Showing posts with label యోగ - ఫిట్ నెస్. Show all posts
Showing posts with label యోగ - ఫిట్ నెస్. Show all posts

Monday, August 6, 2012

సర్వరోగ నివారిని ప్రాణాయామం

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు
benefa 

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.


వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
  • శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
    Sitaa
  • రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
  • బయటికి వెళ్లి పోతుంది.
  • గుండెకు సత్తువ లభిస్తుంది.
  • మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
  • జఠరాగ్ని పెరుగుతుంది.
  • శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

    3. తీసుకోవలసిన జాగ్రత్తలు
    • మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
    • కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
    • గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
    • మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
    • ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
    • అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
    • ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
    • పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
    • నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
    • నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
    • ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
    • రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
    • ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
    • ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

Tuesday, March 27, 2012

యువతరం ధ్యాన మంత్రం

http://www.yogiinterrupted.com/wp-content/uploads/2011/11/How-to-Meditate-Properly1.jpg
‘నిత్యం పని ఒత్తిడి..శారీరకంగా..మానసికంగా ఎంతో అలసిపోతున్నాం ..పెరుగుతున్న పోటీతత్వం కారణంగా ఎప్పటికప్పుడు సామర్ధ్యం పెంచుకుంటూ పోటీ పడాల్సి వస్తోంది. ఇంటి బాధ్యతలు..బంధుత్వాలు .. స్నేహాలు ఇలా ప్రతిక్షణం మనిషిని చుట్టే ఆలోచనలు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారుు. మనసులు మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారుు. ఈ బాధ్యతలన్నీ సరైన ప్రణాళిక లేకుంటే ఏ పనీ సరిగా చేయలేం. అనుకున్నవన్నీ సాధించలేం. దీని నుంచి ఎలా బయటపడాలి ? జీవితంలో విజయం ఎలా సాధించాలి ? ఆనందంగా ఎలా ఉండాలి ? సమాజ నిర్మాణంలో మన బాధ్యత ఏంటి ? ఇలా ఎప్పుడైనా ఆలోచించామా ? అనేక శారీరక రుగ్మతలకు మానసిక దుర్బలత్వమే కారణం. మరి మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండా లంటే తగిన వ్యాయామం చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడుకు పదును పెట్టాలి. అంటే మనసును ప్రక్షాళన చేసుకోవాలి. ఇందుకు ధ్యానం చక్కటి మార్గం. ప్రస్తుతమున్న జీవన విధానం కన్నా ఉన్నతంగా ధ్యానం ద్వారా జీవితాన్ని గడపవచ్చని ధ్యానేకంద్రాల నిర్వాహ కులు చెబుతున్నారు.
Yogad 
ఏదైనా పవిత్ర లక్ష్యాన్ని నిర్థారించుకుని దానిపైనే దృష్టి నిలపడం ధ్యానం. ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. ధ్యానం యోగాలో ఒక భాగం. మన పూర్వీకులు అనేక సంవత్సరాలు పరిశో ధన చేసి మానవ శరీరం యోగా రూపంలో గొప్ప ఆద్యాత్మిక శక్తిని సాధించే ప్రక్రియను ప్రపంచానికి అందించారు. యోగాకు ఆద్యుడు పతంజలి సూచించిన ప్రకారం ఎనిమిది నియమాలతో కూడుకుంది . భౌతిక శాస్తప్రరంగా, సాంకేతిక విజ్ఞానపరంగా ఎంతో వృద్ధి సాధించినప్పటికీ సంతోషంగా మనం జీవించలేకపోతున్నాం. ఈ దిశగా ఆలోచిస్తే యోగా అవసరమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా, ధ్యానం సాధనచేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సాధకులు చెబుతున్నారు.

యోగా ప్రయోజనాలు ఇవీ...

Yoga3 
మనం సాధన చేసే తీరును బట్టి ఫలితాలు ఉంటాయి. మనం ప్రతి రోజూ భౌతిక విధులు నిర్వర్తిస్తున్నట్లుగానే ధ్యానాన్ని కూడా నిత్యకృతగా మార్చుకుంటే మంచి ఫలితాలు బోధపడతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. కేవలం శారీరక, మానసిక ఆరోగ్యా లకే ఈ ధ్యానం పరిమితం కాదు. మనం ప్రశాంతంగా జీవిస్తూ, మన చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే ధ్యానం. నిర్మాణాత్మక సమాజం దిశగా మనం పయనించేందుకు ధ్యానం గొప్ప వరం. సాంప్రదాయ యోగా క్రమేణా అనేక పద్ధతుల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నో సంస్థలు పలు రకాలుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తూ వాటి కేంద్రాలను విస్తరిస్తున్నాయి. http://yogalina.files.wordpress.com/2012/01/pilates_mat_class_joyg-ay24.jpg
విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...
యోగా మన దేశంలో పుట్టినప్పటికీ విదేశా ల్లోనే ఎక్కువ ఆదరణకు నోచుకుంటోందని యోగా గురువు ఎ.ఎల్వీ కుమార్‌ చెబుతున్నారు. అన్నారు. అమెరికా, స్వీడన్‌, కెనడా, యుకె, పోలెండ్‌ దేశాలకు చెందిన 20 మంది పాశ్చాత్యులు యోగా నేర్చుకోవడానికి ఇటీవల భాగ్యనగరానికి విచ్చేశారు. యోగా హీలింగ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్చంద సంస్థ సాంప్రదాయయోగా (ట్రెడిషనల్‌ యోగా) లో టీచర్లకు గత కొద్ది కాలంగా శిక్షణను అందిస్తోంది. శిక్షణలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామ, శ్వాస పద్ధతులు, మెడిటేషన్‌ తదితర అంశాలపైన క్లాసులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యోగా పరిచయం, ఎక్‌స్టర్నల్‌ (బహిర్గత), ఇంటర్నల్‌ (అంతర్గత) యోగా, ఇతర ప్రత్యామ్నాయ శాస్తల్రను బోధిస్తున్నారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ...
Yogal 
ప్రధానంగా ధ్యానం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. రిథమిక్‌ టైప్‌ ఆఫ్‌ బ్రీథింగ్‌లో ఆరు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు మూడు గంటలపాటు ప్రాణా యామం బస్ర్తిక, సుదర్శన్‌ క్రియల్లో శిక్షణ ఇస్తారు. ఈ ధ్యానం వల్ల శరీరానికి 72 నుంచి 80 శాతం వరకు గాలి అదనంగా అందుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీనిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అందిస్తోంది. కోర్సు పూర్తయిన తరువాత ప్రతి రోజూ 20 నిముషాల పాటు దీనిని కొనసాగిస్తే సరిపోతుంది.
-ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ ఫీచర్స్‌ ప్రతినిధి

Tuesday, August 30, 2011

మత్స్యాసనం లంగ్ క్లీనర్*మత్స్యాసనం వెయ్యడమంటే... జీవకణాలకు ప్రాణవాయువును పంప్ చెయ్యడమే!!

గాలీ వెలుతురు ధారాళంగా ఉన్న ఇంట్లో చెమ్మ చేరదు.
ఊపిరి సాఫీగా ఉన్న ఒంటికి రోగమూ రొప్పూ ఉండదు.
పండగొస్తోంది.
గూళ్లు గుమ్మాలు ఎలాగూ దులుపుకుంటాం.
అలాగే శ్వాసకోశాలనూ కాస్త శుభ్రం చేసుకుంటే...
పండగ సంతోషాలకు ఆస్త్మాలు,ఆయాసాలు అడ్డురావు.
మత్స్యాసనం శ్రద్ధగా సాధన చెయ్యండి. లంగ్స్‌ని క్లీన్ చేసుకోండి.
మత్స్యాసనం వెయ్యడమంటే...
జీవకణాలకు ప్రాణవాయువును పంప్ చెయ్యడమే!!


మత్స్యాసనం

ఈ ఆసన స్థితిలో ఊపిరితిత్తులు గాలితో నిండి శరీరం చేపలాగ నీటి మీద తేలడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని మత్స్యాసనం అంటారు. ఈ యోగసాధన ద్వారా ఊపిరితిత్తులకు వ్యాయామం అందుతుంది. దాంతో ఆస్త్మా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. దీనిని ఎలా చేయాలంటే...

పద్మాసన స్థితిలో కూర్చోవాలి. తర్వాత ఫొటోలో ఉన్నట్లు మోచేతుల సహాయంతో శరీరాన్ని మెల్లగా నేల మీదకు తీసుకురావాలి. ఈ స్థితిలో దేహం బరువు నడుము, మోచేతుల మీద ఉంటుంది. మెల్లగా వెన్ను, భుజాలు, తలను కూడా నేల మీదకు ఆనించి పడుకోవాలి.


అరచేతులను చెవులకు పక్కన నేలకు ఆనించాలి (ఈ స్థితిలో చేతి వేళ్లు భుజాలవైపు ఉండాలి). తర్వాత అరచేతుల మీద బలాన్ని మోపి నేలను నొక్కిపట్టి నడుమును, ఛాతీని పైకి లేపాలి. మెడను వెనక్కు వంచి తల నడినెత్తిని నేలకు ఆనించాలి.


ఇప్పుడు చేతులను తల పక్కనుంచి తీసి కాలివేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు నేలకు ఆని ఉంటాయి. ఇది మత్స్యాసన స్థితి. సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. అదెలాగంటే...


కాళ్లను వదిలి, అరచేతులను తలకు ఇరువైపుల నేలకు ఆనించాలి. తలను పైకి లేపి మెల్లగా భుజాలను నేలకు ఆనించిన తర్వాత తలను నేలకు ఆనించాలి. తర్వాత నడుము భాగాన్ని నేలకు ఆనించి, మోచేతుల సహాయంతో పైకి లేచి కూర్చోవాలి.


పద్మాసనాన్ని విప్పి శరీరాన్ని వదులు చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 3-5 సార్లు చేయాలి. పద్మాసనం వేయలేని వాళ్లు లేదా పద్మాసన స్థితిలో ఎక్కువ సేపు ఉండలేని వాళ్లు... మత్స్యాసనాన్ని అర్ధపద్మాసనం వేసి వేయవచ్చు. అదీ సాధ్యం కానప్పుడు కాళ్లు చాపి కూడా చేయవచ్చు. కింద చెప్పిన అన్ని ప్రయోజనాలు చేకూరాలంటే పద్మాసన స్థితిలోనే వేయాలి.


మత్స్యాసనం ప్రయోజనాలు!

థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంథులు, కంఠం ద్వారా మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి.

ఊపిరితిత్తులలోకి ప్రాణశక్తి బాగా అంది రక్తం శుద్ధి అవుతుంది.


ఉబ్బసం, ఆయాసం, శ్వాసనాళ సమస్యలు తగ్గుతాయి.


ఛాతీకండరాలు, మర్మాంగాలు శక్తిమంతం అవుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్దకం పోతుంది.


నడుము శక్తిమంతం అవుతుంది, గర్భకోశ సమస్యలు తగ్గుతాయి.


టాన్సిల్స్, మధుమేహం, మెదడు సమస్యల నుంచి ఉపశమనం.


నరాల సమస్యలు, చెవి, ముక్కు వ్యాధులు తగ్గుతాయి.


మత్స్యాసనాన్ని వీళ్లు చేయకూడదు!

సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని చేయకూడదు.

హెర్నియా ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.


ఆస్త్మా నివారణకు ఉపకరించే మరికొన్ని యోగాసనాలు ఇవి!

ఉష్ట్రాసనం, శశాంకాసనం, శలభాసనం, సుప్తవజ్రాసనం, ధనురాసనం, భుజంగాసనం, కోణాసనం, పశ్చిమోత్తాసనం, సూర్యనమస్కారాలు, పవనముక్తాసనం, జలనేతి, సూత్రనేతి, కపాలభాతి, ఉజ్జయి, కుంజరధౌతి, విభాగ ప్రాణాయామం... మొదలైనవి. వీటిలో అనేక యోగాసనాలు గత సంచికలలో ప్రచురితమయ్యాయి.
మోడల్: మానస
- వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఆయుర్వేదంలో..!

