Showing posts with label winter. Show all posts
Showing posts with label winter. Show all posts

Tuesday, January 11, 2011

చలికాలం మహ చెడ్డకాలం!

చలి ఎక్కువగా ఉంటోంది కదూ. ఈ సీజన్‌లో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వారి మాటలు విందాం రండి.

* చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.
*మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.
*ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
* మొలకెత్తిన గింజలు ఈ సీజన్‌లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది. పైగా పొట్ట బరువుగా అనిపించదు.
* ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
* నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్‌లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తాయి.
* శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.
*వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.
* వయోధికులు చన్నీటి స్నానాలు వదిలేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది.
* పొద్దుకుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి. కర్టెన్లు కూడా వేసేయడం ద్వారా ఇల్లు లేదా నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవాలి.
* వృద్ధులు, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పని సరి. లేకుంటే చలి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
* పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకొని పడుకోవడం వల్ల చర్మం పాడు కాకుండా ఉంటుంది.
*తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్న వారు చెవులకు తప్పని సరిగా మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పని సరిగా వేసుకొనే బయటకు వెళ్లాలి.

Thursday, January 6, 2011

చలి కాలంలో హాట్ హాట్‌గా...!

"అబ్బా.. పొద్దున్నే లేవాలంటే నావల్ల అయ్యే పనికాదు. చలి చంపేస్తోంది. ఇంకాసేపు పడుకొని లేస్తాలే..'' శీతాకాలం ప్రతి ఇంట్లో పొద్దున్నే కనిపించే సన్నివేశమే ఇది. బద్దకంగా ఒళ్లు విరుచుకునే ప్రతి ఉదయం.. చాలా డల్‌గా నడిచిపోతుంది. ఆ డల్‌నెస్‌ను తరిమేసి, హుషారు రాజేయాలంటే ఏం చేయాలి..? శరీరంలో వెచ్చదనాన్ని నింపాలి. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..

* శీతాకాలంలో శరీరానికి వేడి చాలా అవసరం. ఎనర్జీ.. హీట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్నే థర్మిక్ ఎఫెక్ట్ అంటాం. ప్రొటీన్లు అధికంగా కలిగిన ఆహారపదార్థాలకు ఈ గుణం ఎక్కువ.
* పొద్దున్నే లేవగానే తాజా అల్లం ముక్క వేసుకుని కాచిన టీ తాగాలి. కాఫీకంటే ఇదే బెటర్. లేదంటే, బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకోవచ్చు. వేడి వేడి సూప్ కూడా తాగొచ్చు. బయట దొరికే రెడీమెడ్ సూప్‌కంటే ఇంట్లో తాజా కూరగాయలతో చేసుకున్న సూప్‌తోనే ఎక్కువ ప్రయోజనం.
* ఈ సీజన్‌లో శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోయే అవకాశం ఎక్కువ. అధిక బరువు పెరగడానికీ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. దీన్ని అధిగమించాలంటే సమయానికి తిండి తినాలి. రోజులో ఒకేసారి కాకుండా మూడు నాలుగుసార్లు తింటే బెటర్.
* చలికాలంలోనూ వ్యాయామం తప్పనిసరి. ఎంత కష్టమైనా పొద్దున్నే వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా వాయిదా వేయవద్దు. వ్యాయామంతోనే శరీరంలో సహజమైన వేడి పుడుతుంది. నాడీమండలాన్ని చురుగ్గా ఉంచుతుంది. రక్తప్రసరణ స్వేచ్ఛగా సాగుతుంది.
* పొద్దున్నే లేస్తూనే బిస్కెట్లు, టీ కలిపి తీసుకోవడం చాలామందికి అలవాటు. బిస్కెట్లు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. నిద్రలేచిన 15 నిమిషాల్లో ఏదో ఒక ఆహారపదార్థం కొద్దిగానైనా తీసుకోవాలి. వీలుకాకపోతే కనీసం ఒక అరటిపండైనా తినాలి.
* చాలామంది రాత్రి మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి పొద్దున్నే వేడిచేసుకుని తింటుంటారు. చలికాలంలో దీనికి స్వస్తి చెప్పండి. అప్పటికప్పుడు వేడిగా వండుకుని తినండి.
* పొద్దున, రాత్రి పాలు తాగేవారు అందులో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే మంచిది. మిరియాలకు వేడి చేసే స్వభావం అధికం. వీటివల్ల దగ్గు, కఫం సమస్యలు తొలగుతాయి.
* వంటల్లో తరచూ అల్లం, మిరియాలు, యాలకులు, లవంగాలు, నువ్వులు వేసుకోవాలి. మసాలా దినుసులు మోతాదుకు మించకుండా వాడాలి.
* నాడీవ్యవస్థ సాఫీగా పనిచేసేందుకు ఫోలిక్ యాసిడ్, ఐరన్ అవసరం. దీనికోసం పచ్చరంగు కలిగిన ఆకుకూరలు, కూరగాయలు తినాలి. చిక్కుడు, బీన్స్, బీరకాయ, పొట్లకాయ తినొచ్చు. ఆకుపచ్చని కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* ఆకుకూరల్లో శ్రేష్టమైనది, చలికాలంలో అవసరమైనది మునగాకు. మునగాకును ఉడికించి పప్పుతో కలిపి తీసుకోవచ్చు. మెంతికూర, పాలకూర, తోటకూర కూడా కూరల్లో వేసుకోవచ్చు. ఆకుకూరలు తింటే చర్మం పొడిబారడం తగ్గుతుంది.

