Showing posts with label ఆహారం. Show all posts
Showing posts with label ఆహారం. Show all posts

Tuesday, January 10, 2012

ఆకలి... ఆరోగ్యం...


ఉపవాసం పేరిట లంఖణాలు చేయడం అంత మంచిది కాదు. అలా కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచడం సరైనది కాదు. కడుపును ఖాళీగా ఉంచడం, పూర్తిగా భర్తీ చేసేయడం... ఈ రెండూ మంచిది కాదు.
 
  మీకు వేళకు ఆకలవుతుందా? మంచి జీర్ణశక్తి ఉందా? అది మంచి ఆరోగ్య సూచన. ఆ ఆరోగ్యాన్ని అలా కొనసాగించాలి. మనం పనులతో దాన్ని నిర్లక్ష్యం చేసి ఆకలిని పట్టించుకోకుండా ఉండటం, వేళకు తినకపోవడం, వేళ మించాక తినడం వంటివి చేస్తే చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలివి... 

http://chicshaping.com/wp-content/uploads/2011/12/hay-diet.jpg
కరకరలాడిపోతున్నట్లుగా మరీ ఆకలి పెరిగిపోయేవరకూ ఆగకండి. అలాగని ఆకలి వేయకుండానే తినేయకండి. వేళకు తింటూ ఉంటే అదే సమయానికి ఆకలి అనిపిస్తుంది. క్రమం తప్పకుండా ఒకే సమయంలో తినడం అన్ని విధాలా మంచిది.
రెస్టారెంట్‌లాంటి చోట్లకు వెళ్లినప్పుడు వండి వడ్డించాల్సిన భోజనం వచ్చేలోపు రెడీమేడ్‌గా దొరికేవాటినే చాలా మంది తినేస్తుంటారు. అలాంటి సమయంలో అందుబాటులో ఉన్న బెకరీ ఐటమ్స్‌తో కడుపును నింపేయకండి. కాస్త ఆలస్యం అయినా... పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలనే తినండి. 

http://healthyetips.com/wp-content/uploads/2011/08/2087080.jpg
బ్రేక్‌ఫాస్ట్ రాజుగారి భోజనంలా భారీగా ఉండవచ్చు. మధ్యాహ్న భోజనం ధనికులు తినే భోజనంలా ఉండవచ్చు. కానీ... రాత్రి తినేది మాత్రం సామాన్యులు తినేలా ఉండాలి. అంటే... రాత్రుళ్లు పరిమితంగా తినాలని గుర్తుపెట్టుకోండి.
మీరు భోజనంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్‌గాని, జ్యూస్‌గానీ కలిపి తీసుకోకండి. భోజనం సమయంలో వీలైనంతగా నీళ్లు కూడా తాగకండి. భోజనం పూర్తయ్యాకే నీళ్లు తాగండి. 

http://healthyweightlossmanagement.com/wp-content/uploads/2009/08/healthy_eating_s1_family_eating_healthy.jpg
మీరు మటన్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటూ ఉంటే... దానితో పాటు వీలైనంతగా ఉడికించిన కూరగాయలు, పండ్లు తినండి.
ఆకలి తీరినట్లు అనిపించగానే తినడం ఆపేయండి. భోజనం రుచిగా ఉంది కదా అని మరీ ఎక్కువగా తినేయకండి. దాని వల్ల వచ్చే అనర్థాలు ఎన్నో!
పాప్‌కార్న్స్, శ్నాక్స్, సాఫ్ట్‌డ్రింక్స్ లాంటి చిరుతిండ్లకు దూరంగా ఉండండి.
వృత్తిపరంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా భోజనం వేళను పాటించండి. రాత్రుళ్లు చాలాసేపు ఆగాల్సి వస్తే రాత్రి భోజనం స్కిప్ చేయకండి. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్థాల స్థానంలో దోసముక్కలు, క్యారట్ ముక్కలు, టొమాటో ముక్కలు వంటి సలాడ్స్ తీసుకోండి. 

http://healthyeatingportal.com/i/img09.jpg
ఎవరైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు అన్ని వేళలా అన్ని పదార్థాలూ తినకండి. స్నేహపూర్వకమైన ఒత్తిడితో అన్నీ తినేయకండి. ఆరోగ్యకరం కాని వాటిని వద్దనడమూ నేర్చుకోండి. 

http://www.goodhealthhabit.com/wp-content/uploads/2011/09/facts-about-healthy-eaeting.jpg
ఉపవాసం పేరిట లంఖణాలు చేయడం అంత మంచిది కాదు. అలా కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచడం సరైనది కాదు. కడుపును ఖాళీగా ఉంచడం, పూర్తిగా భర్తీ చేసేయడం... ఈ రెండూ మంచిది కాదు.
ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయండి.