ఆస్త్మా తమకశ్వాసరోగం. ఇది కఫం, వాతం ప్రధానంగా వచ్చే వ్యాధి. దీని లక్షణాలలో ప్రధానంగా కనిపించేది శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలతో కూడిన ఆయాసం. ఇలా బాధపడేటప్పుడు ముఖాన్ని నేలకు చూస్తున్నట్లుగా కూర్చుంటే బాధ ఉపశమించినట్లు ఉంటుంది, అదే ఆకాశంలోకి చూస్తున్నట్లు అంటే వాలు కుర్చీలో కూర్చున్నప్పుడు తీవ్రత ఎక్కువవుతుంటుంది.
ఆస్త్మాను నివారించడానికి రోజూ ప్రాణాయామం చేయడం ఉత్తమమైన మార్గం. అలాగే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి.

ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు, ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు. అదే విధంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం... ఆస్త్మాతో బాధపడుతున్న సమయంలో ప్రాణాయామం కాని ఏ ఇతర యోగా ప్రక్రియలను కూడా సాధన చేయకూడదు.


ఆస్త్మా తక్షణ నివారణకు: మూడు చెంచాల ‘కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ‘శృంగారాభ్రరస’ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. వీటితోపాటు ఛాతీకి, నడుముకు కర్పూరతైలాన్ని రాసి వేడి నీటి కాపడం పెట్టాలి.


అలర్జీలను కలిగించే వాటిని గమనించి, అవి ఆహారం, దుస్తులు, కాస్మటిక్స్... ఇలా ఏవైనా సరే వాటికి దూరంగా ఉండాలి.

- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యనిపుణులు

ఆస్త్మా తగ్గించే ఆహారం

కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

బేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.


ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.


ఇలా కూడా తీసుకోవచ్చు...

పసుపు కలిపిన పాలు తాగాలి. స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. - పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.

ఇవి వద్దు!

పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.

‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.

- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్

Sunday, July 17, 2011

ప్రాథమిక వ్యాయామాలు

మీరు చేయబోయే ఈ వ్యాయామాలకు ముందుగా మీ శరీరాన్ని, కండరాలను సిద్ధం చేయాల్సివుంటుంది. ఇవి మీ కండరాలలో ఉన్న స్తబ్ధతను పొగొట్టి, మీ కండరాలలో మార్పును, మృదుత్వాన్ని సులభంగా వంగగల గుణాన్ని కల్గిస్తాయి. సంకోచ వ్యాకోచాలను, రిలాక్స్‌ అవ్వడం, బిగపట్టడం వంటి చర్యలకు మీ కండరాలు సిద్ధం అవుతాయి. ఈ వ్యాయామాలు మీ శ్వాసక్రియను పెంచుతాయి. రక్తప్రసరణ చైతన్యవంతమవుతుంది. ఎక్కువ ఆక్సిజన్‌ మీ కణధాతువులకు అందుతుంది. మీరు సెక్సర్‌సైజులు చేసేముందు మీ వీలును బట్టి ఈ ప్రాథమిక వ్యాయామాలను రెండు మూడు తక్కువ కాకుండా చేయాలి. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తే.. మరీ మంచిది. ఈ వ్యాయామాలు గాఢంగా, లోతుగా శ్వాసించడానికి మీ రక్త ప్రరణను పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.
ఎక్సర్‌సైజ్‌ నెం.1: ఉన్నచోటే పరుగెట్టడం...
lady-standనిటారుగా నిలుచోండి. చేతులు ఫొటోలో చూపిన విధంగా పెట్టండి. మొ దట్లో కాలుని చాలా తేలికగా పైకి ఎత్తుతూ ఉన్నచోటే పరు గుపెట్టండి. క్రమంగా.. వేగాన్ని పెంచండి. చేతులను, భుజాల దాకా చాపి, క్రిందికి దింపుతూ, ముందుకు వెనక్కి కదిలించాలి. మీ శ్వాసక్రియ ఊపందుకొని, రొప్పే దశకు చేరుకున్నప్పుడు తిరిగి వేగాన్ని తగ్గిస్తూ.. పరుగు ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.2: గెంతడం...
vatsముందు నిటారుగా నిలబడండి. కాళ్ళు బాగా విడదీయండి. చేతుల్ని చెరోవైపు సాగదీసీ చాపి గెంతండి. కాళ్ళను మళ్లీ దగ్గర చేర్చండి. చేతుల్ని మీ తొడలమీదకు చేర్చండి. మళ్లీ గెంతండి. కాళ్ళు ఎడంగా పెట్టి చేతులు చాపండి. క్రమంగా వేగం పెంచండి. కాళ్ళు, చేతులు గట్టిగా సాగదీయడం బట్టి మీ గెంతులో ఊపు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం రొప్పేదాకా చేసి ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.3: గొంతుక్కూ చోండి...
stand(ఎ) నిటారుగా నిలబడండి. పాదాలను విడిగా వుంచండి. చేతుల్ని ఫొటోల్లో చూపిన విధంగా పెట్టండి. (బి) క్రిందికి మోకాళ్ళు పైకూర్చోండి. పిరుదులు మడమలకు తగలాలి. (సి) తరువాత చేతుల్ని ముందుపెట్టి పాదాల్ని వెనక్కి తీసుకు వెళ్లి ముని వేళ్లపై ఆన్చండి. తిరిగి లేచి నిలుచోండి. ఇలా నెమ్మదిగా మొదలుపెట్టి వేగం పెంచండి. రొప్పే దాకా చేసి ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.4: తొడలను పట్టండి...
bendsనిటారుగా నిలుచోండి. (ఎ) చేతుల్ని నడుము మీద ఉంచుకోండి. (బి) అడుగు ముందుకువేసి కుడికాలుని కర్ణదిశగా పెట్టి ఫొటోలో చూపిన విధంగా రెండు చేతులతో తొడను బంధించండి. ఇలాగే కుడి కాలితో కూడా చేయండి. ఈ వ్యాయామాన్ని పదిసార్లు రిపీట్‌ చేయండి. రొప్పేదాకా ఇలా చేసి ఆపండి.


ఎక్సర్‌సైజ్‌ నెం.5: పాక్షికంగా గుంజిళ్ళు...
vastకుడికాలికి, ముందర ఎడం కాలు పెట్టి నిటారుగా నిలబడండి. చేతుల్ని ఇలా తల వెనుక మీ శరీరాన్ని మోకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ... చేతుల్ని ఇలా తలవెనుక మీ శరీరాన్ని మొకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ.. ఒక్కసారి స్ప్రింగులా గెంతి మీ పాదాలతో నేలను తన్నండి. కాళ్ళు పెట్టే దిశను మార్చి రిపీట్‌ చేయండి. ఇలా పదిసార్లు చేయండి. ఊపరి వేగం పుంజుకున్నాక ఆపండి.

ఎక్సర్‌సైజ్‌ నెం.6: ముందుకీ, వెనక్కి వంగోండి...
vat1నిటారుగా నిలబడండి. మీ మొండాన్ని ముందుకు వంచి చేతులిలా పెట్టండి (ఎ) మీ చేతుల వేళ్ళతో నేలను తాకే ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంగకూడదు. తరువాత నిటారుగా నిలబడి భుజాలను వాల్చండి. తరువాత వెనక్కి వంగం డి. ప్రతీసారీ వీలైనంత ఎక్కువగా వెనక్కి, క్రిందికి వంగటానికి ప్రయత్నించండి (బి). అయిదుసార్లు ఇలా చేయండి. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ అయిదుసార్లు చేయండి.

Tuesday, July 12, 2011

కపాలభాతి యోగ స్నానం

స్నానం చేస్తాం. శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తాం. తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తాం. బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తాం. మసాజ్‌లా ఉంటుంది.అయితే - ఇవన్నీ పైపై స్నానాలు. కాకిస్నానాలు. లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. ఈవారం కపాలభాతి ఆసనం నేర్పిస్తున్నాం. సాధన చెయ్యండి. మెదడుకు, శ్వాసకోశాలకు, జీవక్రియలకు లాలపొయ్యండి. గాల్లో తేలినట్లు లేకపోతే అడగండి.

కపాలభాతి ప్రయోజనాలు:

మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి

శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది


ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది


జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి


సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి


కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది

వీళ్లు చేయకూడదు!
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.

ఎప్పుడు చేయాలంటే!

ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.


జాలంధర బంధం అంటే గడ్డాన్ని ఛాతీకి బంధించి ఉంచడం, మూలబంధం అంటే మలద్వారాన్ని పైకి లేపి ఉంచడం, ఉడ్యానబంధం అంటే పొట్టను బిగించడం.


బాహ్య కుంభకం అంటే శ్వాస వదిలిన తరవాత కొద్దిసేపు తీసుకోకపోవడం (ఊపిరి బిగపట్టడం). ఇలా ఉండగలిగినంత సేపు మాత్రమే ఉండాలి.


అంతర వ్యాయామం: ఆయుర్వేదం

కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు.
- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు
యోగశాస్త్రం ప్రకారం
‘కపాలం’ అంటే మస్తిష్కం లేదా మెదడు. ‘భాతి’ అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపచేసే క్రియ కాబట్టి దీనిని కపాలభాతి అంటారు. ఇది షట్‌క్రియల్లో ఒకటి అయినప్పటికీ ప్రాణాయామంలో భాగంగానూ సాధన చేయవచ్చు. దీనిని నాలుగు దశల్లో చేయాలి. గతవారం భస్త్రిక ప్రాణాయామాన్ని ఐదు దశల్లో సాధన చేశాం. భస్త్రికలో గాలిని తీసుకోవడం, వదలడం రెండూ ఉంటాయి, కపాలభాతితో గాలిని వదలడమే ప్రధానం. శ్వాస తీసుకోవడం అప్రయత్నంగా జరగాలి తప్ప, ప్రయత్నపూరకంగా గాఢంగా, దీర్ఘంగా తీసుకోవడం అనేది ఉండదు.
సాధన ఇలా!పద్మాసన స్థితిలో వెన్ను, మెడ నిటారుగా ఉంచి, చేతులను వాయుముద్రలో మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లుమూసుకోవాలి, ముఖంలో ప్రశాంతత ఉండాలి.

మొదటి దశలో...

కుడి చేతి పిడికిలిని బిగించి, బొటనవేలితో ముక్కు కుడిరంధ్రాన్ని మూసి, ఎడమరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి. శ్వాసను వదిలినప్పుడు కడుపు భాగం లోపలికి ముడుచుకోవాలి. ఇలా 10-20 సార్లు చేయాలి. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ చేయాలి.

రెండవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి వాటి మీద బొటనవేలిని ఉంచాలి. ఉంగరపువేలు, చిటికెన వేళ్లతో ముక్కు ఎడమయంధ్రాన్ని మూయాలి. ముక్కు కుడిరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి.

మూడవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి, బొటన వేలితో ముక్కు కుడి రంధ్రాన్ని, చివరి రెండు వేళ్లతో ఎడమ రంధ్రాన్ని మూయాలి. ఇప్పుడు ఎడమరంధ్రం మీద ఉన్న వేళ్లను తీసి శ్వాసను వదలాలి. శ్వాసను పూర్తిగా వదిలిన వెంటనే చివరివేళ్లతో ఎడమరంధ్రాన్ని మూయాలి. తర్వాత ముక్కు కుడిరంధ్రం మీద ఉన్న బొటనవేలిని తీసి శ్వాసను పూర్తిగా వదలాలి.

నాలుగవ దశలో...

చేతులను వాయుముద్రలో ఉంచి శ్వాసను బలంగా వదలాలి. 10 -20 సార్లు చేయడం, మధ్యలో విశ్రాంతి, అప్రయత్నంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలినప్పుడు కడుపులోపలికి పోవడం వంటి నియమాలు అన్ని దశల్లోనూ యథాతథం. కపాలభాతిలో 90శాతం నిశ్వాస, పదిశాతం ఉచ్వాశ జరగాలి.

నాలుగు దశలూ పూర్తయిన తర్వాత శ్వాసను వదిలి మూలబంధం, ఉడ్యానబంధం, జాలంధర బంధం వేయాలి. ఈ బంధాలన్నింటినీ బాహ్య కుంభకంలోనే వేయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత బంధాలను విడవాలి. ముందుగా ఉడ్యానబంధం, తర్వాత జాలంధర బంధం, మూలబంధాలను విడవాలి. బంధాలను వేయడం, విడవడంలో క్రమం మారుతుంది. చివరగా విశ్రాంతి తీసుకోవాలి.

