‘అంతా భ్రాంతియేనా’... అన్నది దేవదాసులోని పాట. అది దేవదాసులకు అక్షరాలా వర్తించే పాట అన్నది నిజం. మద్యం అలవాటున్న డోసుదాసులకు జీవితంలో వెలుగు ఉండదు. మద్యం తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్నది ఒక భ్రమ. పిల్లలకు ఒక స్పూన్ బ్రాందీ తాగిస్తే అజీర్తి ఉండదని, పరిమితంగా తాగితే గుండెకు మంచిదని ఒక అపోహ. వీటితో పాటు మద్యానికి అలవాటు పడి ఒక్కసారిగా మానేయాలనుకున్నా... కొన్ని సమస్యలు. శరీరంపై చీమలు పాకినట్లు, గోడలపై పాములు పాకినట్లు భ్రమలు. ఇలాంటి భ్రాంతులు, భ్రమలు తొలగించి, ‘జీవితాన వెలుగు ఎంతో ఉంద’ని చెప్పేందుకే ఈ కథనం...
అజయ్‌కి నలభై ఏళ్లు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. భార్య, ఇద్దరు పిల్లలు... ఫ్రెండ్స్‌తో మందు పార్టీలో అర్ధరాత్రి దాకా కూర్చున్నాడు. వాహనంపై ఇంటికి బయల్దేరాడు. తను సవ్యంగానే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతనికి అనిపిస్తోంది. కాని అప్పటికే రోడ్డు మీద వచ్చీ పోయే వాహనాల వాళ్లు అజయ్‌ని సరిగ్గా డ్రైవ్ చేయమని హెచ్చరిస్తున్నారు. తను ఇంత బాగా డ్రైవ్ చేస్తుంటే వీళ్లు ఎందుకు అలా అంటున్నారో అనుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు అజయ్. వాహనం కొంతదూరం ప్రయాణించిందో లేదో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అజయ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
సూర్యారావు వయసు అరవై. తనకు ఇరవై ఏళ్ల వయసప్పటి నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. అంటే దాదాపు నలభై ఏళ్లుగా మద్యం తాగుతున్నాడు. కూతురు ‘ఇక తాగొద్దు’ అని తన మీద ఒట్టు వేయించుకోవడంతో సడెన్‌గా తాగుడు మానేశాడు. అన్నాళ్లూ బాగానే ఉన్న సూర్యారావు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తరుముతున్నట్టుగా, చంపబోతున్నట్టుగా ఉలిక్కి పడుతున్నాడు. శరీరంపై చీమలు పాకినట్టుగా ఊరికూరికే చేతులు, పాదాలు గీరుకుంటున్నాడు. సూర్యారావు ప్రవర్తన ఇంటిల్లిపాదీని హడలెత్తిస్తోంది.
ఈ రెండు కేసులను పరిశీలిస్తే ఒకతను మద్యం సేవించిన తర్వాత ‘మత్తులో కూడా తను బాగానే ఉన్నాను కదా!’ అనుకున్నాడు. కాని శరీరం అదుపులో లేదు. ఫలితంగా ప్రమాదం సంభవించింది. రెండో కేసులో దాదాపు నలభై ఏళ్లపాటు రోజూ మద్యం తాగిన వ్యక్తి హఠాత్తుగా వ్యసనాన్ని మానుకోవడంతో అతని శరీరం అదుపు కోల్పోయింది.
అకస్మాత్తుగా మానేస్తే అనేక భ్రాంతులు...
రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునేవారు అకస్మాత్తుగా మానేస్తే ‘ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్’ కనిపిస్తాయి. అందులో భ్రాంతులు ప్రధానమైనవి. ఎవరూ మాట్లాడకపోయినా శబ్దాలు వినిపించడాన్ని ఆడిటరీ హ్యాలూసినేషన్స్ అంటారు. శరీరంపై చీమలు పాకినట్లు అనిపించడాన్ని టాక్టైల్ హ్యాలూసినేషన్స్ అంటారు. ఈ భ్రాంతికి గురయ్యే క్రమాన్ని ఫార్మికేషన్ అంటారు. అంతేకాదు గోడ మీద పాములు, జెర్రులు వంటి హానికరమైన జీవులు పాకినట్లు కనిపిస్తుంటాయి.
