Sunday, July 25, 2010

అందమైన పాదాలు

పాదాలు పగలడం, రక్తాలు రావడం, నడవలేకుండా అవ్వడం వంటి సమస్యలు చాలా మందిలో తలెత్తుతాయి. పాదాలను సంరక్షించుకోవడానికి పెడిక్యూర్‌ ఒక మంచి పద్ధతి. మన ఇంటిలోనే ఈ పద్ధతి ద్వారా పాదాలను అందంగా ఉంచుకోవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు.

Pedicure-medicareపాదాలను సంరక్షించుకోవాలంటే వాటిని క్రమం తప్పకుండా శు భ్రం చేస్తూ ఉండాలి. పాదాలను శుభ్రంగా ఉంచడానికి, అందంగా కనిపించడానికి పెడిక్యూర్‌ చేయడం ఒక మంచి పద్దతి. నెలలో రెండుసార్లు పెడిక్యూర్‌ చేసుకోవాలి. పెడిక్యూర్‌ కోసం బయటికెళ్ళకుండా ఇంట్లోనూ చేసుకోవచ్చు.

కావలసిన వస్తువులు...
నెయిల్‌ బ్రష్‌, నెయిల్‌ క్లిప్పర్స్‌, ప్యూమిక్‌ స్టోన్‌, మసాజ్‌ క్రీమ్‌, నెయిల్‌ వార్నిష్‌, ఒక చిన్న టబ్‌ పెడిక్యూర్‌ చేయడానికి ఉపయోగపడుతాయి.

లాభాలు...
పాదాలను ఆరోగ్యంగా ఉంచడానికి పెడిక్యూర్‌ ఉపయోగ పడుతుంది. పాదాలకి కావల్సినంత మసాజ్‌, టోనింగ్‌ లభిస్తుంది రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో పాదాలా దృఢంగా ఉంటాయి.

ఎలా చేయాలి...
పెడిక్యూర్‌ చేయడానిి ఒక టబ్‌లో గోరువెెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లలో షాంపూ, సగం నిమ్మకాయ, ఏదైనా ఆయిల్‌, చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు 20 నిమిషాలు ఈ టబ్‌లో కాళ్లు పెట్టి కూర్చోవాలి. అంతన్నా ముందు పాదాల గోర్లపై ఉన్న నెయిల్‌ పాలిష్‌ను రిమూవర్‌ సహాయంతో తొలగించాలి. కొద్దిసేపు పాదాలను నీళ్లలో పెట్టిన తర్వాత మడమలు,అరికాళ్లను ప్యూమిక్‌ స్టోన్‌ లేదా ఇసుక, మట్టితో రుద్ది శుభ్రం చేయాలి.

గోర్ల చుట్టు పక్కల ఉన్న చర్మాన్ని, చర్మం వెనుక భాగాన్ని బాగా పుష్‌ చేయాలి. గోర్లను కట్టర్‌తో జాగ్రత్తగా కత్తిరించి ఒక షేప్‌ ఇస్తే బాగుంటుంది. గోర్లు కత్తిరించే సమయంలో గాయపడకుండా చూసుకోవాలి.ఆ తరువాత ఏదైనా మంచి నూనె లేదా క్రీముతో గోర్లను,పాదాలను మాలిష్‌ చేయాలి. ఒక వేళ మీకిష్టమైతే పాదాలు శుభ్రం చేసుకోడానికి నెలలో ఒకసారి బ్లీచ్‌ లేదా వారంలో ఒకసారి స్క్రబ్‌ చేయవచ్చు. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను పాదాలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే పెళుసుదనం తగ్గి పాదాలు అందం గా కనిపిస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. అందమైన పాదాలకు ఆ మాత్రం శ్రద్ధ అవసరమే మరి.

