శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది జీర్ణప్రక్రియకు తోడ్పడే రసాలను ఉత్పత్తి చేస్తుంది. కొందరు అధికంగా బరువు పెరగడం, కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కాలేయం కొవ్వును తొలగించలేకపోతుంది. దీనివల్ల కొవ్వు పదార్థాలు కాలేయంలో నిలువ ఉండిపోతాయి. కాలేయం సాధారణ పరిమాణం కంటే పెద్దగా అవుతుంది. సామర్థ్యం తగ్గిపోతుంది. దీన్నే ఫ్యాటీలివర్ అంటారు. ఇతర సమస్యలకోసం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది.కారణాలు
కాలేయ వ్యాధులకు ప్రధాన కారణం హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్. ఇదే కాకుండా ఆల్కహాల్, దీర్ఘకాలంపాటు మందులు వాడటం, విల్‌సన్స్ డిసీజ్, రోగనిరోధక వ్యవస్థలో కలిగే లోపాలు ఫ్యాటీ లివర్‌కు కారణమవుతాయి. డయాబెటిస్ ఉన్న వారు, స్థూలకాయులు, హైపర్‌ట్రైగ్లిసరిడీమియా, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిర్థారణ పరీక్షలు
కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సి.బి.పి), లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్.ఎఫ్.టి), సి.టి లివర్, యూఎస్‌జి అబ్డామిన్, లివర్ బయాప్సీ, లిపిడ్ ప్రొఫైల్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఆర్‌బిఎస్ పరీక్షలు చేయించడం ద్వారా కాలేయ పనితీరు, వ్యాధులను నిర్ధారించుకోవచ్చు.
చికిత్స
కాలేయ వ్యాధులకు హోమియోలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పరిశీలించి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే వ్యాధి త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.
కార్డస్‌మరైనస్ : ఈ మందు కాలేయం, నరాల మీద మంచి ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండటం, శరీరంలో నీరు పట్టడం, కాలేయం పరిమాణం పెరగడం, ఆకలి మందగించడం, మలబద్ధకం, అర్షమొలలు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ ఔషధం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఛెలిడోనియమ్ : కాలేయం సమస్యలు, తల బరువుగా ఉండటం, తల తిరగడం, కాలేయం వాపు, పచ్చకామెర్లు, పిత్తాశయంలో రాళ్లు, మలబద్ధకం, ఆయాసం, మెడనొప్పి, కుడి భుజంనొప్పి, శరీరం పచ్చరంగులోకి మారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.
సియోనాంతస్ : ఇది కాలేయం, ప్లీహం మీద మంచి ప్రభావం చూపుతుంది. మలేరియా, రక్తహీనత, ప్లీహం వాపు, కుడిపైపు కడుపు నొప్పి, కాలేయ వాపు, నడుం నొప్పి, అర్జంటుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఉపకరిస్తుంది. లైకోపోడియమ్ : కొంచెం ఆహారం తీసుకోగానే కడుపు నిండిన ఫీలింగ్ కలగడం, కాలేయం వద్ద నొప్పి, శరీరంలో నీరు పట్టడం, కాలేయ వాపు, అర్షమొలలు, మలబద్ధకం, ఉత్సాహంగా లేకపోవడం, తీపిపదార్థాలంటే ఇష్టపడుతుండటం, చల్లదనానికి, రాత్రివేళ నొప్పి నుంచి ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలు ఉప యోగించవచ్చు.
కాల్కేరియా కార్బ్ : తెల్లగా, లావుగా ఉండి ఎక్కువ చెమటలు పట్టే తత్వం ఉన్నవారికి మంచి మందు. వంగినపుడు కాలేయం వద్ద నొప్పి, కడుపు ఉబ్బడం, ఇంగ్వైనల్ మీసెంటరిక్ గ్రంథుల వాపు ఉంటుంది. చల్లదనానికి, నిలబడినపుడు ఈ లక్షణాలు ఎక్కువవుతుంటాయి. పొడి వాతావరణంలో నొప్పి ఉన్న వైపు పడుకుంటే ఉపశమనం ఉంటుంది. ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు ఈ మందు వాడవచ్చు.
మెర్క్‌సాల్ : దాహం అధికంగా ఉండటం, జీర్ణశక్తితగ్గడం, కాలేయ వాపు, పచ్చకామెర్లు, రక్తం, జిగురుతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.
మాగ్‌మూర్ : ఇది కాలేయంపైన మంచి ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి లోపించిన మహిళలకు ఇది దివ్యౌషధం. గర్భాశయ సమస్యలతో బాధపడే వారు ఉపయోగించవచ్చు. నాలుకు పచ్చరంగులో ఉండటం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అర్షమొలలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.
నక్స్‌వామికా : తేన్పులు, వికారం, వాంతులు, జీర్ణశక్తిలోపించడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు నక్స్‌వామికా మందు పనిచేస్తుంది.