* చలికాలంలో నూనె పదార్థాలను తగ్గించాలి. ఆకుకూరలు, చేపలు, చికెన్ అధిక మసాలాలతో వండకూడదు. ఉడికించి కూర చేసుకుని తింటేనే శరీరానికి ఉపయోగం. లేదంటే మలబద్ధకం ఏర్పడుతుంది.

* చలికాలంలో శరీరానికి ప్రొటీన్లు కూడా ఎంతో అవసరం. ఉదయాన్నే ఉడికించిన కోడిగుడ్డు, చేపలు, చికెన్, పప్పుదినుసులు, సలాడ్స్ తినండి.
* చలికాలంలో విటమిన్-సి, ఎ కొరత ఏర్పడుతుంది. వీటి కోసం నారింజ, బొప్పాయి, జామకాయలు, క్యారెట్ తినాలి.
* చలికాలంలో దాహం అవదు. అందువల్ల నీరు ఎక్కువ తాగరు. దీనివల్ల అనారోగ్యం తప్పదు. ద్రవ పదార్థాలను తీసుకున్నా, నీటిని మాత్రం పుష్కలంగా తాగాలి.
* రాత్రిపూట పడుకునే ముందు సూప్, పండ్లు, చపాతీ వంటివి తీసుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు రాత్రిపూట అన్నం తక్కువ తినాలి. మాంసాహారం జోలికి పోకపోతేనే మంచిది.

Tuesday, January 4, 2011

శీతాకాలంలోనే కాదు .... ఏ కాలమైనా కోమలమే..

శీతాకాలంలోనే కాదు సంవత్సరం అంతా పాదాలను అందంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సిందే. మన శరీరంతో పాటు చర్మాన్ని చలికాలంలో చిట్లకుండా చూసుకోవాలంటే కొన్ని రకాలైన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా చేతులు, పాదాల విషయంలో మరీ జాగ్రత్త వహించాలి.పాదాలు, చేతి వేళ్ళ సంరక్షణకోసం మెనిక్యూర్‌, పెడిక్యూర్‌లను ఆశ్రయించడం మనకు తెలిసిందే. దీనికోసం మహిళలు ఎక్కువగా బ్యూటీపార్లర్‌లను ఆశ్రయిస్తుంటారు. దానికోసం ఎంతో ఖర్చుచేస్తారు. అయితే, ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల పాదాలు, చేతులను అందంగా మలచుకోవచ్చు.

