‘ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలం. ఆరోగ్యాన్ని
కొనలేం’ అన్నది ఒక నానుడి. కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు. మనం రోజూ
చేసే పనులతోనే ఒక్క పైసా ఖర్చు కాకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే
కొద్దిపాటి వ్యాయామం, మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా వేళకు
నిద్రపోవడం వంటి కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందంతే. ఇవన్నీ
ఫ్రీగా లభించేవే. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచితంగానే
ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలిపేదే ఈ కథనం.
మనం
పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా
మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా
బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని
ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల
మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే
10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు
చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు
కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను
(మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు
బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు
వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు
బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్యం కోసం శారీరక శ్రమ అవసరం. దానికోసం గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశాలివి...
వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం.
జాగింగ్, రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.
{పతిరోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదుసార్లు పాటించాలి.
వాకింగ్‌లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.
వాకింగ్ ఏ వేళలో చేసినా పరవాలేదు. ఉదయం వేళల్లో అయితే మంచిది.
వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు.
జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిది కాదు.
నడక మొదలుపెట్టాక ఆపడం మంచిది కాదు. ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడపా మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావడం అన్నది కష్టమై శరీరంమీద చాలా ఒత్తిడి పడుతుంది.
పరగడపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి శ్నాక్ తీసుకుని వాకింగ్ చేయడమే మంచిది.
స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది.
మంచి బ్రేక్ ఫాస్ట్: మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తిలో మూడింట ఒకవంతు మనం ఉదయం తీసుకునే ఆహారం (బ్రేక్ ఫాస్ట్) తోనే వస్తుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందడం మాత్రమే కాదు... మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది.
ఉదాహరణకు
మనలో చిరాకుపడే తత్వం తగ్గుతుంది.
దేనిమీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది.
అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది.
దానితో పాటు మన బరువుకు తగినట్లుగా వేళకు మంచి ఆహారం తీసుకోవాలి.
దీనితో పాటు మన ఆహార అవసరాలకు తగినట్లుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి.

నిద్ర బాగా పట్టాలంటే...
బెడ్‌రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. నిద్ర వేళ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
సాయుంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.
ప్రతి రోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.
నిద్రకు ముందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియుళ్లు చూడొద్దు.
రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.
నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.
గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ... నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.
పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోండి.
నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
నిద్ర... ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.

మనం
పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా
మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా
బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని
ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల
మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే
10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు
చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు
కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను
(మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు
బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు
వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు
బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం కోసం శారీరక శ్రమ అవసరం. దానికోసం గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశాలివి...
వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం.
జాగింగ్, రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.
{పతిరోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదుసార్లు పాటించాలి.
వాకింగ్‌లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.
వాకింగ్ ఏ వేళలో చేసినా పరవాలేదు. ఉదయం వేళల్లో అయితే మంచిది.
వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు.
జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిది కాదు.
నడక మొదలుపెట్టాక ఆపడం మంచిది కాదు. ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడపా మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావడం అన్నది కష్టమై శరీరంమీద చాలా ఒత్తిడి పడుతుంది.
పరగడపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి శ్నాక్ తీసుకుని వాకింగ్ చేయడమే మంచిది.
స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది.
మంచి బ్రేక్ ఫాస్ట్: మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తిలో మూడింట ఒకవంతు మనం ఉదయం తీసుకునే ఆహారం (బ్రేక్ ఫాస్ట్) తోనే వస్తుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందడం మాత్రమే కాదు... మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది.
ఉదాహరణకు
మనలో చిరాకుపడే తత్వం తగ్గుతుంది.
దేనిమీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది.
అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది.
దానితో పాటు మన బరువుకు తగినట్లుగా వేళకు మంచి ఆహారం తీసుకోవాలి.
దీనితో పాటు మన ఆహార అవసరాలకు తగినట్లుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి.

