Showing posts with label Ayurvedam. Show all posts
Showing posts with label Ayurvedam. Show all posts

Saturday, October 29, 2011

మలినాలను కడిగే పంచకర్మలు

ఎంత సేపూ వ్యాధి లక్షణాలను తగ్గించే వైద్య చికిత్సల కోసం వెళతాం కానీ, వ్యాధి కారకమైన ఆ మూలాల మీదికి చాలా సార్లు మన దృష్టే వెళ్లదు. శరీరంలో పేరుకుపోయిన కల్మషాలను తొలగించుకోకుండా ఏ వ్యాధైనా శాశ్వతంగా పోదుకదా! అందుకే ఆయుర్వేదం ఆ కల్మషాలను తొలగించే పంచకర్మ చికిత్సలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రత్యేకించి సొరియాసిస్ వ్యాధి నిర్మూలనలో ఈ పంచకర్మ చికిత్సలు మరీ ముఖ్యమైపోయాయి.

శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలు సొరియాసిస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం. ఈ మాలిన్యాలకు మానసిక ఒత్తిళ్లు కూడా తోడైతే, సమస్య మరీ తీవ్రమవుతుంది. అందుకే సొరియాసిస్‌కు ఈ రెండు కోణాల్లోంచి చికి త్సలు అందించవలసి ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉద్దేశించినవే పంచకర్మ చికిత్సలు.

వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అనే ఈ ఐదు చికిత్సలు సొరియాసిస్ నిర్మూలనలో అద్భుతంగా తోడ్పడతాయి. శరీరాన్ని పంచకర్మ చికిత్సలకు సిద్ధం చేయడానికి కూదా కొన్ని విధానాలు ఉంటాయి. వీటినే పూర్వకర్మలు అంటారు. అందులో భాగంగా స్నేహం ( తైలమర్ధనం) స్వేదం ( స్టీమ్) ఉంటాయి.

చర్మ వ్యాధుల్లో సాధారణంగా శరీరం పొడిబారిపోయి ఉంటుంది. ఔషధాలు కలిసిన నెయ్యి గానీ, నూనె గానీ ఇచ్చే ఈ స్నేహపాన ం వల్ల ఆ పొడితనం పోయి చ ర్మానికి ఒక నూనెతనం, ఒక మృదుత్వం వస్తాయి. ఈ చికిత్స మూడు నుంచి ఏడు రోజుల దాకా ఉంటుంది. ఈ ప్రక్రియలో వాడే నూనె లేదా నెయ్యికి సహజంగా జిడ్డుతనం, జారుడు గుణం ఉంటాయి. వీటివల్ల శరీరంలో పేరుకుపోయి, గ ట్టిపడిన దోషాలను ఇది మెత్తబడతాయి. ఆ తరువాత శరీరానికి చెమట పట్టించే స్వేదం చేస్తాం. దీనివల్ల అప్పటికే మెత్తబడిన మలినాలన్నీ కడుపులోకి వచ్చేస్తాయి. వాటిని కడుపులోంచి బయటికి పంపించడానికి ఇక పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి.

వమనం
సొరియాసిస్ మచ్చలు మందంగా ఉండి దురద కలిగిస్తూ, నలుపెక్కి ఉంటే శరీరంలో ఖఫదోషం ఎక్కువగా ఉన్నట్లు భావించబడుతుంది. ఈ దోషాన్ని నిర్మూలించడానికి 'వమన క్రియ' అవసరమవుతుంది. ఇది ఔషధాలు కలిపిన ద్రవాలు ఇచ్చి వాంతి చేయించే ప్రక్రియ. వమన క్రియ వల్ల కడుపులోకి చేరిన మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.

విరేచన క్రియ
సొరియాసిస్ మచ్చలు ఎర్రబడి, పొట్టు ఎక్కువగా రాలుతూ ఉండడం వాతం ఎక్కువగా ఉన్నట్లు చెప్పే సూచనలు. ఈ స్థితిలో విరేచన క్రియ అవసరమవుతుంది. వాతాన్ని తొలగించడంలో విరేచన క్రియను మించింది లేదు. ఇది మలద్వారం ద్వారా శరీరంలోని మలినాలన్నిటినీ బయటికి పంపించే ప్రక్రియ.

వస్తికర్మ
సొరియాసిస్ చికిత్సలో వస్తికర్మ పాత్ర చాలా తక్కువ. కాకపోతే, సమస్య సొరియాసిస్ ఆర్థరైటిస్‌గా పరిణమించిన స్థితిలో మాత్రం వస్తికర్మ అవసరమవుతుంది. ఈ సమస్యేమీ లేనప్పుడు వస్తికర్మ అవసరం లేదు. నిజానికి సొరియాసిస్ చికిత్సలో వమన, విరేచనాలదే కీలక పాత్ర అవుతుంది.

నస్యకర్మ
ఔషధపు చుక్కలను నాసిక రంద్రాల్లో వేసే ప్రక్రియను నస్యకర్మ అంటారు. ఇది శారీరక ప్రధానమే కాకుండా మానసిక ప్రధానం కూడా. ఈ చికత్సతో ప్రతికూల ప్రేరకాలన్నీ తొలగిపోయి మెదడు చైతన్యవంతమవుతుంది. అలాగే అస్తవ్యస్తమైపోయిన మెదడులోని అల్ఫా, బీటా, గామాలు నియంత్రణలోకి వస్తాయి.

ఇవి తరంగాల వంటివి. వీటి ఆధారంగానే మనిషి ఆలోచన సరళి ఉంటుంది. ఆ తరంగాలను నియంత్రించడం నస్యకర్మ వల్ల సాధ్యమవుతుంది. దీనివల్ల భయాందోళనలు, దిగులు, డిప్రెషన్ తొలగిపోయి, మానసిక ప్రశాంత ఏర్పడుతుంది. నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది.

రక్తమోక్షణం
కొందరిలో సొరియాసిస్ మచ్చలు కొన్ని చోట్ల మందంగా మారిపోతాయి. అక్కడ గడ్డకట్టుకుపోయిన చెడు రక్తమే ఇందుకు కారణం. ఆ చెడు రక్తాన్ని తీసివేయకుండా ఎన్ని మందులు వాడినా ఆ మచ్చలు తగ్గవు. గడ్డకట్టుకుపోయిన ఆ చెడు రక్తాన్ని, జలగల సహాయంతో తీసివేయవలసి ఉంటుంది. ఇలా చేసే ప్రక్రియనే రక్తమోక్షణం అంటారు. ఆ తరువాత కూడా ఆ వ్యాధి మళ్లీ రాకుండా ఒక ఏడాది పాటు మందులు వాడవలసి ఉంటుంది.

నిజానికి, పంచకర్మల తరువాత శరీరంలో మందులను గ్రహించే శక్తి బాగా పెరుగుతుంది. పంచ కర్మ చికిత్సలకు ముందే మందులు వాడితే, 50 శాతం ఉండే ప్రయోజనం ఆ చికిత్సల తరువాత అయితే 100 శాతం ఉంటుంది. కాకపోతే, పంచకర్మ చికిత్సలతో శరీరం పరిశుద్ధంగా మారి, మందులతో వ్యాధి తగ్గినా, అది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేమీ కాదు.

ఆ శక్తి పెరగకపోతే మళ్లీ ఏదో ఒక వ్యాధి వచ్చే వీలుంది. అందుకే పంచకర్మ చికిత్సలు తీసుకున్నాక వ్యాధి నిరోధక శక్తిని పెంచే రసాయన చికి త్సలు తప్పనిసరి అవుతాయి. అశ్వగంధ, శతావరి, గుడూచి, బ్రాహ్మి, యష్టిమధు వంటి ఔషధాల మిశ్రమంతో తయారయ్యే ఈ రసాయనాలు శరీరాన్ని సర్వశక్తివంతంగా తయారుచేస్తాయి. దీని వల్ల శరీరం వ్యాధిగ్రస్తం కాకుండా స్థిరంగా ఉంటుంది.

Tuesday, August 30, 2011

మత్స్యాసనం లంగ్ క్లీనర్*మత్స్యాసనం వెయ్యడమంటే... జీవకణాలకు ప్రాణవాయువును పంప్ చెయ్యడమే!!

గాలీ వెలుతురు ధారాళంగా ఉన్న ఇంట్లో చెమ్మ చేరదు.
ఊపిరి సాఫీగా ఉన్న ఒంటికి రోగమూ రొప్పూ ఉండదు.
పండగొస్తోంది.
గూళ్లు గుమ్మాలు ఎలాగూ దులుపుకుంటాం.
అలాగే శ్వాసకోశాలనూ కాస్త శుభ్రం చేసుకుంటే...
పండగ సంతోషాలకు ఆస్త్మాలు,ఆయాసాలు అడ్డురావు.
మత్స్యాసనం శ్రద్ధగా సాధన చెయ్యండి. లంగ్స్‌ని క్లీన్ చేసుకోండి.
మత్స్యాసనం వెయ్యడమంటే...
జీవకణాలకు ప్రాణవాయువును పంప్ చెయ్యడమే!!


మత్స్యాసనం

ఈ ఆసన స్థితిలో ఊపిరితిత్తులు గాలితో నిండి శరీరం చేపలాగ నీటి మీద తేలడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని మత్స్యాసనం అంటారు. ఈ యోగసాధన ద్వారా ఊపిరితిత్తులకు వ్యాయామం అందుతుంది. దాంతో ఆస్త్మా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. దీనిని ఎలా చేయాలంటే...

పద్మాసన స్థితిలో కూర్చోవాలి. తర్వాత ఫొటోలో ఉన్నట్లు మోచేతుల సహాయంతో శరీరాన్ని మెల్లగా నేల మీదకు తీసుకురావాలి. ఈ స్థితిలో దేహం బరువు నడుము, మోచేతుల మీద ఉంటుంది. మెల్లగా వెన్ను, భుజాలు, తలను కూడా నేల మీదకు ఆనించి పడుకోవాలి.


అరచేతులను చెవులకు పక్కన నేలకు ఆనించాలి (ఈ స్థితిలో చేతి వేళ్లు భుజాలవైపు ఉండాలి). తర్వాత అరచేతుల మీద బలాన్ని మోపి నేలను నొక్కిపట్టి నడుమును, ఛాతీని పైకి లేపాలి. మెడను వెనక్కు వంచి తల నడినెత్తిని నేలకు ఆనించాలి.


ఇప్పుడు చేతులను తల పక్కనుంచి తీసి కాలివేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు నేలకు ఆని ఉంటాయి. ఇది మత్స్యాసన స్థితి. సాధారణ శ్వాస తీసుకుంటూ ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. అదెలాగంటే...


కాళ్లను వదిలి, అరచేతులను తలకు ఇరువైపుల నేలకు ఆనించాలి. తలను పైకి లేపి మెల్లగా భుజాలను నేలకు ఆనించిన తర్వాత తలను నేలకు ఆనించాలి. తర్వాత నడుము భాగాన్ని నేలకు ఆనించి, మోచేతుల సహాయంతో పైకి లేచి కూర్చోవాలి.


పద్మాసనాన్ని విప్పి శరీరాన్ని వదులు చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా 3-5 సార్లు చేయాలి. పద్మాసనం వేయలేని వాళ్లు లేదా పద్మాసన స్థితిలో ఎక్కువ సేపు ఉండలేని వాళ్లు... మత్స్యాసనాన్ని అర్ధపద్మాసనం వేసి వేయవచ్చు. అదీ సాధ్యం కానప్పుడు కాళ్లు చాపి కూడా చేయవచ్చు. కింద చెప్పిన అన్ని ప్రయోజనాలు చేకూరాలంటే పద్మాసన స్థితిలోనే వేయాలి.


మత్స్యాసనం ప్రయోజనాలు!

థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంథులు, కంఠం ద్వారా మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి.

ఊపిరితిత్తులలోకి ప్రాణశక్తి బాగా అంది రక్తం శుద్ధి అవుతుంది.


ఉబ్బసం, ఆయాసం, శ్వాసనాళ సమస్యలు తగ్గుతాయి.


ఛాతీకండరాలు, మర్మాంగాలు శక్తిమంతం అవుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్దకం పోతుంది.


నడుము శక్తిమంతం అవుతుంది, గర్భకోశ సమస్యలు తగ్గుతాయి.


టాన్సిల్స్, మధుమేహం, మెదడు సమస్యల నుంచి ఉపశమనం.


నరాల సమస్యలు, చెవి, ముక్కు వ్యాధులు తగ్గుతాయి.


మత్స్యాసనాన్ని వీళ్లు చేయకూడదు!

సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని చేయకూడదు.

హెర్నియా ఉన్న వాళ్లు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.


ఆస్త్మా నివారణకు ఉపకరించే మరికొన్ని యోగాసనాలు ఇవి!

ఉష్ట్రాసనం, శశాంకాసనం, శలభాసనం, సుప్తవజ్రాసనం, ధనురాసనం, భుజంగాసనం, కోణాసనం, పశ్చిమోత్తాసనం, సూర్యనమస్కారాలు, పవనముక్తాసనం, జలనేతి, సూత్రనేతి, కపాలభాతి, ఉజ్జయి, కుంజరధౌతి, విభాగ ప్రాణాయామం... మొదలైనవి. వీటిలో అనేక యోగాసనాలు గత సంచికలలో ప్రచురితమయ్యాయి.
మోడల్: మానస
- వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

ఆయుర్వేదంలో..!

ఆస్త్మా తమకశ్వాసరోగం. ఇది కఫం, వాతం ప్రధానంగా వచ్చే వ్యాధి. దీని లక్షణాలలో ప్రధానంగా కనిపించేది శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలతో కూడిన ఆయాసం. ఇలా బాధపడేటప్పుడు ముఖాన్ని నేలకు చూస్తున్నట్లుగా కూర్చుంటే బాధ ఉపశమించినట్లు ఉంటుంది, అదే ఆకాశంలోకి చూస్తున్నట్లు అంటే వాలు కుర్చీలో కూర్చున్నప్పుడు తీవ్రత ఎక్కువవుతుంటుంది.
ఆస్త్మాను నివారించడానికి రోజూ ప్రాణాయామం చేయడం ఉత్తమమైన మార్గం. అలాగే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి.

ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు, ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు. అదే విధంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం... ఆస్త్మాతో బాధపడుతున్న సమయంలో ప్రాణాయామం కాని ఏ ఇతర యోగా ప్రక్రియలను కూడా సాధన చేయకూడదు.


ఆస్త్మా తక్షణ నివారణకు: మూడు చెంచాల ‘కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ‘శృంగారాభ్రరస’ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవాలి. వీటితోపాటు ఛాతీకి, నడుముకు కర్పూరతైలాన్ని రాసి వేడి నీటి కాపడం పెట్టాలి.


అలర్జీలను కలిగించే వాటిని గమనించి, అవి ఆహారం, దుస్తులు, కాస్మటిక్స్... ఇలా ఏవైనా సరే వాటికి దూరంగా ఉండాలి.

- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యనిపుణులు

ఆస్త్మా తగ్గించే ఆహారం

కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

బేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.


ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.


ఇలా కూడా తీసుకోవచ్చు...

పసుపు కలిపిన పాలు తాగాలి. స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. - పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.

ఇవి వద్దు!

పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.

‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న అధ్యయనాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.

- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్

Tuesday, July 12, 2011

కపాలభాతి యోగ స్నానం

స్నానం చేస్తాం. శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తాం. తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తాం. బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తాం. మసాజ్‌లా ఉంటుంది.అయితే - ఇవన్నీ పైపై స్నానాలు. కాకిస్నానాలు. లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. ఈవారం కపాలభాతి ఆసనం నేర్పిస్తున్నాం. సాధన చెయ్యండి. మెదడుకు, శ్వాసకోశాలకు, జీవక్రియలకు లాలపొయ్యండి. గాల్లో తేలినట్లు లేకపోతే అడగండి.

కపాలభాతి ప్రయోజనాలు:

మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి

శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది


ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది


జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి


సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి


కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది

వీళ్లు చేయకూడదు!
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.

ఎప్పుడు చేయాలంటే!

ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.


జాలంధర బంధం అంటే గడ్డాన్ని ఛాతీకి బంధించి ఉంచడం, మూలబంధం అంటే మలద్వారాన్ని పైకి లేపి ఉంచడం, ఉడ్యానబంధం అంటే పొట్టను బిగించడం.


బాహ్య కుంభకం అంటే శ్వాస వదిలిన తరవాత కొద్దిసేపు తీసుకోకపోవడం (ఊపిరి బిగపట్టడం). ఇలా ఉండగలిగినంత సేపు మాత్రమే ఉండాలి.


అంతర వ్యాయామం: ఆయుర్వేదం

కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు.
- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు
యోగశాస్త్రం ప్రకారం
‘కపాలం’ అంటే మస్తిష్కం లేదా మెదడు. ‘భాతి’ అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపచేసే క్రియ కాబట్టి దీనిని కపాలభాతి అంటారు. ఇది షట్‌క్రియల్లో ఒకటి అయినప్పటికీ ప్రాణాయామంలో భాగంగానూ సాధన చేయవచ్చు. దీనిని నాలుగు దశల్లో చేయాలి. గతవారం భస్త్రిక ప్రాణాయామాన్ని ఐదు దశల్లో సాధన చేశాం. భస్త్రికలో గాలిని తీసుకోవడం, వదలడం రెండూ ఉంటాయి, కపాలభాతితో గాలిని వదలడమే ప్రధానం. శ్వాస తీసుకోవడం అప్రయత్నంగా జరగాలి తప్ప, ప్రయత్నపూరకంగా గాఢంగా, దీర్ఘంగా తీసుకోవడం అనేది ఉండదు.
సాధన ఇలా!పద్మాసన స్థితిలో వెన్ను, మెడ నిటారుగా ఉంచి, చేతులను వాయుముద్రలో మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లుమూసుకోవాలి, ముఖంలో ప్రశాంతత ఉండాలి.

మొదటి దశలో...

కుడి చేతి పిడికిలిని బిగించి, బొటనవేలితో ముక్కు కుడిరంధ్రాన్ని మూసి, ఎడమరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి. శ్వాసను వదిలినప్పుడు కడుపు భాగం లోపలికి ముడుచుకోవాలి. ఇలా 10-20 సార్లు చేయాలి. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ చేయాలి.

రెండవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి వాటి మీద బొటనవేలిని ఉంచాలి. ఉంగరపువేలు, చిటికెన వేళ్లతో ముక్కు ఎడమయంధ్రాన్ని మూయాలి. ముక్కు కుడిరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి.

మూడవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి, బొటన వేలితో ముక్కు కుడి రంధ్రాన్ని, చివరి రెండు వేళ్లతో ఎడమ రంధ్రాన్ని మూయాలి. ఇప్పుడు ఎడమరంధ్రం మీద ఉన్న వేళ్లను తీసి శ్వాసను వదలాలి. శ్వాసను పూర్తిగా వదిలిన వెంటనే చివరివేళ్లతో ఎడమరంధ్రాన్ని మూయాలి. తర్వాత ముక్కు కుడిరంధ్రం మీద ఉన్న బొటనవేలిని తీసి శ్వాసను పూర్తిగా వదలాలి.

నాలుగవ దశలో...

చేతులను వాయుముద్రలో ఉంచి శ్వాసను బలంగా వదలాలి. 10 -20 సార్లు చేయడం, మధ్యలో విశ్రాంతి, అప్రయత్నంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలినప్పుడు కడుపులోపలికి పోవడం వంటి నియమాలు అన్ని దశల్లోనూ యథాతథం. కపాలభాతిలో 90శాతం నిశ్వాస, పదిశాతం ఉచ్వాశ జరగాలి.

నాలుగు దశలూ పూర్తయిన తర్వాత శ్వాసను వదిలి మూలబంధం, ఉడ్యానబంధం, జాలంధర బంధం వేయాలి. ఈ బంధాలన్నింటినీ బాహ్య కుంభకంలోనే వేయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత బంధాలను విడవాలి. ముందుగా ఉడ్యానబంధం, తర్వాత జాలంధర బంధం, మూలబంధాలను విడవాలి. బంధాలను వేయడం, విడవడంలో క్రమం మారుతుంది. చివరగా విశ్రాంతి తీసుకోవాలి.

 












 
కొవ్వు శక్తిగా మారే ప్రక్రియ
మన శరీరంలోని కొవ్వును ఎల్ కార్నిటైన్ అనే పోషకం శక్తిగా మారుస్తుంది. ఎల్ కార్నిటైన్ తగ్గినా, దాని పనితీరు మందగించినా కొవ్వు శక్తిగా మారకుండా నిల్వ ఉండిపోతుంది. ఇది బాగా పనిచేయాలంటే దేహానికి తగినంత ఆక్సిజన్ అవసరం. కపాలభాతి సాధన చేసేవాళ్లు సమతుల ఆహారం తీసుకోవడం, మద్యపానం, ధూమపానం, జంక్‌ఫుడ్, స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులను మానేయడం. కార్బోహైడ్రేట్లను తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటిస్తే నెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బరువు తగ్గుతారు.

- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్

- వాకా మంజుల,  ఫొటోలు: అమర శ్రీనివాసరావు.వి , మోడల్: పూజిత

Wednesday, January 26, 2011

వాతాన్ని తగ్గించే విషగర్భతైలం

ఆయుర్వేద వైద్య విధానంలో విషద్రవాలను కడుపులోకి అలాగే చర్మ మర్ధనానికి కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాల మూలికలు, మరికొన్ని రకాల ఖనిజ రసాయనాలను తీసుకుంటారు. ఎక్కువ సంఖ్యలోనూ, ఎక్కువ మోతాదులోనూ అలాగే ఎక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను తీసుకుని తయారు చేసే తైలాన్ని " మహా విషగర్భ తైలం'' అంటారు.

తక్కువ సంఖ్యలోనూ, తక్కువ మోతాదులోనూ అలాగే తక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను వినియోగించి తయారు చేసే తైలాన్ని " లఘు విషగర్భ తైలం'' అంటారు. తైలం తయారీకి మూలికలు, ఖనిజ రసాయనాలు కలిపిన ఒక ముద్దను తయారు చే సుకుని అందుకు నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకుంటారు. ఆ తరువాత నూనెకు నాలుగు రెట్లు 16 భాగాల ద్రవాంశం కోసం ముందు కషాయాన్ని తయారు చేసుకుంటారు.


మహా విషగర్భ తైలం

ఈ తైలం తయారు చేసుకోవడానికి ఉమ్మెత్త విత్తులు, వావిలి విత్తులు, చేదు సొరకాయ విత్తులు, గలిజేరు వేర్లు, ఆముదం విత్తులు, అశ్వగంధ, చిత్రమూలం, మునగ పట్ట, కాకమాచీ, లాంగలీ దుంప, వేపపట్ట, వెర్రిపుచ్చ వేర్లు, దశమూలాలు, శతావరీ, సారిబా, ముండీ, విదారీకంద, స్నుహీ, అర్క, కర్కాటక శృంగి, గన్నేరు వేర్లు, కాకజంఘ వేర్లు, ఉత్తరేణు వేర్లు, బలా, అతిబలా, నాగబలా, మహాబలా, అడ్డసరం, తిప్పతీగె, ప్రసారిణీ మొదలైన మూలికలకు నీరు చేర్చి కషాయం సిద్ధం చేసుకుంటారు.

అలాగే విషముష్టి (శుద్ధి చేయనివి), శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, రాస్నా, కోష్టు, హరితాలకం, తుంగముస్తలు, దేవదారు, వత్సనాభి, యవక్షారం,సర్జక్షారం, పంచలవణాలు, మైల తుత్తం, కాయఫలం, పాఠా, భారంగీ, నవసారం, వెర్రిపుచ్చ, జవాసా, జీరక మూలికలను చూర్ణం చేసుకుని, తడిపి ముద్ద చేస్తారు. తైలపాక వి«ధి ప్రకారం నువ్వుల నూనెను కూడా తీసుకుంటారు.

పైన తెలిపిన అన్ని ద్రవాలను తగిన పాత్రలో కలిపి పొయ్యి పైన ఉంచుతారు. మూలికల ముద్ధ మాడిపోకుండా, కషాయ ద్రవం ఇగిరిపోయి తైలాంశం మాత్రమే మిగిలేంతవరకు ఉడికించి తైలాన్ని జాగ్రత్తగా తయారు చేస్తారు.
ఉపయోగాలు
-ఈ తైలాన్ని చర్మం పైన మర్ధనకే ఉపయోగిస్తారు. ప్రధానంగా బాగా నొప్పి కలిగించే వాత వ్యాధుల్లో అంటే ఆమవాతం, సంధివాతం, కటివాతం, అర్థాంగ వాతం, గృధ్రసీ వాతం, దండాపతానకం వంటి సమస్యలకు ఈ తైలాన్ని వాడతారు.
- దీర్ఘకాలికంగా పక్షవాతం ఉన్నవారిలో కాళ్లూ చేతులు బిగుసుకుపోయి ఉంటాయి. వీరికి ఫిజియోథెరపీ కష్టంగా ఉంటుంది. ఈ స్థితిలో ఈ తైలంతో రోజూ మర్ధన చేస్తే ఆ సమస్య తొలగిపోతుంది.
-వాత వ్యాధుల కారణంగా శరీరం బిగుసుకుపోయే గుణం చలికాలం మరింత ఎక్కువవుతుంది. ఈ స్థితిని ఈ తైలం నివారిస్తుంది. అయితే ఎండాకాలం ఈ తైలాన్ని వాడకపోవడం మంచిది. అలాగే ఒంటిపైన మంటగా, పొగలుగా ఉన్న వారు కూడా ఈ తైలాన్ని వాడకూడదు.
- నొప్పిని తగ్గించే గుణం ఉండడం వల్ల ఈ తైలాన్ని చెవినొప్పికి చుక్కల మందుగా కూడా వాడవచ్చు. అలాగే వినికిడి లోపం, చెవిలో శబ్ధాలు రావడం వంటివి కూడా ఈ తైలంతో తగ్గుతాయి. అయితే ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
లఘు విషగర్భ తైలం

లఘు అనే పదం లేకుండా చాలా మంది కేవలం విషగర్భ తైలం అని కూడా పిలుస్తారు. ఈ తైలం తయారీకి అవసరమైన ద్రవం కోసం ఈసబ్గోల్ కషాయం, గన్నేరు వేర్లు క షాయం, ఉమ్మెత్త స్వరసం, నిర్గుండీ స్వరసం, జటామాంసీ కషాయం, ఇవన్నీ కలిపి తీసుకుంటారు.

మూలికల ముద్దకోసం ఉమ్మెత్త విత్తులు, కోష్టు, ప్రియంగు పూలు, వత్సనాభి, పిచ్చి కుసుమ వేళ్లు, రాస్నా, గన్నేరు వేర్లు, మాల్కంగినీ విత్తులు, మిరియాలు, దంతీ, జటామాంసీ, చిత్రమూలం, పచ్చ ఆవాలు, దేవదారు, పసుపు, కస్తూరి పసుపు, ఆముదం వేర్లు, లక్షా, త్రిఫలా, మంజిష్ఠా చూర్ణాలను సమానంగతా తీసుకుంటారు. వీటన్నిటినీ తైలపాక నిష్పత్తిలో నువ్వుల నూనె చేర్చి తైలం మిగిలేలా ఉడికిస్తారు.

దీని వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మహా విషగర్భ తైలం లాగే ఉంటాయి. కాకపోతే తీక్షణత తక్కువగా ఉంటుంది. అందువల్ల సున్నితులకు ఇది ఉత్తమం. పైగా వేడి వాతావరణంలోనూ ఈ తైలాన్ని వాడవచ్చు.

విషముష్టి తైలం:

ఈ తైలం తయారీకి ప్రత్యేకించి విషముష్టి గింజలు మాత్రమే తీసుకుంటారు. దీనికి జొన్న కలి (కాంజికం) చేర్చి కషాయం తయారు చేస్తారు. ముద్ద కోసం విషముష్టి గింజల పొడినే వాడతారు. నువ్వుల నూనెతో పాటు ఆముదం కూడా జతచేస్తారు. అన్నిటినీ తైలపాక నిష్పత్తిలో కలిపి తైలం మిగిలేలా ఉడికిస్తారు. దీని ఉపయోగాలు విషగర్భ తైలంలాగే ఉంటాయి.


డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్,
ఫోన్: 9848750720.

Sunday, January 23, 2011

డిప్రెషన్‌కు మేలైన మందు

కొందరు చిన్న చిన్న సంఘటనలకు కూడా తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. వారికి సరియైన సమయంలో చికిత్స ఇప్పించకపోయినట్లయితే సమస్య మరింత తీవ్రమయి ఇతరులను గుర్తుపట్టలేని స్థితికి వస్తారు. డిప్రెషన్ కాస్తా మానసిక వ్యాధిగా మారుతుంది. అయితే ఈ సమస్యకు హోమియోలో మంచి వైద్యం అందుబాటులో ఉందంటున్నారు డాక్టర్ యం. శ్రీకాంత్. ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి తదితర అంశాలు డిప్రెషన్‌కు కారణమవుతుంటాయి. కొందరు డిప్రెషన్ నుంచి సులభంగానే బయటపడతారు. కొందరిలో మాత్రం ఏళ్ల తరబడి ఉంటుంది. సాధారణంగా డిప్రెషన్ మూడు రకాలుగా ఉంటుంది.

1) మేజర్ డిప్రెషన్ : చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. ఇది వ్యక్తి జీవితవిధానంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. చదువు, నిద్ర, ఆహారం విషయంలో, ఇతర పనులతోనూ సంబంధం కలిగి ఉంటుంది. జీవితాంతం వేధించే సమస్య ఇది.