పాదాలు సంరక్షణకు:
footదుమ్ము, ధూళివల్ల పాదాలు మురికిగా కనుపిస్తాయి. వాటిని శుభ్రం చేసుకోవడానకి గోరువెచ్చని నీటిని ఒక బేసిన్‌లో తీసుకొని, ఎప్సాన్‌ ఉప్పు, బాడీ వాష్‌కు సంబంధించిన సోప్‌ క్రీమ్‌ను మిశ్రమంగా కలుపుకొని అందులో పాదాలను పదినిమిషాలసేపు ఉంచాలి.ఫ్యూమిస్‌ స్టోన్‌ తీసుకొని చర్మాన్ని బాగా రుద్దాలి.ఆరేంజ్‌ స్టిక్‌ను తీసుకొని కాలి గోళ్ళ మధ్య ఉన్న మట్టిని తొలగించాలి. అంతేకాకుండా గోళ్ళను కూడా పాలిష్‌ చేసుకోవాలి. సుతిమెత్తని పాదాలు ఎల్లప్పుడూ అందంగా కనపడాలంటే... నెలకొకసారైనా ఇలాంటి టిప్స్‌ని ఇంట్లో ఉండే చేసుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గడంతో పాటు అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.

చేతుల సంరక్షణకు:
మన శరీరంలో ఎక్కువగా పనిచేసేవి చేతులే... అందుకోసం చేతుల విషయంలో... మరీ ముఖ్యంగా గోళ్ళ విషయంలో శ్రద్ధ వహించకపోతే... అంద వికారంగా తయరవుతాయి.పెడిక్యూర్‌లాగానే...మేనిక్యూర్‌ను కూడా ఇంట్లో కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటించి అందంగా మలచుకోవచ్చు.గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో చేతులను ఉంచి, ఆరెంజ్‌ వుడ్‌ స్టిక్‌తో గోళ్ళను శుభ్రపరుచుకోవాలి. కాళ్ళ కన్నా చేతులపై మనం ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఫ్యూమస్‌ స్టోన్‌పై చేతులను ఉంచి బాగా రుద్దా లి. అంతేకాకుండా ఎవరికి ఇష్టమైన సోప్‌ క్రీమ్‌ను వాడుకొని మరింతగా రుద్దుకోవడం ద్వారా చేతులను మరింత అందంగా మలచుకోవచ్చు.

కాలంతో పనిలేదు...
పాదాలను ఎండాకాలంలోనే సంరక్షించుకోవాలనే రూలేంలేదు. అన్ని కాలాల్లోనూ శ్రద్ధతీసుకున్నప్పుడే అవి అందంగా తయారవుతాయి. అందుకోసం ఇంట్లోనే తయారుచేసుకునే పదార్ధాలతోపాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి ఒక అరగంట సమయం మీ పాదాలకోసం కేటాయిసే ్తచాలు అందమైనా పాదాలు మీసొంతం.

స్మూత్‌గా తయారవుతుంది...

feet 
ఒక ప్లాస్టిక్‌ బౌల్‌లో గోరువెచ్చని నీటిలో సాఫ్ట్‌నెస్‌ కోసం కొన్ని చుక్కల ‘చామోమైల్‌’ ఆయిల్‌ వేయాలి.తరువాత పాదాలను అందులో పదినిమిషాల పాటు అందులో ఉంచాలి. తరువాత తీసి టవల్‌తో తుడిచేస్తేచాలు మీ పాదాలు ఎంతో నునుపుగా తయా రవుతాయి.ప్యూమిస్‌ స్టోన్‌ను నీటిలో ఒక నిమిషం పాటు ఉంచి ఆ రాయి తో పాదాల చర్మాన్ని సున్నితంగా రు ద్దాలి. అప్పుడు చర్మంపై ఉండే మృత కణాలు పోయి సాఫ్ట్‌ అండ్‌ స్మూత్‌ గా తయారవుతాయి. మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌గానీ, ఆయిల్‌తో గానీ మీ పాదా లకు మర్దనా చేసుకుంటే మీ పాదాల కు విశ్రాంతి కలుగుతుంది. అంతేకా కుండా తిరిగి ఉత్తేజంగా తయార వుతుంది.