నిద్ర బాగా పట్టాలంటే...
బెడ్‌రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. నిద్ర వేళ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
సాయుంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.
ప్రతి రోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.
నిద్రకు ముందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియుళ్లు చూడొద్దు.
రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.
నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.
గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ... నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.
పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోండి.
నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
నిద్ర... ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.

పాలు, చెరకు, ద్రాక్ష పండ్లు ముఖాన్ని శుభ్ర పరచడంలో అత్యుత్తమంగా పని చేస్తాయి.అలాగే ఆలివ్ ఆయిల్‌ను, ఆవనూనెను మేకప్‌ను తొలగిం చేందుకు వినియోగించవచ్చు.మొటిమలు బాగా వస్తుంటే స్ట్రాబెర్రీలను వినియోగించ వచ్చు. ఇందులో సహజంగా ఉండే సలిసైలిక్ ఆసిడ్ చర్మం లోని అధిక జిడ్డును పీల్చి వేసి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది.
చర్మం ఎండిపోయినట్టు ఉంటే బాగా పండిన అరటిపండు, బొప్పాయిని చిదిమి, అందులో గుడ్డును కలపడం వల్ల చర్మానికి తగినంత మాయిశ్చర్ అందుతుంది. అలాగే, గసగసాలు, బఠాణీలు వంటి వాటిల్లో సహజ నూనెలు ఉం టాయి. వాటిని పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించడం వల్ల మంచి మెరు పు వస్తుంది. డల్‌గా ఉండే చర్మానికి పెరుగు కూడా మంచి మందు.జిడ్డోడే చర్మానికి గుడ్డులో ఉండే తెల్లసొన చాలా మంచి ఆహారం లాంటిది. మెంతులు, కం దులు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టిస్తే జిడ్డును నియంత్రించి, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది.
ఇంట్లో సౌందర్య పోషణ చేసుకునే ముందుగా ముఖానికి ఆవిరిపడితే చర్మ రంధ్రాలు తెరుచుకొని సహజ ఉత్పత్తులో ఉండే పోషకాలను చ ర్మం మరింత బాగా పీల్చుకుంటుంది. ముఖం నున్నగా, పట్టులా మృదువుగా ఉండాలంటే షవర్ చేసే సమయంలో బేకింగ్ సోడాను శరీరం మొత్తానికి పట్టించాలి. ముఖం మీద బ్లాక్ హెడ్స్‌ను తొలగించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది బాహుమూలాల్లో, అరికాళ్ళల్లో చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వస్తుంటుంది. అటువంటివారు వెనిగర్‌ను, నీటిని సమపాళ్ళలో తీసుకుని డియోడరెంట్‌కి బదులుగా దానిని వాడాలి. 

పాదాలను శుభ్రం చేసుకోవడానికి ముందుగా నెయిల్ బ్రష్, నెయిల్ క్లిప్పర్స్, పూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ వార్నిష్, ఒక చిన్న టబ్ తీసుకోవాలి.పాదాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు చేయబోయేది పెడిక్యూర్. పాదాలకి కావల్సినంత మసాజ్, టోనింగ్ దీని వల్ల లభిస్తుంది రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో పాదాలు దృఢంగా ఉంటాయి.
గోళ్ల చుట్టు పక్కల ఉన్న చర్మాన్ని చర్మం వెనుక భాగానికి బాగా తోయాలి. గోళ్లను కట్టర్‌తో జాగ్రత్తగా కత్తిరించి ఒక షేప్ ఇవ్వాలి. ఈ సమయంలో గాయపడకుండా చూసుకోవాలి. ఆ తరువాత ఏదైనా మంచి నూనె లేదా క్రీముతో గోళ్లను, పాదాలను మాలిష్ చేయాలి.ఇష్టమైతే పాదాలు శుభ్రం చేసుకోడానికి నెలలో ఒకసారి బ్లీచ్ లేదా వారంలో ఒకసారి స్క్రబ్ చేయవచ్చు. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను పాదాలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే పెళుసుదనం తగ్గి గోళ్లు మెరుపు కనిపిస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. 