 












 
కొవ్వు శక్తిగా మారే ప్రక్రియ
మన శరీరంలోని కొవ్వును ఎల్ కార్నిటైన్ అనే పోషకం శక్తిగా మారుస్తుంది. ఎల్ కార్నిటైన్ తగ్గినా, దాని పనితీరు మందగించినా కొవ్వు శక్తిగా మారకుండా నిల్వ ఉండిపోతుంది. ఇది బాగా పనిచేయాలంటే దేహానికి తగినంత ఆక్సిజన్ అవసరం. కపాలభాతి సాధన చేసేవాళ్లు సమతుల ఆహారం తీసుకోవడం, మద్యపానం, ధూమపానం, జంక్‌ఫుడ్, స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులను మానేయడం. కార్బోహైడ్రేట్లను తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటిస్తే నెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బరువు తగ్గుతారు.

- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్

- వాకా మంజుల,  ఫొటోలు: అమర శ్రీనివాసరావు.వి , మోడల్: పూజిత

షుగర్ ఉంటే ఊబకాయం!

 http://rlv.zcache.com/diabetes_obesity_diabesity_tshirt-p235492290384050037trlf_400.jpg
మధుమేహంతో బాధపడుతున్న వారికి తాజాగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 మధుమేహం ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు అధికబరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వస్తున్నది. అమెరికాలో ఈ మేరకు జరిపిన అధ్యయనాల్లో బెంబేలెత్తించే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికాలో టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో 62శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. 20 శాతం మంది మరీ ఎక్కువ బరువైపోయి, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని లయోలా హెల్త్ యూనివర్శిటీ చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్య పెరిగితే భవిష్యత్‌లో పలు చిక్కులు ఎదురవుతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పౌష్టికాహారం తీసుకోక పోవటం, సోడా వినియోగం పెరగటం, వ్యాయామం తగ్గటం వల్ల మధుమేహంతోపాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 7.8శాతం అంటే 2.3 కోట్ల మంది మ«ధుమేహ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇందులో 90శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. తగినంత వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో అక్కడ మధుమేహం సమస్య పెరిగిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆహారపు ఆలవాట్ల విషయంలో అమెరికా బాట పడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలేమో?
మధుమేహంతో బాధపడుతున్న వారికి తాజాగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 మధుమేహం ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు అధికబరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వస్తున్నది. అమెరికాలో ఈ మేరకు జరిపిన అధ్యయనాల్లో బెంబేలెత్తించే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికాలో టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో 62శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. 20 శాతం మంది మరీ ఎక్కువ బరువైపోయి, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని లయోలా హెల్త్ యూనివర్శిటీ చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్య పెరిగితే భవిష్యత్‌లో పలు చిక్కులు ఎదురవుతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పౌష్టికాహారం తీసుకోక పోవటం, సోడా వినియోగం పెరగటం, వ్యాయామం తగ్గటం వల్ల మధుమేహంతోపాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 7.8శాతం అంటే 2.3 కోట్ల మంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇందులో 90శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. తగినంత వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో అక్కడ మధుమేహం సమస్య పెరిగిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆహారపు ఆలవాట్ల విషయంలో అమెరికా బాట పడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలేమో?

షుగర్ మోసుకొచ్చే 'టీవీ'క్షణం
మీరు రోజుకు రెండు నుంచి మూడు గంటలు టెలివిజన్ చూస్తున్నారా? అయితే మీకు పలు రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతీ రోజు టీవీ ఎక్కువగా చూసే వారిలో మధుమేహం టైప్ 2 ముప్పు వచ్చే అవకాశాలు 20శాతం ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఒక్క మధుమేహమే కాదు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 15శాతం అధికంగా ఉంటుంది. టీవీ ఎక్కువగా చూసేవారిలో 13శాతం వివిధ కారణాల వల్ల మృత్యువుకు చేరువ అవుతున్నారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. టీవీ రోజుకు మూడు గంటలు చూస్తున్నారంటే, ఆ సమయంలో తీసుకుంటున్న ఫ్రైడ్ ఆహారపదార్థాలు, తీపి పానీయాలు కొలెస్ట్రాల్, బ్లడ్‌షుగర్‌లను పెంచుతుందని తేలింది. దీనివల్ల ఒబేసిటీ, బీపీ, హైబ్లడ్‌షుగర్ లాంటి సమస్యలు పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. చిప్స్‌లో ఆయిల్, ఉప్పుతో పాటు అధిక కేలరీలు ఉంటాయి. ఇవి తినటం వల్ల వివిధ జబ్బులు వచ్చిపడతాయని యూనివర్శిటీ సదరన్ డెన్మార్క్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

షుగర్ ఉంటే ఇలా తినాలి
మధుమేహం ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ పిరమిడ్‌లో సూచించిన విధంగా ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించే వీలుంటుంది. మధుమేహం ఉన్న వారు స్వీట్లు, ఆల్కహాల్ తీసుకోరాదు. తీసుకున్నా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇక పాలు, మాంసాహారాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. ఇక చిరుధాన్యాలు, బ్రెడ్ వంటి పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Saturday, January 29, 2011

పని పెంచండి..బరువు తగ్గండి!

పక్క వీధిలోని పాలబూత్‌కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే... కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే... బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్... అంట్లు కడగడానికి ఓ పనిమనిషి... పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ.... ఇదీ మారిన మన లైఫ్‌స్టైల్. చివరకు మనకు మిగిలిందేమిటి.... వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లకై వెదుకులాట.

* * * పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లడం.... చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం..... ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు... అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. కారణం... ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు.

వెయిట్ తగ్గించే అద్భుతాలు

స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్, క్రీములు, పౌడర్లు, టీలు (డాక్టర్ టీ), డైట్ సప్లిమెంట్లు... ఇలా చెప్పుకొంటూ పోతే బరువు తగ్గించేవని చెప్పేవి మార్కెట్లో సవాలక్ష ఉన్నాయి. కొన్ని ఫిట్‌నెస్ సెంటర్లయితే వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్ల పేరుతో మనీ బ్యాక్ పాలసీ లాంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాసౌండ్ చికిత్సలు, మసాజ్‌లు, రేడియేషన్ల వంటి వాటితో కొవ్వు కరిగిస్తామంటున్నాయి. కొన్ని జేబుకు చిల్లు పడటమే తప్ప వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు బాధితులు. 'స్లిమ్మింగ్ మెషీన్ సహాయంతో మీ శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా తగ్గించేస్తామన్న మాటలు నమ్మి లక్షన్నర రూపాయలు చెల్లించాను.

స్లిమ్మింగ్ పరికరం ఉత్పత్తి చేసే వేడి కొవ్వును కరిగిస్తుందని నమ్మబలికారు. కానీ ఒక ఇంచు కూడా బరువు తగ్గలేదని వాపోయారు హైదరాబాద్‌కు చెందిన ఓ యాంకర్. మొత్తం బాడీ మసాజ్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని వెళ్లిన కాల్‌సెంటర్ ఉద్యోగిని అయిన ప్రమీల వాళ్లు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. రోజూ అరగంట సేపు వాకింగ్, తరువాత మరో అరగంట ఎక్సర్‌సైజ్ చేయడం వారానికి మూడుసార్లు తమ సెంటర్‌లో ఓ గంటసేపు మసాజ్...

నెలరోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గుతారని చెప్పడంతో ఇక తను తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టింది ప్రమీల. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా అలా బయటకు వెళితే చాలు.. ఏ బేకరీకో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కో వెళ్లడం రుచిగా ఉన్నదల్లా లాగించెయ్యడం... తరువాత బరువు పెరిగిపోతున్నామని బాధపడటం... ఇటీవలి కాలంలో ఈ తరహా ధోరణి ఎక్కువయింది. ఎక్కువ కష్టపడకుండా వెంటనే బరువు తగ్గిపోవాలన్న కోరికతో స్లిమ్‌బెల్టులు, స్లిమ్ మెషీన్లు కొని తెచ్చిపెట్టుకోవడం, స్లిమ్ క్యాప్సుల్స్, యాంటి ఒబేసిటీ మందుల్లాంటివి వాడటం వల్ల అనుకున్న ఫలితం పొందడం మాట అటుంచి ఇతరత్రా సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది.

అసలైన మంత్రం

అందుకే బరువు తగ్గడానికి రాచబాట లాంటి వ్యాయామాన్ని వదిలేసి యంత్రాలపై ఆధారపడటం సరికాదు. వ్యాయామం చేసేందుకు సమయం సరిపోవట్లేదంటారు చాలామంది. కానీ ఆరోగ్యాన్ని మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఎంత అర్జెంట్ పనులున్నా వ్యాయామం కోసం కనీసం ఓ అరగంట సమయాన్ని కేటాయించాలి. మన రోజువారీ పనుల్లో కూడా కాస్త బద్దకాన్ని వదిలితే బరువు తగ్గించుకోవడం మన చేతుల్లో పనే. ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లడానిక్కూడా లిఫ్ట్ వాడేబదులు నాలుగు అంతస్థులున్నా మెట్లు ఎక్కండి. పక్కనున్న షాప్‌కి నడిచే వెళ్లండి. మీ బాబును స్కూల్లో దింపడానికి బండి తీయకండి.

సాధ్యమైనంతవరకూ కాళ్లకు పనిచెప్పండి. 'హాస్పిటల్‌లో ఏ ఫ్లోర్‌కి, ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినా లిఫ్ట్ అసలే వాడను. బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటంలో నా రహస్యం అదే' అంటారు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు. అండుకే మీరూ బద్దకాన్ని వదిలి కొవ్వును కరిగించే వ్యాయామంపై దృష్టిపెట్టమంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం లేకపోతే మాత్రం ఎక్కడి కొవ్వు అక్కడే ఉంటుంది. అందుకే ఒకరిని చూసి ఒకరు వెయిట్ లాస్ సెంటర్ల వైపు పరుగులెత్తకుండా మంచి తిండి తినండి, బాడీకి పని పెట్టండి, ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు.
-కె.రచన

Thursday, January 6, 2011

చలిలో వాకింగ్!

* ఆరోగ్యంగా. ఫిట్‌గా ఉండాలంటే రోజూ కనీసం అరగంటైనా వాకింగ్ చేస్తే చాలు అంటారు నిపుణులు.
వేసవిలో అయితే పరవాలేదు. కానీ గజ గజ వణికించే ఈ చలిలో పొద్దున్నే లేచి, వాకింగ్ అంటే మాటలా..? మరెలా... పోనీ ఈ చలికాలం వాకింగ్ మానేస్తే...!
* ఒక్కరోజు బద్దకించి వాకింగ్‌కి వెళ్లకపోతే ఇక అంతే సంగతులు! మళ్లీ మూడ్ వచ్చే వరకు బ్రేక్ పడిపోతుంది. అందుకే చలిపులికి బెదరకుండా బద్దకం వదిలించుకుని వాకింగ్‌కి ఒక్క అడుగు వేయండి చాలు... మిగిలిన అడుగులు వాటికవే పడతాయి.

* వాకింగ్ కోసం ఏ పార్కుకో వెళ్తారు కదా. అక్కడి వరకూ వెచ్చని స్వెటర్ వేసుకుని వెళ్లండి. అక్కడి వరకూ వెళ్లిన తరువాత ఆటోమేటిగ్గా నడవడం ఎలాగూ మొదలెడతారు.
* వేగంగా వాకింగ్ చేస్తూ ఉంటే చలి ఎటో ఎగిరిపోతుంది. ముందు స్టార్ట్ చేయడానికే ఇబ్బంది.
* మరీ బయటకు వెళ్లలేమనిపిస్తే హాల్లోనే ఓ గంటసేపు వేగంగా నడవండి.
* పక్క మీద నుంచి లేచేవరకే బద్దకం. మెల్లగా లేచి బ్రష్ చేసుకోవడం మొదలుపెడితే నిద్రమత్తు వదులుతుంది.