దీన్ని విజువల్ హ్యాలూసినేషన్స్ అంటారు. మద్యం తాగి వాహనం నడిపేవారు తామ కదలికలు చురుగ్గానే ఉన్నాయని భావిస్తుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. మద్యం ప్రభావం వల్ల తాము అనుకుంటున్నంత, తమ అంచనాకు తగినట్లుగా వారి కదలికలు ఉండవు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం కూడా మామూలే. అలాగే తమను ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానిస్తుంటారు. తమకు హాని చేయడానికి తలపోస్తున్నట్లుగా భ్రమపడుతుంటారు. ఇలాంటివి జరగక పోయినా జరుగుతున్నట్లు భ్రాంతులకు లోనుకావడాన్ని డెల్యూషన్స్ అంటారు.
గుండె ఆరోగ్యం - మద్యం
రోజూ 30 ఎం.ఎల్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కాని అదే అలవాటు పోను పోను మోతాదును పెంచేలా చేస్తుంది. అందుకని ముందుగానే ఇలాంటి వాటిని దరిచేరనీయకపోవడం మంచిది. గుండె ఆరోగ్యానికి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం, డాక్టర్ సూచనలు పాటిస్తూ ఉండటం అన్ని విధాల మేలు.
జలుబు, దగ్గు - మద్యం
జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. ఇలాంటప్పుడు బ్రాంది తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందని, అవన్నీ తగ్గుతాయనుకోవడం పొరపాటు. వాతావరణంలో మార్పులు, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి ట్రీట్‌మెంట్ బ్రాంది ఎంత మాత్రమూ కాదు. వైద్యులు ఇచ్చిన మందులు, వారి సూచనలు మాత్రమే పనిచేస్తాయి.
మానసిక జబ్బులలో..
మొదటి రెండు పెగ్గులు తీసుకున్నప్పుడు శరీరం చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని మోతాదు పెరిగిన కొద్దీ మెదడు డల్‌గా అయిపోతుంటుంది. నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తనపై తనకు, చుట్టుపక్కల ఏం జరుగుతోందో ధ్యాస ఉండదు. ఆల్కహాల్ ఇన్‌డ్యూస్ డిప్రెషన్, ఇన్‌డ్యూస్ యాంగ్జైటీ డిజార్డర్ వంటి సైకోసిస్ సమస్యలు వస్తాయి.
గర్భవతులు - మద్యం
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పడు బీర్ తాగితే పిల్లలు ఎరగ్రా, తెల్లగా పుడతారని, నార్మల్ డెలివరీ అవుతుందని అనుకుంటారు. కాని అది తప్పు. పిల్లల రంగు ఎప్పుడైనా జెనిటికల్‌గా వస్తుంది. పైగా గర్భవతులు మద్యం తీసుకోవడం వల్ల పిల్లలు శారీరక, మానసిక లోపాలతో పుట్టే అవకాశాలు ఉంటాయి.
యుక్తవయసులో...
పియర్ ప్రెజర్ కారణంగా అంటే ‘స్నేహితులు తాగుతున్నారు కాదా! నేను తాగితే తప్పేంటి?’ అనో, సరదాకో ఫ్రెండ్స్ కోసమో మొదలుపెడుతుంటారు. ఈ అలవాటు సాధారణంగా 20, 25 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కొన్ని రోజులకు మద్యం తీసుకోకపోతే చెమట్లు పట్టడం, చేతులు వణకడం, నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం, అయోమయంగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. దీంతో ఇన్ని రోజుల పాటు రాత్రివేళలలో తీసుకునే మద్యం పగటివేళకూ మారుతుంది. మొదట్లో ఒకటి, రెండు పెగ్గులతో మొదలైన అలవాటు నెమ్మదిగా పెరుగుతూ అధికమోతాదులో తీసుకుంటారు.
బయటపడటానికి...
