
మధుమేహంతో బాధపడుతున్న వారికి తాజాగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 మధుమేహం ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు అధికబరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వస్తున్నది. అమెరికాలో ఈ మేరకు జరిపిన అధ్యయనాల్లో బెంబేలెత్తించే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికాలో టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో 62శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. 20 శాతం మంది మరీ ఎక్కువ బరువైపోయి, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని లయోలా హెల్త్ యూనివర్శిటీ చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్య పెరిగితే భవిష్యత్‌లో పలు చిక్కులు ఎదురవుతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పౌష్టికాహారం తీసుకోక పోవటం, సోడా వినియోగం పెరగటం, వ్యాయామం తగ్గటం వల్ల మధుమేహంతోపాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 7.8శాతం అంటే 2.3 కోట్ల మంది మ«ధుమేహ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇందులో 90శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. తగినంత వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో అక్కడ మధుమేహం సమస్య పెరిగిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆహారపు ఆలవాట్ల విషయంలో అమెరికా బాట పడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలేమో?
మధుమేహంతో బాధపడుతున్న వారికి తాజాగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 మధుమేహం ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు అధికబరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వస్తున్నది. అమెరికాలో ఈ మేరకు జరిపిన అధ్యయనాల్లో బెంబేలెత్తించే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికాలో టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో 62శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. 20 శాతం మంది మరీ ఎక్కువ బరువైపోయి, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని లయోలా హెల్త్ యూనివర్శిటీ చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్య పెరిగితే భవిష్యత్‌లో పలు చిక్కులు ఎదురవుతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పౌష్టికాహారం తీసుకోక పోవటం, సోడా వినియోగం పెరగటం, వ్యాయామం తగ్గటం వల్ల మధుమేహంతోపాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 7.8శాతం అంటే 2.3 కోట్ల మంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇందులో 90శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. తగినంత వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో అక్కడ మధుమేహం సమస్య పెరిగిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆహారపు ఆలవాట్ల విషయంలో అమెరికా బాట పడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలేమో?

షుగర్ మోసుకొచ్చే 'టీవీ'క్షణం
మీరు రోజుకు రెండు నుంచి మూడు గంటలు టెలివిజన్ చూస్తున్నారా? అయితే మీకు పలు రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతీ రోజు టీవీ ఎక్కువగా చూసే వారిలో మధుమేహం టైప్ 2 ముప్పు వచ్చే అవకాశాలు 20శాతం ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఒక్క మధుమేహమే కాదు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 15శాతం అధికంగా ఉంటుంది. టీవీ ఎక్కువగా చూసేవారిలో 13శాతం వివిధ కారణాల వల్ల మృత్యువుకు చేరువ అవుతున్నారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. టీవీ రోజుకు మూడు గంటలు చూస్తున్నారంటే, ఆ సమయంలో తీసుకుంటున్న ఫ్రైడ్ ఆహారపదార్థాలు, తీపి పానీయాలు కొలెస్ట్రాల్, బ్లడ్‌షుగర్‌లను పెంచుతుందని తేలింది. దీనివల్ల ఒబేసిటీ, బీపీ, హైబ్లడ్‌షుగర్ లాంటి సమస్యలు పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. చిప్స్‌లో ఆయిల్, ఉప్పుతో పాటు అధిక కేలరీలు ఉంటాయి. ఇవి తినటం వల్ల వివిధ జబ్బులు వచ్చిపడతాయని యూనివర్శిటీ సదరన్ డెన్మార్క్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
షుగర్ ఉంటే ఇలా తినాలిమధుమేహం ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ పిరమిడ్‌లో సూచించిన విధంగా ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించే వీలుంటుంది. మధుమేహం ఉన్న వారు స్వీట్లు, ఆల్కహాల్ తీసుకోరాదు. తీసుకున్నా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇక పాలు, మాంసాహారాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. ఇక చిరుధాన్యాలు, బ్రెడ్ వంటి పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారిలో, చూపు కోల్పోయే వారిలో - తమకు ఈ దుష్ర్పభావం పడబోతుందన్న విషయం దాదాపు సగానికి మందికి పైగా తెలియనే తెలియదు. ఒక్కోసారి కంటికి చేసే సాధారణ (రొటీన్) పరీక్షల్లో ఈ విషయం బయటపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.