వస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ ఫంగస్ మాత్రం అందరి చర్మంలోనూ ఉన్నా కొంతమందిలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొందరి శరీరం మీద మచ్చలు వస్తాయి. వాతావరణం తేమగా, వేడిగా ఉన్నప్పుడు ప్రధానంగా వేసవిలో ఈ వ్యాధి కనిపించడానికి అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఇది ఫలానా కారణంగా వస్తుందని ఇప్పటికీ నిర్ధరించలేదు.
ఈ వ్యాధి రాకుండా నివారించడానికి కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవి...
ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ మచ్చలు ఎక్కువగా ఉంటే, యాంటీ ఫంగల్ మందులను కడుపులోకి తీసుకోవలసి ఉంటుంది. మందులు వాడాక ఈ మచ్చలు తగ్గినట్టు అనిపించినప్పటికీ, కొంతకాలం తరవాత మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కనక ఈ ఫంగస్ పూర్తిగా తగ్గడానికి మందులు వాడడం తప్పనిసరి. 

డాక్టర్ మహేంద్ర ఆజాద్
దుమ్ము, ధూళివల్ల పాదాలు మురికిగా కనుపిస్తాయి. వాటిని శుభ్రం చేసుకోవడానకి గోరువెచ్చని నీటిని ఒక బేసిన్‌లో తీసుకొని, ఎప్సాన్ ఉప్పు, బాడీ వాష్‌కు సంబంధించిన సోప్ క్రీమ్‌ను మిశ్రమంగా కలుపుకొని అందులో పాదాలను పదినిమిషాలసేపు ఉంచాలి.ఫ్యూమిస్ స్టోన్ తీసుకొని చర్మాన్ని బాగా రుద్దాలి.ఆరేంజ్ స్టిక్‌ను తీసుకొని కాలి గోళ్ళ మధ్య ఉన్న మట్టిని తొలగించాలి. అంతేకాకుండా గోళ్ళను కూడా పాలిష్ చేసుకోవాలి. సుతిమెత్తని పాదాలు ఎల్లప్పుడూ అందంగా కనపడాలంటే... నెలకొకసారైనా ఇలాంటి టిప్స్‌ని ఇంట్లో ఉండే చేసుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గడంతో పాటు అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.
సన్నబడాలంటే ఏం చేయాలని ఎవరినడిగినా బోలెడు సలహాలు ఇస్తారు. జిమ్ కెళ్లమని ఒకరు చెబితే తిండి తగ్గించమని ఒకరు చెబుతారు. అవన్నీ విని విని బోరు కొట్టేసి ఉన్నాయి అందరికీ. అందుకే అనూజ రాజేంద్ర కనిపెట్టిన కొత్త పద్ధతికి చాలా డిమాండ్ ఉంది. ఆ పద్ధతి పేరు 'బాలీఫిట్'. 'ఫిట్‌నెస్ త్రూ డ్యాన్స్'అనే నినాదంతో అనూజ ఈ వినూత్న పద్ధతిని అందరికీ పరిచయం చేశారు. బరువు తగ్గాలనుకునే వారితో ఆమె నాట్యం చేయిస్తుందన్నమాట. అమెరికాలో స్థిరపడ్డ ఈ ఆలోచన అనూజకి మూడేళ్ల కిత్రం వచ్చింది.
అమెరికాకు చెందిన 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్' పదకొండు మిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండేళ్ల క్రితం మనదేశంలో మొత్తం 250 వ్యాయామకేంద్రాలను ప్రారంభించాలనే ఆలోచనతో వచ్చింది. ఇప్పటికి యాభై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, హైద్రాబాద్, పూణె, నాగపూర్, జలంధర్, చంఢీగఢ్, అమృతసర్, లూధియానాలలో ఈ కంపెనీకి బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ చెప్పేమాట ఏమిటంటే... 'యూరప్, అమెరికా దేశాల కంటే ఇక్కడే వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, కనుక తాము తప్పకుండా వ్యాపారంలో విజయవంతం అవుతామని.'