Monday, May 16, 2011

ఆరోగ్యానికి ఆహారం

ఆధునిక కాలంలో ఉద్యోగాలు మెదడుకు తప్ప శరీరానికి శ్రమ ఇచ్చేవిగా ఉండడం లేదు. రోజుకు పది పన్నెండు గంటల పాటు కదలకుండా డెస్క్‌ ముందు కూచొని పని చేసి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చి తినీ తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కద్దు. దాదాపుగా ఏ రంగాన్ని తీసుకున్నా పని విధానమిలాగే ఉంటోంది. కనుక ఉద్యోగం మానడమనేది కుదరని పని. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా అంటే అందుకూ మార్గం ఉన్నది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోజంతా రోబోలా కూర్చుని పని చేయడం వల్ల వచ్చే ప్రతికూల పరిణామాలను తగ్గించుకోవచ్చు.

chokletఆఫీసులో కూర్చుని ఏం తింటాం అనుకోనవసరం లేకుండా తేలికగా మోసుకు వెళ్ళగల ఆహారమిది. అవి మీ గుండెకు, బిపికి, మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఆహారమిది. అందులో ఐదింటి గురించి తెలుసుకుందాం...

అక్రూట్లు...
బాదం పప్పు, బఠాణీలు, పిస్తాలు, మరే ఇతర నట్స్‌ కన్నా కూడా అక్రూట్లలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని కొత్త పరిశోధనలు తెలిపుతున్నాయి. డ్రైఫ్రూట్స్‌ అన్నీ గుండెకు సంబంధించే వ్యాధులను తగ్గించే లిపిడ్స్‌ను మెరుగుపరుస్తాయి. కానీ అక్రూట్లు అంతకు మించి సాయపడతాయని పరిశోధనలలో తేలింది. అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న జంతువులకు వీటిని తినిపించగా వాటి జ్ఞాపకశక్తి మెరుగుపడినట్టు తేలింది. రోజుకు ఏడు అక్రూట్‌ పప్పులు తింటే చాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

కప్పు గ్రీన్‌ టీ...
green-teaగ్రీన్‌ టీలో అధిక శాతం ఉండే పాలిఫెనాల్స్‌ ధ్వంసమైన డిఎన్‌ఎను మరమ్మత్తు చేయడమే కాక ఇమ్యూన్‌ వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తాయి. అంతేకాదు గ్రీన్‌ టీలు కాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. చర్మం, ప్రోస్ట్రేట్‌ కాన్సర్లు రాకుండా కూడా ఇది నిరోధించగలదు.

పాప్‌కార్న్‌...
ఆరోగ్యకరమైన స్నాక్స్‌ చిట్టా ఏదైనా మీ వద్ద ఉంటే అందు లో తప్పనిసరిగా ఉండే పేరు దీనిదే.మనకందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో పాప్‌కార్న్‌ ఒకటని చాలా మంది చెప్తుంటారు.ఇందులో ఫైబరే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికశాతంలో ఉంటాయి. అయితే ఉప్పు తగ్గించుకొని వేసుకుంటే దాన్ని మించిన ఆహారం లేదని నిపుణులు చెబుతున్నారు. మీ ఆఫీసులో మైక్రోవేవ్‌ అందుబాటులో ఉంటే తక్కువ ఉప్పు గల పాప్‌కార్న్‌ తెచ్చి రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

డార్క్‌ చాకొలేట్‌...
dorkఇందులో కూడా పాలిఫెనాల్స్‌ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాదు రక్తం గడ్డకట్టిపోవడాన్ని కూడా నిరోధిస్తుందిట. రోజూ చిన్న డార్క్‌ చాకొలెట్‌ బార్‌ను తింటే రక్తపోటు తగ్గుతుందిట. డార్క్‌ చాకొలేట్‌లో ఉండే కెఫైన్‌ మానసికంగాఉత్తేజితం చేయడమే కాదు ఏకాగ్రత పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది.



పళ్ళు...
frutsఆకలి వేస్తున్న భావనను జయించేందుకు అత్యుత్తమ ఆయుధం పళ్ళే. అంతేకాదు అందులో ఉండే పౌష్టికత మనం నీరసపడకుండా రోజంతా పని చేసేందుకు సాయపడుతుంది. ఆపిల్స్‌, అరటి పళ్ళు, మామిడిపళ్ళు, బొప్పాయ వంటి పళ్ళను రోజు వారీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడా నికి ఆ మాత్రం చేయాలి మరి!

Thursday, September 16, 2010

నిమ్మతో.. నిగనిగ

మనం తినేపదార్థాల రుచి పెరగాలంటే దాంట్లో నిమ్మరసం పడాల్సిందే. నిమ్మ రుచిని పెంచడమే కాకుండా ఆకలిని నియంత్రిస్తుంది కూడా. దీనిలో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మరసాన్ని అధికంగా తీసుకుంటే కార్బోహైడ్రేడ్‌లు నెమ్మదిగా కరుగుతాయి.