4 నిమిషాల వ్యాయామం

రోజూ వ్యాయామం చేయాలనే అనుకుంటున్నా కానీ టైమ్ దొరకట్లేదు... అనుకునే కంప్యూటర్ ఉద్యోగులకు నాలుగు నిమిషాల్లో పూర్తిచేయగలిగే చిన్న చిన్న వ్యాయామాలు సూచిస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. వీటిని మీ డెస్క్ ముందే ఆఫీసులోనే చేయవచ్చు కూడా. అలాగని ఈ వ్యాయామాలను తీసిపడేయలేం. ఆఫీసులో ఉన్నప్పుడు గంటకోసారి వీటిని చేస్తే మెడనొప్పి, నడుంనొప్పి, కండరాలు పట్టేయడం లాంటి సమస్యలకు ఇవి దివ్యౌషధాలు. అవేంటో చూద్దాం మరి.

* రెండు చేతులను ముందుకు చాచి రెండు అరచేతులను కలిపి వుంచండి. అలా 10 నుంచి 20 సెకన్ల పాటు ఉండండి. చేతులు రెండూ స్ట్రెయిట్‌గా ఉండేలా చూడండి.
* ఇప్పుడు లేచి నిలబడి రెండు చేతులను అదేవిధంగా పైకి తీసుకురండి. మీ తల భాగం నుంచి నిటారుగా పైకి ఎత్తి పట్టుకోండి. ఇలా 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండండి.
* ఇప్పుడు రెండు చేతులను మడిచి అంటే ఒకదాని అరచేతిని మరోదాని మోచేతిపై ఉంచండి. అలా పైకే ఉంచండి. ఇప్పుడు మెడ, భుజం భాగాలను కుడివైపు కొద్దిగా వంచి, 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి. తిరిగి ఎడమవైపు కూడా ఇలాగే చేయండి.

* చేతులు కిందకి దించేసి భుజాలను పైకీ, కిందకీ ఎగరేయండి. ఇలా 3 నుంచి 5 సెకన్లు చేయండి. * కిందికి ఉన్న చేతులను వెనకాల ఒకదాన్ని ఒకటి పట్టుకోండి. మెడ, భుజాలను కుడి వైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి వంచి, ఒక్కోవైపు 10 నుంచి 12 సెకన్లు కేటాయించండి.

* దండం పెడుతున్నట్టుగా రెండు అరచేతులను కలిపి ఉంచండి. ఇలా 10 సెకన్లు ఉన్న తరువాత పైకి కలిపివున్న అరచేతులను కిందివైపు దించండి. ఇలా మరో 10 సెకన్లు ఉండండి.
* కుర్చీలో కూర్చుని ఒక చేయి నడుము మీదుగా కిందకి వేలాడదీసి, మరో చేతిని పైకి నిలబెట్టి పట్టుకోండి. రెండు చేతులనూ ఇలా చేయండి. ప్రతిసారీ 8 నుంచి 10 సెకన్ల పాటు ఉండండి.
* కూర్చునే ఉండి నడుం భాగాన్ని మాత్రం పైకి లేపి, తలను ఎత్తి ఉంచండి. దీనికి 10 నుంచి 15 సెకన్లు కేటాయించండి.

Sunday, January 2, 2011

శృంగారం యోగం

Vaastaayanam3‘యోగా’ అనే పదం సంస్కృతం పదం ‘యుగ’ నుండి పుట్టింది. ‘యుగ’ అంటే కలయిక అని అర్థం. పతంజలి విరచితమైన యోగాశాస్త్రం ప్రకారం కలయిక అంటే శారీరక, మానసిక స్థితుల సమాగమం అని అర్థం. యోగాశాస్త్రం మనకు శారీరక, మానసిక, ఆరోగ్య స్థితులను పొందడం ఎలాగో వివరిస్తుంది. ఈ శాస్త్రంలో వివరించబడిన యోగాసనాలు, శారీరక వ్యాయామాలు మన శారీరక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసిక వ్యవస్థను కూడా సంరక్షిస్తుంది...

మీలో శక్తిని, ప్రాణాధారశక్తిని, పెంపొందింపజేయడానికి వీలుగా మీ కండరాల ఆరోగ్యం, బలం పెంచడానికిగాను ఈ వ్యాయామాలు రూపొందించబడ్డాయి. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు మీరు ఆచరించే పలురకాల శారీరక భంగిమలు, కండరాల విస్తరణ, మెలితిప్పడాలు వగైరా చర్యలన్నీ మీ అంతర్గత అవయవాలన్నిటినీ ఉత్తేజితం చేస్తాయి. దాంతోబాటు సక్రమమైన పద్ధతిలో మీరు శ్వాసించగలగడం తద్వారా స్వచ్ఛమైన తాజాయైన ఆక్సిజన్‌ మీ శరీరంలోని ప్రతి కణానికి, నాడులకు సరఫరా కావడం, అవన్నీ పునరుత్తేజితం కావడం జరుగుతుంది. మీ లైంగిక కేంద్రంగా పనిచేసే వెన్నెముక చివరిభాగం బలపడడం ద్వారా మీ లైంగిక పటుత్వం పెరుగుతుంది.

Vaastaayanam లైంగిక పటుత్వం, సామర్థ్యం... ఇవి ఈనాడు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న అంశాలు. లైంగిక సామర్ధ్యానికి, డబ్బు, హోదా, కీర్తిప్రతిష్టలు, అధికారం, విజయం, శారీరక బలం, అందం ఇవేవీ నిశ్చయాత్మకమైన పాత్ర పోషించలేవు. ఇవన్నీ ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాలు ఏర్పడటానికి విస్తృతమైన అవకాశాలను కలిగిస్తాయే తప్ప, లైంగిక సామర్ధ్యానికి గ్యారెంటీ ఇవ్వలేవు. కాగా మనం నిత్యం అనుభవించే అపరిమితమైన ఒత్తిడి, నిరాశ, నిస్పృహలు లైంగిక సామర్థ్యంపై గణనీయమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి.

ఆత్మవిశ్వాసం, చక్కని మానసిక ఆరోగ్యస్థితి, అద్భుతమైన సెక్స్‌ సామర్థ్యానికి పెట్టుబడులు. స్ర్తీలలో రతిభయం, పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్కలనం వంటి సమస్యలు సాధారణంగా మానసిక కారణాల వల్ల ఏర్పడేవే. యోగా వ్యాయామాలు మన శరీరంలోని నాడీ కండరాల ధాతువులను చక్కగా ఉత్తేజపరచడమే కాక మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరం, మనసు రెండూ సంయుక్తంగా ఉన్నప్పుడు లైంగిక సామర్థ్యం మరింత పెరగడమే కాక శృంగారం పాల్గొనే వ్యక్తుల మధ్య ఒద్దిక, గాఢమైన అనుబంధం నెలకొంటాయి.

శృతి చేయండి...
Vaastaayanam1చక్కని శరీర భంగిమతో నిలుచోండి. మీ రెండు పాదాల మీద మీ శరీర భారం సమానంగా పంపిణీ కావాలి. మీ భుజాలు క్రిందికి దింపి, మీ వెన్నెముక చివరి భాగం కిందికి దిగేలా ఉంచండి. మీ శరీరంలో ప్రతి కండరం, పిరుదులు, ఉదరభాగం అన్నీ బిగువుగా మారిపోతున్నట్టు ఊహించుకోండి. కనిపించని ఒక తీగ ఏదో మిమ్మల్ని తలమీద నుండి పాదాల దాకా పైకి లాగుతున్నట్టుగా ఊహిస్తూ... మీరు మరింత పొడుగ్గా సాగిపోతున్నట్టుగా ఊహించుకోండి. మీ ఉదరవేతనంలో గాలిని బాగా లోపలికి పీల్చండి. మీ ఊపిరితిత్తుల నిండా ఆక్సిజన్‌ని నింపండి. ఇప్పుడు మీ దృష్టి అంతా మీ శ్వాసక్రియ మీదనే కేంద్రీకరించండి. వెంటనే మీలో అంతర్గతంగా చాలా ప్రశాంతమైన భావన కలుగుతుంది. ఇలా గాఢంగా శ్వాసించడం ప్రకృతి సహజమైన మత్తును కలిగిస్తుంది.
వ్యాయామం-1...
1) మీ కాలి మునివేళ్ళు తిన్నగా పెట్టి, మీ రెండు కాళ్ళను 2, 3 అడుగుల దూరంలో ఎడంగా వుంచండి. మీ రెండు అరచేతులను వేళ్ళ వద్ద బంధించి ఎదుటివైపుకి తిప్పండి.
2) గాఢంగా శ్వాసిం చండి. రెండు చేతు లను పైకి ఎత్తి, మీ అరచేతులను చూడటానికా అన్నట్టు మీ తలను పైకెత్తి కాస్తా వెనక్కి వంచండి.
3) ఇప్పుడు మీ చేతులను విడదీసి, నడుం పైభాగం వద్ద ముడుచుకోండి. వీలైనంత ఎక్కువగా వెనక్కి వంగండి. మీ పొత్తికడుపు భాగాన్ని ముందుకు తెండి. మీ మెడ, ఛాతి విస్తరింపజేయండి. మామూలుగా శ్వాసించండి. 5 సెకన్లపాటు అలాగే ఉంచి, తరువాత నిటారుగా నిలబడండి.
4) ఇప్పుడు కుడిచేతిని పైకెత్తి ఎడమవైపుకు వాలండి. మీ ఎడమ చేయి ఎడమ తొడ మీదుగా రాస్తూ... పిక్కల దాకా తీసుకువెళ్ళండి. మీ తలను కూడా ఎడమవైపునకు వంచి, ఎడమ చెవి, మీ ఎడమ భుజం తాకేలా పెట్టండి. మామూలుగా ఊపిరి పీలుస్తూ... ఎడమ చేతిని మరింత కిందికి దింపటానికి ప్రయత్నించండి.
5) తిరిగి నిలబడే భంగిమకు రండి. తరువాత ఐదు సెకన్లు ఉంచండి. తరువాత ఇదే మాదిరిగా కుడివైపు చేయండి.
వ్యాయామం-2...
Vaastaayanam21) మామూలుగా శ్వాసించండి. కుడి అరచేత్తో ఎడమకాలి మడమను తాకండి. నడుం మెలితిప్పండి. ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడండి. ఇలా ఐదు సెకన్లు ఉండండి.
2) ఇప్పుడు ఇదేవిధంగా కుడివైపు చేయండి. ఐదు సెకన్లు ఉండండి.
3) నడుం మెలితిప్పడం ఆపండి. మీ రెండు చేతులను, మోచేతుల వద్ద పెనవేసి, గాలిలో తేల్చండి. గాఢంగా ఊపిరిపీలుస్తూ 5 సెకన్లు గడపండి.
4) మీ అరచేతులను నేలమీద వాల్చి వంగండి.
5) మీ అరచేతులను ముందుకు జరుపుతూ పాదాలను దూరంగా ఉంచండి. పిరుదులను వెనక్కి గెంటుతూ మీ మోచేతులను పూర్తిగా సాగదీస్తూ ముందుకు జరపండి. మీ రెండు చేతులను భూమిలోంచి ఎవరో లాగేస్తున్నట్టుగా సాగదీయండి. ఈ భంగిమలో పది సెకన్లు ఉండండి. నెమ్మదిగా కండరాలు వదులు చేస్తూ లేచి నిలబడండి.
బ్యాలెన్స్‌...
శరీరాన్ని సాగదీయడంతోబాటు, బ్యాలెన్స్‌ నేర్చుకోవడం, మీ సావధానాన్ని (అటెన్షన్‌) పెంచుతుంది. ఇంకా మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సాగదీయడం అనే ప్రక్రియ మీ కండరాల్లోని టెన్షన్‌ని పోగొడుతుంది. ఈ వ్యాయామంలో కదలికల వల్ల మీ కండరాల్లో స్తబ్ధత పూర్తిగా తొలిగిపోయి, అవి ఎటుపడితే అటు వంగే రబ్బరు ముద్దల్లా పనిచేస్తాయి.