విదేశీ ఫిట్‌నెస్ క్లబ్‌లు మన దేశంలో ప్రవేశించాక ఫిట్‌నెస్ రంగం స్థాయిలో చాలా మార్పులే వచ్చాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణను అన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. ప్రత్యేక 'ప్యాకేజీలు', పండగలకు 'ఆఫర్లు' ఎక్కువయ్యాయి. దాంతో పాటు మెరుగైన మెషినరీ కోసం ఎంత సొమ్మయినా ఖర్చు చేసేలా స్థానిక కంపెనీలు తమ పద్ధతులను మార్చుకున్నాయి.
అదే క్రమంలో వ్యక్తిగత శిక్షకులను నియమించుకునే పద్ధతి కూడా పెరిగింది. మూడునాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు టీనేజ్ మొదలు యువత, సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ వ్యక్తిగత శిక్షకులను ఆశ్రయించడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా, బెంగళూరులలో జిమ్‌కు వెళ్లేవారిలో దాదాపు సగం మంది వ్యక్తిగత శిక్షకులను నియమించుకుంటున్నారు. వారికి ఒక్కో సెషన్‌కు 250-500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉన్నా వెనకాడడం లేదు. అంటే నెలకు ఐదు నుంచి ఇరవై వేల రూపాయలు. మంచి శరీరాకృతి కోసం యువత, అధిక బరువు వంటి సమస్యలతో మధ్యవయస్కులు, అనారోగ్య నివారణ కోసం రిటైరయిన ఉద్యోగులు... ఇలా ఎవరి కోణం వారిదే అయినా అందరి కామన్ ఎజెండా మాత్రం ఫిట్‌నెస్సే. షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్, ఐశ్వర్యారాయ్, కరీనాకపూర్ వంటి సెలిబ్రిటీలకు వ్యక్తిగత శిక్షకులుగా పనిచేసే వారికి ఒక్కో సెషనుకు పది వేల రూపాయలు చెల్లిస్తారని చెప్పుకుంటారు.
విదేశీ కంపెనీల రాక తర్వాత ఈ కేంద్రాల నిర్వహణ, ఫీజులు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. అయితే ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఉపాధిని పెంచేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాయామ కేంద్రాలు వ్యక్తిగత శిక్షకులతో పాటు థెరపిస్టులు, డైటీషియన్‌లు ఇలా అనేకమందిని నియమించుకుంటున్నాయి. గోల్డ్స్ జిమ్ ఏకంగా 'జి.జి.యు.' (గోల్డ్స్ జిమ్ యూనివర్శిటీ) అని ఒక విశ్యవిద్యాలయాన్నే నడుపుతోంది. అందులో ఫిట్‌నెస్ రంగానికి సంబంధించిన ఏ సర్టిఫికెట్ కోర్సు చేసినా వారికి ఉపాధి ఖాయం. అది ఎంతోమందికి ఉద్యోగావకాశంగా కనిపిస్తోంది. గోల్డ్స్ జిమ్మే కాదు ఇప్పుడు దేశంలో పేరు పొందిన ఫిట్‌నెస్ కంపెనీలన్నీ 'ఫిట్‌నెస్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూట్'లుగా కూడా వ్యవహరిస్తున్నాయి.
ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వ్యాపారావకాశాలు పెరుగుతుండడం గమనించి ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'. సుమారు పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడితో మన దేశంలో అడుగు పెట్టిందీ కంపెనీ. కంప్యూటర్లు తయారు చేసే టీజీఎస్ కంపెనీయే ఈ పేరుతో ఫిట్‌నెస్ రంగంలోకి ప్రవేశించింది. రీబాక్ కూడా అంతే! ప్రధానంగా క్రీడావస్తువులను తయారు చేసే కంపెనీ అది. ఏరోబిక్, జిమ్ సెంటర్లను నిర్వహిస్తుండమే కాకుండా ఇటీవల మెషినరీ తయారీని కూడా మొదలు పెట్టింది అది. రీబాక్ కంపెనీ చెప్తున్న లెక్కల ప్రకారం వాళ్లకు డెబ్బయి శాతం ఆదాయం ఫిట్‌నెస్ సెంటర్ల వల్లే వస్తోందట మిషనరీ అమ్మకాలు కలుపుకుని.