Lemon- నిమ్మరసం తాగినా...నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా...చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు.
- నిమ్మరసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే శరీరంలో ఉన్న టాక్సిన్లు వెలుపలకు నెట్టివేయబడతాయి.
- ఒక్కరోజు శరీరానికి సరిపడా కావాల్సిన సివిటమిన్‌ను నిమ్మ అందిస్తుంది.
- ఆరోగ్యపరంగానే కాక నిమ్మ సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.
- తల స్నానం చేసే ముందు నీటిలో నిమ్మరసాన్ని కలిపిన నీటితో స్నానంచేస్తే కురులు నల్లగా మెరుస్తాయి.
- నిమ్మరసాన్ని పెరుగులో కలిపి చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛామ పెరుగుతుంది.
- ఎండకు కమిలిన ప్రాంతమైనా, కూరగాయలు కోసేప్పుడు చేతులు రంగుమారినా నిమ్మరసాన్ని పట్టిస్తే ఆ మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
- ఎండిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండిలో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.
- కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి.
health_skin_care- నిమ్మరసం ముఖంమీద జిడ్డుని తొలగించి ఎప్పుడూ తాజాగా ఉంచగల్గుతుంది కూడా.
- నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
- నిమ్మరసాన్ని ముల్తానామట్టిలో కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.
- నిరాహారదీక్ష విరమించేటప్పుడు కూడా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారు. ఎందుకంటే ఖాళీకడుపులో గ్యాస్‌ చేరుకుని ఒక్కసారిగా ఏదైనా ఆహారపదార్థం తిన్నా...వెంటనే వాంతి అయిపోతుంది. ఒక్క నిమ్మరసం మాత్రమే శరీరం హరాయించుకుంటుంది.
- పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది.
సోయాతో సౌందర్యం
- నానబెట్టిన సోయా గింజల్ని, దోసకాయ ముక్కలను కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని స్నానం చేసే ముదు శరారమంతా పట్టించి మృదువుగా రుద్దుకోవడం వల్ల శరీరం నునుపుదేలి, మేని వర్ణం మెరుగవుతుంది.
- రెండు చెంచాల సోయాపిండిలో అరచెంచా తేనె, కొద్దిగా టమాటా రసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయడం వల్ల ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది.
- ఒక స్పూను సోయాపిండి, అరస్పూను నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్ర పరచడం వల్ల చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
- పదిహేను సోయాగింజలు, నాలుగు బాదం పప్పులను నాలుగైదు గంటలసేపు నానబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ విశ్రమంలో టీ స్పూన్‌ తేనె, నాలుగైదు చుక్క నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పల్చగా పట్టించాలి. అర్ధ గంట తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి. వారానికోసారి ఈ విధంగా చేయడం వల్ల చర్మం కోమల త్వాన్ని, నిగారింపును సంతరించుకుంటుంది.
- సోయాపిండి, పెసరపిండి సమ భాగాలుగా తీసుకుని స్నానం చేసేటప్పుడు సబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ పిండిని ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన రీతిలో చర్మం పరిశుభ్రపడి నునుపుగా మారుతుంది.
- మొటిమల వల్ల ముఖం మీద నల్లమచ్చలు ఏర్పడిన వారికి ఓ సులువైన పరిష్కారమార్గం వుంది. సోయాపాలలో శగపిండి, కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. ఇందవల్ల నల్లమచ్చలు క్రమేపీ కనుమరుగవుతాయి.ఇలా మన ఇంట్లోనే చౌకగా లభ్యమయ్యే పండ్లు, కూరగాయలతో సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ పేస్ట్‌ను తయారు చేసుకుని తరచుగా ముఖానికి పట్టిస్తుంటే...ఆరోగ్యానికి ఆరోగ్యం...అందానికి అందం మెరుగవుతాయి.