వ్యాయామం-3
hass1) పాదాలను ఎడంగా వుంచి, నిలబడండి. కుడికాలిని ముందుకు జరపండి. పాదాన్ని సరళరేఖపై వుంచండి. మీ ఎడమపాదాన్ని ఈ సరళరేఖకు లంబదిశగా వుంచండి. చేతుల ను వెనక్కి మడిచి నమస్కరిస్తున్న భంగిమలో మీ అరచేతులను జోడించండి. దీంతో మీ ఛాతి పైభాగం, పొట్ట ముందుకు వస్తాయి. మీ భుజాలను క్రిందికి దిగి వుండే విధంగా జాగ్రత్తపడండి. ఒకవేళ మీ అరచేతులను ఈ విధంగా జోడించి వుంచడం కష్టంగా వుంటే, మీ చేతుల మణికట్టును బంధించండి. మీ వీపు క్రింది భాగానికి ఆన్చి వుంచండి.

hassanam22) గాలిని పీల్చండి, వీలైనంత వెనక్కి వాలండి. మీ మెడ, ముఖ కండరాలను వదులుగా వుంచండి.
3) ఇప్పుడు నెమ్మదిగా శ్వాస బయటకు వదులుతూ క్రమంగా ముందుకు వంగండి. మీ నుదురు కుడి మోకాలిని తాకేంతవరకు వంగండి. ఈ దశలో బ్యాలెన్స్‌ తప్పకుండా వుండేందుకు మీ ఎడమకాలిని తిన్నగా వుంచండి. ఎడమకాలి కండరాలను మోకాలి చిప్పపైకి లాగి వుంచండి.

4) మీ శరీర బరువు రెండు కాళ్లకు సమానంగా పంపిణీ అయ్యే విధంగా వుంచండి. మామూలుగా శ్వాసిస్తూ... మీ కుడి మోకాలిని వంచండి. మీ తలను మాత్రం అక్కడు వుంచాలి. మీ కుడి కాలి మడమ, మోకాలి చిప్ప లంబంగా ఒకే సరళరేఖపై వుండేలా జాగ్రత్తపడండి.
5) ఇప్పుడు మీ చేతులను విడదీయండి. ఎడమ చేతిని నడుం వద్ద పెట్టుకోండి. కుడిచేతిని క్రిందికి పెట్టండి. వేళ్ళతో నేలను ఆనుకొని, మీ కుడివేలు ఎక్కడా వంగకుండా వూహించుకుని, దానివంకే చూస్తూ వుండండి.

hassanam36) ఇప్పుడు మీ కుడికాలిని తిన్నగా జరపండి. గాలిని పీలుస్తూ... ఎడమ కాలిని వెనక్కి గాలిలో లేపండి. మీ ఎడమకాలి మడమ, మీ వెన్నెముక ఒకే సరళరేఖలో వుండే విధంగా పెట్టండి. 10 సెకన్లపాటు ఇలా ఉండి నెమ్మదిగా ఎడమకాలిని క్రిందికి దింపి 5వ స్థానానికి రండి. తరువాత ఇదే మాదిరిగా ఎడమవైపు చేయండి.

వస్థికసాగు (పెల్విస్‌ స్ట్రెచ్‌)...
పొత్తికడుపు క్రిందిభాగాన్ని,మూత్రపిండాలు, తదితర సున్నితమైన అవయవాలు, సున్నితమైన కండరాలు కలిగిన అస్థిపంజరపు భాగాన్ని పెల్విస్‌ అంటారు. దీనిని తెలుగులో వస్థికం అంటారు. ఈ ప్రదేశాన్ని సాగదీయడం, విస్తృతంగా చేయడం, మెలిపెట్టడం తదితర వ్యాయామాలు సెక్స్‌కు చాలా ఉపయోగకరం.కిడ్నీలు బాగా పనిచేస్తాయి.

hassanam1అట్లాగే జీర్ణశక్తికి కూడా ఇది చాలా మంచిది. వెన్నెముకకు ఈ వ్యాయామం ఉత్తేజా న్ని కలిగిస్తుంది. ప్రసవానం తరం లేదా వయసు మళ్లే దశలో స్ర్తీలలో చాలామంది ఈ ప్రదేశంలో స్తబ్దతను ఎదుర్కొంటారు. పొత్తికడుపు క్రింది కండరాలు జవజవలాడిపోవడం, యోని కండరాల్లో బిగి తగ్గిపోవడం ఫలితంగా రతిలో బిగువైన స్పందన కొరవడడం వంటి ఇబ్బందులనెదు ర్కొంటారు. అందుకే ఈ ఎక్సర్‌సైజులు.

1) మోకాళ్ళ మీద నేలపై కూర్చోండి. మీ మోకాళ్ళను దగ్గరగా చేర్చి వుంచండి. పాదాలను వెనక్కి పెట్టండి. మీరు మొండాన్ని తిన్నగా పెట్టి కూర్చోవాలి. అరచే తులను పటంలో చూపిన విధంగా తెరిచి వుంచి నేలమీద ఆన్చండి.

2) ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి వాలండి. మోకాళ్ళు దగ్గరగా చేర్చి వుంచే చేయాలి. మీ చేతులను వెనక్కి వంచి, మోచేతులను నేలమీద ఆన్చి, అరచేతులతో మీ పాదాలను పట్టుకొని వెనక్కి వంగండి. మీ పాదాలు, మడమలు, మోకాళ్ళు, తొడలు, పొత్తికడుపు అన్నీ సాగదీయబడుతున్న అనుభూతి మీకు కలుగుతుంది.

ఇది మీకు సౌకర్యవంతంగా అనిపిస్తుంటే...
hassanam3) నేల మీద ఇంకా వెనక్కి వంగండి. మీ చేతులను విడదీసి, తలమీదుగా పైకి జరపండి. అక్కడ వాటిని మీ చేతుల వద్ద మడవండి. గాఢంగా ఊపిరిపీల్చండి. మీరు ఊపిరిని బయటకు వదులు తున్నప్పుడల్లా, మీ శరీరమంతటా సాగదీస్తున్న ఫీలింగ్‌ ఏర్పడు తూ వుంటుంది. దీనివల్ల రక్తప్రసరణ పెరుగు తుంది. కాసేపటికి మీకు ఎంతో హాయిగా, రిలాక్స్‌డ్‌గా మత్తుగా వుంటుంది. ఈ భంగిమలో కాసేపు వుండి తిరిగి (2)వ స్థానానికి రండి. తరువాత (1)వ స్థానానికి రండి.

4) కాసేపు రిలాక్స్‌ అవ్వండి. మీ అరచేతులను నడుముకు ఇరువైపులా వదులుగా వుంచి, మీ మోకాళ్లను పైకి పెట్టి మీ తలను నేలమీద సరళరేఖలో నుంచి ప్రశాంతంగా కాసేపు గడపండి.
5) గాలిని పీల్చండి. మీ రెండు అరచే తులతో మీ కాలి మడమలను పట్టుకోండి. పిదప మీ నడుముని పైకి ఎత్తండి. మీ వస్థిక ప్రదేశంలో కండరాల మీద, లైంగిక అవయవాల మీద మీ దృష్టిని కేంద్రీక రించి, వీలైనంత ఎత్తుకు నడుమును లేపండి. 10 సెకన్లపాటు ఈ విధంగా వుంచి నెమ్మదిగా నేలమీదకు దిగండి. ఈ వ్యాయామాన్ని పూర్తిగా రెండుసార్లు చేయండి.

వస్థికసాగు (కొనసాగింపు)...
1) వెల్లకిలా పడుకోండి. నుడుము పైకి ఎత్తండి. మోకాళ్ళను ఛాతి వద్దకు తెచ్చుకోండి. అక్కడ పద్మాసన భంగిమలో మోకాళ్ళ వద్ద మడవండి. మీ రెండు పాదాలను వీలైనంత ఎక్కువగా చెరోవైపు బయటకు సాగదీసి వుంచండి. కాలి బొటనవేళ్ళను చేతివేళ్ళతో గట్టిగా పట్టుకోండి.
2) గాలిని పీల్చండి. మోకాళ్ళను పద్మాసన భంగిమలోనే నేలమీదకు దింపండి. కాలిబొటనవేళ్ళను పట్టుకొని వుండటాన్ని మాత్రం వదలొద్దు. గాలిని వదిలిపెట్టి 5 సెకన్లు గడపండి.
3) నెమ్మదిగా మీ తలను వెనక్కి వంచండి. మీరు మీ తలవైపు వున్న వస్తువులను చూడటానికి గాను తలను తిప్పినట్లుగా సాధ్యమైనంత ఎక్కువగా తలను వుంచండి. ఈ క్రమంలో మీ వీపు పైభాగాన్ని పైకి లేపండి. రిలాక్స్‌ అవ్వండి.
4) మీ కుడికాలిని నేలమీద నుండి 30 సెం.మీలు పైకి లేపండి. మామూలు గా గాలిని పీల్చండి. తరువాత రెండు కాళ్ళను పైకి లేపండి.నడుము పైకి ఎత్తుతూ... లంబదిశగా పైకి లేపండి. తరువాత మీ తలను నేలమీద నుండి పైకి లేపి,మీ చేతులతో ఎడమకాలి మడమను పట్టుకోండి. ఈ దశలో 5 సెకన్లు వుంచండి. ఇదేవిధంగా కుడికాలితో కూడా చేయండి.

గమనిక: ఈ యోగాసనాలు పూర్తి ఆరోగ్యం గా ఉన్నవారు మాత్రమే చేయాలి. గర్భిణీ స్ర్తీలు, రక్తపోటు, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య పీడుతులు ఈ వ్యాయామాలు చేయడం నిషిద్ధం. వ్యాయామ సమయంలో అస్వస్థతగా అనిపిస్తే... వెంటనే ఆపేయాలి. కంగారు పడుతూ యోగా దశలను దాటేయకూడదు. ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకున్న తరువాత ప్రారంభిస్తే మంచిది.

Saturday, January 1, 2011

ఏరోబిక్స్‌తో కొత్త ఉత్తేజం

న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు కావలసినంత ఎంజాయ్ చేశాం. ఆ వేడుకల తాలూకు బడలికను ఏరోబిక్స్‌తో దూరం చేసుకోండి. - రెండు రోజుల పాటు విరామం తీసుకున్నారు కాబట్టి ముందుగా తేలికపాటి వ్యాయాయాలు చేయండి.

- ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ బాగా ఉపయోగపడతాయి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వల్ల జీవక్రియల పనితీరు, శక్తి విడుదలయ్యే విధానం మెరుగుపడుతుంది.

- కండరాలను ఉత్తేజపరచడానికి ఏరోబిక్ డ్యాన్స్ ఉపయోగపడుతుంది. మంచి మ్యూజిక్ పెట్టుకుని అరగంటపాటు ఎరోబిక్ డ్యాన్స్ చేయడం వల్ల శరీరం రీచార్జ్ అవుతుంది. మెదడుకు రక్తసరఫరా మెరుగుపడుతుంది.
 

- స్టీమ్ బాత్ చేస్తే మరీ మంచిది. శరీరం ఉత్తేజం కావడానికి ఇది ఉపయోగపడుతుంది.

