తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు
నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు
సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా
ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో
ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల
అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా
ప్రాణాయామం గురించి తెలుసుకుందాం.
1.ప్రాణాయామ విశేషాలు
ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.
ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.
ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్ సైన్స్ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.
వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.
2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
- ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
- శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.

- రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
- బయటికి వెళ్లి పోతుంది.
- గుండెకు సత్తువ లభిస్తుంది.
- మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
- జఠరాగ్ని పెరుగుతుంది.
- శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
- ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.
3. తీసుకోవలసిన జాగ్రత్తలు- మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
- కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
- గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
- మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
- సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
- పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
- ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
- అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
- ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
- పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
- నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
- నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
- ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
- రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
- ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
- ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
మనం
పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా
మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా
బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని
ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల
మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే
10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు
చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు
కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను
(మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు
బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు
వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు
బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 




మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి మహ ర్షి తన యోగ శాస్త్రంలో చెప్పిన క్రియా యోగం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మయోగం సంధానం చేసి క్రియాయోగంగా ప్రపంచానికి అందించారు శ్యామాచరణ లాహిరి. ఆయన శిష్యులలో అతి ముఖ్యులు, క్రియాయోగాన్ని విశ్వవ్యాపితం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ 79వ జన్మదినం నేడు.
కుల, మత, జాతి, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షని శ్యామాచరణులు అందచేశారు.'నీవు ఎవరికి చెందవు..అలాగే నీకూ ఎవరూ చెందరు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు. క్రియోయోగం ద్వారా దైవంతో సంభాషించు. సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకో. జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి' అని శ్యామాచరణులు తన శిష్యులకు ఉద్బోధించేవారు.
ఈ ఆసన స్థితిలో ఊపిరితిత్తులు గాలితో నిండి శరీరం చేపలాగ నీటి మీద తేలడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని మత్స్యాసనం అంటారు. ఈ యోగసాధన ద్వారా ఊపిరితిత్తులకు వ్యాయామం అందుతుంది. దాంతో ఆస్త్మా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. దీనిని ఎలా చేయాలంటే...
థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంథులు, కంఠం ద్వారా మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి.
సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని చేయకూడదు.
కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 
నిటారుగా నిలుచోండి. చేతులు ఫొటోలో చూపిన విధంగా పెట్టండి. మొ దట్లో కాలుని చాలా తేలికగా పైకి ఎత్తుతూ ఉన్నచోటే పరు గుపెట్టండి. క్రమంగా.. వేగాన్ని పెంచండి. చేతులను, భుజాల దాకా చాపి, క్రిందికి దింపుతూ, ముందుకు వెనక్కి కదిలించాలి. మీ శ్వాసక్రియ ఊపందుకొని, రొప్పే దశకు చేరుకున్నప్పుడు తిరిగి వేగాన్ని తగ్గిస్తూ.. పరుగు ఆపండి.
ముందు నిటారుగా నిలబడండి. కాళ్ళు బాగా విడదీయండి. చేతుల్ని చెరోవైపు సాగదీసీ చాపి గెంతండి. కాళ్ళను మళ్లీ దగ్గర చేర్చండి. చేతుల్ని మీ తొడలమీదకు చేర్చండి. మళ్లీ గెంతండి. కాళ్ళు ఎడంగా పెట్టి చేతులు చాపండి. క్రమంగా వేగం పెంచండి. కాళ్ళు, చేతులు గట్టిగా సాగదీయడం బట్టి మీ గెంతులో ఊపు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం రొప్పేదాకా చేసి ఆపండి.
(ఎ) నిటారుగా నిలబడండి. పాదాలను విడిగా వుంచండి. చేతుల్ని ఫొటోల్లో చూపిన విధంగా పెట్టండి. (బి) క్రిందికి మోకాళ్ళు పైకూర్చోండి. పిరుదులు మడమలకు తగలాలి. (సి) తరువాత చేతుల్ని ముందుపెట్టి పాదాల్ని వెనక్కి తీసుకు వెళ్లి ముని వేళ్లపై ఆన్చండి. తిరిగి లేచి నిలుచోండి. ఇలా నెమ్మదిగా మొదలుపెట్టి వేగం పెంచండి. రొప్పే దాకా చేసి ఆపండి.