2) డిస్‌థిమియ:
ఇది కొంచెం తక్కువ స్థాయిలోఉంటుంది. కానీచాలా ఏళ్ల వరకు ఉంటుంది. డిస్‌థిమియాతో బాధపడుతున్న వారు రోజువారీ పనులను చేసుకోగలుగుతారు. కానీ ఉత్సాహంగా చేయలేరు.
3) బై పోలార్ డిజార్డర్ : దీనిని మానిక్ డిప్రెషన్ అని కూడా అంటారు. దీనిలో డిప్రెషన్, సివియర్ డిప్రెషన్‌తో పాటు కొన్నిసార్లు మానియా కూడా ఉంటుంది.
లక్షణాలు:
ఆందోళన, ఆత్రుత, చిరాకు, తప్పు చేశాననే భావన, నిరాశ, సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, చనిపోవాలనే ఆలోచనలు, కొన్ని సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటి లక్షణాలు డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో కనిపిస్తాయి.

బై పోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తికి మాట్లాడటంలో ఇబ్బంది, పనిలో తొందరపాటు, పనిమీద ఆసక్తి లేకపోవడం, నిద్రలేమి, సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. డిప్రెషన్ లక్షణాలు వ్యక్తులను బట్టి, సమస్య తీవ్రతను బట్టి మారుతుంటాయి.

కారణాలు :
- జన్యుపరమైన కారణాల వల్ల డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి.
- మెదడులోని కొన్ని రసాయన మార్పుల వల్ల(న్యూరోట్రాన్స్‌మిటర్స్‌లో మార్పు) డిప్రెషన్‌కు లోనవుతారు.
- మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు, విడాకులు, దగ్గరి వ్యక్తులు చనిపోవడం లాంటి సమస్యలు డిప్రెషన్‌కు కారణమవుతాయి.
- ఆరోగ్యపరమైన ఇబ్బందులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
- స్టిరాయిడ్స్, నార్కోటిక్స్ వంటి మందుల వాడకం వల్ల డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది.
- మానసిక వ్యాధులు, ఆందోళన, స్కిజోఫ్రినియా వల్ల నిరాశ, నిస్పృహలకు గురికావచ్చు.
చికిత్స :
సాధారణ డిప్రెషన్‌ను తగ్గించడానికి కౌన్సెలింగ్, యాంటీడిప్రెసెంట్ మందులు బాగా ఉపకరిస్తాయి. ఎలక్ట్రో కంవల్సివ్ థెరపీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స వల్ల మెదడులో రసాయనిక మార్పులు జరుగుతాయి. తద్వారా డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయి. యోగా, ధ్యానం వంటివి రోగిని సాధారణ స్థితికి తీసుకురావడానికి బాగా ఉపకరిస్తాయి. హోమియో వైద్య విధానంలో శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించి మూల కారణాన్ని తొలగించేందుకు అవసరమైన మందులను ఇవ్వడం జరుగుతుంది.

బెల్లడొన : కోపం, నవ్వడం, పండ్లు కొరకడం, మతిస్థిమితం లేని వారిగా ప్రవర్తించడం, దయ్యాలు, జంతువులు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయనే భావన వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు. ఏదీ లేకపోయినా ఏదో ఉందీ అని అరవడం, అసభ్యంగా మాట్లాడటం, నిద్రలేమి, శబ్దం వల్ల సమస్య ఎక్కువకావడం, రాత్రివేళ తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఈ మందు ఇవ్వవచ్చు.

కోనియం :
జ్ఞాపకశక్తి తగ్గడం, తొందరగా బాధపడే స్వభావం, కోపం, గట్టిగా అరవడం, ఎదురు మాట్లాడితే భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఉపకరిస్తుంది. అర్జెంటమ్ నైట్రికం : తెలియని ఆందోళన, ఎప్పుడూ మత్తుగా ఉన్నట్లు అనిపించడం, తలనొప్పి, ఆరోగ్యం గురించి ఆందోళన, ఒకచోట కుదురుగా ఉండలేకపోవడం, అతితొందర వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వాడదగిన మందు.

హయోసయామస్ : ఆత్రుత, నిలకడలేకపోవడం, భయపడే స్వభావం, అసూయ, అనుమానం, ఎక్కువగా మాట్లాడటం, ఏడ్చే స్వభావం, కోపం, రాత్రివేళ సమస్య అధికం కావడం, నడిచినపుడు, ముందుకు వంగినపుడు ఉపశమనంగా అనిపించడం, చిరాకు, నోరు ఎండిపోవడం, మూత్రాశయ ఇబ్బందులు, తలనొప్పి, పడుకున్నప్పుడు దుప్పటి కప్పుకోకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి దివ్యౌషధం.

స్ట్రామోనియం : అధికంగా మాట్లాడే స్వభావం, అతిగా నవ్వడం, పాటలు పాడుతూ ఉండటం, ఎక్కువ వెలుతురును చూసినపుడు సమస్య అధికం కావడం, చీకటి అంటే భయం, పొడవుగా ఉన్నానని అనుకోవడం, దయ్యాలు, జంతువులు కనిపిస్తున్నాయనే భావన, శబ్దాలు వినిపిస్తున్నాయని అనడం, చిన్న వస్తువులు పెద్దగా కనిపించడం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు.


డా. యం. శ్రీకాంత్
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక,
ఫోన్: 9550001133, 9550001199.

Tuesday, January 18, 2011

మా మంచి తులసి...

వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో రారాజుగా వెలిగిపోతున్న మొక్క తులసి.. భారతీయ మగువలు ఎంతో పవిత్రంగా కొలిచే ఈ తులసి వంటింటి వైద్యంలో ఎంతో ముఖ్యం కూడా. కఫాన్ని, పైత్యాన్ని తీసివేయడంలో దీనికి మించినది లేదు. అంతేకాదు.. ఇంకా ఎన్నో రకాల వ్యాధులకు, జబ్బులకు మంచి మందు తులసి.

tulsi1
  • జ్ఞాపకశక్తిని మెరుగు పరచడంలో, నోటిసంబంధిత వ్యాధులకు, ఉబ్బసానికి మంచి మందు తులసి. చర్మవ్యాధులకు ఈ ఆకురసము మంచి ఫలితాన్నిస్తుంది.
  • గాయాలకు, దెబ్బలకు, విష జంతువులు కరిచి నపుడు ఈ ఆకు రసాన్ని పూసినా, వాడినా సత్వర ఉపశ మనం కలుగుతుంది.
  • ప్రతిరోజు 6-10 ఆకులు నమిలితే నోటి దుర్వాసన వుండదు. ప్రతి రోజు క్రమంగా పది ఆకులను తిన్నా లేక 1 చెంచా రసం పరగడుపున తాగినా ఆరోగ్యానికి మంచిది.
  • ఆకురసం, కొంచెం తేనె, ఒక చెంచా అల్లం రసం రంగరించి వాడితే జీర్ణకోశ సమస్యలుండవు.
  • తులసి రసంతో కొంచెం మిరియాల చూర్ణాన్ని కలిపి 2 చెంచాలు తింటే గొంతు బొంగురు పోవుటాన్ని, నీటిలో మరిగించి వడగట్టి తీసుకుంటే గొంతు గరగర, జలుబు, దగ్గు ఉన్నపుడు కఫం బయటకు వచ్చేటట్లు చేస్తుంది.
  • దోమ కాటు వలన వచ్చే మలేరియా వ్యాధికి ఇది మంచి ఔషధం.
    tulasi
  • ఇంటి ఆవరణలో ఈ చెట్లుంటే దోమలను పారదోలుతుంది. క్రిమిసంహారిగా కూడా పనిచేస్తుంది.
  • ఆధునిక పరిశోధనలో క్షయవ్యాధికి కారణమయ్యే బేసిల్లస్‌ ట్యూబర్క్యు లోసిన్‌ అను బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి నశింపజేస్తుందని శాస్త్ర వేత్త లు వెల్లడించారు.
  • పత్రాలలోని సూక్ష్మమైన తైల గ్రంథులల్లోని తైలంలో యూజినాల్‌, యూజినాల్‌ మిథైల్‌, ఈథర్‌, కార్వసిరాల్‌, అను రసా యనాలే సువాసనకు, సూక్ష్మ జీవులను నశించేట్లు చేస్తాయి.
  • తులసి రసం, బెల్లం కలిపి తయారు చేసే తులసిసుధ అనే పానియం రక్తశుద్ధిని, వ్యాధి నిరోధకశక్తిని అభివృద్ది చేస్తుంది.
  • ఈ ఆకుల రసంతో చేసిన టీ జలుబు, దగ్గును, ఉదరకోశ రుగ్మతలకు బాగా పని చేస్తుంది. తులసి వనాలు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి.

జీవన శైలి సమస్యలకు చికిత్స

ఆధునిక జీవన శైలి శరీర వ్యవస్థను నడిపించే వాత, పిత్త, కఫాల సమతుల్యతను దెబ్బ తీస్తోంది. ఫలితంగా పిన్న వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు మొదలవుతున్నాయి. వీటికి తోడు నానాటికి పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్ల కారణంగా వాత దోషం పెరిగి నాడీ సంబంధమైన వ్యాధులు అధికమవుతున్నాయి. అందుకే నాడీ సంబంధిత వ్యాధుల మీద దృష్టి సారిస్తున్నారు ఆధునిక ఆయుర్వేద వైద్యులు.
ఈ కాలంలో చాలా ఎక్కువ మంది జబ్బుచేయగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. కానీ, చాలా వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తున్నాయి. కారణం వ్యాధి మూలాలను తొలగించే వైద్యచికిత్సలు అందకపోవడమే. ఈ నిజాన్ని గ్రహించిన వారంతా వ్యాధిమూలాలను తొలగించే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. శరీరం వ్యాధిగ్రస్థం కావడానికి మౌలికంగా వాత,పిత్త, కఫాలనే మూడుగుణాలు అస్తవ్యస్తం కావడమే ప్రధాన కార ణం.

ఈ మూడింటినీ తిరిగి సమతుల్య స్థితికి తేవడం ఒక్కటే సిసలైన చికిత్స అవుతుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి మిగతా ఎన్ని వైద్య చికిత్సలు చేసినా వృథాయే. గత కాలంలో వైద్యులు ఈ వివరాలను మరీ అంత లోతుగా రోగికి చెప్పేవారు కాదు. కేవలం వైద్యుని మీద ఉండే నమ్మకం మీదే వారు చికిత్స తీసుకునే వారు. ఇప్పుడు అలా కాదు. వ్యాధి మూలాలను వాటిని తొలగించే ఆయుర్వేద చికిత్సా విధాలను పూర్తిగా వివరించనిదే ఎవరూ నమ్మడం లేదు. అందుకే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడాన్ని తమ విధిగా భావిస్తున్నారు.

నాడీ వ్యవస్థే పునాది

ఏ పనిచేయాలన్నా నాడీ వ్యవస్థలో ప్రాథమికంగా అందుకు అవసరమైన శక్తి (యాక్షన్ పొటెన్షియల్) ఉండాలి. ఆ శక్తికి శరీరంలోని ఏడు «ధాతువులూ సక్రమంగా పనిచేయాలి. ఏదైనా ధాతువులోకి శక్తి వచ్చి చేరడానికి ధాతువుకు బయట ఉన్న సోడియం లోనికి వచ్చేస్తుంది. ధాతువులోపల ఉన్న పొటాషియం బయటికి వెళ్లిపోతుంది. ఈ మార్పిడితో మనిషి తన చర్యల్ని సక్రమంగా నిర్వహించగలుగుతాడు. శరీరంలో నిరంతరంగా జరిగే ఈ ప్రక్రియనే వాతం అంటారు.

ఈ వాతంలో దోషం ఏర్పడినప్పుడు నాడీ వ్యవస్థ అంతా కుంటుపడుతుంది. నిద్రలేమి, మూర్ఛ, పక్షవాతం, పంచేంద్రియాలు సరిగా పనిచేయకపోవడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. పైకి కనిపించే ఈ లక్షణాలనైతే ఇతర వైద్యవిధానాలు గుర్తిస్తున్నాయి. కానీ, అందుకు కారణమైన మూలాల్లోకి వెళ్లడం లేదు.

రక్తనాళాల్లో కొవ్వు, లేదా కొలెస్ట్రాల్ అడ్డుపడిందీ అని తెలియగానే దాన్ని శస్త్ర చికిత్సతో తీసివేయాలంటున్నారే తప్ప ఆ సమస్య రావడానికి గల అసలు కారణాలను గమనించడం లేదు. ఆయుర్వేదం మాత్రం ఆ అంశం మీదే ఎక్కువగా దృష్టిపెడుతుంది. ప్రత్యేకించి మానసిక ఒత్తిళ్ల కారణంగా నాడీ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. నాడీ వ్యవస్థ చక్కబడనిదే శరీరంలోని ఏ వ్యా«ధీ పూర్తిగా పోదు. అందుకే ఆధునిక ఆయుర్వేద వైద్యులు వాత గుణదోషాన్ని తొలగించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

జీర్ణాశయం చిక్కులు

జీర్ణక్రియకు తోడ్పడే అంశ మే పిత్తం. పిత్తం అగ్నిలాంటిది. ఈ అగ్ని రక్తంలో ఉంటుంది. సహజంగా శరీరంలోని ప్రతి ధాతువుకూ, ప్రతికణానికీ రక్తం, రక్తం ద్వారా వచ్చే ఆక్సిజన్ కావాలి. అయితే, రక్తంలో పిత్తం ఉంటూ ఆప్రక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని ప్రతి ధాతువునూ, ప్రతి కణాన్నీ ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పిత్తమే తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియకే కాకుండా జీర్ణమైనవి శ్రోతస్సుల్లోకి వెళ్లడానికి, ప్రతిధాతువుకూ శక్తి అందడానికీ, వ్యర్థ పదార్థాల విసర్జనకూ తోడ్పడుతుంది.

నిజానికి శరీరాన్ని ఒక పరిపూర్ణ స్థితిలో ఉంచడంలో పిత్తం ఒక కీలక భూమికను నిర్వహిస్తుంది. కాకపోతే, ఆధునికుల్లో శరీర శ్రమ లేకపోవడం వల్ల ఈ అగ్ని అవసరమైన స్థాయిలో ఉండడం లేదు. ఆ అగ్నిని పెంచే మందులు ఇస్తూనే రోగి జీవన శైలి మార్పు కోసం నొక్కి చెప్పడం ఆయుర్వేదంలో ఒక ప్రధాన అంశం.

కఫం మాటేమిటి ?