డయాబెటిస్‌తో శరీరంలోని జీవక్రియ (మెటబాలిజమ్) ల్లో మార్పుల వల్ల కొందరిలో కంటిలో త్వరగా క్యాటరాక్ట్ రావచ్చు. దీనివల్ల చూపు స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారిలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ వంటి ప్రక్రియలతో కంటి ముందు ఉంటే లెన్స్ మార్చి కృత్రిమ లెన్స్‌ను అమర్చాల్సి ఉంటుంది.
కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అది కంటి నరం మీద పడటాన్ని గ్లకోమా అంటారు. ఈ ఒత్తిడి వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. యాంటీ గ్లకోమా చుక్కల మందు కంట్లో వేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. అయితే దీన్ని జీవితకాలం వాడాల్సి ఉంటుంది. కొంతమందికి శస్తచ్రికిత్స ద్వారా కూడా గ్లకోమాను నయం చేసే అవకాశాలు ఉంటాయి.
కంటిలో కనిపించే ప్రతిబింబాన్ని ‘ఆప్టిక్ నర్వ్’ మెదడుకు చేరవేయడం వల్లనే మనకు చూపు కనిపిస్తుంటుందన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఈ నరం దెబ్బతినడం వల్ల కంటి చూపు అకస్మాత్తుగా దెబ్బతింటుంది. ఈ నరం దెబ్బతిన్న విషయాన్ని ఫండస్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంటి వైద్యులు, న్యూరోఫిజీషియన్ ఆధ్వర్యంలో చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.
లేజర్ కిరణాల సహాయంతో చేయాల్సిన ఈ చికిత్స వల్ల కంటిలో రక్తస్రావాన్ని తగ్గించడం కొత్తగా ఏర్పడే రక్తనాళాలను నివారించడం సాధ్యమవుతుంది. ఈ చికిత్స ప్రక్రియలో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకసారి చికిత్స చేశాక జీవితకాలం పాటు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్లు చెప్పినవిధంగా మంచి పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కుడా ఉండే ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవడం.
మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. ఈ స్వీట్ ఎనిమీ దరిదాపుల్లోకి రానేవద్దు అనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఈ ఎనిమీతో పోరాడుతున్న వారు దానిమీద పైచేయి సాధించాలంటే ఏం చేయాలి? వీటి మీద సమగ్ర వివరణే ఈ ముందు జాగ్రత్త.
నేషనల్ అర్బన్ డయాబెటిస్ సర్వే 2001లో హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, ముంబయ్, మద్రాస్ నగరాలలో (5288 పురుషులు, 5929 స్ర్తీలపై) మధుమేహుల సంఖ్య ఎంతగా ఉందో తెలుసుకోవడానికి ఓ సర్వే నిర్వహించింది. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో పాతికేళ్లు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య వయసు వారిలో 50శాతం మందికి ఈ వ్యాధి ఉందని తెలిసింది. పదేళ్లతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈ సంఖ్య ఎంతగా పెరిగి ఉంటుందో ఊహించవచ్చు. మధుమేహం లేనివారు నాకు ఈ జబ్బు లేదు కదా! అని నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఏ వయసులోనైనా, ఎవరికైనా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణాలు కనిపెట్టి, తగినంత శ్రద్ధ వహిస్తే ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు.
1. పంటి జబ్బులు: పంటికి-మధుమేహానికి ఏమిటి లింకు? పంటి వ్యాధులు డయాబెటిస్‌కు ఎలా కారణం? అనేదానికి వైద్యపరంగా ఇంకా ఆధారాలు తెలియలేదు. అయితే కనెక్షన్ మాత్రం ఉంది. పంటి(పెరియోడాన్‌టైటిస్) వ్యాధుల బారినపడిన వారందరికీ మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. దంత సంబంధ వ్యాధులు ఉన్నవారిలో డెంటిస్ట్ చేత పళ్లను క్లీన్ చేయించిన తర్వాత టెస్టులు చేస్తే, డయాబెటిస్ రిస్క్ సగానికి సగం తగ్గినట్లుగా పరిశీలనలు చెబుతున్నాయి. అందుకే డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే పంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.
