ఆరోగ్య సంరక్షణకు సూక్ష్మ క్రియలు అధికంగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని మాలిన్యాన్ని తొలగించి, ఆయా అవయవాలకు వ్యాయామం కలుగజేసి, వాటి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ సూక్ష్మ యోగ క్రియలను క్రింద కూర్చుని చేయాల్సి ఉంటుంది. క్రింద కూర్చోలేని వారు కుర్చీ మీద గాని లేక మంచం మీదగాని కూర్చొని చేయవచ్చు. కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయవచ్చు. ఈ క్రియలు ఉదరం మీద ప్రభావాన్ని చూపుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత వెంటనే చేయకూడదు. సూక్ష్మయోగ క్రియా ఏ అవయవానికి సంబంధించిందో ఆ అవయవం మీద మనస్సును కేంద్రీకరించడం అవసరం. ప్రతి క్రియ 30 నుంచి 60 సెకన్లు వరకు శక్తిని బట్టి చేయాల్సి ఉంటుంది.
యోగ ప్రార్థన క్రియ...
కూర్చొని రెండు చేతులు జోడించి, నమస్కారం చేస్తూ యోగ ప్రార్థన చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు శ్వాస వదలాలి.
ప్రార్థన క్రియ వలన మనస్సుకు చంచలత్వం పోయి, స్థిరత్వం వస్తుంది. మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. హృదయ శుద్ధి కలుగుతుంది.
భస్ర్తిక క్రియ...
భస్ర్తిక క్రియలు నాలుగు రకాలు. ఇవి శ్వాస, ప్రశ్వాసల ద్వారా శరీర అవయవాలకు శుద్ధి కలిగించే క్రియలు. రెండు ముక్కుల ద్వారా వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి. ఇది భస్త్రిక క్రియ. కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని త్వర త్వరగా వదలాలి, పీల్చాలి.ఇది చంద్రాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం మూసి, కుడి ముక్కురంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సూర్యాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సుషుమ్నా భస్ర్తిక. పై క్రియల వల్ల శరీరంలోని మాలిన్యం పోతుంది. వివిధ అవయవాలకు శుద్ధి కలిగి, వాటికి చైతన్యం కలుగుతుంది.
శిరస్సుకు...
ప్రతి క్రియ 30 సెకన్‌లతో ప్రారంభించి, 60 సెకన్ల వరకు చేయాల్సి ఉంటుంది. ఈ క్రియలు చేస్తున్నప్పుడు గాలిని కంఠం దాటి, లోనికి పోనీయకూడదు. ఇందులో పలు క్రియలున్నాయి.
ఎ. కంఠశుద్ధి: కంఠశుద్ధి కోసం శిరస్సును తిన్నగా ఉంచి, ఎదురుగా చూస్తూ, శ్వాసను వేగంగా వదలాలి, పీల్చాలి.
బి. ఆత్మశుద్ధి వృద్ధి: ఆత్మశక్తిని పెంచేందుకు, భయం పోయేదానికి, శిరస్సును ఎత్తి, శిరస్సు వెనకుక వైపున గల శిఖాభాగం మీద మనస్సును కేంద్రీకరించి, వేగంగా శ్వాస పీల్చాలి, వదలాలి.
సి. జ్ఞాపక శక్తి వికాసం: జ్ఞాపకం లేదా స్మరణ శక్తిని పెంచేందుకు శిరస్సును సగం వంచి, వేగంగా శ్వాస వదలాలి. మనస్సును మాడు మీద కేంద్రీకరించాలి.
డి. మేధాశక్తి వికాసం: వెన్నెముకపై, మెడ కింద, భృకుటిపై మేధాశక్తిని పెంచడానికి శిరస్సును పూర్తిగా వంచి, కళ్లు మూసుకుని వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి.
టెన్షన్ తగ్గించే క్రియలు...
టెన్షన్ తగ్గాలంటే, కనుబొమలు పైకెత్తి, నుదురుపై ముడుతలు పడేట్లు చేసి, ఐదు సెకన్లు అలాగే ఉండాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. శ్వాస సాధారణంగా ఉండాలి.
నేత్రశక్తి క్రియలు...
ఇవి మూడు రకాలు. అవి: 1. నేత్ర శాంతి కోసం చేసే క్రియలు, 2. నేత్ర శక్తి కోసం చేసే క్రియలు, 3. నేత్ర చంచలత్వాన్ని తగ్గించేందుకు చేసే క్రియలు. ఈ క్రియల్లో తలను కదపకూడదు. కళ్లను మాత్రమే తిప్పాలి. మనస్సును ఏకాగ్రత చేయడం అవసరం.