శరీరంలో రరరకాల ద్రవాలు ఉంటాయి. అలాగే శరీరంలోని ప్రతికణంలోనూ ద్రవం ఉంటుంది. శరీరానికి కావలసిన ఈ ద్రవాలన్నింటిని సమతుల్యంగా ఉంచడం కఫమే చేస్తుంది. ద్రవాలు కొరవడితే శరీరం పొడిబారిపోతుంది. జీవక్రియలన్నీ మందగిస్తాయి. అందుకే క ఫాన్ని సమతుల్యంగా ఉంచడాన్ని ఆయుర్వేదం ఒక ముఖ్య అంశంగా పరిగణిస్తుంది. వ్యాధి నుంచి విముక్తున్ని చేయడం ఒక్కటే కాదు. ఆరోగ్యవంతుడు జీవితాంతం ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా ఆయుర్వేదం చెబుతుంది.


డాక్టర్ ఎన్ సత్యప్రసాద్
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల
ఎర్రగడ్డ, హైదరాబాద్
మొబైల్: 9848683848

Sunday, January 2, 2011

మర్దన చికిత్స (మసాజ్‌ధెరపీ)

aromatherapy_massage 
నొప్పి, అసౌకర్యం, పట్టుకుపోవడం వంటి బాధలను నివారించడం కోసం మెత్తటి కణజాలాన్ని మర్దన చేయడంతో కూడుకున్నదే మసాజ్‌ థెరపీ లేక మర్దన చికిత్స. ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఈ చికిత్స ఎంతోదోహదపడుతుంది. ఈ చికిత్సా విధానాన్ని ‘అమెరికన్‌ మసాజ్‌ థెరపీ అసోసియేషన్‌’... చేతులతో మెత్తటి కణజాలాన్ని మర్దన చేసే ప్రక్రియగా అభివర్ణించింది. ఈ వృత్తిలో ప్రాక్టీషనర్‌ శారీరకమైన, మెళకువలను, సంబంధిత వైద్య విధానాలను ఉపయోగించి ఆరోగ్యాన్ని చేకూ ర్చే ప్రక్రియగా కూడా మర్దన చికిత్సను నిర్వ చించారు. శరీరం మీద థెరపిస్టు చేతులు కదిలిస్లూ వివిధ శరీరపరమైన ప్రభావాలను కలిగించడం మర్దనలో వున్నాయి. కండరాలను, లిగమెంట్లను, టెండన్లను, ఫేషియాను వివిధ కదలికలు భౌతికంగా సాగదీయ గలవు.

కణజాలంలో రక్తప్రసారం మెరుగవుతుంది. కండారాల నొప్పులు తగ్గి నాడీమం డల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. నిద్రను ప్రసాదిస్తుంది. చికిత్సాపరమైన మర్దన రక్తప్ర సారం, కండరాలు, ఎముకులు, నాడీమండ ల వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. గాయాల నుంచి, జబ్బునుంచి దేహం కోలు కునే క్రమాన్ని వేగవంతం చేస్తుంది. వివిధ రకాల స్ట్రోకులు, తైలాలపై మసాజ్‌ థెరపీ ఆధారపడివుంది. ఇవి ఒత్తిడి పేరుకుపోయిన భాగాలపై పనిచేసి మనసుకు శరీరానికి విశ్రాంతిని ప్రసాదిస్తాయి. వెన్ను మర్దన, మెడ భుజాల మర్దన, ఛాతీ మర్దన, పొట్ట మర్దన, ముఖం, తల మర్దన, చేతుల మర్దన, కాళ్లు, పాదాల మర్దన పిల్లలకు... పసికందులకు మర్దన గర్భిణీల మర్దన... ఇలా మసాజ్‌ థెరపీలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా థెరపిస్టులకు తెలిసిన 200 పైగా మెళకువలను ఉపయో గించి మర్దన చేయవచ్చు. ఇక్కడ మనం కొన్ని రకాల మర్ధనల గురించి తెలుసుకుందాం...

  • క్రీడల మసాజ్‌
  • స్వీడిష్‌ మసాజ్‌
  • థాయ్‌ మసాజ్‌
  • ఇన్ఫెంట్‌ మసాజ్‌
  • రిలాక్సేషన్‌ మసాజ్‌
  • జీరో బ్యాలెన్సింగ్‌
    ఇవే కాకుండా... ఆక్యుప్రెషెర్‌, షియాటుస, లోమి లోమి, జిన్‌ షిన్‌ జిట్సు, అమ్మ థెరపీ, చినే ట్సాంగ్‌ వగైరా ప్రాచ్య పద్ధతులు మసాజ్‌లో చికిత్సా విధానాలుగా ఉన్నాయి. అనేక అనుబంధ థెరపీల్లో అనేక మర్దన మెళకువలు కూడా చేర్చారు. అరోమా థెరెపీ, రెఫ్లెక్సాలజీ, రికీ, హెల్లెవర్క్‌, ఆస్టియోపతీ వీటిలో ముఖ్యమైనవి.

    మర్దన చికిత్స వల్ల ఎన్నో లాభాలు...
    వీటిలో ప్రతి మర్దన చికిత్సకు ఎన్నెన్నో లాభాలున్నాయి. చెప్పాలంటే... సమగ్ర ఆరోగ్యం ఫలితం... మర్దన చికిత్స. ఇది బాడీవర్క్‌ రక్త ప్రసారాన్ని పెంచుతాయి. కను క దేహం అధికంగా ప్రాణవాయువును, పోష కాలను కణాల్లోకి, ప్రధానాంగాల్లోకి పంప్‌ చేస్తుంది. థెరపిస్టు చేసే మాసాజ్‌ వల్ల లింఫ్‌ వ్యవస్థకు ఉత్తేజం లభిస్తుంది. శరీరం సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ. బలోపేతమై మన ఆరోగ్యంపై దాడిచేసే టాక్సి ఇన్వేడర్సును సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ఉదాహర ణకు, రొమ్ము క్యాన్సర్‌ రోగులకు చేసే మసాజ్‌ వల్ల కాన్సర్‌ను నిరోధించే కణాలు పెరుగుతాయి.

    massage-face 
  • శరీరంలోని సహజసిద్ధమైన నొప్పి నివారణ పదార్థం ఎండోర్ఫిన్స్‌ను విడుదల చేయడానికి దోహదపడుతుంది. ఉదాహరణ కు మసాజ్‌ టెక్నిక్‌ అయిన ఆక్యుపంక్చర్‌ థెరపీ నొప్పి తగ్గించే ఎండోర్ఫిన్స్‌ ఉత్పత్తి చేసేట్టు శరీరాన్ని ఉత్తేజపరచగలదు. ఆక్యు పంక్చర్‌ చికిత్స నొప్పితగ్గంచే ఓపియడ్స్‌ అనే పదార్థాలను కూడా విడుదల చేస్తుందని అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధు లు, గాయాలు, ఆపరేషన్‌ నుంచి కోలుకో వడం, నొప్పి తగ్గించడం వంటి చికిత్సలో ఆక్యుపంక్చర్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. మైగ్రే యిన్‌ తలనొప్పిని తగ్గించి మందులు అంతగా అవసరం లేకుండా సహాయపడు తుంది.

    తల్లులు కాబోయేవారికి నొప్పులు తగ్గిస్తుంది. మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. డిప్రెషన్‌, ఆందోళనను ఆసుపత్రిలో ఉండవలసిన కాలా న్ని తగ్గిస్తుంది. బిగుసుకుపోయిన ఉద్రిక్త కండరాలకు విశ్రాంతినిస్తుంది. దిగువ వీపు నొప్పి, మెడ నొప్పిని చికిత్సగా మసాజ్‌ థెర పిస్టు తరచూ మసాజ్‌ చేస్తాడు. మొత్తం మాన సిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కో ర్టిసాల్‌ వంటి స్ట్రెస్‌ హార్మోన్ల స్థాయి తగ్గించి శరీరం ఒత్తిడిని ఎదురుకోవ డానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌, టెండి నైటిస్‌ వంటి వాపు పరిస్థిలకు చికిత్సగా కూ డా మర్దన చికిత్సను ఉపయోగించవచ్చు. కండరాల ఉద్రిక్తత, బిగుసుకు పోవడానికి వైద్యంగా తోడ్పడుతుంది.

    massagae-oli 
  • దెబ్బతిన్న కండరా లకు బెణుకుపట్టిన లిగమెంట్సు సత్వరం మా నడానికి తోడ్పడుతుంది. కండరాలు బిగుసు కుపోవడాన్ని తగ్గిస్తుంది. కీళ్ళకు వెసులుబాటు ను, కదలికలను ప్రసాదిస్తుంది. క్రీడల్లో సామ ర్థ్యాన్ని పెంచుతుంది, క్రీడల్లో, పనిలో అయ్యే గాయాలను మాన్పుతుంది. రక్తపోటు (బిపి) తగ్గిస్తుంది. ఉద్రిక్తతకు సంబంధించిన తల నొప్పులనుంచి, కంటి అలసట నుంచి ఉపశ మనం కలిగిస్తుంది. భంగిమల్ని మెరుగుపరు స్తుంది. శరీరం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.కండరాలు- ఎముకల వ్యాధులను నయం చేస్తుంది. ఆపరేషన్‌, గాయాలయిన తర్వాత కోలుకోవడానికి తోడ్పడుతుంది.

    మర్దన చికిత్స వల్ల ఒనగూరే భావోద్రేకపరమైన లాభాలు...
  • మానసిక అప్రమత్తతలో విశ్రాంతిని పెంపొందిస్తుంది.
  • ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని సృజనాత్మక శక్తిని పెంచుతుంది.
  • సంరక్షణ అవసరాలను తీరుస్తుంది.
  • ఆరోగ్యంగా ఉన్నామన్న అనుభూతిని పెంపొందిస్తుంది.
  • ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది.
  • శరీరం గురించి అవగాహన పెంపొందిస్తుంది.
  • మనసు-శరీరాల మధ్య లింకు గురించి అవగాహన పెంపొందిస్తుంది.
  • * మర్దన తైలం... చరిత్రలో మర్దన తైలం మర్దన చికిత్సలో అంతర్భాగంగా ఉంటూవచ్చింది. తైలం పూసి నొప్పి తగ్గించడానికి రుద్దడం గురించి ప్లాటో, సోక్రటీస్‌ ఆనాడే తమ రచనల్లో పేర్కొన్నారు. ్రపూ 1000 నాడే మర్దన చేయడానికి తైల పదార్థం గురించి హోమర్‌ రాశాడు. మర్దన చేయించుకునే వారి చర్మంపై సున్ని తంగా నాజూకుగా జారడానికి మర్దనలో తైలం వాడుతారు. వివిధ రకాలుగా ఉపయో గపడే ఎన్నో తరహాల తైలాలు ఈనాడు అందుబాటులో ఉన్నాయి. చర్మాన్ని శుద్ధిచేసి పోషణనివ్వడానికి వివిధ రకాల తైలాల్లో పోషకాలున్నాయి. మొక్కలు, చెట్లు, మూలాలు, విత్తనాల నుంచి తీసిన సుగంధ తైలాలు (ఎసెన్షియల్‌ ఆయిల్స్‌) మర్దన చికిత్సలో మెరుగైన ఫలితాలకోసం ఈ తైలాలను వినియోగిస్తారు. aromatherapy_massage 
    ఇవే అరోమా థెరపీగా ప్రసిద్ధి చెందాయి. మూలికల్లో ఉండే మందుగుణాలు ఎసెన్షియల్‌ తైలాల్లో ఉన్నాయి, వీటికి ఏంటీసెప్టిక్‌ గుణముండి ఒకవ్యక్తి మూడ్‌ను ఆల్ఫాక్టరీ నరాల ద్వారా సరిదిద్దు తాయి. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఎంతో చిక్కనయిన వైనప్పటికీ సరిగా వాడితే ఎలాటి చెడు ప్రభావాలు కలగవు. మర్దనలో వాడే మర్దన తైలాలు, వాటి ముఖ్యమైన గుణాల పట్టిక ఈ కింద ఇచ్చారు. స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ తేలికైంది, తియనైంద కాస్త కరుకుగా ఉండే తైలం. ఇది వాపులకు వాడే తైలం. లోపలకు చొచ్చుకుపోయి చర్మానికి పోషణ అందిస్తుంది. ఈ తైలం కారియర్‌ ఆయిల్స్‌ ప్రముఖమైందిగా కూడా ప్రసిద్ది చెందింది. చెమ్మనిచ్చి, పోషించి, పునఃజవసత్వాలను ప్రసాదించే గుణాలు ఆప్రికాట్‌ ఆయిల్‌కు ఉన్నాయి. ఎండిపోయిన, సున్నితమైన చర్మానికి ఎంతో మంచిది. వాపులకు కూడా ఈ తైలం పనిచేస్తుంది. అవొకాడో ఆయిల్‌... పొడి చర్మం, ఎక్జిమా, సోరియాసిస్‌ లేక అలాంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు తరచూ ఈ తైలం వాడుతారు. ఎండ వాతావరణం వల్ల దెబ్బతిన్న చర్మం, పగిలిన చర్మానికి, పోషణలేని చర్మానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చర్మానికి జీవంపోసి మెత్తపరుస్తుంది. జొజొబా ఆయిల్‌ అన్ని రకాల చర్మానికి మంచిది. ఎలాటి ఇబ్బందులు లేకుండా మచ్చలు పడ్డ చర్మానికి ఈ తైలాన్ని వాడవచ్చు. ఇది మొటిమల్ని నియంత్రించడానికి తోడ్పడుతుంది. జొజొబాను అరోమా థెరపీలో కారియర్‌ ఆయిల్‌గా కూడా వాడతారు. ఇది సులువుగా చర్మాన్ని చొచ్చుకుపోతుంది. జొజొబా క్రిమిసంహారిణి పూడుకుపోయిన రంధ్రాల్లో సెబమ్‌ను తొలిగంచడానికి సహాయపడుతుంది. వీట్‌ జెర్మ్‌ ఆయిల్‌లో ఎక్కువ మోతాదులో విటమిన్‌-ఇ ఎసెన్షియల్‌ ఫాటీ ఆసిడ్స్‌ ఉన్నాయి. అరోమాథెరపీ మసాజ్‌లు కలిపిచేసే చికిత్సలో దీన్ని విస్తారంగా వినియోగిస్తారు. మెత్తనైన, యవ్వనంతో తొణికిసలాడే చర్మాన్ని పెంపొందిస్తుందని తెలుస్తోంది. గాయం మానిన మచ్చలు, సాగిన మచ్చలు మాన్పడానికి సహాయపడుతుంది. హాజెల్‌నట్‌ ఆయిల్‌ తైలం మెత్తగా ఉంటుంది. చర్మానికి చెమ్మనిచే గుణాలు న్నాయి. చర్మాన్ని టోన్‌ చేసి గట్టిపరచడానికి ఈ తైలం సహాయపడుతుంది. కాపిలరీస్‌ను బలోపేతం చేయడానికి కళాలు పునరుజ్జీవిం పచేయడానికి తోడ్పతుంది. సిసేమ్‌ ఆయిల్‌ అన్ని తరహాల చర్మానికి మంచిది. రింగ్‌వర్మ్‌, స్కాబీస్‌, ఫంగల్‌ చర్మవ్యాధులను నిర్మూలిస్తుంది. దీన్ని ఏంటీసెప్టిక్‌గా భావిస్తారు. చెడకుండా ఎక్కువకాలం మన్నుతుంది.హోలీ ఆయిల్‌ మంచి కారియర్‌ ఆయిల్‌గా పరిగణిస్తారు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోయేలా తోడ్పడుతుంది. మంచి సుకుమారమైన, వాసనలేని హైపో ఎలెర్జిక్‌ ఆయిల్‌.