ముఖానికి ముల్తానీ మిట్టి - తేనెతో సౌందర్య రక్షణ

ముల్తానీ మిట్టి చర్మ సౌందర్యాన్ని పెంచే ముఖ్య సాధనాల్లో ఒకటిగా నేడు చలామణి అవుతోంది. దీనిలో చర్మ సౌందర్యాన్ని పెంచే మంచి గుణాలున్నాయి. కేవలం చర్మం మాత్రమే కాదు కేశ సౌందర్యాన్ని కూడా పెంచేందుకు అద్భుతంగా వుపయోగపడుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. మనం రోజూ ఎన్నో రకరకాల వాతావరణాల్లో తిరుగుతూ వుండాల్సి వస్తుంటుంది. వాతావరణంలో వుండే తేమ, ధూళి, ఇతర అంశాలు, వాతావరణ కాలుష్యం చర్మం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల చర్మం కాంతి హీనమైపోతుంది. అటువంటి చర్మాన్ని తిరిగి అందంగా చేసుకోవాలంటే... ముల్తానీ ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాం..
ముల్తానీ మిట్టి వాతావరణ ప్రభావం చర్మం కోల్పోయిన తేమను, ఆయిల్‌ను తిరిగి చేకూరుస్తుంది. ముఖానికి కాంతిని ఇస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలలో వున్న మురికిని తొలస్తుంది.
face-packమొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తుంది.
మిట్టిని ఫేస్‌ మాస్క్‌గా వుపయోగించుకోవచ్చు. ఒక టీస్పూన్‌ ముల్తానీ మిట్టి, అరస్పూన్‌ కొబ్బరి నీళ్లు, అర స్పూన్‌ ఆరంజ్‌ రసం, అరస్పూన్‌ పైనాపిల్‌ జూస్‌. ఒక బంతి ఆకు, పూల ముద్ద, ఒక స్పూన్‌ గులాబీ రేకుల పేస్ట్‌ బాగా కలిపి పేస్ట్‌ మాదిరిగా తయారు చేసుకోవాలి.
దీన్ని ముఖానికి మాస్క్‌గా వేయాలి. వరుసగా 45 రోజులు ఇలా చేసినట్టయితే మీ చర్మ సౌందర్యం, మెరుపు మీరే నమ్మలేనంత అద్భుతంగా వుంటుంది.
రెండు స్పూన్ల ముల్తానీ మిట్టిలో పావు స్పూన్‌ చందనం పొడి, రెండు స్పూన్లు కొబ్బరి నీళ్లు, రెండు స్పూన్లు దోసకాయ రసం కలిపి పేస్టులాగా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది.
తొందరగా చెమట పట్టే వారికి ముఖం తొందరగా వాడిపోయినట్లు అవుతుంది. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముందుగా స్వచ్ఛమైన ముల్తానీ మిట్టిని కొద్దిగా నీటితో కలుపుకోవాలి.
దీన్ని మెత్తటి క్రీం లాగా తయారు చేసుకుని ముఖానికి పట్టించుకోవాలి. అలా పది నిముషాలు వుంచితే చాలు, ముఖం తేటగా కనిపిస్తుంది.
MultaniMittiPackముల్తానీకి కొద్దిగా నిమ్మరసం, పుదీనా రసం కలిపి ముఖానికి పట్టించినా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు నెమ్మదిగా తగ్గుతాయి.
రెండు స్పూన్ల తులసి, పుదీనా రసం తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మకాయ, ముల్తానీ మిట్టి కలిపి ముఖానికి రాసుకోవాలి. అది ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో కడగాలి. కాంతి విహీనంగా తయారైన ముఖానికి ఇంది ఎంతో మేలు చేస్తుంది.
ముల్తానీ మిట్టిని చర్మ రకాన్ని బట్టి నీటితో లేదా గులాబీ నీరుతో కూడా కలిపి ముఖంపై మాస్క్‌లా వేసుకోవచ్చు. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగితే ముఖం కాంతి వంతంగా అయిపోతుంది.
పొడిగా చర్మం వున్న వారు ముల్తానీ మిట్టిలో పాలమీగడ కలుపుకుని ముఖానికి రాసుకుంటే పొడిబారిన చర్మం బాగవుతుంది.
ప్యాక్‌ వేసుకుని వేసుకుని కడుగునేప్పుడు సబ్బును వుపయోగించడం మంచిది కాదు. వీలైనంత వరకు మంచినీటినే వుపయోగించండి.