* టీనేజ్ పిల్లలు ఇంటికి లేటుగా రావడం, దొంగతనం చేయడం, వారి నుంచి మద్యం వాసన రావడం వంటివి గమనిస్తే వదిలేయకుండా నిపుణులచే చికిత్స ఇప్పించాలి.
* ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నష్టాలు, కౌన్సిలింగ్ ద్వారా తెలియజేసి సదరు వ్యక్తిని మోటివేట్ చేయాలి.
* రెగ్యులర్‌గా మద్యం తీసుకునే వ్యక్తి హఠాత్తుగా మానేస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వీళ్లు ఆల్కహాల్ విత్‌డ్రావల్ స్టేట్‌లోకి వెళతారు. చేతులు, కాళ్లు స్వాధీనం తప్పడం, తను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అయోమయంగా ఉండిపోతాడు. అతనికి వారం నుంచి పది రోజుల వరకు నిద్రపోయేందుకు సరిపడా మెడిసిన్ డోసును పెంచుతూ, తగ్గిస్తారు. దీనిని డిటాక్సిఫికేషన్ అంటారు.
* హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి సమాజంలోకి వెళ్లాక, మళ్లీ మద్యం తీసుకోకుండా ఉండటానికి, దానిని అవాయిడ్ చేయడానికి కౌన్సెలింగ్ ఇస్తారు.
* డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు రావడం, మందులు వాడటం చేస్తుంటే పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు.
* ఆల్కహాల్ అనేది ఒక్క వ్యాధి మాత్రమే కాదు. ఇదొక సామాజిక దెయ్యం కూడా. కాబట్టి దీనిని గుర్తించినప్పుడు సిగ్గుపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం.
మద్యం తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చాలామందిలో ఓ అపోహ. కాని మద్యం వంధ్యత్వానికి దారితీస్తుంది. సంతానోత్పత్తి సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.
పిల్లలకు ఒక స్పూన్ బ్రాంది తాగిస్తే అజీర్తి సమస్య ఉండదని కొంతమంది భావిస్తుంటారు. కాని దీని కారణంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచే మద్యం వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. పైగా అది శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

అజయ్‌కి నలభై ఏళ్లు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. భార్య, ఇద్దరు పిల్లలు... ఫ్రెండ్స్‌తో మందు పార్టీలో అర్ధరాత్రి దాకా కూర్చున్నాడు. వాహనంపై ఇంటికి బయల్దేరాడు. తను సవ్యంగానే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతనికి అనిపిస్తోంది. కాని అప్పటికే రోడ్డు మీద వచ్చీ పోయే వాహనాల వాళ్లు అజయ్‌ని సరిగ్గా డ్రైవ్ చేయమని హెచ్చరిస్తున్నారు. తను ఇంత బాగా డ్రైవ్ చేస్తుంటే వీళ్లు ఎందుకు అలా అంటున్నారో అనుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు అజయ్. వాహనం కొంతదూరం ప్రయాణించిందో లేదో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అజయ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.సూర్యారావు వయసు అరవై. తనకు ఇరవై ఏళ్ల వయసప్పటి నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. అంటే దాదాపు నలభై ఏళ్లుగా మద్యం తాగుతున్నాడు. కూతురు ‘ఇక తాగొద్దు’ అని తన మీద ఒట్టు వేయించుకోవడంతో సడెన్‌గా తాగుడు మానేశాడు. అన్నాళ్లూ బాగానే ఉన్న సూర్యారావు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తరుముతున్నట్టుగా, చంపబోతున్నట్టుగా ఉలిక్కి పడుతున్నాడు. శరీరంపై చీమలు పాకినట్టుగా ఊరికూరికే చేతులు, పాదాలు గీరుకుంటున్నాడు. సూర్యారావు ప్రవర్తన ఇంటిల్లిపాదీని హడలెత్తిస్తోంది.
