలోనే ఉంటుంది.అసలు చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే కారణాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి... వాటికి పరిష్కారం ఏంటీ అంటే...

aloe-showerసరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకపోవ డం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌...లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. అయి తే చాలా మంది చుండ్రు నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. అలాంటి వైద్యం కన్నా మనమే సొంతంగా ఇంటి వద్దే చుండ్రు నివారణ మందును తయారు చేసుకొని వాడవచ్చు.

పొట్లకాయరసంతో :

సహజసిద్ధంగా చుండ్రు నివారణ మందును ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు ను. మార్కెట్లో దొరికే పొట్లకాయను ఒకటి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి జ్యూస్‌ మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొట్లకాయరసంలో వేరే ఏదీ కలపకుండా దానిని వడగట్టి ఆపళంగా తలంతా వెంట్రు కల మొదళ్ల నుంచి చివరిదాకా పట్టించా లి. అవసరం అనుకుంటే మరో పొట్లకా యను జ్యూస్‌ చేసుకుని మొత్తాన్ని వాడాలి.ఇరవై నిమిషాలపాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన క్రమంగా చుం డ్రు మటుమాయం అవుతుంది. చుండ్రు నివారణకు పొట్లకాయ రసం బాగా పనిచేస్తుంది.పైగా వెం ట్రుకలు నిగనిగలాడేలా చేయడం లోనూ పొట్లకాయ రసం బాగా ఉపకరిస్తుంది.

శనగపిండి:
శనగపిండి నాల్గు స్పూన్లు తీసుకుని ఒక కప్పు పెరుగులో ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కల పాలి. మెత్తగా పేస్ట్‌ మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత పల్చ గా వచ్చిన పిండిని వెంట్రుకల మొదళ్లనుంచి చివళ్ల దాకా వచ్చేలా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయా లి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.

నిమ్మ, జామరసం మిశ్రమంతో:
నిమ్మకాయరసంలో జామ ఆకుల రసాన్ని మేళవించి రెండూ కలి పి వెంట్రుకల లోపల దాకా వేళ్లేట్లుగా పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నా నం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చొప్పున చేస్తుంటే చుండ్రు మటుమాయం అవుతుంది.

హెన్నా :
వెంట్రుకల రంగు మార్చుకోవడానికి హెన్నాను వాడుతుంటారు. అయితే మార్కెట్లో మంచి బ్రాండ్‌ హెన్నాను వాడితే చాలా మంచిది. హెన్నా చుండ్రును అరికట్టడంలో దివ్యంగా పనిచేస్తుంది.

మెంతులు, పెరుగు పేస్ట్‌ :
మెంతులు ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి గుజ్జులా చేసుకుని వెంట్రుకలకు పట్టించాలి. మెంతులు చుండ్రు నివారణలో దివ్యంగా పని చేస్తాయి.

గోరింటాకు :
గోరింటాకు కోసుకురాగానే ఆ ఆకుల రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది.అందులోకి ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కలుపుకుంటే మరింత అనుకూలమైన ఫలితం వస్తుంది.

వెనిగర్‌ :
మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్‌ బాటిల్‌ను తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్‌ చొప్పున కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది.

ఉసిరికపొడి :
పెద్ద ఉసిరికాయలను తెచ్చి నూరి వాటిని ఎండబెట్టి ఆ తర్వాత పొడిచేసుకోవాలి. లేకపోయినా ఉసిరిక పొడి అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరిక పొడిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత ఎవరిచేతనైనా తల మాలిష్‌ చేయించుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కొన్నాళ్లలో తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.

పోషకాహారం :
ఇవన్నీ ఒక ఎత్తయితే... మనం తీసుకునే పోషకపదార్ధాలు ఒక ఎత్తు. ఎక్కువగా ఏ కాలంలో వచ్చే పండును ఆ కాలంలో తప్పక తీసుకోవాలి. చుండ్రు నివారణలో మనం తీసుకునే పండ్లు, వాటి రసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. చుండ్రు ఉన్నవాళ్లు ఎక్కువగా సిట్రస్‌ పండ్లు తీసుకోకపోవడమే మంచిది. అలాగే చుండ్రు తగ్గేదాకా అరటిపండును కూడా తినవద్దు. ఎక్కువ ఆయిలీ పదార్థాలు, పిజ్జాలు, బర్గర్ల వంటివి తగ్గించాలి.



 
బాధించే చుండ్రు.. 