Sunday, December 19, 2010

డాన్స్‌ థెరపీ

tatjana
అనాదిగా వివిధ సంస్కృతుల్లో కథలు, వివిధ భావోద్రేకాలను ప్రదర్శించడానికి నాట్యం మాధ్యమంగా ఉంటూవస్తోంది. ఈనాడు ఈ సంస్కారవంతమైన కదలికల్ని చికిత్సగా కూడా వినియోగిస్తున్నారు. ఆందో ళన, కీళ్ళనొప్పులు, డిస్లెక్సియా వంటి రుగ్మత లను నయం చేయడానికి వివిధ నాట్య రూపా లను ఉపయోగిస్తున్నారు. ఏకాగ్రతను రెట్టిం చడానికి నాట్యం గొప్ప సాధనంగా రుజువ య్యింది. పార్కిన్సన్‌ వ్యాధిని ఎదుర్కోవడానికి కూడా దోహద పడుతుంది. నాట్య కదలికల చికిత్సకు (డాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ) గ్రూప్‌సెషన్లు, భారతీయ శాస్ర్తీయ, ఆధునిక, సమకాలిక నాట్య రూపాలను వినియోగిస్తున్నారు. వివిధ వ్యాధులను నయం చేయడానికి అన్ని వయసుల వారికి ఈ చికిత్స ఉపయోగపడు తోంది. డ్యాన్స్‌ థెరపీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దీనిని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే ఓ ప్రమాదానికి లోనైన మితాలీ మోహన్‌ గురించి తెలుసు కుందాం... ఆమె చేయించు కునే ఫిజియోథెరపీలో భాగంగా డ్యాన్స్‌ థెరపీలో కూడా చేరమని చెప్పారు డాక్టర్లు. నాట్యం చేస్తున్న కాస్సేపూ మనం మన చింతల్ని మరిచిపోతాం. ఈ కళలో మనసు, శరీరం రెండిటికీ పని చెప్పాల్సివుంటుంది. మనం ఒక విధమైన తన్మయత్వంలోకి జారుకుంటాం. కథక్‌ నాట్యం నేర్పే పంతులమ్మ విజయశ్రీ చౌదరి ఈ అభిప్రా యంతో పూర్తిగా ఏకీభవిస్తోంది.


dance_therapy1 ఆటగా అనిపించినప్పటికీ నాట్యం ధ్యానంలో ఉచ్చస్థాయిని చేరుకోవడానికి సహాయపడు తుందని ఆమె అంటున్నారు. నృత్యం మంచి వ్యాయామం అంటున్నారామె. ఏ నృత్యం సౌకర్యవంతంగా ఉంటే ఆ నాట్యరూపాన్ని డ్యాన్స్‌ థెరపీకి వినియోగించవచ్చు. సమ కాలీన నాట్య భంగిమల్లో కొన్ని ఏకాగ్రత పెంచడానికి ఎక్కువ అల్లరిచేసే పిల్లలకు, డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడతాయని సమకాలీన నాట్య శిక్షకుడు హృషికేష్‌ పవార్‌ అంటున్నారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడు తున్న రోండా చాకో డ్యాన్స్‌ థెరపీ అధ్భుతమైన ఫలితాలివ్వడంతో చాలా సంతోషంగా వున్నారు. అత్యంత సులువైన పని కూడా పార్కిన్సన్‌ వల్ల దెబ్బతింటుంది, ఆత్మవిశ్వాసం కోల్పోతాం, డ్యాన్స్‌ థెరపీ నాలాంటివారెందరో తమ దైనందిన రోజువారీ పనులు చేసుకోగలుగుతారు అంటున్నారు రోండా. ఆమె కదలికలు నిదానంగా ఉండ వచ్చు కానీ ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుపో తున్నారు. సంతులనాన్ని, సరైన భంగిమ పొందడానికి భారతీయ శాస్ర్తీయ నాట్య రూపాలు సహాయపడతాయని ఇది మంచి చికిత్సా విధానమని ప్రముఖ ఎముకల డాక్ట రు డా.సత్యశీల్‌ నాయక్‌ అంటున్నారు. మరో ఎముకల డాక్టర్‌ సునీల్‌ కోరే కూడా ఈ అభిప్రా యంతో ఏకీభవిస్తున్నా రు.

ఎలాంటి కదలి కైనా శరీరానికి మంచిదని అనారోగ్యం చాలా వరకూ మానసికమైందని ఆయన అంటున్నారు. వారి ఉత్సాహాన్ని రేకెత్తించడానికి కూడా డ్యాన్స్‌ థెరపీ సహాయపడుతుంది. ఒక వ్యక్తి పాదాలు ఆడించడం కూడా ఓ విధమైన ఆక్యుప్రెషర్‌ థెరపీ అంటున్నారు చౌదరి. ఎంతో శక్తినిస్తుం ది మీరు గమనించినట్లయితే నర్తకీమణులు తమ వయసుకంటే చిన్నవారిగా కనిపిస్తారు. కనుక డ్యాన్స్‌ థెరపీ వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

భారత్‌- అమెరికాల్లో డ్యాన్స్‌ థెరపీ వైవిధ్యం...
dance_therapy భారతీయ, అమెరికా డ్యాన్స్‌ థెరపీల మధ్య చాలా తేడా ఉంది. అమెరికన్‌ డ్యాన్స్‌ థెరపీ అసోసి యేషన్‌లో వేయమంది సభ్యు లున్నారు. జైళ్ళలో, డి-ఎడిక్షన్‌ కేంద్రాల్లో, హాఫ్‌వేహోంలు (చికిత్సా కేంద్రాలు) ల్లో వీరు పనిచేస్తున్నారు. ఇండియాలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. సుశిక్షితులైన థెరపిస్టులు స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత వారికి సరైన జీత భత్యాలు ఇవ్వడంలేదు. వారిసేవలకు సరైన గుర్తింపు రావడంలేదు. వారి సేవలెంతగానో అవసమైనప్పటికీ వారు మన వ్యవస్థతో నిరంతరం పోరాడుతున్నారు. బేజారై విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అమెరికా లో వైద్యం దాదాపు ప్రైవేటు సైకోథెరపీ సెషన్‌లాగా జరుగుతుంది. సందర్శకులు కూడా ఒక దిక్కే కనిపించే అద్దం గుండా చూడవచ్చు. ఇండియాలో స్కూలుకు వచ్చే సందర్శకులు పార్కులోకి వచ్చినట్లు సరాసరి సెషన్‌లోకి నడిచివచ్చేస్తారు పైగా నాట్యం ఒక ప్రదర్శన కళ అన్న విషయం మన మెదళ్ళలో నాటుకుపోయింది. ఇండియాలో ఉన్న ఎన్నో శాస్ర్తీయ, జానపద నాట్య రూపాలు మన జనసముదాయంలో అంతర్భాగాలు.

Tuesday, December 14, 2010

స్టెప్ వేయండి ...... స్లిమ్ అవ్వండి ....... * ' బాలీఫిట్ '.

సన్నబడాలంటే ఏం చేయాలని ఎవరినడిగినా బోలెడు సలహాలు ఇస్తారు. జిమ్ కెళ్లమని ఒకరు చెబితే తిండి తగ్గించమని ఒకరు చెబుతారు. అవన్నీ విని విని బోరు కొట్టేసి ఉన్నాయి అందరికీ. అందుకే అనూజ రాజేంద్ర కనిపెట్టిన కొత్త పద్ధతికి చాలా డిమాండ్ ఉంది. ఆ పద్ధతి పేరు 'బాలీఫిట్'. 'ఫిట్‌నెస్ త్రూ డ్యాన్స్'అనే నినాదంతో అనూజ ఈ వినూత్న పద్ధతిని అందరికీ పరిచయం చేశారు. బరువు తగ్గాలనుకునే వారితో ఆమె నాట్యం చేయిస్తుందన్నమాట. అమెరికాలో స్థిరపడ్డ ఈ ఆలోచన అనూజకి మూడేళ్ల కిత్రం వచ్చింది.

భరతనాట్యం, భాంగ్రా నృత్యాలు వచ్చిన అనూజ ఇప్పటికే చాలా దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. కాని పెళ్లయి పిల్లలు పుట్టాక బాగా ఒళ్లు చేసింది. తను స్లిమ్‌గా అవ్వాలంటే మళ్లీ నాట్యం చేయాల్సిందేననుకుంది. ఒక్క ఏడాదిలోనే ఇరవైకిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు తమకు కూడా నాట్యం నేర్పమని అడిగారు. అంతే 'నాట్యంతో బరువు తగ్గడమెలా' అని కొద్ది రోజులు స్టడీ చేసింది అనూజ. 2007లో అమెరికాలోని మిచిగాన్ పక్కనున్న ఆన్ ఆర్బర్‌లో తొలి శిక్షణా కేంద్రం ప్రారంభించింది. ఇందులో భారతీయుల కంటే ఎక్కువగా అమెరికన్లే చేరారు. మూడేళ్లు తిరిగేసరికి తీరిక లేనంత బిజీ అయిపోయింది అనూజ.

ఎలాంటి నాట్యం చేస్తారు...
భరతనాట్యం, భాంగ్రా, బాలీవుడ్ స్టెప్పులకు ఏరోబిక్స్ టిప్స్ కలిపితే బాలీఫిట్ అవుతుంది. ఒక నిమిషానికి 100 నుంచి 150 బీట్స్ ఉండి హోరెత్తింటే పాటల్ని ఎంపిక చేస్తారు. ఇందులో ఎక్కువగా రీమిక్సే ఉంటాయి. సరదాగా సాగే ఈ నాట్యంలో రకరకాల భంగిమలు ఉంటాయి. మూడు రకాల వ్యాయామాలు ఉండేలా దాన్ని తయారుచేశారు. బాలీఫిట్ కార్డియో, బాలీఫిట్ రిథమ్, బాలీఫిట్ టాట్స్. వీటికి కావాల్సిన స్టెప్పుల్ని ముందుగానే శిక్షకులు నేర్పిస్తారు. మ్యూజిక్‌లో వచ్చే బాణీలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తే సరిపోతుంది.

రోజూ ఉదయం పూట ఓ గంటసేపు ఈ బాలీఫిట్ చేస్తే ఒంట్లో కొవ్వుని ఇట్టే కరిగించేయొచ్చంటున్నారు అనూజ. విదేశాల్లో విజయవంతమైన తన ప్రయోగాన్ని ఆమె ఆ తర్వాత స్వదేశంలోనూ ప్రవేశపెట్టింది. ముంబై నగరంలో తను ఏర్పాటు చేసిన బాలీఫిట్ శిక్షణ కేంద్రాలకు కూడా యువత నుంచి మంచి స్పందనే వచ్చింది. బాలీఫిట్‌కి వెళుతున్న పెద్దవయసు వారు ఏమంటారంటే 'బాలీఫిట్ వల్ల ఒళ్లు తగ్గడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది' అని.

ఎప్పటికైనా గొప్ప నటిని అవ్వాలనుకున్న అనూజ ఇప్పుడు బాలీఫిట్ సెలబ్రెటీగా ఎదిగిపోయింది. అమెరికా, కెనడా, ఇండియాలో బోలెడు బాలీఫిట్ తరగతులు నిర్వహించి అందరి మనసుల్ని గెలిచింది.' స్లిమ్‌గా అవ్వడం ఎలా' అని బెంగపడుతున్నవారి పాలిట దేవతగా మారిపోయింది. మనమందరం అనూజ దగ్గరికి వెళ్లలేం కాబట్టి ఇంట్లోనే ఒక మ్యూజిక్‌ప్లేయర్ ఆన్ చేసి రోజూ ఉదయం ఓ గంట డ్యాన్స్ ప్రాక్టీసు చేసి చూద్దాం.

'జిమ్ జిమ్మం' టోంది యువత


సమయం
ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య
నగరాల్లో ఎక్కడ చూసినా ఎవరో ఒకరు 'వాకింగ్' లేదా 'జాగింగ్' చేస్తూ కనిపిస్తారు. కొందరు 'వ్యాయామాలు', మరికొందరు 'యోగాసనాలు' వేస్తూ కనిపిస్తుంటారు. కొందరు 'జిమ్' నుంచి, మరి కొంతమంది 'ఏరోబిక్స్' సెంటర్ల నుంచి బయటకొస్తూ కనిపిస్తుంటారు. ఇంకా జాగ్రత్తగా చూస్తే బయటకొచ్చే టైమ్ లేక బాల్కనీలోనో వరండాలో ఏదో ఒక వ్యాయామ భంగిమలో కనిపిస్తుంటారు.

సమయం
సాయంత్రం నాలుగున్నర గంటల తరవాత- సేమ్ సీన్ రిపీట్.
ఏదో ఒక నగరంలో కాదు దేశంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఎవరికీ తప్పని 'ఫిట్‌నెస్ మంత్ర' ఇది. ఆడ, మగ, చిన్నా పెద్దా తేడా లేకుండా ఫిట్‌నెస్ కోసం కొందరు 'పరుగులు' పెడుతుంటే, కొందరు 'బరువులు' మోస్తున్నారు. కొంతమంది 'ఆడు'తుంటే, కొంతమంది 'ధ్యానం'లో మునిగిపోతున్నారు. ఒక దశాబ్దం క్రితం మన ఫిట్‌నెస్ పరిశ్రమ పరిధి చాలా తక్కువ. ఫిట్‌నెస్ పట్ల మన వాళ్ల ఆలోచనా విధానం 'మోజు' నుంచి 'అవగాహన'కు చేరుకోవడమే ఈ రంగంలో సంభవించిన పెద్ద మార్పు అనుకోవచ్చు. ఆ మార్పే భారత ఫిట్‌నెస్ పరిశ్రమను విదేశీ కంపెనీలు సైతం కోట్ల పెట్టుబడులతో పరుగెత్తుకొచ్చే విస్తృత పరిశ్రమగా రూపొందించింది. ఆ 'పరిశ్రమ' గురించే ఈ వారం కవర్‌స్టోరీ.