అపుడే అందం వస్తుంది ...
మీరు కాలిగోళ్లకు పాలిష్‌ వేయాలను కున్నప్పుడు ముందుగా గోరును శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం నెయిల్‌పాలిష్‌ రియూవర్‌ను ఉప యోగించవచ్చు. రిమూవర్‌ను ఉప యోగించిన తరువాత టవల్‌తో పూర్తిగా శుభ్రపరిచిన తరువాతే పాలి ష్‌ వేసుకోవాలి. అప్పుడే అందం వస్తుంది. పాలిష్‌ను ఎట్టి పరిస్థితు ల్లోనూ చర్మానికి తాకకుండా చూసు కోవాలి.

Friday, December 24, 2010

స్మూత్ వింటర్!

చలికాలం వస్తే చాలు... మరో భయమూ గడగడలాడించేస్తుంది.
ఇది చలి వల్ల వచ్చే వణుకు కాదు...
చర్మానికి కలిగే హానిని తలచుకుని ఈ ఆందోళన.
మామూలు టైమ్‌లో ఉండే మెరుపు తగ్గిపోయి చర్మం నిస్తేజంగా మారుతుంది.
బాగా పొడిబారిపోయి కాస్త గోరు గీరుకున్నా చారికలు పడిపోయి అసహ్యంగా కనిపిస్తుంది. ‘వింటర్’తో పాటు వచ్చే చర్మ సమస్యలకు ‘స్మూత్’ పరిష్కారమే ఈ ముందుజాగ్రత్త.


చలికాలంలో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. దానికి తోడు చల్లటిగాలులు. అందువల్ల చర్మంలోని తేమ, సహజసిద్ధమైన నూనెలు తగ్గిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారి, దురద మొదలవుతుంది. మంటపుడుతుంది. గీరితే పొట్టు రాలుతుంది. చలికాలంలో ఈ సమస్య అందరికీ వస్తుంది. కాకపోతే ఇప్పటికే చర్మ సమస్యలు ఉన్నవాళ్లకి, కొన్ని రకాల మందులు వాడుతున్నవారికి ఎక్కువ. పెదవులు కూడా త్వరగా పొడిబారి, పగులుతూ ఉంటాయి. అజాగ్రత్త చేస్తే ఒక్కోసారి రక్తం కూడా వస్తుంటుంది. ఈకాలంలో జుట్టు కూడా పొడిబారి, కాంతి తగ్గి, బలహీనపడి, ఎక్కువగా ఊడుతుంటుంది.


వింటర్ ఎగ్జియోరోసిస్: ఈ సమస్య చేతులకి, కాళ్లకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. చర్మం బాగా పొడిబారి, దురద మొదలవుతుంది. వీళ్లు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడాలి.

ట్యానింగ్: చలిగా ఉంది కదా! అని ఎక్కువసేపు ఎండలోనే ఉండటం వల్ల పొడిబారిన చర్మం కమిలిపోతుంది.

అటోపిక్ డెర్మటైటిస్: ఈ స్కిన్ డిసీజ్ ఏడాది లోపు పిల్లల్లో బుగ్గలు, చేతులు, కాళ్ల మీద మొదలవుతుంది. చర్మం ఎరగ్రా, పొడిబారి దురద వస్తుంది. తరచూ ముక్కుకారడం, డస్ట్ అలెర్జీ, ఆస్తమాసమస్యలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఎగ్జిమా శరీరమంతా స్ప్రెడ్ అయిఎరిథ్రోడెర్మస్‌గా మారుతుంది. వీరు డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం అవసరం.

సోరియాసిస్: 30 -40 ఏళ్ల మధ్య వయస్కులు, వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువ. మోకాళ్లు, మోచేతులు, వీపు మీద ఎరన్రి ప్యాచెస్ వస్తుంటాయి. చర్మం మందంగా మారి, పొట్టు రాలుతూ ఉంటుంది. తలలో కూడా తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. గోళ్లు, కీళ్ల సమస్యలు ఉంటాయి.