అందాన్ని రెట్టింపు చేసే శిరోజాలు అస్తమానం ఊడిపోతుంటే, మీ అందం అడవి కాచిన వెన్నెల అవుతుంది కదూ! దానికి కారణం చండ్రు. తలలో దురద పెట్టి చికాకు పెట్టడం కారణం కావడమే కాకుండా మాటిమాటికీ తలలో చెయ్యి పెట్టడం చూసే వారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దీని కారణంగా చేసే పనిలో ఏకాగ్రత కూడా తగ్గుతుంది.చుండ్రు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్‌, చర్మతత్త్వాలు అంతర్గతంగా ప్రధానపాత్ర వహించే కారణాలు.

dandruff 
వెంటనే తొలగించాలి...
చుండ్రువల్ల జుట్టు బాగా రాలిపోతుంది. బాగా దురద పెడుతుంది. ముఖం, వీపు, మెడలపై పడి చికాకు పుట్టిస్తుంది. ముఖం పై మొటిమలు కావడం, తలనొప్పికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుం ది. చుండ్రుతో పాటు మొఖం పై అవాంఛిత రోమాలు, స్థూలకా యం, రుతుక్రమంలో తేడాలు కనిపిస్తే పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ సిం డ్రోమ్‌ ఉందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాలి. చండ్రుతో తరుచు ఇబ్బంది పడేవారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీ డాండ్రఫ్‌ షాంపూ వాడకాన్ని ఆపేస్తారు. కానీ ఇలా చేయకూడదు.

చుండ్రు నివారణకు...
చుండ్రు తొలగించడానికి పార్లర్లకు వెళ్ళి చికిత్స తీసుకో అవసరం లేదు. ఇంట్లోనే పాటించే అనేక చిట్కాలవల్ల చుండ్రు తగ్గే అవకాశం ఉంది.
- అరకప్పు పెరుగులో రెండు టేబుల్‌ స్పూన్ల పెసరపిండి కలిపి జుట్టుకు పట్టించాలి. ఆరగంటాగి కడిగేయాలి. ఈ విధంగా వారానికోసారి చేస్తుండాలి.
- ఒక టీ స్పూన్‌ నిమ్మపండు రసంలో రెండు టీ స్పూన్‌ల వెనిగర్‌ని కలపాలి, దానితో తలని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
-వెనిగర్‌ రెండు టేబుల్‌స్పూన్లు మాడుకు పట్టించి అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. తేలిగ్గా తలను మసాజ్‌ చేసుకుని కడిగేయాలి.
- మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయాలి. తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకోండి. మసాజ్‌ అయ్యాక ఓ అరగంట తరువాత షవర్‌ బాత్‌ చేస్తే చుండ్రు ఉండదు.
-ఒక మగ్గు నీటిలో ఒక టీ స్పూన్‌ తాజా నిమ్మరసం కలిపి తలస్నా నం అయ్యాక ఈ నీటితో జుట్టు కడుక్కోవాలి. దీనివల్ల చుండ్రు తాలూకు పొట్టు రేగడం తగ్గిపోవడమే కాకుండా జుట్టుకు మెరుపు చేకూరుతుంది.
- సెలీనియా, సలె్ఫైడ్‌ లేదా స్యాలి సిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాం పులను వాడాలి.ఇవి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.
- మలస్సేజియా గ్లోబస్తా అనే ఫం గస్‌ తాలూకు జన్యువు 50,90 శా తంమందికి చర్మంపై పెరుగుతుంది. ఈ జన్యువు చుండ్రు, ఇతర చర్మసంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. వీటిలో సహజీవనం సా గించే కొన్ని జన్యువులు కూడా ఉండ డం వల్ల మలస్సేజియాసెక్స్‌కు అనుకూలంగా ఉంటుందని, దీని వల్ల వీటి విస్తరణకు అవకాశం అధికం గా ఉంటుందని నిపుణులు అం టున్నారు. దీనిని అరికట్టేం దుకు యాంటీ డాండ్రఫ్‌ షాంపూలు ఉపకరిస్తాయి.
-ప్రపంచలో 90 శాతం మంది ప్రజల్ని చుండ్రు బాధిస్తున్నదని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం వారు పది లీటర్ల ఫంగస్‌ను వృద్ధి చేశారు. ఇది కోటిమంది ప్రజల తలపై ఉండే ఫంగస్‌కు సమమైంది.

నిగనిగలాడే జుట్టు కోసం...
హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు సొంతం అవుతుంది.