కురులకు ముల్తానీ..
ఈ ముల్తానీ మిట్టిని శిరోజాలకు పట్టిస్తే అవి మరింత మెరుస్తూ, ఆరోగ్య కరంగా వుంటాయి. జుట్టుకు మరింత నలుపు రంగును చేకూరుస్తుంది.
కొందరికి పొడుగాటి వెంట్రుకలు వున్నప్పటికీ అవి కళావిహీనంగా, డల్‌గా అనిపిస్తాయి. అంటే వాటికి తగినంత మెరుపు వుండదు. అలాంటి వారు చిన్న చిట్కా పాటిస్తే ఆకట్టుకునే శిరోజాలు పొందవచ్చు.
రెండు స్పూన్‌ల ముల్తానీ మిట్టిని తీసుకుని ఒక స్పూన్‌ పెరుగు, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించాలి. ఇది పూర్తిగా పొడిగా అయిపోయిన తరువాత తల స్నానం చేయాలి. అప్పుడు వెంట్రుకలు నిగనిగలాడుతూ ఫ్రెష్‌గా కనిపిస్తాయి.
తేనెతో సౌందర్య రక్షణ
తేనె నాణ్యమైన మాయిశ్చరైజర్‌. గోరు వెచ్చని తేనెను ముఖానికి పట్టించి 20 నిమిషాలాగి కడిగేయాలి. మదువుగా తేమగా మిలమిలలాడుతుంది మీ చర్మం.
చెంచా తేనెకు రెండు చుక్కల లావెండర్‌ నూనె కలిపి ముఖానికి పట్టించండి. పిగ్మెంటేషన్‌కు ఇది చక్కటి పరిష్కారం.
పొడిచర్మం వున్న వారు అరచెంచా తేనెకు రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్‌ కలిపి ముఖానికి పట్టిస్తే చాలు. మీ చర్మం గులాబీలా మృదువుగా తయారవడం ఖాయం.

తేనె, నిమ్మకాయ కలిపి ముఖానికి పట్టించినా కూడా మంచి ఫలితముంటుంది.
క్రమం తప్పకుండా తేనెను ముఖానికి రాసుకుంటే ముఖంలోని మచ్చలు తొలగిపోతాయి.
పొడిబారిన పెదవులపై కొద్దిగా తేనెను రాసుకుంటే పగుళ్ళు మాయం అవుతాయి.
తేనె జుట్టుకు మంచి కండిషనర్‌. పాలు తేనెల మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టు పట్టులా నిగనిగలాడుతుంది.
ఎన్నో ఔషదాలలోనూ తేనెను వుపయోగిస్తారు.
తేనెను రోజూ కొద్దిగా తీసుకుంటే స్వరపేటికకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరం అవుతాయి.

చందనంతో.. అందం

చందనం వృక్షరూపంలో మన దేశంలోనే విస్తారంగా లభిస్తుంది. ప్రస్తుతం చైనా, ఇండోనీషియాల్లోనూ చందనం చెట్లను పెంచుతున్నారు. మైసూర్‌ చందనం విశ్వ విఖ్యాతి గాంచింది. ఇది కర్ణాటక, తమిళనాడు, కోయంబత్తూర్‌లో దొరుకుతుంది. ఇవాళ విదేశాల్లోనూ చందనానికి ప్రాచుర్యం ఉంది.చందనాన్ని చాలామంది వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. టాల్కం పౌడర్లు, సబ్బులు, అగరుబత్తులు, ఫేస్‌క్రీములు వంటి వాటి తయారీలో చందనం విరివిగా వినియోగించబడుతోంది. అదే సమయంలో మెరుగైన అందాన్ని ఇవ్వడానికి కూడా చందనం ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

sandalwoodచందనం పట్టు వేసుకుంటే చలువ చేసి, తల నొప్పి తగ్గుతుందని మన బామ్మలు వైద్యం చేస్తుండేవారు. ఆరోగ్యానికే కాకుండా, అందానికి సైతం చందనం వాడుకలో ఉంది. పరిమళాలీనే చంద నం, భారతీయుల మనసుల్లో ఒక ప్రముఖస్థానాన్ని ఆక్రమించే ఉంది. పూజల తరువాత నుదుట పెట్టుకు నే తిలకంగానో, వేసవిలో ఎండ వేడిమి తట్టుకునేందుకు లేపనంగానో అందరూ వాడుతున్నాము. చందనం లోని యాంటి సెప్టిక్‌ గుణాల వల్ల, రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాము. చందనం వేసవిలో సూర్యరశ్మిలోని అల్ట్రా మయొలెట్‌ కిరణాలు నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తుంది. అందుకని చందనం కలిసిన సన్‌లోషన్స్‌ వాడుతున్నారు. సౌందర్యసాధనంగా చందనం గురించి తెలుసుకుందాం.