నిటారుగా నిలుచోండి. (ఎ) చేతుల్ని నడుము మీద ఉంచుకోండి. (బి) అడుగు ముందుకువేసి కుడికాలుని కర్ణదిశగా పెట్టి ఫొటోలో చూపిన విధంగా రెండు చేతులతో తొడను బంధించండి. ఇలాగే కుడి కాలితో కూడా చేయండి. ఈ వ్యాయామాన్ని పదిసార్లు రిపీట్ చేయండి. రొప్పేదాకా ఇలా చేసి ఆపండి.
కుడికాలికి, ముందర ఎడం కాలు పెట్టి నిటారుగా నిలబడండి. చేతుల్ని ఇలా తల వెనుక మీ శరీరాన్ని మోకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ... చేతుల్ని ఇలా తలవెనుక మీ శరీరాన్ని మొకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ.. ఒక్కసారి స్ప్రింగులా గెంతి మీ పాదాలతో నేలను తన్నండి. కాళ్ళు పెట్టే దిశను మార్చి రిపీట్ చేయండి. ఇలా పదిసార్లు చేయండి. ఊపరి వేగం పుంజుకున్నాక ఆపండి.
నిటారుగా నిలబడండి. మీ మొండాన్ని ముందుకు వంచి చేతులిలా పెట్టండి (ఎ) మీ చేతుల వేళ్ళతో నేలను తాకే ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంగకూడదు. తరువాత నిటారుగా నిలబడి భుజాలను వాల్చండి. తరువాత వెనక్కి వంగం డి. ప్రతీసారీ వీలైనంత ఎక్కువగా వెనక్కి, క్రిందికి వంగటానికి ప్రయత్నించండి (బి). అయిదుసార్లు ఇలా చేయండి. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ అయిదుసార్లు చేయండి.





మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.
కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు.
డాక్టర్ ఎన్ సత్యప్రసాద్
* ఆరోగ్యంగా. ఫిట్‌గా ఉండాలంటే రోజూ కనీసం అరగంటైనా వాకింగ్ చేస్తే చాలు అంటారు నిపుణులు.

లైంగిక పటుత్వం, సామర్థ్యం... ఇవి ఈనాడు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న అంశాలు. లైంగిక సామర్ధ్యానికి, డబ్బు, హోదా, కీర్తిప్రతిష్టలు, అధికారం, విజయం, శారీరక బలం, అందం ఇవేవీ నిశ్చయాత్మకమైన పాత్ర పోషించలేవు. ఇవన్నీ ఇద్దరి వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాలు ఏర్పడటానికి విస్తృతమైన అవకాశాలను కలిగిస్తాయే తప్ప, లైంగిక సామర్ధ్యానికి గ్యారెంటీ ఇవ్వలేవు. కాగా మనం నిత్యం అనుభవించే అపరిమితమైన ఒత్తిడి, నిరాశ, నిస్పృహలు లైంగిక సామర్థ్యంపై గణనీయమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి.
చక్కని శరీర భంగిమతో నిలుచోండి. మీ రెండు పాదాల మీద మీ శరీర భారం సమానంగా పంపిణీ కావాలి. మీ భుజాలు క్రిందికి దింపి, మీ వెన్నెముక చివరి భాగం కిందికి దిగేలా ఉంచండి. మీ శరీరంలో ప్రతి కండరం, పిరుదులు, ఉదరభాగం అన్నీ బిగువుగా మారిపోతున్నట్టు ఊహించుకోండి. కనిపించని ఒక తీగ ఏదో మిమ్మల్ని తలమీద నుండి పాదాల దాకా పైకి లాగుతున్నట్టుగా ఊహిస్తూ... మీరు మరింత పొడుగ్గా సాగిపోతున్నట్టుగా ఊహించుకోండి. మీ ఉదరవేతనంలో గాలిని బాగా లోపలికి పీల్చండి. మీ ఊపిరితిత్తుల నిండా ఆక్సిజన్‌ని నింపండి. ఇప్పుడు మీ దృష్టి అంతా మీ శ్వాసక్రియ మీదనే కేంద్రీకరించండి. వెంటనే మీలో అంతర్గతంగా చాలా ప్రశాంతమైన భావన కలుగుతుంది. ఇలా గాఢంగా శ్వాసించడం ప్రకృతి సహజమైన మత్తును కలిగిస్తుంది.