కళ్లకు శాంతిని కలిగించే క్రియలు...
ఇవి కనుగుడ్లను వేగంగా తిప్పే క్రియలు. రెండు చేతులు తిన్నగా ముం దుకు చాచి, పిడికిలి బిగించి, బొటనవేళ్లను నిలిపి రెండు ళ్లతో ఎడమ బొటనవేలిని, కుడి బొటనవేలిని వేగంగా చూడాలి. తర్వాత కుడి చేయి కుడివైపు ఉంచి, ఎడమ చేతిని, ఎడమవైపు కిందికి దింపి, పైబొటన వేలిని, కింది బొటన వేలిని వేగంగా చూడాలి. తర్వాత ఎడమ చేయి పైకి ఎడమవైపు ఉంచి, కుడి చేయి కిందికి కుడివైపుకు దింపి, రెండు బొటన వేళ్లను పైకి, కిందకు వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని పైకి, మరో బొటన వేలిని కిందికి ఉంచి, వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని భ్రుకుటికి ఎదురుగా ముక్కుకొసకు దగ్గరగా ఉంచి, మరో బొటనవేలిని ముందుకు చాచి, రెండింటిని ఒక దాని తర్వాత మరొక దాన్ని త్వరత్వరగా చూడాలి.
అనంతరం కుడిచేతిని తిన్నగా పక్కకు చాచి, బొటనవేలిని చూస్తూ, చేతిని గుం డ్రంగా పెద్ద సర్కిల్‌లో వేగంగా తిప్పాలి. మోచేతిని వంచకూడదు. ఎడమచేతిని కూడా తిన్నగా పక్కకు చాచి పైవిధంగా చేయాలి. రెండు రెప్పలను వేగంగా మూయాలి, తెరవాలి. పై క్రియలు పూర్తయిన వెంటనే రెండు అరచేతులు కలిపి బాగా రుద్దాలి. కొద్దిసేపుటికి వేడి కలుగుతుంది. రెండు కళ్లమీద రెండు అరచేతులను ఉంచాలి.


‘తలనొప్పి వచ్చినట్టుగా అనిపించగానే, బ్రెయిన్ ట్యూమర్ అయి ఉంటుందా?’ అనే అనుమానం తొలుస్తుంది. ‘ఛాతిలో నొప్పి, అమ్మో! ఇది డెఫినెట్‌గా గుండెజబ్బే..,’ ‘నడుం నొప్పి, బాబోయ్! కిడ్నీలు ఫెయిల్ అయ్యాయేమో,’ కడుపులో నొప్పి, క్యాన్సర్ కాదు కదా!...’ చిన్న చిన్న అనారోగ్యసమస్యలకు అనుమానం వల్ల పెద్ద పెద్ద జబ్బులను అంటగట్టుకొని భయపడుతుంటారు. ఎదుటివారు ‘అలా అయి ఉండదులే’ అంటే, మీకేం తెలుసు, దేనినైనా ‘కీడెంచి మేలెంచు’ అన్నారు పెద్దలు అంటుంటారు.
అజయ్‌కి నలభై ఏళ్లు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. భార్య, ఇద్దరు పిల్లలు... ఫ్రెండ్స్‌తో మందు పార్టీలో అర్ధరాత్రి దాకా కూర్చున్నాడు. వాహనంపై ఇంటికి బయల్దేరాడు. తను సవ్యంగానే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతనికి అనిపిస్తోంది. కాని అప్పటికే రోడ్డు మీద వచ్చీ పోయే వాహనాల వాళ్లు అజయ్‌ని సరిగ్గా డ్రైవ్ చేయమని హెచ్చరిస్తున్నారు. తను ఇంత బాగా డ్రైవ్ చేస్తుంటే వీళ్లు ఎందుకు అలా అంటున్నారో అనుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు అజయ్. వాహనం కొంతదూరం ప్రయాణించిందో లేదో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అజయ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
రోజూ 30 ఎం.ఎల్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కాని అదే అలవాటు పోను పోను మోతాదును పెంచేలా చేస్తుంది. అందుకని ముందుగానే ఇలాంటి వాటిని దరిచేరనీయకపోవడం మంచిది. గుండె ఆరోగ్యానికి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం, డాక్టర్ సూచనలు పాటిస్తూ ఉండటం అన్ని విధాల మేలు.
జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. ఇలాంటప్పుడు బ్రాంది తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందని, అవన్నీ తగ్గుతాయనుకోవడం పొరపాటు. వాతావరణంలో మార్పులు, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి ట్రీట్‌మెంట్ బ్రాంది ఎంత మాత్రమూ కాదు. వైద్యులు ఇచ్చిన మందులు, వారి సూచనలు మాత్రమే పనిచేస్తాయి.
మొదటి రెండు పెగ్గులు తీసుకున్నప్పుడు శరీరం చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని మోతాదు పెరిగిన కొద్దీ మెదడు డల్‌గా అయిపోతుంటుంది. నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తనపై తనకు, చుట్టుపక్కల ఏం జరుగుతోందో ధ్యాస ఉండదు. ఆల్కహాల్ ఇన్‌డ్యూస్ డిప్రెషన్, ఇన్‌డ్యూస్ యాంగ్జైటీ డిజార్డర్ వంటి సైకోసిస్ సమస్యలు వస్తాయి.
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పడు బీర్ తాగితే పిల్లలు ఎరగ్రా, తెల్లగా పుడతారని, నార్మల్ డెలివరీ అవుతుందని అనుకుంటారు. కాని అది తప్పు. పిల్లల రంగు ఎప్పుడైనా జెనిటికల్‌గా వస్తుంది. పైగా గర్భవతులు మద్యం తీసుకోవడం వల్ల పిల్లలు శారీరక, మానసిక లోపాలతో పుట్టే అవకాశాలు ఉంటాయి.
పియర్ ప్రెజర్ కారణంగా అంటే ‘స్నేహితులు తాగుతున్నారు కాదా! నేను తాగితే తప్పేంటి?’ అనో, సరదాకో ఫ్రెండ్స్ కోసమో మొదలుపెడుతుంటారు. ఈ అలవాటు సాధారణంగా 20, 25 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కొన్ని రోజులకు మద్యం తీసుకోకపోతే చెమట్లు పట్టడం, చేతులు వణకడం, నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం, అయోమయంగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. దీంతో ఇన్ని రోజుల పాటు రాత్రివేళలలో తీసుకునే మద్యం పగటివేళకూ మారుతుంది. మొదట్లో ఒకటి, రెండు పెగ్గులతో మొదలైన అలవాటు నెమ్మదిగా పెరుగుతూ అధికమోతాదులో తీసుకుంటారు.
గత శతాబ్దం పురోగమనానికి చెందినదైతే, ప్రస్తుత శతాబ్దం ఆందోళన, ఒత్తిడి, విచారం, అనుమానాలు, వివాదాలు, అసంపూర్ణ నిర్ణయాలతో కూడిన కార్యకలాపాలకు చెందిన కాలమని జేమ్స్ సి. కోలమన్ అంటా రు. గతంలో ఒత్తిడి ఎప్పుడైనా బయటపడి సమస్యగా మారుతుండేది కానీ నేడు అది నిత్యసత్యమైపోయింది.ఇంతకీ ఒత్తిడి అంటే ఏమిటి? అందరం నిత్యం దానిని ఎదుర్కొంటున్నా కొందరు మా త్రమే దానిని గుర్తించి సులభంగా వివరించగలరు. అంతర్గతంగా విధ్వంసాన్ని సృష్టించగల బహిర్గత ఉద్దీపనలే ఒత్తిడి. మానసిక అసమతుల్యాన్ని సృష్టించి ప్రమాదకారిగా మారగల శక్తిగలది. ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు అది మన క్రియాత్మక సమగ్రతను కూడా దెబ్బతీయగలదు. మనం ఆశిస్తున్న దానికి, మన దృ ష్టికోణానికి మధ్య ఉన్న అసమతుల్యత. సులువుగా చెప్పాలంటే, మన మనస్సు అసహనం గా, వ్యాకులంగా, ఆందోళనతో, భారంగా, ఉ ద్రిక్తంగా ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉన్నామన్నమాట.
సెరొటోనిన్, ఆడ్రినాలిన్, అసిటైల్కోలైన్, డోపమైన్, కార్టిసాల్ స్థాయిలలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు నిత్యం, అసందర్భంగా జరుగుతున్నప్పుడు దీనికి అవసరమైన శక్తిని సమకూర్చేందుకు శరీరంలో ఉన్న శక్తిని పీలుస్తాయి. ఇది సుదీర్ఘకాలం పాటు నిత్యకృత్యం అయితే ఒత్తిడికి సంబంధించిన వ్యాధులైన మైగ్రేన్, హైపర్‌టెన్షన్, ఆసిడ్ పెప్టిక్ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఆర్థరైటిస్, మలబద్ధకం తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. 
మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి బతికినా జీవితాంతం వైకల్యంతో జీవించాల్సి వచ్చే ప్రమాదం ఎక్కువ.
మద్యం వ్యక్తి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. మద్యపానం ఒక నేరమో, పాపమో కాదు. అది ఒక వ్యాధి. మద్యపానం ఒక వ్యసనంగా మారడం, మొదడులోని రసాయనాల మార్పుల వలన సంభవిస్తుంది. ఈ మార్పులను వైద్యంతో, శాస్ర్తీయ పద్ధతులతో నయం చేయవచ్చు. మద్యానికి బానిసైలన వారిని ద్వేషించడం, దూషించడం చేయకుండా వారిని ఆదరించి తగిన చికిత్స ఇప్పించాలి.
మద్యం కోసం ఒక వ్యక్తి చేసే ఖర్చు రాను రాను పెరుగుతూ వస్తుంది. మద్యానికి బానిసైన వ్యక్తి ముందుగా తను సాధించే దానిలో అధికశాతం మద్యానికే హెచ్చిస్తాడు. తర్వాత మద్యపానం వలన కలిగే వ్యాధులకు చికిత్స కోసం ఖర్చుచేస్తాడు. దీని వల్ల తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఫలితంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మద్యపానం చేసిన వ్యక్తి సంఘంలో గౌరవం కోల్పోతాడు.
* గతంలో మద్యం సేవించే సమయం ...
మద్యం ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిని, గ్రాహణ శక్తిని, ఏకాగ్రతను, విచక్షణను కోల్పోతారు.
రాఘవకు నలభై ఏళ్లు. మంచి వ్యాపారం ఉంది. తల్లిదండ్రులు, భార్యా, ఇద్దరు పిల్లలు అతని కుటుంబం. రాఘవకు ఇరవై ఏళ్లుగా ‘తాగుడు’ అలవాటు ఉంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఇక ముందు ఒక్క చుక్క మద్యం తాగినా బతకడం కష్టం అని వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది కదా! అనుకుని బలహీన క్షణంలో మద్యం తాగాడు. దాంతో ఆరోగ్యపరిస్థితి విషమించి రాఘవ చనిపోయాడు. ఆ కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది.
1940 ముందు వరకు ‘తాగడం’ ఒక వ్యాధిగా గుర్తించలేదు. అమెరికాలోని డాక్టర్ బాబ్, బిజినెస్ మ్యాన్ బిల్ డబ్ల్యూ అనే ఇద్దరూ తాగుడు కారణంగా సర్వం కోల్పోయి చింతలో పడిపోయారు. వారు ఒక చోట కలిసి తమ దుస్థితికి చింతిస్తూ తమను బాగుపరుచుకోవడం కోసం ఏం చేయవచ్చు అని చర్చిస్తూ కూర్చున్నారట. ఆ చర్చ 24 గంటల పాటు సాగిందట. ఎప్పుడూ తాగుడు ధ్యాసలోనే ఉండే వారు ఓ రోజంతా తాగలేదు. మద్యం పట్ల ఉన్న సందేహాలను, సమస్యల గురించి చర్చించుకుంటే ఈ వ్యసనం నుంచి బయట పడటం సులభమే అని అర్థమైందట. తాము పడిన కష్టాలు చెప్పుకుంటుంటే తాగాలని అనిపించకపోవచ్చు. అలా పుట్టిందే ఈ ఆల్కహాలిక్ అనానిమస్ గ్రూపు. అలా ‘ఆల్కహాలిక్ అనానమస్’ పేరుతో ప్రపంచమంతటా సంస్థలు ఏర్పడ్డాయి. ఇలాంటి సంస్థలు అన్నిచోట్లా మద్యం దురలవాటు తగ్గించడానికి కృషి చేస్తున్నాయి.