ముఖాన్ని తాజాగా ఉంచేందుకు......
1 చెంచా చందనం పొడికి 1 చెంచా తేనె, సగం చెంచా పసుపు చేర్చి, బాగా కలపాలి. ఈ లేపన్నాన్ని ము ఖం, మెడకు రాసుకుని, 20 నిమిషాల తరువాత, చల్లని నీటితో కడిగేయాలి. ఇది ఉత్తమమైన ఫేస్‌ మాస్క్‌ లా పని చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాస్క్‌ కనుక ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అందుకే బ్యూటీపార్లర్‌ వంటివాటికి వెళ్లి కృత్రీమ రసాయనాలు వాడడం కంటే చందనం వాడడం ఉత్తమం.

మొటిమలను తొలగించటంలోనూ......
మొటిమలు పోవడానికి రక ర కాల క్రీములువాడుతుంటా రు. కానీ దానితో పోలిస్తే చ ందనం ఎంతో ఉపయుక్తం. 2 చెంచాల సెనగ పిండి కి, సగం చెంచా పన్నీరు, 2 చెం చాలు నీరు, 1 చెంచా చంద నం పొడి చెర్చాలి. బాగా కలి పి ముఖానికి పట్టించుకోవాలి. ఎండిపోయాక, ముఖం మీద నీ రు చిలకరించుకుంటూ శుభ్రం చే సుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు ని యమబద్ధంగా చేస్తే ముఖం కాంతివం తం కావటమే కాకుండా, క్రమంగా మొటిమలూ పోతాయి.

ఎండ వేడిమి నుంచి రక్షణకు...
చందనం పేస్ట్‌ను ముఖానికీ, మెడకూ రాసుకుని, ఎండిపోయాక చల్లని నీటితో కడిగేయాలి. ఈ చందనం పేస్ట్‌ తయారు చేసుకోవటం కూడా సులువే. చందనం కర్రను నీటిలో అరగదీస్తే, పేస్ట్‌ తయారవుతుంది. దీనిలో తగినంత ఖీరాల రసం లేదా పన్నీరు కలిపి, ఉపయోగించుకోవచ్చు.
ముల్తానీ మట్టి, గుడ్డులోని పసుపు సొన, తేనె, ఆలివ్‌ నూనె, చందనం పొడి కలిపి, పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి లేపనం చేసుకుని ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తే ఎండకు కమిలిన చర్మానికి చల్లదనం కలిగి, మునుపటి స్థితికి వస్తుంది..
వేసవిలో విపరీతంగా చెమట పడుతుంటుంది. చందనం పొడికి పన్నీరు చేర్చి, ఈ మిశ్రమాన్ని శరీరమంతటా లేపనం చేసుకోవాలి. కాసేపు తరువాత స్నానం చేస్తే, శరీరదుర్గంధం పోతుంది.

Wednesday, July 21, 2010

తినండి హాయిగా....

pizzaప్రతిప్రాణీ ఆహారం తీసుకోక తప్పదు. మనిషి మూడుపూటలా భోజనం చేయాల్సిందే. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడం తప్పనిసరి. అయితే మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా శరీరంలోని మొదడు తదితర భాగాలకు పోషణనందిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి మనసు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
మనం తీసుకునే ఆహారంలో నూనె, మసాలా దినుసులు, పాచిపోయిన ఆహారం లేదా హెవీ డైట్‌ కారణంగా మనసులో కామ, క్రోధాలు, ఒత్తిడి తదితరాలు పెరిగిపోతాయట. ఆకలికి మించి ఎక్కువగా తీసుకోవడం, లేదా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు వైద్యులు.

ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి అందడంతో పాటు ఉత్సాహంగాను ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్లనే శరీరానికి శక్తి, బలం వస్తుందనుకోవడం పొరబాటు. మనం తీసుకునే ఆహారం ఏ మేరకు జీర్ణమయ్యిందనే విషయం తెలుసుకోవాలి. పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం యువత అందులోనూ మహిళలు సరైన ఆహారం తీసుకోవడం లేదనేది వైద్యనిపుణుల అభిప్రాయం.

కొంతమంది యువతులు మాత్రం సమయానికి ఆకలి తీర్చుకుంటున్నప్పటికీ ముఖ్యంగా దారి లో ఏది కనపడితే అది తినేయడం లేదా టీ, స్నాక్స్‌తోనూ ఓ పూట గడచిందనుకుం టున్నారట. దీంతో వారు తీసుకునే ఆహారం జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి వారు సరైన ఆహారం తీసుకోకపోవడం మూలంగా తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు అంటున్నారు.