Saturday, September 11, 2010

పిండివంటల పరమార్థం * వంటల్లో ఆరోగ్య విశిష్టత

మన సంప్రదాయ వంటలు రాన్రాను కనుమరుగైపోతున్నాయి. నూడిల్స్, పానీపురీ.. వెజిటబుల్ పలావ్.. బిర్యానీలూ.. ఇలా దైనందిన జీవితంలో ఫాస్ట్ఫుడ్ సంస్కృతి జీర్ణించుకుపోతోంది. దీంతో అనేక సమస్యలూ తలెత్తుతున్నాయి. ఐతే -
సంప్రదాయ రీతిలో ‘వినాయక’ చవితికి చేసుకునే వంటల్లో ఆరోగ్య విశిష్టత ఉండటం గమనార్హం. పులగం, కుడుములు, ఉండ్రాళ్లు తరచూ తీసుకోవడం బహు శ్రేష్టం. బియ్యంతో ఏదో ఒక పప్పు కలిపి వండే వంటకాన్ని పులగం అంటారు. కొంతమంది నెయ్యి, ఇంగువ, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తదితర ద్రవ్యాలతో కలిపి వండుతారు. దీనే్న కిచిడీ అంటారు. గుండె జబ్బులకు మినపప్పుతో చేసిన పులగం భేష్షుగ్గా పనిచేస్తుంది. శరీరానికి చలవ చేయాలంటే పెసరపప్పు కలిపి చేసిన పులగం ఆరోగ్యప్రదాయిని. దీనే్న ఆలయాల్లో ‘కట్టె పొంగలి’ అని పిలుస్తారు. దీంట్లో కొద్దిగా మిరియాలు వేయడం ద్వారా మరింత రుచి వస్తుంది. శనగపప్పుతో చేసిన పులగం బలాన్నిస్తుంది.
శే్లష్మంతో బాధపడేవారు కందిపప్పుతో చేసిన పులగాన్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది. పులగంలో కొద్దిగా జీలకర్ర వేయడం వల్ల పైత్యాన్ని నివారించవచ్చు. ఇక ఉండ్రాళ్లు, ఆవిరి కుడుములు కూడా.
ఆయుర్వేదంలో ఉండ్రాళ్లకు ఉండ్రములని, మోదకములనీ పేరు. విఘ్నేశ్వరుడు మోదకప్రియుడు కాబట్టి వినాయక చవితినాడు ఈ పిండివంటను చేస్తారు. మరిగే వేడినీటిలో బియ్యపు పిండి పోసి, ముద్దగా మారేటట్లు చేసి దానికి నానబెట్టిన సెనగపప్పు కలిపి నిమ్మకాయ సైజులో వుండలుగా చేసి నీటి ఆవిరి మీద వండితే ఉండ్రాళ్లు తయారవుతాయి. కొంతమంది కొబ్బరి తురుముని మధ్యలో వుంచి పూర్ణం చేసి కూడా వండుతారు. వీటిని అల్లం చెట్నీతో కాని లేదా పాలతో కాని లేదా నెయ్యితో కాని కలిపి వడ్డిస్తారు. ఉండ్రాళ్లను నూనె లేకుండా చేస్తారు. కాబట్టి తింటే లావెక్కుతామన్న భయం ఉండదు. అయితే అతిగా తింటే విరుగుడుగా జీలకర్ర, పుదీనా కలిపిన మజ్జిగ తీసుకోవాలి.
కుడుములు
సాధారణంగా కుడుములని మినపప్పు, బియ్యప్పిండి కలిపి చేస్తారు. ముందుగా మినపప్పు రుబ్బి, దానికి బియ్యప్పిండిని కలిపి వాసెన మీద బిళ్లలుగా ఉడికిస్తారు. ఇది వాతాన్ని, మేహవాతాన్ని తగ్గిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కుడుములను వేరు రకంగా కూడా చేస్తారు. ముందుగా కొబ్బరి తురుమునూ, బెల్లాన్ని కలిపి ఉడికించాలి. ఏలక్కాయలు, గసగసాలు, కొద్దిగా బియ్యప్పిండి చేర్చి ముద్దలుగా చేసి ఉంచుకోవాలి. ఇది మధ్యభాగం కోసమన్నమాట. ఇప్పుడు పై పొర కోసం పిండిని తయారుచేసుకోవాలి. కొంచెం నీళ్లు తీసుకుని బుడగలు వచ్చేవరకూ మరిగిన తరువాత కొద్దిగా నెయ్యి, ఉప్పు చేర్చాలి. తగినంత బియ్యప్పిండి కలిపి బాగా కలియతిప్పి మెత్తని ముద్దగా చేయాలి. దీనిని వేడిగా ఉండగానే చిన్నచిన్న వుండలుగా చేసి, అప్పడం మాదిరిగా చేతులతో వెడల్పు చేసి, మధ్యలో ముందు తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి ఉండను పెట్టి కొసలకు నెయ్యి పూసి సీలు చేసి ఆవిరి మీద ఉడికించాలి. వేడివేడి కుడుములు రెడీ.
పాలతాలికలు
మరిగే నీళ్లలో బియ్యప్పిండిని పోసి ముద్దగా కలిపి, అరచేతులతో చిటికెన వేలు ఆకృతిలో పొడవుగా చేసి పాలలో వేసి ఉడికించి తయారుచేసినవే పాలతాలికలు. అతి దప్పికను, పైత్య వికారాలను తగ్గిస్తాయి.
పరమాన్నం
దీనికి ఆయుర్వేదంలో క్షీరోదనం అని పేరు. పాలలో బియ్యాన్నిగాని లేదా సగ్గుబియ్యాన్ని కాని వేసి తగినంత బెల్లాన్ని లేదా పంచదారను కలిపి ఉడికిస్తే పరమాన్నం తయారవుతుంది. ఇది ధాతువృద్ధిని కలిగిస్తుంది. వాతాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది.
శనగ గుగ్గిళ్లు
శనగలను నీళ్లలో నానబెట్టి, నీటి ఆవిరి మీద ఉడికించి, కొద్దిగా నెయ్యితోనూ, పసుపు కారం, ఉప్పు, ఇతర దినుసులతోనూ తాళింపు వేసి చేస్తారు. నానబెట్టడం వల్ల పొట్ట ఉబ్బరింపును కలిగించదు. మాంసకృత్తులు ఎక్కువ కనుక పెరిగే పిల్లలకు మంచి చేస్తాయి.
-డా.చిరుమామిళ్ల మురళీ మనోహర్

Thursday, September 9, 2010

మంచి చేసే మిర్చి

మిరపకాయలు ఎక్కువగా తినొద్దు, తింటే అల్సర్‌ అని అంటుంటారు. అయితే ఒక నిర్ణీత పరిధిలో తింటే ఫరవాలేదు. పచ్చిమిరపకాయలంటే ఇష్టపడని తెలుగువారంటూ ఉండరు. అదివరకటి కాలంలో అయితే పెరుగన్నంతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపను కూడా నంచుకుని తినేవారు. ఇప్పటి కాలంలో పిజ్జా, బర్గర్లలో టమాటాసూప్‌, జామ్‌, జెల్లీలను జనం హాయిగా ఆస్వాదిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో టాస్మేనియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.