బి) వైరల్ ఇన్ఫెక్షన్లు: చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్... వంటి వైరల్ ఫీవర్ల మూలంగా ప్రతి ఏడాది ఎంతో మంది బాధపడుతున్నారు. వీటి నివారణకు డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే వీటి వల్ల పదే పదే బాధపడేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఈ మధ్యకాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా పనుల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్ట్రెస్ హార్మోన్లు అన్నీ కూడా ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు కార్టిజాల్స్, ఎడ్రిలిన్, థైరాక్సిన్, గ్రోత్‌హార్మోన్... లాంటివి. మనలో కోపం, బాధ, ఉద్వేగం, భయాలకు లోనైనప్పుడు గుండెదడ, మెదడు బండబారిపోవడం, బి.పి పెరగడం లేదా పడిపోవడం, తల భారంగా అనిపించడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. దాదాపుగా డయాబెటిస్ రావడానికి 70 శాతం మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. స్ట్రెస్‌ని మొదట్లోనే ఆధునికవైద్యపరంగా కాకుండా యోగా, మెడిటేషన్, లాఫింగ్, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.
మధుమేహం ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించడంతో పాటు ఇతరత్రా ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ప్రొ॥ పి.వి.రావు
ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనుపిస్తుంటుంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య 50 శాతం తక్కువే అయినప్పటికీ స్థూలకాయం గల మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండడం వల్ల శరీరం ఇన్సులిన్‌కు తగిన రీతిలో స్పందించలేదు. దీని కారణంగా మూత్రంలో మార్పులు సంభవించి, మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయని బోస్టన్‌లో ఉన్న బ్రిస్టన్‌లోని బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఎరిక్ టేలర్ స్పష్టం చేశారు. ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు ఆయన అన్నారు.
అధిక బరువు వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిసెటన్స్ పెరుగుతుంది. దాంతో ఎక్కువ మొత్తాలలో ఇన్సులిన్ ఇంజక్షన్ ద్వారా తీసు కుంటున్నా ఫలితాలు అంతగా ఉండవు. ఇలా అధిక బరువువల్ల మధుమేహంతో బాధపడుతుంటారు. మధుమేహం వ్యాధికాదు కాని డైజెస్టివ్ డిజార్డర్. దీని ప్రభావం క్రమంగా శరీరంలోని మూత్రపిండాలు, కాలేయంతో పాటు నరాలు కూడా దెబ్బతినడం తో నొప్పి తెలియదు. అందుకే సైటెంట్ హార్ట్ ఎటాక్స్ వస్తుంటాయి. బరువు పెరగడం, గుండె పోటుకు మధ్య ప్రత్యక్ష సంబం ధమే ఉంది.బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది. లిపిడ్స్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ లిపిడ్స్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అయిన హెడిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి వీటన్నింటి ప్రభావం బరువు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంది.
గుండెమీద ఎక్కువ రక్తాన్ని పంప్ చేయాల్సిన బాధ్యత పడినప్పుడు ఆ ప్రభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఎందుకంటే గుండె పంప్ చేసిన రక్తమంతా శుభ్రపడడానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి ఊపిరితిత్తులకు చేర్చాల్సి ఉంటుంది. దాంతో గురక లాంటివి ప్రారంభం కావచ్చు. ఇలాగే స్లీప్ అప్నియాలింటి ఇబ్బందులూ కలుగవచ్చు. నిద్రలో గొంతులోకి శ్వాసనాళాలు ముడు చుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిని గుర్తించిన వెంటనే వాళ్లను లేపాలి.నిద్రలేవగానే శ్వాసకండరాలు మాములుగా అవుతాయి. ఇలా స్లీప్ ఆప్నియాలో ఒక రాత్రిలో చాలాసార్లు శ్వాస ఇబ్బంది కలగవచ్చు. మాటిమాటికి వాళ్లని లేపుతుండడంతో నిద్ర చాలక పగలూ కునికి పాట్లు పడే అవకాశం ఎక్కువ. అధిక బరువు వల్ల శ్వాస నాళాలలో ఊపిరితిత్తులో ఎన్నో సమస్యలు రావచ్చు. 
మీరు డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? వాటి నియంత్రణకు రోజూ మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. డయాబెటిస్‌ను, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో మాత్రల కంటే బీన్స్ నయమని వెల్లడయింది..