ఈ రెండు కేసులను పరిశీలిస్తే ఒకతను మద్యం సేవించిన తర్వాత ‘మత్తులో కూడా తను బాగానే ఉన్నాను కదా!’ అనుకున్నాడు. కాని శరీరం అదుపులో లేదు. ఫలితంగా ప్రమాదం సంభవించింది. రెండో కేసులో దాదాపు నలభై ఏళ్లపాటు రోజూ మద్యం తాగిన వ్యక్తి హఠాత్తుగా వ్యసనాన్ని మానుకోవడంతో అతని శరీరం అదుపు కోల్పోయింది.
అకస్మాత్తుగా మానేస్తే అనేక భ్రాంతులు...
రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునేవారు అకస్మాత్తుగా మానేస్తే ‘ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్’ కనిపిస్తాయి. అందులో భ్రాంతులు ప్రధానమైనవి. ఎవరూ మాట్లాడకపోయినా శబ్దాలు వినిపించడాన్ని ఆడిటరీ హ్యాలూసినేషన్స్ అంటారు. శరీరంపై చీమలు పాకినట్లు అనిపించడాన్ని టాక్టైల్ హ్యాలూసినేషన్స్ అంటారు. ఈ భ్రాంతికి గురయ్యే క్రమాన్ని ఫార్మికేషన్ అంటారు. అంతేకాదు గోడ మీద పాములు, జెర్రులు వంటి హానికరమైన జీవులు పాకినట్లు కనిపిస్తుంటాయి.
దీన్ని విజువల్ హ్యాలూసినేషన్స్ అంటారు. మద్యం తాగి వాహనం నడిపేవారు తామ కదలికలు చురుగ్గానే ఉన్నాయని భావిస్తుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. మద్యం ప్రభావం వల్ల తాము అనుకుంటున్నంత, తమ అంచనాకు తగినట్లుగా వారి కదలికలు ఉండవు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం కూడా మామూలే. అలాగే తమను ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానిస్తుంటారు. తమకు హాని చేయడానికి తలపోస్తున్నట్లుగా భ్రమపడుతుంటారు. ఇలాంటివి జరగక పోయినా జరుగుతున్నట్లు భ్రాంతులకు లోనుకావడాన్ని డెల్యూషన్స్ అంటారు.
గుండె ఆరోగ్యం - మద్యం
రోజూ 30 ఎం.ఎల్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కాని అదే అలవాటు పోను పోను మోతాదును పెంచేలా చేస్తుంది. అందుకని ముందుగానే ఇలాంటి వాటిని దరిచేరనీయకపోవడం మంచిది. గుండె ఆరోగ్యానికి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం, డాక్టర్ సూచనలు పాటిస్తూ ఉండటం అన్ని విధాల మేలు. జలుబు, దగ్గు - మద్యం
జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. ఇలాంటప్పుడు బ్రాంది తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందని, అవన్నీ తగ్గుతాయనుకోవడం పొరపాటు. వాతావరణంలో మార్పులు, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి ట్రీట్‌మెంట్ బ్రాంది ఎంత మాత్రమూ కాదు. వైద్యులు ఇచ్చిన మందులు, వారి సూచనలు మాత్రమే పనిచేస్తాయి.మానసిక జబ్బులలో..
మొదటి రెండు పెగ్గులు తీసుకున్నప్పుడు శరీరం చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని మోతాదు పెరిగిన కొద్దీ మెదడు డల్‌గా అయిపోతుంటుంది. నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తనపై తనకు, చుట్టుపక్కల ఏం జరుగుతోందో ధ్యాస ఉండదు. ఆల్కహాల్ ఇన్‌డ్యూస్ డిప్రెషన్, ఇన్‌డ్యూస్ యాంగ్జైటీ డిజార్డర్ వంటి సైకోసిస్ సమస్యలు వస్తాయి.గర్భవతులు - మద్యం
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పడు బీర్ తాగితే పిల్లలు ఎరగ్రా, తెల్లగా పుడతారని, నార్మల్ డెలివరీ అవుతుందని అనుకుంటారు. కాని అది తప్పు. పిల్లల రంగు ఎప్పుడైనా జెనిటికల్‌గా వస్తుంది. పైగా గర్భవతులు మద్యం తీసుకోవడం వల్ల పిల్లలు శారీరక, మానసిక లోపాలతో పుట్టే అవకాశాలు ఉంటాయి.యుక్తవయసులో...