merchiమిర్చిని అధికంగా వినియోగించేవారిలో షుగర్‌ నియంత్రణ శక్తి అధికంగా ఉం టుందని ఇటీవల జరిపిన పరిశోధనలలో తేలింది. ఇందులో ఉండే కెప్సానిన్‌, డీహైడ్రాకెప్సానిన్‌లకు రక్తంలో గ్లూకోజ్‌ శాతం నిల్వలను తగ్గించే శక్తి ఉందట. మిర్చిని అధి మోతాదులో తినేవారిలో రక్తం గడ్డకట్టే అవకాశం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా పరిశోధకుల బృం దానికి నేతృత్వం వహించిన భారతీయ సంతతికి చెందిన వెైద్యుడు డా.కిరణ్‌ అహుజా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇందుకోసం ప్రత్యేకం గా ఇప్పటికిప్పుడు మిరపకా యలను అలవాటు చేసుకో నవసరం లేదంటున్నారు వెైద్యులు.

అయితే మిరప కాయలు అధికంగా వాడేవారు తమ అలవాట్లు మార్చుకో నవసరం లేదు.
మిర్చిని అంత కారంగా తినలేకపోతే... అందులో కొద్దిగా తీపిని, చింతపండును చేర్చి కారం చట్నీగా దోసెల్లోకి తింటే బాగుంటుంది. టమాటా సాస్‌లాగా చిల్లీసాస్‌ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కళ్ల వెంబడి నీళ్లు తెప్పించినా అది చేసే మేలు మనకు సంతోషాన్ని ఇస్తుంది.

greenఆంధ్రా స్పెషల్‌ మిరపకాయ బజ్జీలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. కొద్దిగా వర్షం కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు యువతరం తప్పక మిర్చిబజ్జీలను ఆశ్రయి స్తుంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మిర్చిబజ్జీలను, అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కమ్మనెైన రుచిని ఆస్వాదిస్తుంటారు. కారం తినలేని వారు మాత్రం వాళ్ల వంక జాలిగా చూస్తుంటారు. గృహిణులు కూడా లావుగా ఉండే మిర్చి బజ్జీలలో శనగపిండిని కూరి డీప్‌గా ఫ్రై చేసుకుని కూరలా చేసుకుని అన్నంలో తింటుంటారు. సాధారణంగా లావుగా ఉండే మిర్చిలో కారం పాళ్లు కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనితో చాలా మంది చట్నీలు చేసుకోవడానికి, కూరలు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంత కారం వాళ్లు ఎలా తినగలుగుతున్నారా అని. కారం అధికంగా తినేవారు తీపి పదార్ధాలను తినలేరు. ఇన్నాళ్లూ షుగర్‌ వ్యాధికి చేదు కాకరతోనే నివారణ అనుకునేవారు.

merఇటీవల వచ్చిన సర్వేతో మిర్చిని ప్రేమించేవారు ఇక భయపడాల్సిన పనిలేకుండా హ్యాపీగా లాగించేయవచ్చు. సాధారణంగా శనగలను ఆడవారు వాయినాలు ఇచ్చుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బెంగాల్‌గ్రామ్‌గా పిలిచే ఈ శనగలలో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి. రోజంతా కటిక ఉపవాసం ఉన్నా సరే శనగలు తిని ఆరోగ్యంగా ఉండ వచ్చు. ఉడకబెట్టిన శనగలు, నానబెట్టిన శనగలు మంచి ప్రొటీన్లుగా ఉపయోగపడతాయి. వంద గ్రాముల శనగ లలో 61.2 శాతం పిండిపదార్ధాలు, 5.3 శాతం కొవ్వు, 17.1 శాతం మాంసకృత్తులు, 190 మిల్లీగ్రాముల కాల్షియం, 168 గ్రాముల మెగ్నీషియం, 9.8 శాతం ఇనుము, 71 మిల్లీగ్రాముల సోడియం, 322 మి.గ్రా. పొటాషి యం, 3.9 మి.గ్రా పీచుపదార్ధం, 361 కేలరీలు ఉంటాయి.

Thursday, September 2, 2010

రుచి - ఆరోగ్యం

కేవలం మార్పు అనేది ఏ ఒక్క విషయానికో పరిమితం కాదు. ప్రతి నిమిషం.. ప్రతి క్షణం కూడా మారిపోతూనే వుంటాయి. ఇందులో కొన్ని మార్పులు మంచి పరిణామాలకు దారితీస్తే మరికొన్ని చెడు ప్రభావాలను చూపిస్తాయి. ఆహార విషయం కూడా అంతే. సమయాల్లో తేడాలు.. తినేతిండిలో మార్పులు.. రోజు రోజుకూ పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతి.. అనుకరించే విధానాలు అన్నీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలకు దారి తీస్తున్నాయి. అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. అప్పటికప్పుడు అది బాగానే వున్నా సమయం గడిచేకొద్దీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