Saturday, January 1, 2011

తైలాలతో దేహానికి మెరుపు

చర్మ సంరక్షణలో సుగంధ తైలాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సుగంధ తైలాలను అరోమా, ఎసెన్షియల్, వోలటైల్ ఆయిల్స్ అని అంటారు. ఇవి మొక్కలు, వృక్షాలకు సంబంధించిన శుద్ధమైన, సహజసిద్ధమైన నూనెలు. ఆహ్లాదాన్ని కలిగించే వాసనలు ఉండటంతో అరోమా అని, అణువణువూ పిండి, వడగాచి తీయడంతో ఎస్సెన్షియల్ అని, ఇగిరిపోయే గుణం ఉండటం వల్ల వోలటైల్ అని పిలుస్తారు. ఈ తైలాలను వనమూలికలకు సంబంధించిన వేరు, కాండం, ఆకు, పూవు, తొక్క, గింజ భాగాల నుంచి సేకరిస్తారు.

మెదడుకు సంబంధించిన దాదాపు అన్ని నాడులూ చర్మంపైకి చేరుకునేవే. చర్మంలోనికి తెరుచుకున్న ఇతర జ్ఞాన కర్మేంద్రియాల ఉపరితల భాగం (ఎపిథీలియం, మ్యూకస్ పొరలు) కూడా చర్మంలో అంతర్భాగమే. అలాగే మెదడుకు మనసుకు ఉన్న సంబంధం విడదీయరానిది. ఆహ్లాదంగా ఉన్న మెదడు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే చాలా రకాల చర్మవ్యాధులు మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తీవ్రమవుతాయి. మనసుకు ఆహ్లాదం కలిగించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించి, తద్వారా చర్మ వ్యాధులను నివారించడం సుగంధ తైలాల ప్రత్యేకత.

సుగంధ తైలాలు ఎంత ఆహ్లాదకరమైనవో అంతే తీక్షణమైనవి. కాబట్టి వీటి వాడకానికి ఆవిరికాని, ఇగిరిపోని గుణాలుండే వెజిటబుల్ ఆయిల్స్‌ను వాహక తైలాలుగా వాడాల్సి ఉంటుంది. అలాకాకుండా నేరుగా తీసుకుంటే శ్వాసతీసుకోవడం కష్టంగా మారవచ్చు. అందుకే ముందుగా తైలాన్ని ప్యాచ్ టెస్ట్ చేసి చూసుకోవాలి. అరోమా అయిల్స్‌తో ఆల్మండ్, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆలివ్ నూనెలను క్యారియర్ ఆయిల్స్‌గా వాడతారు. ఒక్కోసారి ముక్కు ద్వారా ఈ తైలాలను ఉపయోగించాల్సి వచ్చినపుడు నీళ్లలో కలిపి ఆవిరిగా పట్టడం, స్ప్రే చేస్తారు. కడుపులోనికి తీసుకోవాల్సి వచ్చినపుడు ఆల్కహాల్, నీటిలో కలిపి టింక్చర్‌గా తీసుకోవచ్చు.

చర్మవ్యాధులకు చికిత్సగా అరోమా తైలాలు (అరోమా థెరపీ) మూడు రూపాలలో వాడతారు. 1) చర్మ సంరక్షణ(బాడీకేర్) 2) సౌందర్య సంరక్షణ(బ్యూటీ కేర్) 3) కేశ సంరక్షణ(హెయిర్ కేర్). ఈ రకమైన చికిత్సలు అందించేటప్పుడు అరోమా తైలాలు యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెల్యూలైట్, యాంటీ సెప్టిక్ వంటి ఫార్మకలాజికల్ గుణాలలో ఒకటి కంటే ఎక్కువ రూపాలలో పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సూక్ష్మరూపంలో ఉండటంతో చర్మం నుంచి రక్తంలోకి త్వరగా చేరుతుంది.

చర్మ సంరక్షణ(బాడీకేర్)

చర్మ సంరక్షణలో భాగంగా తైలాలను నీళ్లలో కలిపి స్నానం రూపంలో గానీ, వెజిటబుల్ నూనెల్లో కలిపి అభ్యంగం రూపం(మసాజ్)లో గానీ ఉపయోగించాల్సి ఉంటుంది.
పొడి చర్మం : 50 మి.లీ అరోమా ఆయిల్ కాంపౌండ్ తయారు చేసుకోవడానికి.. (ఎసెన్షియల్ ఆయిల్) జిరేనియమ్ - 8 చుక్కలు, కెమొమిల్ - 6 చుక్కలు, మంచి గంధం - 6 చుక్కలు, వర్టివెర్ట్ - 8 చుక్కలు (బే సాయిల్), ఆల్మండ్ - 30 మి.లీ, అప్రికాట్ - 20 మి.లీ జిడ్డు చర్మం : 50 మి.లీ అరోమా ఆయిల్ కోసం (ఎస్సెన్షియల్ ఆయిల్) జనిఫెర్ బెర్రీ - 6 చుక్కలు, లెమన్ - 7 చుక్కలు, రోజ్‌వుడ్ - 6 చుక్కలు, ఇలాంగ్ ఇలాంగ్ - 5 చుక్కలు (బే సాయిల్), గ్రేప్ సీడ్ - 40 మి.లీ, జోజోబ - 10 మి.లీ, ముడుతల చర్మం : (ఎస్సెన్షియల్ ఆయిల్) ఫాకిన్ సెన్స్ - 6 చుక్కలు, క్యారట్ సీడ్ - 8 చుక్కలు, పట్ చవులీ - 8 చుక్కలు, స్పికెనార్డ్(జటామాంసి) - 4 చుక్కలు (బే సాయిల్), అప్రికాట్ - 35 మి.లీ, ఈవెనింగ్ ప్రైమ్‌రోజ్ - 5 మి.లీ, క్యారట్ సీడ్ - 5 మి.లీ, అశ్వగంధ - 5 మి.లీ

ఒబెసిటీ

50 మి.లీ యాంటీ సెల్యూలైట్ తయారీకి.. (ఎస్సెన్షియల్ ఆయిల్) ఫెన్నెల్ - 5 చుక్కలు, జనిఫెర్ బెర్రీ - 5 చుక్కలు, పట్ చవులీ - 5 చుక్కలు, రోజ్‌మెరీ - 5 చుక్కలు, గ్రేప్‌సీడ్ - 5 చుక్కలు (బే సాయిల్) , నువ్వుల నూనె - 50 మి.లీ
కేశ సంరక్షణ(హెయిర్‌కేర్) :

శిరోజాలు రాలడాన్ని తగ్గించుటకు :(50 మి.లీ తయారీకి), (ఎస్సెన్షియల్ ఆయిల్) స్పికెనార్డ్ - 5 చుక్కలు, రోజ్‌మెరీ - 6 చుక్కలు, సుగంధ్ కోకిల - 6 చుక్కలు, కర్రీ లీవ్స్ - 6 చుక్కలు, (బేసాయిల్) నువ్వుల నూనె - 45 మి.లీ, ఆముదం నూనె - 5 మి.లీ చుండ్రు నివారణకు : (50 మి.లీ తయారీకి) (ఎస్సెన్షియల్ ఆయిల్) పట్ చవులీ - 6 చుక్కలు, రోజ్‌మెరీ - 6 చుక్కలు, టీ ట్రీ - 6 చుక్కలు, సెడార్ వుడ్ - 6 చుక్కలు (బేసాయిల్), నువ్వుల నూనె - 45 మి.లీ, ఆలివ్ ఆయిల్ - 5 మి.లీ,

ముఖం శుభ్రపరచుకోవడానికి(క్లెన్సింగ్): శుభ్రమైన నీటిలో గానీ, క్లెన్సింగ్ మిల్క్‌లో (1-2 స్పూన్‌లు)గానీ రెండు చుక్కల మోతాదులో క్లేరీసెజ్, లెమన్, లైమ్, రోజ్‌మెరీ, కామెమైల్, లావెండర్, జిరానియమ్, టర్మరిక్.. వీటిలో ఏదైనా ఒకదానిని కలిపి ముఖానికి పట్టించి, మెత్తటి గుడ్డతో తుడిచినట్లయితే మేకప్ మరకలు తొలగి ముఖం నిగనిగలాడుతుంది.

ముఖానికి లేపనము : (ఫేషియల్ ప్యాక్)

పొడి చర్మానికి: గంధం నూనె - 2 చుక్కలు, మీగడ, తేనె - 1 స్పూన్, శనగపిండి, ముల్తాన్ మట్టి - అర స్పూన్ వీటన్నింటినీ ఒక గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కాసేపు ఆరిన తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. జిడ్డు చర్మానికి : ఇలాంగ్ ఇలాంగ్ - 1 చుక్క, జిరేనియమ్ - 1 చుక్క, పుచ్చకాయ లేక టమాట గుజ్జు - 2 స్పూన్‌లు, ముల్తానిమట్టి - అర స్పూన్, వీటన్నింటినీ ఒక గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు ఆరిన తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.


డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్,
ఫోన్: 9848750720.

Friday, December 31, 2010

పసుపుతో ఆరోగ్యం * పసుపే ఆరోగ్యానికి పసిడి

* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
* చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
* పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
* వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
* చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.
* చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.
* వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్‌లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.
* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు



* స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
* బిళ్ళగనే్నరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్‌ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
* ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
* మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.
* పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
* గుప్పెడు వేపాకు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు దంచి కురుపుల మీద రుద్ది ఒక గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు తగ్గుతాయి.
* రెండు లేదా మూడు మిరియాలు బుగ్గన పెట్టుకొని మెల్లగా నములుతూ రసం మింగాలి. ఇలా రోజుకు ఐదునుండి ఏడు మిరియాలు నమిలితే దగ్గు తగ్గుతుంది.
* తెల్ల ఉల్లిపాయ రసం పది మి.లీ., అల్లం రసం పది మి.లీ. నిమ్మ రసం పది మి.లీ. తేనెతో కలిపి 50మి.లీ. తీసుకుంటే కాటరాక్ట్, గ్లూకోమా తగ్గుతుంది.
* తులసి రసం, అల్లం రసం రెండుమూడు చుక్కలు తీసుకుని కొంచెం తేనె కలిపి పిల్లలకిస్తే జ్వరం, జలుబు తగ్గుతాయి.
* త్రిఫల చూర్ణం, పసుపు, నీళ్ళు కలిపి పేస్టులా చేసి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మందుపెట్టాలి. పగుళ్ళు తగ్గేంతవరకు ఇలా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
* అల్లం, జీలకర్ర నెయ్యిలో వేయించి, అందులో పటిక బెల్లం ముక్కలు వేసి కరగబెట్టాలి. పటిక బెల్లం కరిగాక ముక్కలుచేసి రోజూ ప్రొద్దున్న తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
* పండు జిల్లేడు ఆకుకు నీరు సున్నం రాసి, వెచ్చచేసి, రసం పిండి చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
* అల్లం రసం, ఇంగువ కలిపి వెచ్చచేసి చెవిలో వేస్తే చీము కారడం తగ్గుతుంది. తాత్కాలికంగా వచ్చే చెవుడు కూడా తగ్గిపోతుంది.
* పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది.
* స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి కొద్దిగా వేడి చేసి, దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోక చెక్కల మసి - మూడూ కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళవాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం (కాచు) సమానంగా కలిపి, కొద్దిగా ముద్దకర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి.
* జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారణ అవుతుంది.
* లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోకలు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
* గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.
* వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది.
* వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకొని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5గ్రాములు తీసుకుని రెండూ కలిపి రాత్రి పడుకోబోయేముందు నమిలి తింటే మలబద్ధకం పోతుంది.
* చందన అత్తరు (శాండల్ ఉడ్ ఆయిల్) పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.

* ముద్దతామర ఆకుల్ని వేళ్ళతో సహా నూరి కురుపుల మీద కట్టాలి. చీము తగ్గి కురుపులు మానుతాయి.
* మెంతికూర చిన్నదిగాని, పెద్దదిగాని కూర చేసుకుని రోజూ కనీసం మూడు నెలలు తింటే రక్తహీనత తగ్గుతుంది.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
* నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి.
* ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి.
* ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
* పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
* అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది.
* జీవన్‌ధార ఒక చుక్క తమలపాకులో వేసి తినాలి. కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
* రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు ఒక తమలపాకులో పెట్టి నమిలి తినాలి. ఇలా ఉదయం, సాయంత్రం రెండుపూటలా మూడురోజులు తింటే జలి జ్వరం తగ్గుతుంది.
* తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
* దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న స్ర్తిలకి తక్షణం పనిచేస్తుంది.

* ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
* గుంటగలగరాకు దంచి రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెతో కలిపి నీరు మరిగించి ఉడకబెట్టి, చిటపట శబ్దంపోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచి, సువాసనకి గంధకచ్చూరాలు కలిపి, దీనిని వాడడంవల్ల జుట్టు రాలదు, నల్లబడుతుంది, పెరుగుతుంది.
* మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
* కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
* బిళ్ళగనే్నరు ఆకులను, జామ ఆకుల్ని సమానంగా తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం మూడురోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీటిలో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకుని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అరకప్పు నీటితో గాని పాలతో గాని కలుపుకుని తాగితే నడుంనొప్పి తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
* శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.
- పంతుల సూర్యలోవరాజు

వ్యాధులు - నివారణోపాయాలు

* ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.

-సూర్యలోవరాజు


Tuesday, December 28, 2010

చర్మవాధ్యులకు '' నాన్‌వెజ్ '' తైలాలు

ఔషద మొక్కల మిశ్రమంతో తయారు చేసిన తైలాలే కాకుండా జంతు శరీర భాగాలను కలిపి చేసే తైలాలు కూడా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో కుట్లు వేయకుండానే గాయాలను మాన్పే శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు, డె ర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, దెబ్బలవల్ల ఏర్పడిన పుండ్లు, వెరికోస్ అల్సర్ల వంటివి ఈ తైలాలతో చాలా త్వరగా మానిపోతాయి.
అలాగే చర్మం ముడతలు, మొటిమల కారణంగా ఏర్పడే సన్నని గుంటలు ఇలా ఎన్నో రకాల సమస్యల నివారణలో ఆయుర్వేద తైలాలు గొప్పగా తోడ్పడతాయి. అలాంటి కొన్ని తైలాల వివరాలు మీకోసం...