1) మామూలుగా శ్వాసించండి. కుడి అరచేత్తో ఎడమకాలి మడమను తాకండి. నడుం మెలితిప్పండి. ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడండి. ఇలా ఐదు సెకన్లు ఉండండి.
1) పాదాలను ఎడంగా వుంచి, నిలబడండి. కుడికాలిని ముందుకు జరపండి. పాదాన్ని సరళరేఖపై వుంచండి. మీ ఎడమపాదాన్ని ఈ సరళరేఖకు లంబదిశగా వుంచండి. చేతుల ను వెనక్కి మడిచి నమస్కరిస్తున్న భంగిమలో మీ అరచేతులను జోడించండి. దీంతో మీ ఛాతి పైభాగం, పొట్ట ముందుకు వస్తాయి. మీ భుజాలను క్రిందికి దిగి వుండే విధంగా జాగ్రత్తపడండి. ఒకవేళ మీ అరచేతులను ఈ విధంగా జోడించి వుంచడం కష్టంగా వుంటే, మీ చేతుల మణికట్టును బంధించండి. మీ వీపు క్రింది భాగానికి ఆన్చి వుంచండి.
2) గాలిని పీల్చండి, వీలైనంత వెనక్కి వాలండి. మీ మెడ, ముఖ కండరాలను వదులుగా వుంచండి.
6) ఇప్పుడు మీ కుడికాలిని తిన్నగా జరపండి. గాలిని పీలుస్తూ... ఎడమ కాలిని వెనక్కి గాలిలో లేపండి. మీ ఎడమకాలి మడమ, మీ వెన్నెముక ఒకే సరళరేఖలో వుండే విధంగా పెట్టండి. 10 సెకన్లపాటు ఇలా ఉండి నెమ్మదిగా ఎడమకాలిని క్రిందికి దింపి 5వ స్థానానికి రండి. తరువాత ఇదే మాదిరిగా ఎడమవైపు చేయండి.
అట్లాగే జీర్ణశక్తికి కూడా ఇది చాలా మంచిది. వెన్నెముకకు ఈ వ్యాయామం ఉత్తేజా న్ని కలిగిస్తుంది. ప్రసవానం తరం లేదా వయసు మళ్లే దశలో స్ర్తీలలో చాలామంది ఈ ప్రదేశంలో స్తబ్దతను ఎదుర్కొంటారు. పొత్తికడుపు క్రింది కండరాలు జవజవలాడిపోవడం, యోని కండరాల్లో బిగి తగ్గిపోవడం ఫలితంగా రతిలో బిగువైన స్పందన కొరవడడం వంటి ఇబ్బందులనెదు ర్కొంటారు. అందుకే ఈ ఎక్సర్‌సైజులు.
3) నేల మీద ఇంకా వెనక్కి వంగండి. మీ చేతులను విడదీసి, తలమీదుగా పైకి జరపండి. అక్కడ వాటిని మీ చేతుల వద్ద మడవండి. గాఢంగా ఊపిరిపీల్చండి. మీరు ఊపిరిని బయటకు వదులు తున్నప్పుడల్లా, మీ శరీరమంతటా సాగదీస్తున్న ఫీలింగ్ ఏర్పడు తూ వుంటుంది. దీనివల్ల రక్తప్రసరణ పెరుగు తుంది. కాసేపటికి మీకు ఎంతో హాయిగా, రిలాక్స్‌డ్‌గా మత్తుగా వుంటుంది. ఈ భంగిమలో కాసేపు వుండి తిరిగి (2)వ స్థానానికి రండి. తరువాత (1)వ స్థానానికి రండి.