cup 
బయట దొరికే ఆహారం తక్కువ ధరతో...  చాలా సులువుగా లభిస్తుంది. ఇంట్లో కష్టపడి చేసుకునే వాటికన్నా వీటికి రుచి కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. బయట దొరికే ఆహారంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ కాస్త ఎక్కువే ప్రాధాన్యతనే సంపాదించుకున్నాయి. ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌లో చాలా వరకు ఎక్కువగా ఫ్రై రూపంలోనే ఇష్టపడతారు. వీటిని రుచి కోసం కానివ్వండి.. లేదా ఇంకేదైనా సరే.. ఎక్కువగా వేయిస్తారు. ఇలా చేసే వాటిలో పైబర్‌ చాలా తక్కు వగా వుంటుంది. కాలరీస్‌ శాతం చాలా ఎక్కువగా వుంటుంది. అన్ని సందర్భాల్లోనూ ఇదే నిజం కాకపోవచ్చు. కొన్నిటి వల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా దొరక వచ్చు. కానీ చాలా వరకు వీటి వల్ల నష్టమే ఎక్కువగా వుంటోంది.

ఎంత వరకు...
ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవడంలోనూ కొన్ని పరిధులు వుంటాయి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి మాత్రమే ఆహారం ఒక మార్గంగా చూడాలి. ఆకలి లేకున్నా దొరికినది తినడం సరికాదు. దీని వల్ల అదనపు కేలరీస్‌ ఒంట్లో చేరి ఒబెసిటీకి దారితీయవచ్చు. స్నాక్స్‌ తీసుకునే సమయంలోనూ ఎంత తీసుకుంటున్నాం అన్నది మననంలో వుండాలి. అన్నిటినీ సమం చేసుకోవాలి. ఆరోగ్య నియమాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్నాక్స్‌ శరీరానికి కేవలం బలాన్ని ఇచ్చేవిగా వుండేలా ఎంచుకోవాలి.

అనారోగ్య సమస్యలు..
brad 
డయాబెటీస్‌తో బాధపడేవారు స్నాక్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ పదార్థాలు తీసుకునే సమయంలో కాస్త ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇన్సులిన్‌ తీసుకునే వారు మరింత జాగ్రత్తలు పాటించాలి. పైబర్‌ శాతం అధికంగా వుండి, ఫ్యాట్‌ తక్కువగా వుండే పదార్థాలను ఎంచుకోవాలి. కాంప్లెక్స్‌ కార్పొహైడ్రేట్స్‌ ఎక్కువగా వుండే ఓట్స్‌, కూరగాయలు ఎక్కువగా వుండేది కూడా ఫాస్ట్‌ ఫుడ్‌ల రూపంలో దొరుకుతున్నాయి. వాటిని కొంత వరకు తీసుకున్నా నష్టం ఏమీ వుండదు. దీనికితోడు పండ్లు కూడా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో రక్త క్రియలు అన్నీ అదుపులో వుండేలా అవి చేస్తాయి.

ఏం చేయాలి..
ఆకలి లేకుండా తినడం మాత్రం మార్చుకోవాలి. కొన్ని పదార్థాలు రుచి పరంగా ఎంత తిన్నా ఇంకా తినే విధం గా వుంటాయి. ఉదాహరణకు చిప్స్‌ వం టివి. వీటిని తీసుకునేప్పుడు ముందుగా ఎంపికలోనే మార్పుచేసుకోవాలి. ఇప్పుడు అనేక రకాల స్నాక్స్‌ మంచి చేసే విధంగా కూడా తయారవుతున్నాయి. కాస్త ధర ఎక్కువ అయినా అవి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఇటువంటి పదార్థాలను ఎంపిక చేసుకోవడం మంచిది. టివీ చూస్తూ, లేదా కబుర్లు చెప్పుకుంటూ తినేప్పుడు కాస్త జాగ్రత్త లు తీసుకోవాలి. లేకపోతే ఎక్కువగా తినే అవకాశం వుంటుంది.

Saturday, August 21, 2010

ఉపాహారం.. ఇలా తీసుకుందాం

'హెవీగా ఫుడ్ తీసుకోవడం వల్ల విపరీతంగా లావెక్కుతున్నామని ఉపాహారం(స్నాక్స్)తో సరిపుచ్చుతుంటే... బరువు మాత్రం తగ్గడం లేదు'. ఇది మనకు కామన్‌గా నగరవాసుల నుంచి వినిపించే మాట. వాస్తవానికి స్నాక్స్‌ను ఎక్కువ పరిమాణంలో లాగించేయడమే దీనికి కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు. భోజనం ముందు, తర్వాత తీసుకునే ఉపాహారం క్రమపద్ధతిలో ఉంటే బరువు తగ్గడం, ఆరోగ్యం కాపాడుకోవడం చాలా సులువు అంటున్నారు. వయసురీత్యా స్నాక్స్‌ని ఎలా తీసుకోవాలి, ఏ ఏ రూపాల్లో, ఎలాంటి సమయంలో తీసుకోవాలనేది పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

పన్నేండేళ్లలోపు చిన్నారులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. వారికి స్నాక్స్ ఇవ్వాల్సి వస్తే తాజా పండ్లను ముక్కలుగా కోసి ఇవ్వాలి. నట్స్‌రూపంలోనూ స్నాక్స్ ఇవ్వొచ్చు. వీటినే కాస్త రోస్ట్ చేసి ఇస్తే ఆ రుచే వేరు. ఒక వేళ చిన్నారులకు శాండ్‌విచ్ ఇష్టమైతే మధ్యలో ఫ్రూట్ ముక్కలుంచి ఇస్తే సరిపోతుంది. జంక్‌ఫుడ్ తగ్గించేందుకు ఇదో మార్గం. ఉడికిన పచ్చి బఠాణీలు, అటుకుల మిక్చర్, ఫ్రూట్‌జెల్లీ కూడా చిన్నారులతో తినిపించవచ్చు. ప్రోటీన్స్, కాల్షియం కాంబినేషన్స్‌తో స్నాక్స్ ఇస్తే మంచిది.