ఆహారం ఎప్పుడు తీసుకోవాలి
foodకొంత మంది ఆహారం తీసుకోవడానికి ఎలాంటి సమాయాన్ని అనుసరించరు. ఒకరోజు ఒక సమయంలో తీసుకుంటే మరోరోజు మరో సమయంలో తీసు కుంటారు. కానీ అలా కాకుండా తీసుకు నే ఆహారానికి నియమిత సమయం తప్పకుండా ఉండాలి. ఉదయం అల్పా హారం తప్పనిసరిగా తీసుకోవాలం టు న్నారు వైద్యులు. అల్ఫాహారం తరువాత ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య లో భోజనం తీసుకోవాలి. దీంతో పగ లంతా పనిచేసేందుకు శరీరానికి కావల సిన శక్తి లభిస్తుంది. కొందరేమో ఉద యం పూట టీ ఆల్ఫాహారం తీసు కుంటారు. తర్వాత ఏకంగా రాత్రి పూట భోజనం తీసు కుంటారు.

మరికొంతమంది అల్ఫాహారానికి, బోజనానికి మ ద్య సమయం ఉంచరు. ఒకటి తర్వాత ఒకటి తినేస్తారు. దీంతో ఆరోగ్యం పాడవు తుంది. పగటిపూట తీసు కునే ఆహారం శారీరక శ్రమననుసరించి ఉండాలట. రాత్రిపూట తీసుకునే ఆహారం మాత్రం తేలికపాటి భోజనం, లేదా జీర్ణ మయ్యే టువంటి ఆహారాన్ని మాత్రమే తీసు కోవలంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకోవడానికి తప్పకుండా సమయాన్ని పాటించాలి. తీసుకునే ఆహారం కొద్దిపాటిదైనా సమయానుసారం తీసుకోవాలి. సమయానుకూలంగా ఆహారం తీసుకోకపోవడం మూలంగా అది జీర్ణవ్యవస్థ, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సమయానుసారంగానే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.దీంతో శరీరంలోని జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆహారాన్ని ఎలా తీసుకోవాలి
ప్రతిరోజు ఆహారాన్ని తీసుకునే ముందు చేతులు, కాళ్లు, నోరు శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసే టపుడు తూర్పు లేదా దక్షిణ దిక్కును చూస్తున్నట్లు కూర్చోవలట. దీంతో ఆయుష్షు, కీర్తిప్రతిష్టలు పెరు గుతాయని పెద్దలు చెబుతుంటారు. చెప్పులు తొడుక్కుని, నిలబడి ఆహారం తీసుకోవడం మంచిది కాద న్నది వారి అభిప్రాయం.భోజనాన్ని బాగా నమిలి తినాలి లేకుంటే దంతాలు చేయాల్సిన పనిని పేగులు చేయాల్సివస్తుందట.

రుచికోసం కాకుండా ఆరోగ్యం కోసం మాత్రమే బుజించాలని, ఆహారం చాలా రుచిగా ఉందని ఎక్కువ లాగిస్తే దుష్పరిణామాలు తప్పవంటున్నారు వైద్యులు. భోజనం చేసిన వెంటనే నీళ్లు, టీ తాగడం, పరుగెత్తడం, కూర్చోవడం, పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. భోజనం చేసిన తర్వాత కాసేపు అటుఇటూ ఆరోగ్యానికి ఆనందదాయకం అంటున్నారు నిపుణులు. మంచి ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేదంటే అనారోగ్యాల పాలవ్వడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు.

Sunday, July 18, 2010

శ్వాసను బట్టే ఆయుష్షు, యోగా ఏకైక మార్గం..

పార్కు కనిపిస్తే యొగా క్లాస్ పెట్టేస్తాడు

తెల్లటి దుస్తుల్లో యోగా నేర్పిస్తున్న ఈ పెద్దాయన పేరు ధరణీప్రగడ ప్రకాష్‌రావు. ఉద్యోగం మానేసి పదిహేనేళ్ల నుంచి రోజూ ఇదే పని. ఎక్కడ పచ్చటి పార్కు కనిపిస్తే అక్కడ యోగా క్లాసు పెట్టేస్తాడు. అందరూ బుద్ధిగా యోగా చేస్తుంటే.. చూస్తూ మురిసిపోతాడు. అరవై వేల మందికి యోగా నేర్పించిన ఈ పెద్దాయనను చూసి అరవై ఏళ్ల ఆయన వయసే చిన్నబోయింది..