తిలల (నువ్వులు) నుండి తీసిన నూనెలను తైలాలు అనడం పరిపాటి. అయితే ఆ తరువాత తిలల వంటి ఇతర నూనె గింజల నుండి తీసిన తైలాలను కూడా తైలాలుగానే పిలవడం మొదలయ్యింది. తైలాలకు ఔషధ మొక్కల కల్కాన్ని కలిపి తైలపాక విధిలో తయారుచేసిన నూనెల్ని కూడా తైలాలుగానే గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేద తైలాలుగా బాగా ప్రసిద్ధి పొందాయి.

అయితే ఔషధ మొక్కలు కాకుండా కొన్ని జంతువుల భాగాలు తీసుకుని నూనెల గింజల నుండి తీసిన నూనెను కలిపిగానీ లేదా కలపకుండా గానీ కొన్ని తైలాలను తయారు చేస్తారు. అందులో భాగంగా ఈము పక్షి కొవ్వు, కాడ్ చేప లివర్ ఇలాంటివి తీసుకుని తైలపాక విధానం లేకుండా తైలాలు తయారు చేస్తారు. ఇందుకు భిన్నంగా అండతైలం (గుడ్డు నూనె), మూషికా తైలాలను మాత్రం తైలపాకవిధిలో తయారు చేస్తారు.

ఈము తైలం

ఈము ఒక ఆస్ట్రేలియన్ పక్షి పేరు. ఈ పక్షి వీపు పైన ఉండే కొవ్వును కరిగించడం ద్వారా ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది.
ఉపయోగాలు:

* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు చాలా త్వరగా మానిపోయే అవకాశం ఉంది. గాయాలతో ఏర్పడిన మచ్చలు, అలాగే కీలాయిడ్స్‌ను నిరోధించడంలోనూ ఈ తైలాలు ఎంతో తోడ్పడతాయి. * క్రిమి, కీటకాలు కుట్టడం వల్ల కలిగే నొప్పి, దురద, మంట వాపులు ఈ తైలం రాస్తే తగ్గుముఖం పడతాయి. * డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వ్యాధుల్లో చర్మం పైనున్న తేమ తగ్గి పొలుసులుగా రాలుతూ ఉంటుంది. పైగా వాపు, దురద కూడా ఉంటాయి. ఆ భాగాల్లో ఈ తైలాన్ని రోజూ రాస్తే మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంలోని తేమ ఇగిరిపోకుండా ఉంటుంది.
* గాయాలు కండరాల లోతుల్లోకి వె ళ్లినప్పుడు కొందరిలో గాయం పైకి కనిపించకపోవచ్చు. కానీ, కమిలినట్లు నల్లబడుతుంది. అలాంటి వాటి పైన ఈ తైలం రాస్తే వారంలోపే తగ్గిపోతుంది.
* ఈ తైలంతో మర్ధన చేస్తే చర్మ ముడతలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి కొందరిలో వచ్చే అకాల వృద్దాప్య లక్షణాలకు ఈ తైలం సంజీవని లాంటి ది.
* శరీరం బరువు పెరగడం వల్లగానీ, గర్భధారణ వల్లగానీ ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించడంలోనూ ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
* మొటిమలను తగ్గించడంలోనూ, మొటిమల కారణంగా ఏర్పడే పలుచని గుంటలను నివారించడంలోనూ ఈ తైలంతో చేసే ఫేషియల్స్ ఉపయోగపడతాయి.
చేపనూనె:

'కాడ్' అనే చేప లివర్ నుండి తీసిన కాడ్ లివర్ ఆయిలే చేపనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ తైలంలో విటమిన్-ఎ, డిలతో పాటు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉపయోగాలు

* ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మం పొడిబారే వ్యా«ధులకు ఈ తైలం క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటే క్రీముగా చర్మంపై పూతగా వాడితే దురదలు తగ్గుతాయి.
* ఇందులోని విటమిన్లు యాంటిఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ చర్మాన్ని కాపాడ తాయి.
గుడ్డు సొన నూనె

విరివిగా దొరికే అవకాశం ఉన్నందున ఈ తైలం తయారీకి కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. ఈ తైలంలోనూ ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఉపయోగాలు:

చి కాలిన గాయాలకు, దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన పుండ్లకు, వెరికోస్ అల్సర్లకు ఈ తైలంతోవేసే పూత ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలు చాలా త్వరగా కూడా మానతాయి.
చి ఈ తైలానికి తగు నిష్పత్తిలో కొబ్బెరినూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మూషికా తైలం ఎలుక మాంసానికి నువ్వుల నూనె చేర్చి తయారు చేసే తైలమిది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే కండరాలు తెగి వాలిపోయేటంతటి పెద్ద గాయాలు కూడా చాలా త్వరగా మానతాయి. * ఈ తైలం రాచపుండ్లు మానడంలోనూ బాగా తోడ్పడుతుంది.
* చర్మం పైన ముడతలు తగ్గడానికి, జారిన అవయవాలు (ప్రొలాప్స్ యుటెరస్/ రెక్టమ్) బిగువు పొందడానికి కూడా ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

Friday, December 17, 2010

వేధించే కాలినొప్పి... సయాటికా

సయాటికా.. ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి ఉంటుంది. దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో సయాటికాకు శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు వైద్యులు.

శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి మోకాళ్లు, పిక్కల ద్వారా అరికాళ్లు, కాలివేళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. మన వెన్నులో ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కొంత ఖాళీ ప్రదేశం, ఒక సయాటిక్ నరం, పూసలను బంధించి ఉంచే కొన్ని కండరాలు ఉంటాయి. మన దైనందిన పనుల్లోని కొన్ని లోపాల వల్ల కొందరిలో ఈ పూసలను బంధించి ఉంచే కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా పూసల మధ్య సహజంగా ఉండవలసిన ఖాళీ తగ్గిపోతుంది. దీనివల్ల పూసల మధ్య ఉండే సయాటికా
నరం ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల ఆ నరం శరీరంలో ఎంత దూరం వెళితే అంత దూరం నొప్పి వస్తూనే ఉంటుంది. సయాటిక్ నరం ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే సమస్య కావడం చేత దీనికి సయాటికా అన్న పేరు స్థిరపడింది. సయాటికాకు ఆయుర్వేద పరిభాషలో గృద్రసి వాతం అని పేరు.

లక్షణాలు
సయాటికా సమస్య ప్రారంభం కాగానే కనిపించే లక్షణం నొప్పి. ఆ తరువాత కొంత అసౌకర్యంగా ఉండటం, ఆ భాగంలో ఏదో కదిలినట్టు, చీమలు పాకినట్లు, పొడిచినట్లు అనిపిస్తుంది. తరువాత ఆ భాగమంతా మొద్దుబారినట్లుగా తయారవుతుంది. వంగడం క ష్టమవుతుంది. ఒకవేళ వంగినా మళ్లీ లేవబోతే చురుకుపెట్టినట్లు అవుతుంది.ఈ లక్షణాలు తొంటి నుంచి కాలి వేళ్ల దాకా ఎక్కడైనా కనిపించవచ్చు. ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నడుము భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. రెండవ దశలో ఈ నొప్పి నడుము నుంచి పిరుదుల దాకా వెళుతుంది. ఈ దశలో కాస్త తైలమర్ధనం చేసుకున్నా నొప్పి తగ్గుతుంది. మూడవ దశలో నొప్పితో కాలంతా లాగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే పొడిచినట్లు, మొద్దుబారినట్లు కూడా అనిపిస్తుంది. నాలుగవ దశలో నొప్పి కాలంతా పాకడమే కాకుండా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.

పడుకుని మరో పక్కకు తిరగబోతే బలంగా చురుకు పెట్టినట్లు అవుతుంది. వంగినా లేచినా ఇదే పరిస్థితి ఉంటుంది. సయాటికా సమస్య ఉన్న వివాహితుల్లో చాలా మందిలో అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలన సమస్యలు ఉంటాయి. సయాటికా సమస్యతో వచ్చిన వారికి ఈ సమస్య కూడా ఉంటే రెండింటికీ ఏకకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నపుంసకత్వానికి కూడా దారి తీయవచ్చు. సమస్య మరీ తీవ్రమైతే కొందరిలో రెండు కాళ్లూ చచ్చుబడిపోవచ్చు. ప్రమాదాల్లో కూడా కొందరిలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సమస్య మొదలైన మూడుమాసాల్లోపే వస్తే ఇది సులభంగా తగ్గిపోతుంది. కనీసం ఏడాదిలోపు తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి. మూడేళ్లు దాటాక చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిస్థాయిలో తగ్గదు.

కారణాలు

సయాటికా రావడానికి అస్తవ్యస్తమైన జీవన శైలి ప్రధాన కారణం. ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారిలో కండరాలకు ఎక్కువగా శ్రమ ఉండదు. అరుదుగా ఎప్పుడైనా కాస్త ఎక్కువ బరువు ఎత్తడం, ఎక్కువ గంటలు నిలుచోవడం లేక కూర్చునే భంగిమలో తేడా వల్ల వెన్నుపాము అపక్రమానికి లోనయితే ఈ సమస్య తలెత్తుతుంది. రోజంతా కూర్చుని లేదా నిలుచుని ఉండే ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారు, మరీ ఎత్తయిన హీల్స్ ధరించేవారు, బెల్ట్‌ను మరీ బిగుతుగా పెట్టుకునే వారు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు, ఏదైనా ప్రమాదానికి గురయిన వారు సయాటికా సమస్యకు గురికావచ్చు.

అలాగే దీర్ఘకాలికంగా మధుమేహం, క్షయ, లైంగిక వ్యాధుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినపుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇవే కాకుండా బాల్యంలో తగిలిన దెబ్బల తాలూకు దుష్ప్రభావం శరీరంలో ఉండిపోతుంది. అది పెద్దయ్యాక ఎప్పుడో శరీరం బలహీనపడినప్పుడు సయాటికాగా బయటపడవచ్చు. ముఖ్యంగా రోజూ చేసే పనుల వల్ల కాకుండా హఠాత్తుగా ఏదైనా బరువైన పనిచేసినప్పుడు ఈ సమస్య రావచ్చు. ఇక స్త్రీలలో అయితే, గర్భంతో ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ నడుము మీద పడే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపాల వల్ల సయాటికా సమస్య రావచ్చు.

వైద్య చికిత్సలు

ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. వీటిని డిస్కు బల్జ్, స్లిప్ డిస్క్, హెర్నియేటెడ్ డిస్క్, సీక్వెస్ట్రమ్ డిస్క్ అంటారు. మొదటి మూడు దశల్లో సమస్యను ఆయుర్వేద మందులతోనే పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్సల తరువాత ఎంఆర్ఐ రిపోర్టు చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. చివరి దశ అయినటువంటి సీక్వెస్ట్రమ్‌లో మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంది. సయాటికాకు ఆయుర్వేద వైద్యవిధానంలో పంచకర్మ చికిత్సలో భాగమైన మేరు చికిత్స బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద మందులతో పాటు ఆహార నియమాలను పాటిస్తే ఫలితం బాగుంటుంది.

Tuesday, December 7, 2010

కండర పుష్టికి కావాలా తైలాలు?

సౌష్టవమైన ఆకృతిని, దృఢత్వాన్నీ కలిగించేవి కండరాలే. చర్మం లోపల సన్నని దారాల్లా ఉండడంతో మొదలు, శరీరంలోని అన్ని అవయవాల నిర్మాణం దాకా కండరాలే కీలక పాత్ర వహిస్తాయి. సిక్స్ ప్యాక్, ఎయిట్‌ప్యాక్ బాడీ బిల్డింగ్‌లోనూ ముఖ్య భూమిక కండరాలదే.కండరాలు బలహీనపడిన వ్యక్తి బక్కచిక్కిపోతాడు. చర్మం సైతం తన ప్రభను కోల్పోయి ముడుతలు పడుతుంది. పైగా ఏపనీ చేయలేని అశక్తత, నిరుత్సాహం వెంటాడతాయి. ఇదంతా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు.

లేదా రక్తహీనత, క్షయ, గ్రహణి (ఐబిఎస్), తరుచూ వచ్చే జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్లనూ కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏర్పడిన పోషకలోపాల కారణంగా పుట్టిన బలహీన శిశువు మొదలు, «వృద్ధుల దాకా అందరూ కండరాల సమస్యను ఎదుర్కొనే వారే. ఇలాంటి వారికి కొన్ని ప్రత్యేక తైలాలతో మర్ధన చికిత్స చేస్తే ఆరోగ్యంతో పాటు కండర పుష్టీ పెరుగుతుంది. రక్తప్రసరణా వ్యవస్థ బలపడి చర్మంతోపాటు శరీర అవయవాలన్నీ తమతమ కార్యకలాపాలను సవ్యంగా జరుపుకోగల్గుతాయి. ఫలితంగా ఆరోగ్యమూ కుదుటపడుతుంది.

చందన బలా లాక్షాది తైలం :
చందనం, బలామూలం, లాక్ష్యానిర్యాసం, ఉశీర అనే నాలుగు వనౌషదుల కషాయం కాచిపెట్టుకుని దీనికి తగినన్ని పాలు కూడా కలుపుతారు. ఈ మొత్తానికి నాలుగో వంతు నువ్వుల నూనె చేరుస్తారు. నూనెలో నాలుగోవంతు చందన చెక్క, వట్టివేర్లు, సోంపు, దేవదారు చెక్క, పసుపు, కోష్టు, మంజిష్టా, అగరు, సుగంధిపాల, అశ్వగంధ, బలామూలాలు, కస్తూరి పసుపు, మూర్వా, తుంగ ముస్తలు, ముల్లంగి, ఏలకులు, దాల్చిన, నాగకేసరాలు, రాస్నా, లాక్షా, అజమోద, చంపక, చోరపుష్టి మొదలగు వాటి చూర్ణాలను ముద్దగా చేసి పైన తెలిపిన కషాయం, పాలు, నూనెలు ఉన్న పాత్రలోకి చే ర్చి 'తైలపాక విధి' లో ఆయుర్వేద ఫార్మసిస్టులు తయారు చేస్తారు.

ఉపయోగాలు
|* స్త్రీలలో రక్తస్రావ లక్షణాలు ఉండే గర్భకోశ వ్యాధులు (మెనొరేజియా, మెట్రోరేజియా), రక్తస్కందన లోపాలు ఉండే హీమోఫిలియా, మెటికియల్ హెమరేజ్ వంటి సమస్యలకు ఈ తైలంతో మర్ధన చికిత్స చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

* దగ్గు, దమ్ము, క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఛాతిపనైన, ముందూ వెనుక మర్ధన చేస్తే ఛాతీలో కండరరపట్లు పోయి కసమస్యలు తేలిగ్గా ఉపశ మిస్తూ ఔషధ చికిత్సలో సహకరిస్తాయి.