ఫాస్‌ఫరస్ : ఫ్యాటీ లివర్, పచ్చకామెర్లు, కడుపునొప్పి, ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, మలబద్ధకం వంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు ఉపయోగించదగిన మందు.
నివారణ
* అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
* ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
* కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు.
డాక్టర్ టి. ప్రభాకర్, ఎండి హోమియో
హోమియో కేర్ ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు,
ఫోన్ :955000339, 9550001188
నోట్లోకి నీళ్లు వస్తుండటం, ఆహారం ఛాతీపై అంటుకున్నట్లుగా ఉండటం, నోట్లోకి పుల్లటి తేన్పులు వస్తుండటం వంటి లక్షణాలు ఆల్కహాల్ తీసుకునేవారిలో కనిపించే తొలి లక్షణం. మనం తీసుకునే ఆహారం నోట్లోంచి గొంతులోకి అన్నవాహికలోకి రాగానే అన్నవాహిక చివర ఉన్న స్ఫింక్టర్ కారణంగా అన్నకోశం (స్టమక్)లోనే ఉండిపోతుంది. అయితే మద్యం వల్ల ఆ స్ఫింక్టర్ తాను పట్టి ఉంచే సామర్థ్యాన్ని కోల్పోయి రిలాక్స్ అవుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, కడుపులోంచి నోట్లోకి యాసిడ్ వచ్చి పుల్లగా అనిపించడం జరుగుతాయి. దాంతో పాటు చిన్న పేగులు, పెద్ద పేగుల్లోని కదలికలు మందగించవచ్చు. దాంతో తిన్నపదార్థాల కదలిక జరగాల్సినంత వేగంగా జరగక అవసరమైన పోషకాలు అందవు.
కాలేయంలోని కాలేయ కణాల స్థానంలో క్రమంగా కొవ్వు పేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మద్యం తీసుకునేవాళ్లకు వచ్చే వ్యాధుల్లో ఇది తరచూ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాలేయం కొద్దిగా ఉబ్బుతుంది (లివర్ ఎన్‌లార్జిమెంట్). దాంతో పొట్ట పైభాగంలో కుడి వైపున కొద్దిగా ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తుంది.
కాలేయ కణాలు ఒక్కొక్కటీ మరింతగా దెబ్బతినడం వల్ల లివర్‌లో మంటతో కూడిన వాపు (ఆక్యూట్ ఇన్‌ఫ్లమేషన్) రావచ్చు. దాంతో బయటకు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, కామెర్లు వంటివి బయటికి కనిపించే లక్షణాలు. దీంతో పాటు తెల్లరక్తకణాల పెరుగుదల, కాలేయం ఎరబ్రారడం (టెండర్ లివర్), రక్తనాళాలు సాలీడు కాళ్లలా చర్మం కింద ఉబ్బుగా కనిపించడం వంటివి కనిపిస్తాయి. మన శరీరంలోని మిగతా అవయవాల కంటే కాలేయానికి తనను తాను చక్కబరుచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. అందుకే ఈ దశ వచ్చాకనైనా మద్యం మానేస్తే అన్నీ చక్కబడి క్రమంగా కాలేయం మునుపటి ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది.
కాలేయంలోని సాధారణ లివర్ కణజాలం (టిష్యూ) అంతా దెబ్బతిని కేవలం పని చేయని నిష్ర్పయోజనమైన కణజాలం మిగిలిపోయే దశ ఇది. దీన్ని లివర్ సిర్రోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం తన సాధారణ ఆకృతిని కోల్పోతుంది. అంతేకాదు... అది కుంచించుకుపోతుంది. దాంతో పేగుల నుంచి కాలేయానికి వచ్చే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని పోర్టల్ హైపర్‌టెన్షన్ అంటారు. దీని వల్ల ఆహార నాళంలోని రక్తనాళాలు (సిరలు) సైతం ఉబ్బి ఒక్కోసారి అవి చిట్లే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం లేదా మలంలో రక్తం కనిపించవచ్చు. మలంలో రక్త స్రావం కావడం వల్ల మలం నల్లగా వస్తుంది.
శరీరంలోకి ఏవైనా విషపదార్థాలు ప్రవేశించగానే వాటిని విరిచేసి వాటి ప్రభావాన్ని నిర్మూలించే విధులను కాలేయం నిర్వహిస్తుంది. మద్యం ఒక రకమైన విషం (టాక్సిన్) కావడం వల్ల దాన్ని విరిచి వేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పనిలో కాలేయం తాను నిత్యం చేయాల్సిన దానికంటే ఎక్కువగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. ఇక అలవాటుగా మద్యం తాగేవారిలో ఈ విషయాలను విరిచేసే పనిని అదేపనిగా చేస్తుండటం వల్ల కాలేయంపై భారం పడుతుంది. కాలేయంపై పడే దుష్ర్పభావాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.