రోసాసియ: ఈ చర్మ సమస్య ఉన్నవాళ్లకు బుగ్గలు, ముక్కు, తల ముందుభాగం మీద ఎరగ్రా కందిపోయి ఉంటుంది. ఇది యాక్నెనా, పింపులా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఆల్కహాల్, మసాలాలు ఎక్కువ తీసుకునేవాళ్లకు వస్తుంది.

యాక్నె, పింపుల్స్: చలికాలంలో చర్మం పొడిబారి మృతకణాలు పెరుగుతాయి. ఇవి చర్మం రంధ్రాలని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియా ఆకర్షించి మొటిమలు ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది.

ఆస్టియోటిక్ ఎగ్జిమా: ఈ సమస్య వృద్ధులకు వస్తుంది. పొలం ఎండి బీటలు వారినట్టు చర్మం కూడా అలా కనిపిస్తుంటుంది.

కాగ్నైటల్ డిజార్డర్
ఈ సమస్య పుట్టుకతోనే మొదలవుతుంది. చర్మం అంతా పొడిబారి చేపల పొలుసుల్లాగ ఊడిపోతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి చాలా సివియర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఈ పిల్లలకు పుట్టిన దగ్గర నుంచే చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.
అభ్యంగన స్నానంతో అందం, ఆరోగ్యం...
శీతల వాతావరణంలో చర్మానికి లభించే రక్తప్రసరణ మందగిస్తుంది. అందువల్ల చర్మానికి కావలసిన పోషకపదార్థాలు తక్కువవుతాయి. ఫలితంగా చర్మం పొడి బారుతుంది. అలెర్జ్జీలు, ఎగ్జిమాలు సునాయాసంగా వస్తుంటాయి. అనంతరం ఇన్‌ఫెక్షన్లు ఆవహిస్తాయి.
చర్మ ఆరోగ్య సూత్రాలు: రోజూ ఉదయం పూట కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. రోజు మొత్తంలో 4-5 లీటర్ల నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం.

తగినంత వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి చెమట వచ్చేట్టు చేయాలి. తలకు కూడా చెమట పడితే వ్యాయామం పూర్తిగా చేసినదానికి చిహ్నం.
అభ్యంగనం: ఇది చర్మానికి చేసే తైలమర్దనం. నువ్వుల నూనె లేదా ఆవనూనె మర్దనాకు మంచిది. ఆ తర్వాత నలుగు కోసం సున్నిపిండి వాడాలి. పెసరపిండి నాలుగుపాళ్లు, వరిపిండి ఒకపాలు తీసుకొని తగినన్ని నీళ్లలో కలిపి ముద్దగా చేయాలి. పెసరపిండికి బదులు శనగపిండిని కూడా వాడుకోవచ్చు.
స్వేదకర్మ: వేడినీటి ఆవిరితో శరీరానికి చెమట పట్టేట్టు చేయాలి. దీనినే స్టీమ్ బాత్ అంటారు. పావుగంట పాటు ప్రభాత సూర్యకిరణాలు తాకేట్టు ఎండలో కూర్చుంటే మంచిది.

ఔషధాలు: పసుపు, బావంచాలు, అగరు (మొక్క బెరడులోని చేవ) ద్రవ్యాలను సమపాళ్లలో మెత్తగా పొడి చేసి నలుగుకు వాడితే చాలా మంచిది.
ముస్తా (తుంగముస్తలు), కరక్కాయ, మంజిష్ఠ ద్రవ్యాలు కలిపి నలుగుకు వాడుకోవచ్చు.

బొప్పాయి పండు ముద్ద, క్యారట్, కీరా గుజ్జు, పాల మీగడలలో ఏదైనా ఒకదానిలో కొంచెం నిమ్మరసం కలిపి చర్మంపై లేపనం చేస్తే నల్లని, గోధుమరంగు మచ్చలు తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ముడతలు కూడా తగ్గుతాయి.

రోజూ రాత్రి పది గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని నీళ్లలో కలిపి తాగితే మృదువుగా విరేచనం అవటమే కాకుండా, చర్మపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను త్రిఫలాలు అంటారు.