పియర్ ప్రెజర్ కారణంగా అంటే ‘స్నేహితులు తాగుతున్నారు కాదా! నేను తాగితే తప్పేంటి?’ అనో, సరదాకో ఫ్రెండ్స్ కోసమో మొదలుపెడుతుంటారు. ఈ అలవాటు సాధారణంగా 20, 25 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కొన్ని రోజులకు మద్యం తీసుకోకపోతే చెమట్లు పట్టడం, చేతులు వణకడం, నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం, అయోమయంగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. దీంతో ఇన్ని రోజుల పాటు రాత్రివేళలలో తీసుకునే మద్యం పగటివేళకూ మారుతుంది. మొదట్లో ఒకటి, రెండు పెగ్గులతో మొదలైన అలవాటు నెమ్మదిగా పెరుగుతూ అధికమోతాదులో తీసుకుంటారు.బయటపడటానికి...
* టీనేజ్ పిల్లలు ఇంటికి లేటుగా రావడం, దొంగతనం చేయడం, వారి నుంచి మద్యం వాసన రావడం వంటివి గమనిస్తే వదిలేయకుండా నిపుణులచే చికిత్స ఇప్పించాలి.
* ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నష్టాలు, కౌన్సిలింగ్ ద్వారా తెలియజేసి సదరు వ్యక్తిని మోటివేట్ చేయాలి.
* రెగ్యులర్‌గా మద్యం తీసుకునే వ్యక్తి హఠాత్తుగా మానేస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వీళ్లు ఆల్కహాల్ విత్‌డ్రావల్ స్టేట్‌లోకి వెళతారు. చేతులు, కాళ్లు స్వాధీనం తప్పడం, తను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అయోమయంగా ఉండిపోతాడు. అతనికి వారం నుంచి పది రోజుల వరకు నిద్రపోయేందుకు సరిపడా మెడిసిన్ డోసును పెంచుతూ, తగ్గిస్తారు. దీనిని డిటాక్సిఫికేషన్ అంటారు.
* హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి సమాజంలోకి వెళ్లాక, మళ్లీ మద్యం తీసుకోకుండా ఉండటానికి, దానిని అవాయిడ్ చేయడానికి కౌన్సెలింగ్ ఇస్తారు.
* డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు రావడం, మందులు వాడటం చేస్తుంటే పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు.
* ఆల్కహాల్ అనేది ఒక్క వ్యాధి మాత్రమే కాదు. ఇదొక సామాజిక దెయ్యం కూడా. కాబట్టి దీనిని గుర్తించినప్పుడు సిగ్గుపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం.
మద్యం తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చాలామందిలో ఓ అపోహ. కాని మద్యం వంధ్యత్వానికి దారితీస్తుంది. సంతానోత్పత్తి సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.
పిల్లలకు ఒక స్పూన్ బ్రాంది తాగిస్తే అజీర్తి సమస్య ఉండదని కొంతమంది భావిస్తుంటారు. కాని దీని కారణంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచే మద్యం వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. పైగా అది శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

నోట్లోకి నీళ్లు వస్తుండటం, ఆహారం ఛాతీపై అంటుకున్నట్లుగా ఉండటం, నోట్లోకి పుల్లటి తేన్పులు వస్తుండటం వంటి లక్షణాలు ఆల్కహాల్ తీసుకునేవారిలో కనిపించే తొలి లక్షణం. మనం తీసుకునే ఆహారం నోట్లోంచి గొంతులోకి అన్నవాహికలోకి రాగానే అన్నవాహిక చివర ఉన్న స్ఫింక్టర్ కారణంగా అన్నకోశం (స్టమక్)లోనే ఉండిపోతుంది. అయితే మద్యం వల్ల ఆ స్ఫింక్టర్ తాను పట్టి ఉంచే సామర్థ్యాన్ని కోల్పోయి రిలాక్స్ అవుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, కడుపులోంచి నోట్లోకి యాసిడ్ వచ్చి పుల్లగా అనిపించడం జరుగుతాయి. దాంతో పాటు చిన్న పేగులు, పెద్ద పేగుల్లోని కదలికలు మందగించవచ్చు. దాంతో తిన్నపదార్థాల కదలిక జరగాల్సినంత వేగంగా జరగక అవసరమైన పోషకాలు అందవు.