'సార్, నా కడుపులో ఒక్కటే మంట...'
'మీరు పిజ్జా తింటారా..?'
'తినని రోజే లేదు. బాగా లాగిస్తా.. '
'గోడలకు సినిమా వాల్‌పోస్టర్లను దేంతో అతికిస్తారో తెలుసా..?'
'మైదాపిండితో..'
'పిజ్జాను కూడా ఆ మైదాతోనే చేస్తారు. అందుకే మీ కడుపులో సినిమా ఆడేస్తుంటుంది..'
'అమ్మో, ఈ రోజు నుంచే పిజ్జా మానేస్తా!'

*** 'సార్, నన్ను గ్యాస్ట్రిక్ సమస్య వేధిస్తోంది..?'
'బిర్యానీ తింటూ, కూల్‌డ్రింక్‌తాగే అలవాటుందా..'
'కూల్‌డ్రింక్ లేనిదే నోట్లోకి ముద్ద దిగదు సార్..'
'బాగుంది. ఓ రోజు నువ్వు తాగే కూల్ డ్రింక్‌ను మీ పెరట్లోని మొక్కలకు పిచికారి చెయ్యి. వారం తర్వాత చూడు. ఒక్క పురుగుపడితే ఒట్టు..' 'అంటే, కూల్‌డ్రింక్ ప్రాణుల్ని చంపేంత ప్రమాదకరమా.. వామ్మో, ఇక నుంచి తాగనే తాగను..'

*** మీకు జబ్బు వస్తే ఎంత పెద్ద డాక్టర్ దగ్గరకైనా వెళ్లండి. గురి కుదిరే మందులు రాస్తే రాస్తాడు కానీ, మీకు జబ్బు ఎందుకు వచ్చిందో ఇంత సులువుగా చెప్పి.. మీ తప్పును అక్కడికక్కడే మీతోనే ఒప్పించి మాన్పించలేడు. అరవై ఏళ్ల ప్రకాష్‌రావు మాత్రం డాక్టరు కాకపోయినా మీ వ్యసనాలను మీ ద్వారానే మీకు చూపించి సిగ్గుపడేలా చేస్తారు.

మారుమాట మాట్లాడకుండా ఆ క్షణం నుంచే మాన్పించేలా చేస్తారు. అదే ఈ యోగా మాస్టారు ప్రత్యేకత. లేకపోతే అరవై వేలమంది గుండెల్లో యోగముద్ర ఎలా వేయగలిగేవాడు..? రిటైరయ్యాక ఇంట్లో కాలక్షేపం చేయకుండా హైదరాబాద్‌లోని పార్కులన్నీ తిరుగుతూ ఆరోగ్యానికి సింహాసనాలు వేస్తున్నారు. పదిహేనేళ్ల నుంచి యోగా నేర్పిస్తూ.. ఆరోగ్య సైన్యాన్ని తయారు చేస్తున్నారు.

-యోగా ఎందుకు మంచిదంటే..
- జిమ్‌లో వ్యాయామం చేస్తే 13 నుంచి 14 జాయింట్లు కదులుతాయి.
-వాకింగ్ చేస్తే 27 జాయింట్లు కదులుతాయి.
-స్విమ్మింగ్ చేస్తే 100 జాయింట్లు కదులుతాయి.
-యోగా చేస్తే మాత్రం శరీరంలోని 360 జాయింట్లూ కదులుతాయి. అంతే కాదు. అస్థిరంగా ఉన్న మనసును స్థిరంగా ఒకేచోట బంధించడం యోగాతోనే సాధ్యం.

"ఇప్పటికి 60 వేల మందికి రూపాయి ఫీజు తీసుకోకుండా యోగా నేర్పించాం. ఆరోగ్య చైతన్యం తీసుకొచ్చా. వాళ్లందరి అభిమానాన్ని సంపాదించుకున్నాం''

మన్యం రోగాల నుంచి..
విశాఖపట్టణం నుంచి అరకు దాటిన తర్వాత మాచ్‌ఖండ్ జలపాతం వస్తుంది. అక్కడే ప్రకాష్‌రావు నాన్న రామశర్మ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌కు లీడర్‌గా ఉండేవారు. మన్యంలో తాగే నీరంతా కలుషితం. కుటుంబమంతా జబ్బులు పట్టుకున్నాయి. చేసేది లేక హైదరాబాద్ మకాం మార్చేశారు. ప్రకాష్‌రావు ఇక్కడే సైక్లో స్టయిల్ మెకానిక్‌గా 15 ఏళ్లు పనిచేశారు.