పన్నెండేళ్లు దాటిన వారికి
ఈ వయసు పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్‌తో కూడిన ఆహారం చాలా కీలకం. డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాల్లో ప్రొటీన్లు కావాల్సిన మోతాదులో లభిస్తాయి. సెనగలు, పెసలు లాంటి సంప్రదాయ స్ప్రౌట్స్‌ని ఇస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది. యుక్త వయసు వారికి పిజ్జా, బర్గర్లపై దృష్టి ఉంటుంది. వాళ్ల టేస్ట్‌కి తగ్గట్టుగా వెజిటబుల్ కట్‌లెట్‌ని ఇస్తే మేలు.

ఈ వయసులో కాల్షియం కూడా అవసరం. సాయంత్రం వేళల్లో స్నాక్స్‌కి బదులుగా మిల్క్‌షేక్స్ లాంటివి తీసుకోవచ్చు. పిజ్జా రూపంలో అయితే తక్కువ కొవ్వున్న చీజ్ ఇవ్వొచ్చు. సాధారణ బరువు ఉండే వారికి వారానికి ఒకసారి చీజ్, సోయా పన్నీర్ ఇవ్వడం మంచిది. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఇది అవసరం లేదు. ఉదయం అల్పాహారం మొదలుకొని లంచ్, డిన్నర్‌తోపాటు మనం తీసుకునే స్నాక్స్ క్యాలరీలు రెండు వేలకు మించకూడదు. ఒకవేళ స్నాక్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తే... మెయిన్ మీల్ తగ్గించుకోవాలి.

టీనేజర్స్ ఇలా తీసుకుంటే చాలు
సమయానికి భోజనం చేయకపోవడం యుక్త వయసు వారిలో ఉండే ప్రధాన సమస్య. ఉదయం టిఫిన్ మొదలుకొని రాత్రి భోజనం వరకు ఏదీ సమయానికి తీసుకోరు. ఇలాంటివారు ఒకేసారి ఆకలితో హెవీ మీల్స్ చేయడం వల్ల అధిక బరువు పెరుగుతారు. వీరు చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి. బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ రూపంలో తాజా పండ్లను తీసుకోవాలి. దీంతో కావాల్సినన్ని క్యాలరీలు లభిస్తాయి. కడుపు నిండినట్లు ఉంటుంది.

మధ్యాహ్న భోజనం తరువాత కూడ ఇదే చేయాలి. మొలకెత్తిన విత్తనాలు, ఫ్యాట్ తక్కువగా ఉండే మజ్జిగ, ఇతర మిల్క్‌షేక్స్, ఫ్లేవర్ మిల్క్‌లాంటివి తీసుకోవాలి. సాధారణంగా మహిళలు 30 ఏళ్లు, పురుషులు 35 ఏళ్లు దాటిన తరువాత బరువు పెరగడం మొదలవుతుంది. అది ఊబకాయానికి దారి తీయవచ్చు. క్రమేణా రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతలకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలోనే నోటిని అదుపులో ఉంచుకోవాలి.

బ్యాలెన్స్ తప్పితే అధిక బరువుతో బాధపడాల్సి వస్తుంది. బరువులేని వారు తగినంత బరువు పెరగాలంటే... మెయిన్‌మీల్‌తో పాటు పాప్‌కార్న్, మరమరాలు, చాక్లెట్ ఫ్లేవర్స్, కొవ్వు పరిమాణం తక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవాలి. బేకరీ ఐటమ్స్‌లో మైదా ఎక్కువగా ఉంటుంది. వీటిని చిన్నారులకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వయసు పైబడిన వారు
వయసుపెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గుతుంది. బీపీ, షుగర్ దరిచేరుతుంది. దీంతో జీర్ణశక్తి సన్నగిల్లుతుంది. పెరిగే వయసురీత్యా స్నాక్స్ రూపంలో బొప్పాయి, దానిమ్మ పండ్లు, కీర దోస, క్యారెట్లు తీసుకోవడం మేలు. ఆహారంలో విటమిన్-ఎ, సి ఉండేటట్లు చూసుకోవాలి. ఓట్స్, బిస్కెట్స్‌లాంటివి కూడా తీసుకోవచ్చు.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. స్నాక్స్ సరైన సమయంలో తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తిన్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తీసుకోవాలి. లంచ్ ఒంటి గంటకు ముగిస్తే 4 గంటల సమయంలో మళ్లీ స్నాక్స్ తీసుకోవాలి. రాత్రి 8 గంటల్లోగా డిన్నర్ తప్పకుండా ముగించాలి. ఈ విధంగా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