కాలేయంలోని కాలేయ కణాల స్థానంలో క్రమంగా కొవ్వు పేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మద్యం తీసుకునేవాళ్లకు వచ్చే వ్యాధుల్లో ఇది తరచూ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాలేయం కొద్దిగా ఉబ్బుతుంది (లివర్ ఎన్‌లార్జిమెంట్). దాంతో పొట్ట పైభాగంలో కుడి వైపున కొద్దిగా ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తుంది.
కాలేయ కణాలు ఒక్కొక్కటీ మరింతగా దెబ్బతినడం వల్ల లివర్‌లో మంటతో కూడిన వాపు (ఆక్యూట్ ఇన్‌ఫ్లమేషన్) రావచ్చు. దాంతో బయటకు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, కామెర్లు వంటివి బయటికి కనిపించే లక్షణాలు. దీంతో పాటు తెల్లరక్తకణాల పెరుగుదల, కాలేయం ఎరబ్రారడం (టెండర్ లివర్), రక్తనాళాలు సాలీడు కాళ్లలా చర్మం కింద ఉబ్బుగా కనిపించడం వంటివి కనిపిస్తాయి. మన శరీరంలోని మిగతా అవయవాల కంటే కాలేయానికి తనను తాను చక్కబరుచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. అందుకే ఈ దశ వచ్చాకనైనా మద్యం మానేస్తే అన్నీ చక్కబడి క్రమంగా కాలేయం మునుపటి ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది.
కాలేయంలోని సాధారణ లివర్ కణజాలం (టిష్యూ) అంతా దెబ్బతిని కేవలం పని చేయని నిష్ర్పయోజనమైన కణజాలం మిగిలిపోయే దశ ఇది. దీన్ని లివర్ సిర్రోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం తన సాధారణ ఆకృతిని కోల్పోతుంది. అంతేకాదు... అది కుంచించుకుపోతుంది. దాంతో పేగుల నుంచి కాలేయానికి వచ్చే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని పోర్టల్ హైపర్‌టెన్షన్ అంటారు. దీని వల్ల ఆహార నాళంలోని రక్తనాళాలు (సిరలు) సైతం ఉబ్బి ఒక్కోసారి అవి చిట్లే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం లేదా మలంలో రక్తం కనిపించవచ్చు. మలంలో రక్త స్రావం కావడం వల్ల మలం నల్లగా వస్తుంది.
శరీరంలోకి ఏవైనా విషపదార్థాలు ప్రవేశించగానే వాటిని విరిచేసి వాటి ప్రభావాన్ని నిర్మూలించే విధులను కాలేయం నిర్వహిస్తుంది. మద్యం ఒక రకమైన విషం (టాక్సిన్) కావడం వల్ల దాన్ని విరిచి వేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పనిలో కాలేయం తాను నిత్యం చేయాల్సిన దానికంటే ఎక్కువగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. ఇక అలవాటుగా మద్యం తాగేవారిలో ఈ విషయాలను విరిచేసే పనిని అదేపనిగా చేస్తుండటం వల్ల కాలేయంపై భారం పడుతుంది. కాలేయంపై పడే దుష్ర్పభావాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి బతికినా జీవితాంతం వైకల్యంతో జీవించాల్సి వచ్చే ప్రమాదం ఎక్కువ.
మద్యం వ్యక్తి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. మద్యపానం ఒక నేరమో, పాపమో కాదు. అది ఒక వ్యాధి. మద్యపానం ఒక వ్యసనంగా మారడం, మొదడులోని రసాయనాల మార్పుల వలన సంభవిస్తుంది. ఈ మార్పులను వైద్యంతో, శాస్ర్తీయ పద్ధతులతో నయం చేయవచ్చు. మద్యానికి బానిసైలన వారిని ద్వేషించడం, దూషించడం చేయకుండా వారిని ఆదరించి తగిన చికిత్స ఇప్పించాలి.