శారిబాద్యాసవ/ ఖదిరారిష్ట/ మహామంజిష్టాది: ఈ మూడు ద్రావకాలలో ఏదైనా ఒకటి నాలుగు చెంచాలు తీసుకొని సమానంగా నీళ్లు కలిపి, రెండు పూటలా తాగితే, రక్తం శుద్ధి అవుతుంది. ఫలితంగా చాలా చర్మ రోగాలకు నివారణగా పనిచేస్తుంది.

కుంకుమపువ్వు (శాఫ్రన్):
దీనితో చేసిన నూనె పై పూతకి మంచిది. 200 మి.గ్రా కుంకుమ పువ్వును గ్లాసు పాలతో కలిపి తాగితే చర్మకాంతి మెరుగవుతుంది.

ఆహారం: పులుపు, ఉప్పు, కారాలు తగ్గించాలి. ఆకుకూరలు, మునక్కాయ, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. రోజూ ఒక ఉసిరికాయ తినటం శ్రేష్ఠం.

గమనిక:
అలెర్జీ కలిగించే ఆహారపదార్థాలు తీసుకోకూడదు. అలాగే కొన్ని రసాయనక్రిములు, ఔషధాలు, వేడి ఎక్కువగా ఉన్న సూర్యరశ్మి, సబ్బులకు దూరంగా ఉండటం వల్ల చర్మానికి కలిగే హానిని నివారించుకోవచ్చు.


చలికాలం - చర్మ జాగ్రత్తలు

స్నానం చేసే అరగంట ముందు ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో శరీరానికి మసాజ్ చేసుకోవాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడాలి. చర్మ సమస్యలు ఉన్నవారు స్నానం చేసే నీటిలో 10 చుక్కలు నూనె వేసుకొని చేస్తే ఇంకా మంచిది.

స్నానం చేసి, తడి తుడుచుకున్న వెంటనే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఈ క్రీమ్ రోజుకు 3- 4 సార్లు వాడితే మంచిది.

చలికాలంలో కొందరు స్నానానికి చాలా వేడి నీళ్లు వాడతారు. వేడినీళ్లు చర్మంలో ఉన్న సహజసిద్ధమైన నూనెలను తీసేసి, ఇంకా పొడి చేస్తుంది. అందుకని స్నానానికి ఎక్కువ వేడినీళ్లు వాడకూడదు.

సమతుల ఆహారం చర్మాన్ని పొడిబారనివ్వదు. రోజూ ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పకుండా తీసుకోవాలి. నీళ్లు తక్కువగా తీసుకుంటే చర్మం త్వరగా పొడిబారుతుంది.

బయట ఎక్కువగా తిరిగేవాళ్లు ముఖానికి చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ట్యానింగ్ సమస్య ఎక్కువ.

ముఖానికి క్లెన్సర్లు ఈ కాలంలో వాడకూడదు. ఇవి చర్మాన్ని ఇంకా పొడిబారేలా చేస్తాయి.

పాదాలకు, చేతులకు కాటన్ గ్లౌజ్ వేసుకుంటే వెచ్చగా ఉండి, ఎక్కువ పొడిబారనివ్వవు.

తల స్నానానికి 2 గంటల ముందు మాడుకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడి జట్టు వాళ్లయితే షాంపూ ఉపయోగించిన తర్వాత కండిషనర్ వాడాల్సి ఉంటుంది.

జుట్టు తడి ఆరబెట్టడానికి ఈ కాలంలో బ్లో డ్రయ్యర్లు వాడకూడదు. ఇవి జుట్టుకు మరింత హాని చేస్తాయి. బయటకు వెళితే జుట్టును సిల్క్ స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవడం మంచిది.

శిరోజాలకు కలరింగ్‌లు, ఐరనింగ్‌లు చేయించుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల జుట్టులోని తేమ తగ్గి వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతాయి.

పెదాలు:  పెట్రోలియమ్ జెల్లీ లేదా లిప్ బామ్‌ని తరచూ పెదాలపై రాస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు తరచూ వెన్న రాసుకుంటే మంచిది.