మన దేశ యువత ఇప్పుడు ఫిట్‌నెస్ బాట పడుతోంది. ఆ బాటే అవకాశంగా విదేశీ ఫిట్‌నెస్ కంపెనీలు మన దేశంలో ప్రవేశిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఇండియాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ రెండేళ్లలో వెయ్యికి పైగా 'వ్యాయామ కేంద్రాలు' ఏర్పాటు చేశాయంటే వాటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఫిట్‌నెస్ ఇండస్ట్రీ టర్నోవర్ ఏటా 40 శాతం పెరుగుతూ వస్తోంది. ఈ యేడాది అంచనా 2900 కోట్లకు పైమాటే! ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన విదేశీ కంపెనీలు 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్', 'గోల్డ్స్ జిమ్', 'ఫిట్‌నెస్ ఫస్ట్', '24 హవర్స్ ఫిట్‌నెస్', 'ఎనీటైమ్ ఫిట్‌నెస్', 'రీబాక్ ఫిట్‌నెస్ క్లబ్స్'. మొదటి మూడు టాప్‌టెన్ లిస్టులో ఉన్న కంపెనీలు. ఈ కంపెనీలకు 'ఫిట్‌నెస్ మ్యాగజైన్స్' కూడా మంచి రేటింగ్ ఇవ్వడంతో విస్తరణకు మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జీవనశైలిలో ఫిట్‌నెస్ కూడా ఒక భాగం అనే అవగాహన పెరుగుతుండడంతో జిమ్ సెంటర్‌లు నడుపుతున్న కంపెనీలు 'ఎనీటైమ్ జిమ్'లు, 'ఏసీ జిమ్'లంటూ కొత్త కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టాయి.

దేశవ్యాప్తంగా...

అమెరికాకు చెందిన 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్' పదకొండు మిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండేళ్ల క్రితం మనదేశంలో మొత్తం 250 వ్యాయామకేంద్రాలను ప్రారంభించాలనే ఆలోచనతో వచ్చింది. ఇప్పటికి యాభై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, హైద్రాబాద్, పూణె, నాగపూర్, జలంధర్, చంఢీగఢ్, అమృతసర్, లూధియానాలలో ఈ కంపెనీకి బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ చెప్పేమాట ఏమిటంటే... 'యూరప్, అమెరికా దేశాల కంటే ఇక్కడే వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, కనుక తాము తప్పకుండా వ్యాపారంలో విజయవంతం అవుతామని.'
అంతేకాదు వీళ్లు ప్రారంభించిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'లకు కూడా బాగానే ఆదరణ ఉంది. వివిధ షిఫ్టుల్లో పనిచేసే కార్పొరేట్ ఉద్యోగుల సౌకర్యార్థమే ఈ ఎనీ టైమ్ జిమ్‌లు. యు.ఎస్.కే చెందిన మరో ఫిట్‌నెస్ కంపెనీ 'గోల్డ్స్ జిమ్'. ఒక్క ముంబయిలోనే ఆ కంపెనీకి నలభై ఐదు వ్యాయామకేంద్రాలున్నాయి. 2002లో భారతదేశంలో ప్రవేశించి ప్రధాన నగరాలన్నింటిలోకి విస్తరించిన ఈ కంపెనీ రెండు నెలలకు ఒక జిమ్ చొప్పున బ్రాంచీలను పెంచుకుంటూ పోతోంది. వీటి తర్వాత స్నాప్ ఫిట్‌నెస్ కంపెనీ, 24 అవర్స్ ఫిట్‌నెస్ కంపెనీ ఇలా ఒక్కొక్కటీ మన దేశానికి వచ్చి నిలదొక్కుకున్నాయి.

ముంబయి, బెంగళూరులలో బ్రాంచీలను తెరిచిన మరో విదేశీ కంపెనీ 'ఫిట్‌నెస్ ఫస్ట్'. ఇది బ్రిటిష్ కంపెనీ. 'భారతదేశంలో అర్బన్ ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగిందని, ఫిట్‌నెస్ కోసం కొంత మొత్తం వెచ్చించేందుకు వారు ముందుకొస్తున్నారని' అభిప్రాయ పడుతున్న ఈ కంపెనీ 2012 నాటికి దేశంలో 125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. అప్పటి వరకు మరో 15 కేంద్రాలను తెరిచి మెంబర్‌షిప్‌ను ఇంకా పెంచుకునే యోచనలో ఉంది.

అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణతో ఇప్పటికే బాగా పాతుకుపోయిన ఈ జిమ్‌లలో నెలకు సగటున ఆరు వందల చొప్పున మెంబర్‌షిప్ పెరుగుతోంది. సంవత్సర సభ్యత్వం కోసం సగటున రూ. 14,000 వరకు చార్జ్ చేస్తున్నారు. నెలకయితే 1500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఈ ఫిట్‌నెస్ సెంటర్లలో యోగా,ఏరోబిక్స్, ఇండోర్ సైక్లింగ్, పర్సనల్ ట్రెయినింగ్ (విదేశీ వ్యక్తిగత శిక్షకులతో), స్విమ్మింగ్‌పూల్స్, షవరింగ్ ఏరియాస్, డీవీడి లైబ్రరీ తదితర సదుపాయాలు ఉంటాయి.

దేశీయ కంపెనీ టాల్‌వాకర్


మన దేశం విషయానికొస్తే అతిపెద్ద జిమ్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ 'టాల్‌వాకర్'. ఉదయపూర్, లూధియానా, నెరుల్(నవీ ముంబయి), హిమాయత్‌నగర్(హైద్రాబాద్), బెంగళూరు, హుబ్లీ, బెల్గాం, ఔరంగాబాద్ మొదలైన చోట్ల దీనికి వ్యాయామ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత శిక్షకుడు, డైటీషియన్, ఫిజియోథెరపిస్టు తప్పకుండా ఉంటారు. వారికి జీతాలు మొదలు మిషనరీ కొనుగోలు వరకు అన్నీ కలుపుకుని ఏడాదికి అన్ని సెంటర్ల నిర్వహణ వ్యయం సుమారు పదహారు కోట్ల రూపాయలు. అయినా 76 కేంద్రాల్లో సుమారు లక్ష మంది మెంబర్‌షిప్‌తో నడుస్తున్న ఈ కంపెనీకి వచ్చే లాభాలతో పోల్చితే ఆ 'ఖర్చు' చాలా తక్కువే.

ప్యాకేజీ ఆఫర్లు

విదేశీ ఫిట్‌నెస్ క్లబ్‌లు మన దేశంలో ప్రవేశించాక ఫిట్‌నెస్ రంగం స్థాయిలో చాలా మార్పులే వచ్చాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణను అన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. ప్రత్యేక 'ప్యాకేజీలు', పండగలకు 'ఆఫర్లు' ఎక్కువయ్యాయి. దాంతో పాటు మెరుగైన మెషినరీ కోసం ఎంత సొమ్మయినా ఖర్చు చేసేలా స్థానిక కంపెనీలు తమ పద్ధతులను మార్చుకున్నాయి.
ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది మెషినరీ మార్కెట్ గురించి. భారత్‌లో ఉన్న విదేశీ కంపెనీల ఎక్విప్‌మెంట్ అంతా దిగుమతి చేసుకున్నది కావడం వల్ల మన వాళ్లు కూడా అటుగా దృష్టి సారించారు. పేరున్న ఏ జిమ్‌ను చూసినా అంతా విదేశీ టెక్నాలజీయే. ఇండియా వస్తువుల మీద నమ్మకం లేక కాదుగాని విదేశీ మెషినరీ మీద మోజు పెరుగుతుండడం వల్లే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి మెషనరీ దిగుమతి పెరిగిపోతోంది. సెలబ్రిటీ జిమ్‌లు, హోమ్ జిమ్‌లు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. దాంతో మెషినరీ కొనుగోలు విశేష స్థాయిలో ఉంది. మన దేశంలో ఫిట్‌నెస్ మెషినరీ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? 12.5 బిలియన్ రూపాయలు. అది రెండేళ్ల కిందటి మాట. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం మరో రెండేళ్లలో అది ఐదింతలు పెరగనుంది.

పర్సనల్ ట్రెయినర్ ఉంటే బెటర్

అదే క్రమంలో వ్యక్తిగత శిక్షకులను నియమించుకునే పద్ధతి కూడా పెరిగింది. మూడునాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు టీనేజ్ మొదలు యువత, సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ వ్యక్తిగత శిక్షకులను ఆశ్రయించడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా, బెంగళూరులలో జిమ్‌కు వెళ్లేవారిలో దాదాపు సగం మంది వ్యక్తిగత శిక్షకులను నియమించుకుంటున్నారు. వారికి ఒక్కో సెషన్‌కు 250-500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉన్నా వెనకాడడం లేదు. అంటే నెలకు ఐదు నుంచి ఇరవై వేల రూపాయలు. మంచి శరీరాకృతి కోసం యువత, అధిక బరువు వంటి సమస్యలతో మధ్యవయస్కులు, అనారోగ్య నివారణ కోసం రిటైరయిన ఉద్యోగులు... ఇలా ఎవరి కోణం వారిదే అయినా అందరి కామన్ ఎజెండా మాత్రం ఫిట్‌నెస్సే. షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్, ఐశ్వర్యారాయ్, కరీనాకపూర్ వంటి సెలిబ్రిటీలకు వ్యక్తిగత శిక్షకులుగా పనిచేసే వారికి ఒక్కో సెషనుకు పది వేల రూపాయలు చెల్లిస్తారని చెప్పుకుంటారు.

సర్టిఫికేట్ కోర్సులు

విదేశీ కంపెనీల రాక తర్వాత ఈ కేంద్రాల నిర్వహణ, ఫీజులు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. అయితే ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఉపాధిని పెంచేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాయామ కేంద్రాలు వ్యక్తిగత శిక్షకులతో పాటు థెరపిస్టులు, డైటీషియన్‌లు ఇలా అనేకమందిని నియమించుకుంటున్నాయి. గోల్డ్స్ జిమ్ ఏకంగా 'జి.జి.యు.' (గోల్డ్స్ జిమ్ యూనివర్శిటీ) అని ఒక విశ్యవిద్యాలయాన్నే నడుపుతోంది. అందులో ఫిట్‌నెస్ రంగానికి సంబంధించిన ఏ సర్టిఫికెట్ కోర్సు చేసినా వారికి ఉపాధి ఖాయం. అది ఎంతోమందికి ఉద్యోగావకాశంగా కనిపిస్తోంది. గోల్డ్స్ జిమ్మే కాదు ఇప్పుడు దేశంలో పేరు పొందిన ఫిట్‌నెస్ కంపెనీలన్నీ 'ఫిట్‌నెస్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూట్'లుగా కూడా వ్యవహరిస్తున్నాయి.

మహిళలను లక్ష్యంగా చేసుకుని రీబాక్ కంపెనీ కూడా ఒక సర్టిఫికేట్ కోర్సును నేర్పిస్తోంది. 'నైక్ ఏరోబిక్స్' పేరుతో నడిచే ఆ కోర్సులో ఈ మధ్యే విద్యార్థుల సంఖ్య పెరగుతోందట. ఈ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లను కూడా మరిన్ని కేంద్రాలకు విస్తరించే యోచనలో ఉంది రీబాక్. చాలా నగరాల్లో ఇప్పటికీ (ఏరోబిక్స్ మినహా) మహిళా శిక్షకులు కొన్ని జిమ్ సెంటర్లలో మాత్రమే ఉన్నారు. గోల్డ్స్ జిమ్ కంపెనీకి కూడా ఇండియాలో ఇరవై మంది మాత్రమే మహిళా శిక్షకులు ఉన్నారట.