మద్యం కోసం ఒక వ్యక్తి చేసే ఖర్చు రాను రాను పెరుగుతూ వస్తుంది. మద్యానికి బానిసైన వ్యక్తి ముందుగా తను సాధించే దానిలో అధికశాతం మద్యానికే హెచ్చిస్తాడు. తర్వాత మద్యపానం వలన కలిగే వ్యాధులకు చికిత్స కోసం ఖర్చుచేస్తాడు. దీని వల్ల తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఫలితంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మద్యపానం చేసిన వ్యక్తి సంఘంలో గౌరవం కోల్పోతాడు.
* గతంలో మద్యం సేవించే సమయం ...
మద్యం ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిని, గ్రాహణ శక్తిని, ఏకాగ్రతను, విచక్షణను కోల్పోతారు.
రాఘవకు నలభై ఏళ్లు. మంచి వ్యాపారం ఉంది. తల్లిదండ్రులు, భార్యా, ఇద్దరు పిల్లలు అతని కుటుంబం. రాఘవకు ఇరవై ఏళ్లుగా ‘తాగుడు’ అలవాటు ఉంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఇక ముందు ఒక్క చుక్క మద్యం తాగినా బతకడం కష్టం అని వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది కదా! అనుకుని బలహీన క్షణంలో మద్యం తాగాడు. దాంతో ఆరోగ్యపరిస్థితి విషమించి రాఘవ చనిపోయాడు. ఆ కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది.
1940 ముందు వరకు ‘తాగడం’ ఒక వ్యాధిగా గుర్తించలేదు. అమెరికాలోని డాక్టర్ బాబ్, బిజినెస్ మ్యాన్ బిల్ డబ్ల్యూ అనే ఇద్దరూ తాగుడు కారణంగా సర్వం కోల్పోయి చింతలో పడిపోయారు. వారు ఒక చోట కలిసి తమ దుస్థితికి చింతిస్తూ తమను బాగుపరుచుకోవడం కోసం ఏం చేయవచ్చు అని చర్చిస్తూ కూర్చున్నారట. ఆ చర్చ 24 గంటల పాటు సాగిందట. ఎప్పుడూ తాగుడు ధ్యాసలోనే ఉండే వారు ఓ రోజంతా తాగలేదు. మద్యం పట్ల ఉన్న సందేహాలను, సమస్యల గురించి చర్చించుకుంటే ఈ వ్యసనం నుంచి బయట పడటం సులభమే అని అర్థమైందట. తాము పడిన కష్టాలు చెప్పుకుంటుంటే తాగాలని అనిపించకపోవచ్చు. అలా పుట్టిందే ఈ ఆల్కహాలిక్ అనానిమస్ గ్రూపు. అలా ‘ఆల్కహాలిక్ అనానమస్’ పేరుతో ప్రపంచమంతటా సంస్థలు ఏర్పడ్డాయి. ఇలాంటి సంస్థలు అన్నిచోట్లా మద్యం దురలవాటు తగ్గించడానికి కృషి చేస్తున్నాయి.
తాగుబోతు తన బాల్యాన్ని, యవ్వనాన్ని, వయసుని ఆనందంగా అనుభవించలేడు. అలాగే తన పిల్లల బాల్యాన్ని, వారి అభివృద్ధిని కూడా చూసి ఆనందించే స్థితిలో ఉండడు. తన వ్యసనాన్ని గుర్తించి దాని నుంచి బయట పడాలనుకునే వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మనస్తత్వ నిపుణులు కౌన్సెలింగ్, కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్‌ను ఇస్తారు. వాటిని వైద్యుల సూచనల మేరకు వాడుతూ ఉండాలి. అయితే మెడిసిన్స్, ఆల్కహాల్ ఏకకాలంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్, మందులను పేషంట్ మానసిక స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డి-అడిక్షన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ తీసుకొని బయటకు వెళ్లిన వ్యక్తి, తిరిగి వ్యసన పరుడిగా మారకుండా ఉండాలంటే తరచూ డి-అడిక్షన్ సెంటర్‌లకు వెళుతూ, అక్కడి మీటింగ్‌లలో పాలుపంచుకోవాలి. ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలను అవలోకించుకుంటూ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండాలి.