తాగుబోతు తన బాల్యాన్ని, యవ్వనాన్ని, వయసుని ఆనందంగా అనుభవించలేడు. అలాగే తన పిల్లల బాల్యాన్ని, వారి అభివృద్ధిని కూడా చూసి ఆనందించే స్థితిలో ఉండడు. తన వ్యసనాన్ని గుర్తించి దాని నుంచి బయట పడాలనుకునే వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మనస్తత్వ నిపుణులు కౌన్సెలింగ్, కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్‌ను ఇస్తారు. వాటిని వైద్యుల సూచనల మేరకు వాడుతూ ఉండాలి. అయితే మెడిసిన్స్, ఆల్కహాల్ ఏకకాలంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్, మందులను పేషంట్ మానసిక స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డి-అడిక్షన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ తీసుకొని బయటకు వెళ్లిన వ్యక్తి, తిరిగి వ్యసన పరుడిగా మారకుండా ఉండాలంటే తరచూ డి-అడిక్షన్ సెంటర్‌లకు వెళుతూ, అక్కడి మీటింగ్‌లలో పాలుపంచుకోవాలి. ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలను అవలోకించుకుంటూ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండాలి.
‘జన్మతః వ్యాధిగా ‘తాగుడు’ వ్యసనాన్ని గుర్తించారు వైద్యులు. బిడ్డ ఎదిగిన కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు బయట పడుతుంటాయి’ అంటున్నారు. దీనికి ఇంటి పరిస్థితులు, పరిసరాలు దోహదం చేస్తుంటాయి. అది ఎలా అంటే తల్లిదండ్రులకు చెప్పకుండానే స్కూల్‌కి డుమ్మా కొట్టడం, కాస్త ఎదిగాక కాలేజీ మానేసి సినిమాలకు, షికార్లకు వెళ్లడం జరుగుతుంటుంది. టీనేజ్ దశలో హార్మోన్ల వల్ల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ మార్పులు వస్తుంటాయి. మొండిగా ప్రవర్తిస్తుంటారు. మూడీగా ఉంటాడు. సహనం ఉండదు. ఏ పనినీ సక్రమంగా చేయలేరు. తండ్రికి తాగే అలవాటు ఉంటే ‘నాన్న తాగుతున్నాడు కదా! నేను తాగితే తప్పేంటి’ అనుకుంటారు. దీంతో ఏ పని చేస్తున్నా ‘మద్యం’ తీసుకుంటే బాగుండు అనే ఆలోచన పుట్టుకొస్తుంటుంది. పిల్లవాడిలో చిన్ననాటి నుంచే మార్పు తీసుకురావాలంటే ఈ వ్యసనం పట్ల అవగాహన పేరెంట్స్‌లో తప్పక ఉండాలి.
ఇంట్లో ‘తాగే’ వారు ఉంటే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గు పడతారు. కాని ‘తాగే’ అలవాటున్న వారిలో మార్పు తేవడానికి కుటుంబసభ్యులు మొత్తం సహకరించాల్సి ఉంటుంది. మద్యానికి సంబంధించి అవగాహన ఇంట్లో అందరిలోనూ ఉండాలి. ఇది మందులతో చేసే చికిత్స కాదు, మానసిక చైతన్యంతోనే మార్పు తీసుకురావాలి. తాగిన వారిని తిట్టడం, కొట్టడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదు. ఎందుకంటే తాగేవారిలో మూర్ఖత్వం ఉంటుంది. వారు చేయదలచుకున్నది చేసి తీరాలన్న పట్టుదల ఉంటుంది. అందుకని కుటుంబసభ్యులు కూడా రీహాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరం.
మొదటిసారి మద్యం తీసుకునేటప్పుడు ఒక పెగ్గుతో సరిపెట్టేస్తారు. ఫర్వాలేదు కదా అనే ఆలోచనతో మరోసారి రెండు పెగ్గులు, పోను పోను రోజూ కొంత మోతాదును పెంచుతూ పోతుంటారు. ఇలాంటప్పుడు ఇది ఒక వ్యాధి అని గుర్తించాలి. వ్యసనం ఉన్నవారిలో చాలా తక్కువ మంది మాత్రమే దీని నుంచి బయట పడాలి అనుకుంటారు. మిగతా వారిని మాత్రం వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తెలివిగా వ్యవహరించి ఈ వ్యసనం నుంచి బయటపడేలా చేయాలి. వ్యసనం ఉన్న వ్యక్తి 3-4 నెలల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉండాలి. ‘ఎందుకు తాగుతున్నాను, మద్యం ముందు ఎందుకు బలహీనుడిగా మారాను’ అని ఎవరికి వారు తమ ‘ఆత్మకథ’ రాసుకోవాలి. రోజూ డైరీలో రాసుకోవడం వల్ల సమస్య ఎక్కడ ఉందో సమీక్షించుకోవడానికి వీలవుతుంది.