ఈ రంగంలో మరో కొత్త ట్రెండ్ డీవీడీ వర్క్ అవుట్స్. బిజీగా ఉండేవాళ్లకి, లేజీగా ఉండేవాళ్లకి ఫిట్‌నెస్ డీవీడీలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రకటనులు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితమే శిల్పాశెట్టి విడుదల చేసిన యోగా వీడియోలు సంచలనం సృష్టించాయి. ఆ తరవాత బిపాషా బసు, కరీనాకపూర్, షెర్లిన్‌చోప్రా, లారాదత్తాలు ఆ జాబితాలో చేరారు. వీళ్లందరి వర్క్ అవుట్ డీవీడీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కథానాయికలే కాదు హీరోలూ ఇదే దారిలో ఉన్నారు. జాన్ అబ్రహాం ఇప్పటికే ఒక 'వర్క్ అవుట్' చేయగా, హృతిక్‌రోషన్, సల్మాన్‌ఖాన్‌ల డీవీడీలు త్వరలోనే విడుదల కానున్నాయి. కత్రినా, ప్రియాంక చోప్రాలు కూడా అదే పనిలో ఉన్నారు. అందుకోసం ఈ స్టార్లంతా కోట్లలో పారితోషికం పుచ్చుకున్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరగుతోంది. బాలీవుడ్ వర్క్ అవుట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'బాలీవుడ్', 'బాంబే డ్రీమ్స్', 'మసాలా బాంగ్రా', 'బాలీవుడ్ గ్రూవ్స్', 'ఇండియన్ డాన్స్ ఏరోబిక్స్', 'ఇండియన్ ఫోక్ డాన్స్' డీవీడీలు అమెరికా, యూరోప్ దేశాలలో నీరాజనాలు అందుకుంటున్నాయి.
సగటు మనిషి 'బాడీ బిల్డర్'గా కండలు చూసుకుని మురిసిపోయే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. సినిమాల ప్రభావంతోనే జిమ్ యావ మొదలైనప్పటికీ అది ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరూ గుర్తించారు. ఈ యేడాది వ్యాయామ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న వివిధ కంపెనీలు ప్రకటించాయి. ప్రజల్లో వస్తున్న అవగాహనకు అనుగుణంగా వారిలో ఇంకా ఆసక్తిని పెంచి లాభాలు గడించేందుకు వ్యాయామాల్లో కూడా కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తున్నాయి పలు కంపెనీలు. అందుకోసం డాన్సులు, ఏరోబిక్స్‌లే కాకుండా 'స్పా' యోగాలను కూడా హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌లో కలిపేశారు. అందుకే యోగా గురువులకు, కొరియోగ్రాఫర్లకు ఫిట్‌నెస్ సెంటర్లు నడిపే కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
సౌష్టవమైన ఆకృతిని, దృఢత్వాన్నీ కలిగించేవి కండరాలే. చర్మం లోపల సన్నని దారాల్లా ఉండడంతో మొదలు, శరీరంలోని అన్ని అవయవాల నిర్మాణం దాకా కండరాలే కీలక పాత్ర వహిస్తాయి. సిక్స్ ప్యాక్, ఎయిట్‌ప్యాక్ బాడీ బిల్డింగ్‌లోనూ ముఖ్య భూమిక కండరాలదే.కండరాలు బలహీనపడిన వ్యక్తి బక్కచిక్కిపోతాడు. చర్మం సైతం తన ప్రభను కోల్పోయి ముడుతలు పడుతుంది. పైగా ఏపనీ చేయలేని అశక్తత, నిరుత్సాహం వెంటాడతాయి. ఇదంతా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు.
డాక్టర్ చిలువేరు రవీందర్