* ఒంటిపైన పొడిదురదలు లేదా మంటలు ఉన్నప్పుడు ఈ తైలంతో మర్ధన చేస్తే తక్షణమే ఉపవమనం లభిస్తుంది. * రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వాపులు గానీ, రక్తకణాల క్షీణతతో వచ్చే కామెర్ల జబ్బు ( హీమోలైటిక్ జాండిస్)లో గానీ, ఈ తైౖలాన్ని వాడుకోవచ్చు.

* తలపోటు, కళ్ల మంటలు ఉన్నప్పుడు తలకు మర్ధించుకోవచ్చు. * కాళ్లు, చేతులు పట్టేస్తున్నప్పుడు ( క్రాంప్స్) ఈ తైలంతో మర్ధనచేస్తే ఉపశమనమే కాకుండా సమస్యలు శాశ్వతంగా తగ్గిపోతాయి.
* తరుచూ వచ్చే కొన్ని దీర్ఘకాలిక జ్వరాలకు ఈ తైలంతో అభ్యంగనం చేస్తే శరీరం శక్తిని పుంజుకోవడంతో పాటు జ్వర సమస్యలు కూడా పూర్తిగా పోతాయి.
ఈ ప్రొటీన్, క్యాల్షియం లోపాలతో చిన్న పిల్లల్లో వచ్చే ' ఫక్కా'( రికెట్స్, మరాస్మస్, క్యాషియోర్కర్) వంటి వ్యాధులు, పుట్టుకతోనే వచ్చే మెదడు ఎదగకకుండా పోయే సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మజిల్ డిస్ట్రోఫీ వ్యాధకులకు కూడా ఈ ఈ తైలంతో అభ్యంగనం చేస్తే ప్రయోజనం ఉంటుంది.
మహా మాష తైలం
అశ్వగంధ, శ ఠీ, దేవదారు, బలా, రాస్నా, ప్రసారణీ, కుష్ఠం, భారంగీ, విదారీకంద, పునర్నవా, శతావరీ, జీరక, హింగు, శతపుష్పీ, గోక్షురా, పిప్పలీ మూల, చిత్రక, సైందవ లవణం, జీవనీయ గణం వంటి వనౌషధుల చూర్ణకల్కం ఒక భాగం తీసుకుని దానికి నాలుగు రె ట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మినుముల ( మాష) కషాయం, పాలు కలుపుతారు. ఆ తరువాత అన్నిటినీ ఒక పాత్రలో చేర్చి 'తైలపాక విధి' లో నువ్వుల నూనె మిగిలేట్లు కాచి తయారు చేస్తారు. ఆయుర్వేద ఫార్మసిస్టులు కొందరు కల్క భాగంలో కొంత మేక మాంసాన్ని కూడా కలుపుతారు.

ఉపయోగాలు
ఈ దీర్ఘకాలిక పక్షవాతాలు లేదా నరాల సంబంధ వ్యాదుల్లో కండరాలు, స్నాయువులు (లిగమెంట్లు ) బలహీనపడుతూ ఉంటాయి. వీరికి మహా మాష తైలంతో మర్ధన చేస్తే కండరాలు, స్నాయువులు తిరిగి పుష్టిగా తయారవుతాయి.
* మాటిమాటికీ మూర్ఛలు వచ్చే వారికి, దవడలు పట్టేసే వారికి ఈ తైల మర్ధన ఎంతో మేలు చేస్తుంది.
* అపబాహుక, విశ్వాచీ, ఖంజ, పంగుతా, అర్థితం వంటి నరాల జబ్బుల్లో కండరాలు ఎండిపోతుంటాయి. ఆ స్థితి రాకముందే ఈ తైలంతో మర్ధన చే స్తూ ఉంటే కుంటి, గూని, మూతివంకర, చేతివాతం వంటి సమస్యలు తొలగిపోతాయి.
* పురుషుల్లో ధాతుక్షయం, ప్రత్యేకించి శుక్రక్షయం కారణంగా సంతానం కలగనప్పుడు మహా మాష తైలంతో మర్ధన చేసుకోవడతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
సూచనలు:
పైన పేర్కొన్న వ్యాధులకు తైల మర్ధన ంతో మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణ లో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకున్నప్పుడు ఆ ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. ఇక ఈ వ్యాధులకు అల్లోపతి వైద్య చికి త్సలు తీసుకునే వారు కూడా మర్ధన కోసం మహామాష తైలాన్ని నిస్సంకోంచంగా వాడుకోవచ్చు.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

Wednesday, November 10, 2010

అలసిన మనసుకు పునరుజ్జీవం ధారా చికిత్స

dhara
ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జీవన వేగం మనిషి పై ఒత్తిడి పెం చుతోంది. ఉన్న దానిలో సంతృప్తి లేక లేని దాని కోసం ఆరాటపడటం అశాంతికి లోను చేస్తోంది. వేగంగా మారుతున్న జీవన వేగాన్ని, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిని మానవుడు అందుకోలేకపోతున్నాడు. దీనితో ఒంటరితనం, తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన, ఆగ్రహం, ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్నాడు.

మనఃశరీరాలు ఎంత అవిభాజ్యమో, పరస్పర ఆధారితమో ఆయుర్వేదం సరి గా కనుగొన్నది. ఉద్వేగాలలో అసమతుల్యత, ఉద్రిక్తత, సంపూర్ణాహారం తీసుకోకపోవడం అనేవి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. త్రిదోషాలలో ఒకటైన వాయు మనసును నియంత్రించి, ప్రోత్సహిస్తుంది. ఉద్వేగభరితమైన వాయు దోషం మనస్సును అతలాకుతలం చేయడం వల్ల భయం, దుఃఖం, నిస్సహాయత, స్తబ్దత, సన్నిపాతం వంటివి ఏర్పడతాయి. మనఃకాయక  పద్ధతికి సంబంధించి స్పష్టమైన వైఖరి కలిగిన తొలి వైద్య విధానం ఆయుర్వేదం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం మానసిక రోగాల వర్గీకరణ ఈ ప్రకారం ఉంటుంది.

dhara2
మానస వికార: అసూయ, భయ, చిత్తోద్వేగ, దైన్య, హర్ష, కామ, క్రోధ, లోభ, మద, మన్న, మోహ, శోక, విషాద, ఈర్ష్య, తమ, అతిప్రలాప, అస్వప్న, అతినిద్ర, భ్రమ.
ఉభయాత్మక మానస వికార: మానస అధిష్ఠాన ఉన్మాద, అపస్మార (epilepsy), అపతాంత్ర (hysteria)ü), అతత్వాభినివేశ (obsessive syndrome), మదత్యయ (alcoholic psychosis)), సన్య (coma)..
శరీర అధిష్ఠాన: కామ జ్వర, క్రోధ జ్వర, భయజ అతిసార, శోకజ అతిసార.
ధారా చికిత్స ప్రాధాన్యత:
పద్ధతి: కేరళీయ పంచకర్మలో ధారా ఒక ప్రత్యేక చికిత్స. ద్రవరూపంలో ఉన్న ఓషధులను నిర్ధిష్ట సమయం పాటు ధారగా శరీరం పై పోసే ప్రక్రియ. ఆయుర్వేద గ్రంథాలు దీనిని మూర్ధ తైల, శేక పరిశేకగా అభివర్ణించారు. దీనిని కేరళ సంప్రదాయ వైద్యులు మరింత మెరుగుపరచి, ప్రయోగాలు చేసి ‘ధారా చికిత్స’లో నైపు ణ్యం సాధించారు. ఇటీవలి కాలంలో కేరళీయ పంచకర్మ పద్ధతులలో ప్రముఖమైనదిగా పేరొందింది. ధారా చికిత్సలో కూడా మూడు రకాలు ఉన్నాయి. అవి:
dhara3
1. మూర్ధాన్య ధార (శిరో ధార)
2. సర్వాంగ ధార (శరీరం మొత్తం)
3. పరిశేక (శరీరంలో ఒక చోట మాత్రమే చేసేది)
మూర్ధన్య ధారే శిరోధారగా ప్రాచుర్యం పొందింది. ద్రవ రూపంలో ఉన్న ఓషధులను నుదిటపై ధారగా పోస్తారు. దీనిని మానసిక రోగాలైన సైకోసిస్‌, పిచ్చి, అపస్మారకం, ఒత్తిడి, ఆందోళన, న్యూరోసిస్‌, అయోమయం, నిద్రలేమి వంటి వ్యాధులకు చికిత్స నిమిత్తం విజయవంతంగా ప్రయోగించారు. అయితే దోషాన్ని బట్టి ఓషధులు మారుతాయి.
శిరోధార రకాలు, సూచనలు:
తక్రధార : గ్లాని, ఓజక్షయ, శిరశూల, హృద్రోగ
క్షీర ధార: అనిద్ర, ఉన్మాద, శిరశూల, ఒత్తిడి
తైల ధార: శిరశూల, మానసిక వ్యాధి
ఘృతధార : అనిద్ర, పిత్త వ్యాధులు
వీటికి అదనంగా నారికేళ జల అరనాల కషాయాలు లేదా శుద్ధమైన నీటిని అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు.

dhara1
ఓషధీ తైలాలను 4-8 ఇంచీల ఎత్తు నుంచి నుదిటిపై ధారగా పడేలా ఏర్పాటు చేస్తారు. వ్యాధిని బట్టి, దోషాన్ని బట్టి 30-90 నిమిషాల పాటు దీనిని కొనసాగిస్తారు.

శిరోగత మర్మాలను ఉత్తేజితం చేయడం, ధ్యానం, చక్రాలను చైతన్యవంతం చేయడం, ధారగా ఓషధులను పోయడం వల్ల ఏర్పడే ఒత్తిడి ప్రభావం, దాని ఫలితాలు మనోవికారాలను నియంత్రించడంలో ఎంత దోహదం చేస్తుందో రుజువు అయ్యాయి.

గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను, ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు.
డా ప్రసాద్‌, ఎం.డి.(ఆయుర్వేద),
డా స్వాతి, ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్‌ మల్టీ స్పెషాలిటీ సెంటర్‌,
101,రామచంద్రనివాస్‌ అపార్ట్‌మెంట్స్‌, 
వెంగళరావ్‌నగర్‌, హైదరాబాద్‌
ఫోన్‌: 93909 57168 / 9666649665 / 09503628150
Prasad _ayur@rediffmail.com
swathi_ayur@rediffmail.com

Saturday, November 6, 2010

అడవిలో ఆసుపత్రి ..... మూలికలే మందులు !

mulikalu5అక్కడ కార్పొరేట్‌ వైద్యానికి సైతం లొంగని వ్యాధులు మటు మాయమవుతాయి. ఆయన హస్తవాసిని చూసి మొండి రోగాలు కూడా తోకముడుస్తాయి. అలా అని ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ వైద్యుడేమీకాదు. ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో ఈ సత్కార్యాన్ని చేపట్టారు. ఇప్పటివరకు కొన్ని వేలమంది రోగులకు వైద్యసేవలందించి వారికి స్వాంతన చేకూర్చిన... చేకూర్చుతున్న ఆ వైద్య‘నారాయణుడే’ జమాల్‌ ఖాన్‌. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని ఓ కుగ్రామం నిమ్మలగూడెంలో... వారసత్వ సంపదగా వచ్చిన వైద్య విధానంతో జమాల్‌ తన ప్రకృతి చికిత్సాలయం ద్వారా ఎంతో మందికి వైద్య సేవ చేస్తున్నాడు. ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితం చెట్లలోని మందు గుణాన్ని క్రోడీకరించింది. ఆయుర్వేదం పరిధిలోకి రాని చెట్టు, మొక్క, తీగ అంటూ ఏదీలేదు. ఆలాంటి అపార వృక్షసముదాయంలోంచి వైద్య సంపదను సృష్టిస్తున్నాడాయన. మన్నెం అటవీ ప్రాంతంలో బీదబిక్కి జనానికి సహజమైన ఓషధులతో తన ప్రకృతి వైద్యశాల ద్వారా సేవ చేస్తున్నాడు. మన రాష్ట్రం నుండే కాక... చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి వచ్చే రోగులకు కూడా తన వైద్య సేవలు అందిస్తున్న జమాల్‌ఖాన్‌... ‘వైద్యో నారాయణో హరి’ అనే ఆర్యోక్తికి అక్షరాల అర్హుడు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చుచేసినా తగ్గని మొండి వ్యాధులను వనమూలికలతో... అదీ ఉచితంగా అందిస్తూ... తన సేవా తత్పరతను చాటుకుంటున్న ప్రకృతి వైద్య నిపుణుడు జమాల్‌ నిస్వార్థ సేవల కథనం.