‘జన్మతః వ్యాధిగా ‘తాగుడు’ వ్యసనాన్ని గుర్తించారు వైద్యులు. బిడ్డ ఎదిగిన కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు బయట పడుతుంటాయి’ అంటున్నారు. దీనికి ఇంటి పరిస్థితులు, పరిసరాలు దోహదం చేస్తుంటాయి. అది ఎలా అంటే తల్లిదండ్రులకు చెప్పకుండానే స్కూల్‌కి డుమ్మా కొట్టడం, కాస్త ఎదిగాక కాలేజీ మానేసి సినిమాలకు, షికార్లకు వెళ్లడం జరుగుతుంటుంది. టీనేజ్ దశలో హార్మోన్ల వల్ల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ మార్పులు వస్తుంటాయి. మొండిగా ప్రవర్తిస్తుంటారు. మూడీగా ఉంటాడు. సహనం ఉండదు. ఏ పనినీ సక్రమంగా చేయలేరు. తండ్రికి తాగే అలవాటు ఉంటే ‘నాన్న తాగుతున్నాడు కదా! నేను తాగితే తప్పేంటి’ అనుకుంటారు. దీంతో ఏ పని చేస్తున్నా ‘మద్యం’ తీసుకుంటే బాగుండు అనే ఆలోచన పుట్టుకొస్తుంటుంది. పిల్లవాడిలో చిన్ననాటి నుంచే మార్పు తీసుకురావాలంటే ఈ వ్యసనం పట్ల అవగాహన పేరెంట్స్‌లో తప్పక ఉండాలి.
ఇంట్లో ‘తాగే’ వారు ఉంటే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గు పడతారు. కాని ‘తాగే’ అలవాటున్న వారిలో మార్పు తేవడానికి కుటుంబసభ్యులు మొత్తం సహకరించాల్సి ఉంటుంది. మద్యానికి సంబంధించి అవగాహన ఇంట్లో అందరిలోనూ ఉండాలి. ఇది మందులతో చేసే చికిత్స కాదు, మానసిక చైతన్యంతోనే మార్పు తీసుకురావాలి. తాగిన వారిని తిట్టడం, కొట్టడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదు. ఎందుకంటే తాగేవారిలో మూర్ఖత్వం ఉంటుంది. వారు చేయదలచుకున్నది చేసి తీరాలన్న పట్టుదల ఉంటుంది. అందుకని కుటుంబసభ్యులు కూడా రీహాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరం.
మొదటిసారి మద్యం తీసుకునేటప్పుడు ఒక పెగ్గుతో సరిపెట్టేస్తారు. ఫర్వాలేదు కదా అనే ఆలోచనతో మరోసారి రెండు పెగ్గులు, పోను పోను రోజూ కొంత మోతాదును పెంచుతూ పోతుంటారు. ఇలాంటప్పుడు ఇది ఒక వ్యాధి అని గుర్తించాలి. వ్యసనం ఉన్నవారిలో చాలా తక్కువ మంది మాత్రమే దీని నుంచి బయట పడాలి అనుకుంటారు. మిగతా వారిని మాత్రం వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తెలివిగా వ్యవహరించి ఈ వ్యసనం నుంచి బయటపడేలా చేయాలి. వ్యసనం ఉన్న వ్యక్తి 3-4 నెలల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉండాలి. ‘ఎందుకు తాగుతున్నాను, మద్యం ముందు ఎందుకు బలహీనుడిగా మారాను’ అని ఎవరికి వారు తమ ‘ఆత్మకథ’ రాసుకోవాలి. రోజూ డైరీలో రాసుకోవడం వల్ల సమస్య ఎక్కడ ఉందో సమీక్షించుకోవడానికి వీలవుతుంది.