అన్ని కంపెనీల చూపూ ఈ రంగం మీదే

ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వ్యాపారావకాశాలు పెరుగుతుండడం గమనించి ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'. సుమారు పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడితో మన దేశంలో అడుగు పెట్టిందీ కంపెనీ. కంప్యూటర్లు తయారు చేసే టీజీఎస్ కంపెనీయే ఈ పేరుతో ఫిట్‌నెస్ రంగంలోకి ప్రవేశించింది. రీబాక్ కూడా అంతే! ప్రధానంగా క్రీడావస్తువులను తయారు చేసే కంపెనీ అది. ఏరోబిక్, జిమ్ సెంటర్లను నిర్వహిస్తుండమే కాకుండా ఇటీవల మెషినరీ తయారీని కూడా మొదలు పెట్టింది అది. రీబాక్ కంపెనీ చెప్తున్న లెక్కల ప్రకారం వాళ్లకు డెబ్బయి శాతం ఆదాయం ఫిట్‌నెస్ సెంటర్ల వల్లే వస్తోందట మిషనరీ అమ్మకాలు కలుపుకుని.

వీడియో ఫిట్‌నెస్

ఈ రంగంలో మరో కొత్త ట్రెండ్ డీవీడీ వర్క్ అవుట్స్. బిజీగా ఉండేవాళ్లకి, లేజీగా ఉండేవాళ్లకి ఫిట్‌నెస్ డీవీడీలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రకటనులు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితమే శిల్పాశెట్టి విడుదల చేసిన యోగా వీడియోలు సంచలనం సృష్టించాయి. ఆ తరవాత బిపాషా బసు, కరీనాకపూర్, షెర్లిన్‌చోప్రా, లారాదత్తాలు ఆ జాబితాలో చేరారు. వీళ్లందరి వర్క్ అవుట్ డీవీడీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కథానాయికలే కాదు హీరోలూ ఇదే దారిలో ఉన్నారు. జాన్ అబ్రహాం ఇప్పటికే ఒక 'వర్క్ అవుట్' చేయగా, హృతిక్‌రోషన్, సల్మాన్‌ఖాన్‌ల డీవీడీలు త్వరలోనే విడుదల కానున్నాయి. కత్రినా, ప్రియాంక చోప్రాలు కూడా అదే పనిలో ఉన్నారు. అందుకోసం ఈ స్టార్లంతా కోట్లలో పారితోషికం పుచ్చుకున్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరగుతోంది. బాలీవుడ్ వర్క్ అవుట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'బాలీవుడ్', 'బాంబే డ్రీమ్స్', 'మసాలా బాంగ్రా', 'బాలీవుడ్ గ్రూవ్స్', 'ఇండియన్ డాన్స్ ఏరోబిక్స్', 'ఇండియన్ ఫోక్ డాన్స్' డీవీడీలు అమెరికా, యూరోప్ దేశాలలో నీరాజనాలు అందుకుంటున్నాయి.

యోగా...కాస్త వెరైటీగా

కొంచెం వెరైటీ కోరుకునే వారు మనసును, మెదడును అదుపులో ఉంచే యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామానికి కూడా ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్, అక్షయ్‌కుమార్, శిల్పాశెట్టి, దీపికా పదుకొనె, నేహా ధూపియా వంటి చాలామంది సెలబ్రిటీలు జిమ్ మానేసి యోగాసనాల వెంటపడ్డారు. ఆధునిక మానవుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మానసిక ఒత్తిడితో ఉంటున్నాడు కాబట్టి 'హౌ వుయ్ ఫీల్, నాట్ హౌ వుయ్ లుక్' అనేది కొత్త నినాదంగా మారుతోంది. ఆఫీసుల్లో, ఇళ్లల్లో పనులు చేసి శారీరకంగా అలిసిపోతున్న వాళ్లకి మళ్లీ జిమ్‌లో మిషనరీ వ్యాయామం చేస్తే అలసటే తప్ప శరీరానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందనేది కొంతమంది యోగా గురువుల ప్రశ్న. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామాల ద్వారా శరీరానికి కావల్సిన ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్తున్నారు వాళ్లు. అయితే ఏ పరికరాలు అవసరం లేని యోగాను కూడా ఎవరూ చవకగా నేర్పించడానికి సిద్ధంగా లేరు. యోగా ఇష్టపడే వాళ్ల కోసం చాలా కంపెనీలు యోగా గురువులను అధిక మొత్తం చెల్లించి తమ ఫిట్‌నెస్ క్లబ్బులలో నియమించుకుంటున్నాయి. ఆకర్షణీయమైన జీతాలు ఊరిస్తుండడంతో ఎంతోమంది యోగా గురువులు కమర్షియల్ కెరీర్‌కు పునాదులు వేసుకుంటున్నారు.

అన్నీ ఫిట్‌నెస్ లోకే!

సగటు మనిషి 'బాడీ బిల్డర్'గా కండలు చూసుకుని మురిసిపోయే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. సినిమాల ప్రభావంతోనే జిమ్ యావ మొదలైనప్పటికీ అది ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరూ గుర్తించారు. ఈ యేడాది వ్యాయామ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న వివిధ కంపెనీలు ప్రకటించాయి. ప్రజల్లో వస్తున్న అవగాహనకు అనుగుణంగా వారిలో ఇంకా ఆసక్తిని పెంచి లాభాలు గడించేందుకు వ్యాయామాల్లో కూడా కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తున్నాయి పలు కంపెనీలు. అందుకోసం డాన్సులు, ఏరోబిక్స్‌లే కాకుండా 'స్పా' యోగాలను కూడా హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌లో కలిపేశారు. అందుకే యోగా గురువులకు, కొరియోగ్రాఫర్లకు ఫిట్‌నెస్ సెంటర్లు నడిపే కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఫిట్‌నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా, ఆడుతూ పాడుతూ చేసేలా ఉండాలనేదే ఇప్పుడున్న కొత్త నియమం. అందులో భాగంగానే జాజ్, సల్సా, రుంబా...ఇలా కొన్ని ప్రత్యేక డాన్సులు కూడా ఫిట్‌నెస్‌లో కలిసిపోయాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా డాన్సు నేర్చుకుంటున్న వారితో శిక్షణా సంస్థలు నిండిపోతున్నాయి.

ఒళ్లు జిమ్మనాల్సిందే

భారతీయులు ఇప్పుడు 'సిక్స్‌ప్యాక్', 'ఎయిట్ ప్యాక్'లకు షేకవడం లేదు కాని 'ఫ్యామిలీ ప్యాక్' నుంచి దూరంగా ఉంటూ ఫిట్‌గా ఉండేందుకు మాత్రం ఆరాటపడుతున్నారు. ఒబేసిటీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతుండడమే అందుకు ప్రధాన కారణం. గతంలో 'ఫిట్‌నెస్' అంటే మరోమాట లేదు జిమ్‌కు పరుగెత్తడం తప్ప. కాని ఇప్పుడు అలా కాదు ఆటలు, డాన్సులు, ఏరోబిక్స్, యోగా కూడా ఫిట్‌నెస్‌ను అందించే ప్రత్యామ్నాయాలుగా మారిపోయాయి. అందుకే నగరాల్లో ఎన్ని జిమ్ సెంటర్లు ఉన్నాయో, అన్ని డాన్సు సెంటర్లు, ఎన్ని ఏరోబిక్స్ సెంటర్లు ఉన్నాయో అన్ని యోగా కేంద్రాలూ దర్శనమిస్తాయి. నగర జీవితంలో ఐదు నిమిషాలు కూడా గట్టిగా నడవలేని పరిస్థితే ఉంది. ఆఫీసుల్లో కూర్చున్నచోటు నుంచి కదలకుండానే పనులు చేయాల్సి రావడం... రాకపోకలకు వాహనాలు ఉపయోగించక తప్పని స్థితి ఉండడంతో ఇంక శరీరాన్ని అన్ని రకాలుగా 'అదుపు'లో ఉంచుకోవాలంటే ఫిట్‌నెస్ కేంద్రాల్ని ఆశ్రయించక తప్పడం లేదు. సహజంగా ఒళ్లొంచే పరిస్థితులు వచ్చేదాకా ఈ ట్రెండ్ కొనసాగక తప్పదు.

హైద్రాబాద్ సంగతేంటి?

హైద్రాబాద్‌లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నకొద్దీ వ్యాయామకేంద్రాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందరికీ తెలిసిన గోల్డ్స్ జిమ్, లాటిట్యూడ్స్ ప్రో, ఫిట్‌బజ్, టాల్‌వాకర్, బాడీ అండ్ సోల్, స్నాప్ ఫిట్, దినాజ్ ఫిట్‌నెస్ స్టూడియో వంటివే కాకుండా కొత్తగా పాపులర్ అవుతున్న ఫిట్‌నెస్ వన్, బండాస్ బాడీఫ్లెక్స్ జిమ్, స్లిమ్‌జోన్, ఫిట్‌నెస్ వరల్డ్ జిమ్, పవర్‌పాయింట్ జిమ్... ఇలా లెక్కలేనన్ని వ్యాయామ కేంద్రాలు పట్టుకొస్తున్నాయి. చిన్నా చితకా జిమ్‌లు కలిపి వెయ్యికి పైగా ఉన్నాయి. కొందరిది బిజినెస్ అయితే కొందరికి అది ఉపాధి.
* కార్పొరేట్ జిమ్‌లలో నెల రోజుల మెంబర్‌షిప్ రూ. 5000, ఆరు నెలలకు 12000, సంవత్సరానికి 18000 వరకు ఉంది. అదే స్థానికంగా కొంచెం పేరున్న వాటిలో అయితే నెలకు 1200 రూపాయలు ఉండగా, చిన్న వాటిలో 125-400 మధ్య ఉంది.
* అయితే ఎనభై శాతం మంది రెండు నెలలకు మించి మెంబర్‌షిప్ కొనసాగించడం లేదు. అంటే మధ్యలో మానేసే వాళ్లే ఎక్కువ.
* కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య బాగానే ఉన్నా డ్రాపవుట్స్‌లో కూడా వాళ్లే ఎక్కువ.
* పెద్దవాళ్లు యోగా, జాగింగ్, వాకింగ్‌లతోనే సరిపెట్టుకుంటున్నారు.
* పూర్తిస్థాయి బాడీబిల్డర్‌గా పోటీల్లో పాల్గొనాలంటే కనీసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఆసక్తి కలవారు అందుకూ వెనకాడడం లేదు.
* 'మిస్టర్ వరల్డ్' పోటీల్లో పాల్గొనాలనే ఆశతో, అది సాధ్యం కాకపోతే వ్యక్తిగత శిక్షకులుగానైనా ఉపాధి పొందవచ్చనే నమ్మకంతో నగర యువత ఫిట్‌నెస్ కెరీర్‌పై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు.
ఇది నాణేనికి ఒకవైపు, మరోవైపు ఫిట్‌నెస్‌పై అత్యాశతో అనర్థాలు కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సినిమా హీరోలనో, మరొకరినో చూసి త్వరగా కండలు పెంచాలనే అత్యాశతో 'డ్రగ్స్' తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు కొందరు. 'నిజం చెప్పాలంటే హైద్రాబాద్‌లో ఆరోగ్యం కోసమే జిమ్‌కు వచ్చే యువకుల సంఖ్య చాలా తక్కువ. ఐదారు నెలల్లోనే బాడీ బిల్డర్‌గా కనిపించాలని, సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ మంది వస్తుంటారు. విచ్చలవిడిగా ప్రచారంలో ఉన్న ఫిట్‌నెస్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. దానివల్ల భవిష్యత్‌లో కలిగే అనర్థాలేమిటో జిమ్ నిర్వాహకులు చెప్పడం లేదు. ఇక్కడ సగానికి పైగా జిమ్‌లు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే వాటికి వచ్చే ఆదాయంలో డెబ్బయి శాతం డ్రగ్స్ ద్వారానే' అని ఎనిమిది సంవత్సరాల నుంచి 'పవర్‌పాయింట్ జిమ్' నడుపుతున్న అచ్చగొని సతీష్ గౌడ్ అన్నారు.

* బి. మహేందర్