- మహత్తర వనమూలికలతో మొండి రోగాలకు వైద్యం
- రెండు దశాబ్దాలకు పైబడిన వంశపారంపర్య ఉచిత వైద్య సేవలు
- మూడు రాష్ట్రాల రోగుల ఆశాజ్యోతి ఎండి.జమాల్‌ఖాన్‌
అనాది నుంచి ప్రకృతిలో మమేకమైన మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఆ ప్రకృతికి దూరమయ్యాడు. వైద్యరంగం అభివృద్ధి చెందుతున్న కొద్ది మానవుని ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది. అయితే వైద్యరంగంలో అనేక రకాల వైద్య విధానాలతో రకరకాల చికిత్సలు జరుగుతున్నప్పటకీ, అన్నింటికీ మించి, ప్రకృతిలో దొరికే మహత్తర వన మూలికలే మేలైన రోగ వినాశకారులని గుర్తించిన జమాల్‌ఖాన్‌ కుటుంబం వంశ పారంపర్యంగా ఏజెన్సీలో వైద్యం చేస్తూ, ఎందరో రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అడవి నుండి ఔషద గుణాలు ఉన్న మొక్కలను, వేర్లను, దుంపలను సేకరించి, వాటి ద్వారా చికిత్స నిర్వహిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండల కేంద్రానికి సరిగ్గా మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న నిమ్మలగూడెం జమాల్‌ఖాన్‌ మూలికా వైద్య ప్రకృతి కేంద్రం.

mulikaluచుట్టూ గుట్టలు, పచ్చటి ప్రకృతి, ప్రక్కనే జలజలా పారుతున్న శబరి నది ఒడ్డున తనకున్న కొద్దిపాటి భూమిలోనే అనేక రకాల వన మూలికలను పెంచుతూ, దాన్ని కుటీర పరిశ్రమగా చేసి వనమూలికలతో మందులు తయారు చేస్తున్నారు. సుమారు 20 మంది సహాయకులతో ఈయన వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జమాల్‌ఖాన్‌ సేకరించే అరుదైన వన మూలికా ఔషధాలైన తెల్ల మద్ది, ఎర్రచిత్రమూలం, తెలియకండ, బొమ్మల మర్రి, పీడాకుల పాల, అశ్వగంధ, పాతాల గరిడి, అడ్డసార, సత్తావరి తదితర ప్రకృతి నుంచి లభించే చెట్లు, వేళ్లతో ఎన్నో నయం కాని రోగాలను తగ్గించవచ్చని ఆయన రుజువు చేశారు. ఈ వైద్యశాలలో పాము కాటుకు గురై వచ్చే రోగులకు ఉచితంగా చికిత్స నిర్వహించి, అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఈయన వద్దకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది రోగులు వస్తుంటారు. క్యాన్సర్‌, అస్త్మా, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, బిపి, షుగర్‌ వంటి రోగాలను సైతం జమాల్‌ఖాన్‌ నయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అనేక మంది రోగులు తమ రోగాలు పూర్తిగా ముదిరిన తర్వాత చివరి దశలో రావడం, మందులు పనిచేసే వరకు ఓపికగా ఉండలేకపోవడంతో ఈ ప్రకృతి వైద్యం అంతగా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఈ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అందుకనే మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో మహత్తర వన మూలికలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలగలతో వినూత్న చికిత్స...
mulikalu1 శరీరంపై... ఎన్నో యేళ్లుగా మానకుండా, చికాకు కలిగించి, జీవితంపై విరక్తి పుట్టించే దీర్ఘకాలిక గాయాలకు ఈయన చేసే చికిత్స వినూత్నంగా ఉంటుంది. దీర్ఘకాళికంగా ఉన్న పుండ్ల ప్రదేశంలో బురద నీటి నుండి తెచ్చిన జలగలను వదిలి పుండ్లలో పేరుకుపోయి ఉన్న చెడు రక్తాన్ని పీల్పించడం ద్వారా చికిత్స మొదలుపెడతారు. అలా జలగలు చెడు రక్తాన్ని పీల్చివేసిన అనంతరం వైద్యుడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి మందుల ద్వారా 10-15 రోజులలో గాయం మానేటట్లు వైద్యం చేస్తారు. ఈ ప్రక్రియలో చికిత్స కోసం జలగలను ఒక రోగికి ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు.


రోగుల క్షేమమే కోట్ల ఆస్తితో సమానం...: మూలికా వైద్యుడు జమాల్‌ఖాన్‌
mulikalu3 ఒరిస్సాలోని మల్కా న్‌గిరి జిల్లా మోటు ప్రాంతం, మా నాన్నగారికి నేను 23వ సంతానం. నా తర్వాత తమ్ముడు ఖాలిక్‌ఖాన్‌తో కలిసి వంశపారంపర్యంగా వస్తున్న ఈ మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. మా తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ గారు 1920వ సం లోనే శబరి పరివాహక ప్రాంతాలలో వచ్చిన కలరా, డయేరియా వంటి అంటువ్యాధులను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. దాంతో ఆనాడే మా వైద్య విధానానికి మంచి గుర్తింపు లభించింది. మా తాతల కాలం నుండి నేటివరకు వైద్యసేవలకు గాను ఎప్పుడూ, ఎవరి దగ్గర ఒక నయా పైసా కూడా ఫీజు తీసుకోలేదు. 2002లో శబరి నది దాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మూలికలు సేకరించి తెచ్చిన గిరిజనులకు... కూలీ రూపేణా ఇవ్వడానికి మాత్రమే నామ మాత్రపు డబ్బు తీసుకుంటున్నాం. నాకు కాంట్రాక్టులు, వ్యవసాయం తదితర ఆదాయ మార్గాలు ఉన్నాయి. వైద్య సేవలకు ఎటువంటి రుసుము అవసరం లేదు. ఎందరో దేవుళ్లకు మొరపెట్టుకొని నా దగ్గరకు వచ్చే రోగులకు నయమై క్షేమంగా ఉంటే చాలు, అదే నాకు కోట్ల ఆస్తితో సమానం.

mulikalu2 ఏజెన్సీ ప్రాంతంలో ఆయుర్వేద వైద్య సేవల ద్వారా పక్షవాతం, మధు మేహం, కిడ్నిలో రాళ్లు, కిడ్ని ఫెయిల్యూర్‌, కీళ్లవాతం, కీళ్లనొప్పులు, టి.బి., కాలేయ సంబంధిత వ్యాధులు, రకరకాల కామెర్లు, గర్భసంచి క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, సైనస్‌, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, తెల్లపొడ, శూలబాధలు, అల్సర్‌, అర్ష మొలలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, ఎర్రబట్ట, సెక్స్‌ సంబంధ మైన సమస్యలు, హై, లో బి.పి., కుష్టు, ఇంకా అనేక రకమైన వ్యాధులకు చికిత్స వనమూలికల (గింజలు, బెరడు, వేర్లు, కాయలు, పువ్వు, ఆకులు) ద్వారా నయం చేస్తాం. మాకున్న కొద్దిపాటి ఆవరణలోనే ఎన్నో రకాల ఔషద మొక్కల ను పెంచుతున్నాం. సేకరించిన వాటిల్లో చాలావరకు బట్టీల ద్వారా ఆవిరి రూపంలో కషాయం (లిక్విడ్‌) తీస్తాం. అందులో తెల్లమద్ది, వాకుడు, ఉత్త రేణి, తామెరతీగ, పాషానంబేది, కొండపిండి ఆకు, నేల ఉసిరి, బొమ్మల మర్రి, నల్ల ఉమ్మెత్త, తెల్ల చిత్రమూలం, ఎర్ర ఉల్లి, ముల్ల గోరింక, నిమ్మగడ్డి అంజీరా, జీరా, నేలతాడి, పారీజాత, తిప్పతీగ, అడవినాబి, అడ్డసారా, మామి డి అల్లం, తెల్లగన్నేరు ఇలా వందలాది అడవి వన మూలికలతో పొడులు, లేహ్యాలు, ఔషదగుళికలు తయారు చేసి వ్యాధులను నయం చేస్తుంటాం.ఎందరో మేధావుల సందర్శన...

mulikalu4 భద్రాచలం మన్నెంలో ప్రకృతి వైద్యంతో పలు దీర్ఘకాలిక రోగాలను ఎలా నయం చేస్తున్నారో తెలుసుకోవాలని, ఎందరో మేధావులు, విద్యావేత్తలు, విదేశాల నుంచి సైతం ప్రొఫెసర్లు వచ్చి ఇక్కడి వైద్య విధానాన్ని తెలుసుకొని వెళ్లారు. డబ్బు ప్రధానంగా ఈ వృత్తిని ఎంచుకోకుండా, జమాల్‌ఖాన్‌ చేసే వైద్య సేవలు పలువురు కొనియాడారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వనమూలికల సేకరణ చాలా కష్టమైన విషయమని, దానిని ఇంతకాలంగా కొనసాగిస్తూ ఉండటం నిజంగా ప్రశంసనీయమని పలువురు వైద్యులు కొనియాడారు.


ఎన్నో రోజులుగా రాని మార్పు గమనించాను...: కోటగిరి మురళి, ఉద్యోగి, హైదరాబాద్‌
muraliనేను చాలా కాలంగా వెరికోస్‌వెయిన్స్‌ (చీలమండ వద్ద పుండు) అనే వ్యాధితో బాధపడు తున్నా, ఎన్నో రకాల వైద్య చికిత్స ద్వారా రాని మార్పు నాకు ఈ వైద్య విధానం ద్వారా వచ్చింది. గత సెప్టెంబర్‌ 16న ఒక న్యూస్‌ ఛానల్‌ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. జమాల్‌ఖాన్‌ చేసే వైద్యం, ఆయన రోగులతో మెలిగే తీరు నాకు ఎంతగానో నచ్చింది. అందుకే కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండి వైద్యం చేయించుకోవడానికి వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం వుంది.

జన్మజన్మలకు ఋణపడి ఉంటా...: వాసం నాగేశ్వరరావు, నర్సిపట్నం
nageshwaraoనాకు లివర్‌ దెబ్బతిన్నది. గ్యాస్‌ట్రబుల్‌ వల్ల హెచ్‌.బి.ఎస్‌ పాజిటివ్‌ అనే వ్యాధితో ఇక్కడికి వచ్చాను. లివర్‌పై ఉండే పొర పూర్తిగా చెడిపోయిందని, ఇక బ్రతకడం కష్టమని, చాలామంది చెప్పారు. కానీ, ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న తర్వాత, అంతకు ముందు ఉన్న రేచీకటి కూడా పోయింది. ఇప్పుడు నాకు కళ్లు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. జన్మజన్మలకు డాక్టర్‌గారికి రుణపడి ఉంటాను.

మాకు జమాల్‌ ఖానే దేవుడు...: మడివి విజయ్‌, స్థానికుడు
వారం రోజుల కిందట నన్ను కట్లపాము కరి చింది. అదే వేరేచోట అయితే నేను చచ్చిపోయేవాడినే. కానీ మా ప్రాంతం వాళ్లకు పాముకాటు భయం లేదు. ఎందుకంటే మాకు దేవుడు లాంటి జమాల్‌ఖాన్‌ ఉన్నాడు.

జమాల్‌ లేకుంటే అవిటిదాన్న య్యేదాన్ని...: సిద్దోజి పద్మ, చల్లగరిగ గ్రామం, వరంగల్‌ జిల్లా
padmaబోన్‌ క్యాన్సర్‌తో నా కుడికాలి మడమపై పుండు వచ్చింది. హన్మకొండలోని అమృత హాస్పటల్‌కి కూడా వెళ్లి చూపించుకున్నా. నిమ్స్‌ కూడా వెళ్లి చూపిస్తే మోకాలు వరకు తీసేయాలని చెప్పారు. ఇక్కడి రాకుంటే నా కాలు కోల్పోయేదాన్ని. 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకు సుమారు 70 శాతం నాకు ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా నయమవుతుందనే విశ్వాసం ఉంది. ఈ ఆవరణ, మొక్కలతో ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది.

జమాల్‌గారివద్ద పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం: ముఖ్య సహయకుడు, ఎస్‌కె.సుభానీ
subaniజమాల్‌ఖాన్‌తో నాకు బంధుత్వం ఉంది. బావగా నాకు చుట్టమే అయినా, ఆయన నాకు గురువుతో సమానం. ఆయన తో కలిసి వైద్య సేవల్లో పాలుపంచుకోవడం నా పూర్మజన్మ సుకృతం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఆయన దగ్గర మిగిలే ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు ఎన్ని రకాల పనులున్నా... వైద్యా న్ని, వైద్యసేవలను ఎంతో గౌరవంగా భావి స్తారు. అది నాకు, మా సహాయకులందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఏదో ఒకరోజు చిరాకు పడటం, అశ్రద్ధగా ఉండడం మనం చూస్తుంటాం... కాని మా జమాల్‌ఖాన్‌ గారిలో అది మేం ఇంతవరకు చూడలేదు.

ఇక్కడికి వచ్చే రోగుల్ని చూస్తే... మనసు చలిస్తుంది...:  -  రమణ, కాంపౌండర్‌
mulikalu6 జమాల్‌ఖాన్‌గారితో 15సంలుగా ఉంటున్నా. ఎన్నో వేలమంది రోగులకు సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కోసారి... బాగా రోగం ముదిరిన తర్వాత వచ్చే రోగులను, వారు పడే బాధలు చూస్తే మనసు చలిస్తుంది, రోగం ముదరక ముందే ఇక్కడికి వస్తే త్వరగా నయం చేస్తాం. కాబట్టి బాగుపడ్డ రోగులు ఇతరులకు చెప్పి, వారి వంతు సహకారాన్ని అందిస్తే... ఈ వైద్యానికి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది.

ఆయన సేవల్లో పాలుపంచుకోవడం మా అదృష్టం : సహాయకులు... సోయం ముత్తమ్మ, సోడే రాములమ్మ, సోడే అచ్చమ్మ, సోడే లక్ష్మి (విద్యార్థిని)
మా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రతి బుధవారం గిరిజనులు సంతకు వచ్చేటప్పుడు, జమాల్‌ఖాన్‌గారు చెప్పినటువంటి వేర్లు, బెరడులు, చెట్లు, ఆకులు తీసుకొస్తారు. వారు తెచ్చిన వాటిని మేం శుభ్రపరుస్తాం. ఎన్నో యేళ్లుగా ఈ పనిలో ఉన్నాం. డాక్టర్‌ గారు చెప్పినట్లు ఆవిరితీయడం, ఔషధ గుళికలు తయారు చేయడం, లేహ్యాలు తయారు చేయడం చేస్తుంటాం. డాక్టర్‌ గారు రోగులకు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పటికీ మాకు మాత్రం కూలీ ఇస్తుంటారు. ఆయన చేసే వైద్యంలో మా వంతు సేవ చేస్తూ, ఆయన వెంట ఉండటం పరమానందంగా ఉంటుంది.

వైద్య సదుపాయాలు ఎన్ని ఉన్నా...:మన్నెంలో వనమూలికా వైద్యానికే పెద్దపీట
mulikalu7 మన్నెంలో వనమూలికా వైద్యం చేస్తున్న జమాల్‌ఖాన్‌ వైద్యశాలకు 3 కిలోమీటర్ల దూరంలోని చింతూరు మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా (100 పడకల) హస్పటల్‌ లు అన్నిరకాల అల్లోపతి చికిత్సలు అందిస్తున్నప్పటికీ, నిమ్మలగూడెంలో యం.డి జమాల్‌ఖాన్‌ చేస్తున్న వనమూలికా వైద్యానికే రోగులు, వారి బందువులు పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటిడిఎ సంస్థద్వారా నిత్యం ఈ పరిసర ప్రాంతాల గిరిజన, గిరిజనేతరులను అనునిత్యం అభివృద్ది పరుస్తూ, అన్ని రకాల వైద్యసేవలను వారి వారి ముంగిటకు తెచ్చినా, వనమూలికా వైద్యమే ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల వారందరికి శ్రీరామరక్ష. ఈయన చేసే వైద్యంతో పాటు, పలకరింపు, రోగులతో ఈయన ఉండే వ్యవహర శైలి ప్రతిఒక్కరికి హత్తుకునే విధంగా ఉండడమే దీనికి కారణమని స్థానికులంటారు. హస్తవాసి, వంశపారంపర్య వైద్య విధానముతో జమాల్‌ఖాన్‌ చేసే విన్నూతన ప్రయోగాలతో (జలగలతో చికిత్స) చేస్తున్న వైద్యం కూడా మంచి ఫలితాలను ఇవ్వడం, ఇక్కడకి వచ్చే రోగులకు ఎంతో త్వరగా నయం అవ్వడమే జమాల్‌ఖాన్‌ వైద్య రహస్యమని, పలువురు స్వస్థత చేకూరిన వ్యక్తులు చెప్పడం గమనార్హం.
- మల్లేల సత్యనారాయణ, భద్రాచలం