సకల వ్యాధి నివారిణి మొరోనీ

fruit
చూపులకు సీతాఫలంలా...పై చర్మం తీసేస్తే పైన్‌యాపిల్‌లా సాదాసీదా గా కనిపించే ఆ పండు మనిషి శరీరం మీద దాడిచేసే అనేక రుగ్మతలకు కారణభూతమైన రోగధాతువుల మీదేగాక...మానవ శ రీరంలో మృతకణాలను సై తం పునరుజ్జీవింపజేయడం లో అలుపెరుగని సైనికునిలా అ విశ్రాంత పోరాటం చేసే ది వ్యౌషధ గుణాలను కలిగిన ఫలం మొరోనీ.

పదివేల సంవత్సరాల క్రితమే మొరిండా సిట్రోఫోలి యా సంతతికి చెందిన మొరోని పండు భారతదేశ ంలో విరివిగా లభ్యమయ్యే ది. అప్పట్లో ప్రజలు దీనిని ఆయుష్షు పెంచే ఫలంగా గుర్తించి ఆయుష్షుఫలం అ ని పిలిచేవారు. దీని ఫలం తీసుకుంటే రోగనిరోధకంగా పనిచేస్తుందని తన పరిశోధన ల సారాంశం చెప్పాడు.

ఏఏ రోగాలపై పనిచేస్తుంది: 1953లో డాక్టర్‌ రాల్ఫ్‌హెన్సికి అ నే బయోకెమిస్ట్‌ చేసిన విస్తత్ర పరిశోధనల్లో మొరోని ఫలం అద్భుత ఫ లితాలనిచ్చింది. రోగనిరోధక ఎం జైములు కొందరిలో చాలా తక్కువ శా తం ఉంటాయి. అటువంటివారికి రోజువారీగా మొరోనీఫలం జ్యూస్‌ క్రమం తప్పకుండా తీసుకుం టే వారిలో రోగనిరోధక శక్తి క్రమం గా పెరిగిం దని వైద్యులు ధ్రువీకరించారు.

రక్తపోటు తగ్గిస్తుంది:
noni-fruit
కొందరు హైబిపి, లోబిపితో బాధపడుతుంటారు. అయితే రక్తపోటుతో వచ్చే అనర్థాలను మొరోనీ దూరంగా ఉంచుతుంది. అధికరక్తపోటుకు గురయ్యే వ్యక్తికి గుండెజబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మనిషి ఈ ఫలం రోజూ తిం టే గుండెజబ్బుకు గురవకుండా ఉంటాడు.రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని పరిశోధనల్లో రుజువయింది.

కొలెస్ట్రాల్‌ నివారణ :మొరోనీలో కావలసిన పరిమాణంలో కాల్షియం, ఫైబర్‌ ఉండటంతో మనిషి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు శాతం కరిగించి అధిక కొలెస్ట్రల్‌తో బాధపడేవారిని ఆరోగ్యంగా ఉంచగలిగేలా చేస్తుంది.బ్రెయిన్‌, కిడ్నీ, లివర్‌:ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం దీనిని ప్రతినిత్యం తీసుకుంటే బ్రెయిన్‌, కిడ్నీ, లివర్‌లకు సంబంధించిన రోగాలు దరిచేరకుండా ఉంటాయి. కొంతమందికి జ్ఞాపకశక్తి ఎక్కువగా క్షీణించిపోతూ ఉంటుంది. చదువుల్లో కూడా వెనకబడిపోతుంటారు. అటువంటి వారికి కూడా ఈ ఫలం దివ్యంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

క్యాన్సర్‌ నివారణలో...క్యాన్సర్‌ వ్యాధికి కారకమైన అల్సర్లు రాకుండా జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.కడుపులో వుండే వ్రణాలను కూడా పెరగనివ్వకుండా చేయడంలో మొరోని పాత్ర అమోఘం.ఆస్త్మాను అదుపు చేస్తుంది:నేటి కాలుష్యకారక వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఆస్త్మా వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆస్త్మాని నివారించడంలో మొరోనీకి సాటి మరొకటి లేదు.

నూతన యవ్వనం:మొరోనీ ఫలం గుజ్జును విదేశాలలో ఫేషియల్‌ క్రీమ్‌గా కూడా వాడుతున్నారు.శరీరంపై ముడుతలు, నల్లని చారలు, తెల్లమచ్చలు తొలగిపోయి శరీరం మృదువుగా తయారవుతుంది.

హెచ్‌ఐవి నివారణలో: ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఇటీవల 105 మంది హెచ్‌ఐవి రోగులపై దీనిని ప్రయోగించి చూడగా దాదాపు 56 శాతం అద్భుత ఫలితాలు వచ్చాయి. ఇంకా పూర్తిస్థాయిలో దీనిమీద పరిశోధనలు సాగిస్తున్నారు. ముందు ముందు ఎయిడ్స్‌ నివారించడం లోనూ ఇది ప్రముఖపాత్ర వహిస్తుం దంటే ఆశ్చర్యమే మరి.

Tuesday, December 30, 2008