ఇద్దరు పిల్లలను బాగా చదివించారు. అనుకోకుండా ఓ రోజు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఎవరో చెబితే యోగాలో చేరి, ఆరోగ్యం బాగు చేసుకున్నారు. ఆ అనుభవమే వేలమందికి యోగాపాఠాలు బోధించేలా చేస్తోంది ఆయన్ని. ఆధునిక జీవనశైలిలో ఒత్తిళ్లను అధిగమించలేక నలిగిపోతున్న వారికి ఆయన యోగ ్దదిక్కుగా మారాడు. "మనకు 4,500 రోగాలు వస్తున్నాయి. వీటిలో మానసిక ఒత్తిళ్ల వల్ల వస్తున్నవే ఎక్కువ. ఒత్తిడిని తగ్గించే విశ్రాంతి లేదు.

ఉరుకులు, పరుగులు. అనవసర ఉద్వేగాలు, ఆందోళనలు. మనసు ఒక చోట, శరీరం ఒక చోట. అందుకే బ్రెయిన్ రిలేటెడ్ జబ్బులొస్తున్నాయి..' అంటారాయన. ఆస్పత్రి అవసరం లేకుండా వీటిని యోగాతోనే బాగు చేసుకోవచ్చు. అందుకే ఆయన యోగాను సాధ్యమైనంత మందికి ఉచితంగా నేర్పించాలనుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా భారతీయ యోగా సంస్థాన్‌ను నెలకొల్పిన ప్రకాష్‌లాల్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు ప్రకాష్‌రావు.

"మా సంస్థ తరఫున హైదరాబాద్‌లో 50 యోగా సెంటర్లు నడుస్తున్నాయి. రోజూ తెల్లవారుజామునే అన్ని పార్కులు యోగాతో కళకళలాడాలి. అదే నా ఆశయం. ఇప్పటికి 60 వేల మందికి రూపాయి ఫీజు తీసుకోకుండా యోగా నేర్పించాం. ఆరోగ్య చైతన్యం తీసుకొచ్చా. వాళ్లందరి అభిమానాన్ని సంపాదించుకున్నాం. గొప్ప దానాలలో ఆరోగ్యదానం కూడా ఒకటి.

మా ఇద్దరు పిల్లలు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఇంట్లో ఉండి నేనేం చేయాలి..? అందుకే యోగానే జీవితమైపోయింది...'' అంటున్న ప్రకాష్‌రావు తమ దగ్గర యోగా నేర్చుకున్నవాళ్లనే టీచర్లుగా నియమిస్తున్నారు. ఇలా 150 మంది యోగా టీచర్లను తయారు చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని పార్కుల్లో క్లాసులు ఏర్పాటు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నా ఆయన రవ్వంత కూడా అలసిపోరు. ద్విచక్ర వాహనంలోనే నగరమంతా కలియదిరుగుతూ ఏ పార్కు అనుకూలంగా ఉంటే అక్కడ యోగా క్లాసులకు ప్రాణం పోస్తున్నారు.

శ్వాసను బట్టే ఆయుష్షు
- కుక్క నిమిషానికి 30 సార్లు గాలిని తీసుకొని వదులుతుంది. అందుకే 15 ఏళ్లే బతుకుతుంది.
-తాబేలు నిమిషానికి 5 నుంచి 6 సార్లే గాలిని తీసుకొని వదులుతుంది. అందుకే 400 ఏళ్లు జీవిస్తుంది.
-మనిషి యోగా చేస్తే నిమిషానికి 12 సార్లు గాలిని తీసుకొని వదిలేస్థితికి వస్తాడు. అప్పుడు నూరేళ్లు నిండు ఆరోగ్యంతో బతకగలుగుతాడు.

వీటికి భలే డిమాండ్
- ఒత్తిడితోనే హైపర్‌టెన్షన్ వస్తుంది. మధుమేహం, బీపీ వస్తాయి. ఇలాంటి వారు నావాసనం వేస్తే మధుమేహం, బీపీ, థైరాయిడ్ సమస్యలు వేగంగా తగ్గిపోతాయి.
- ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు వజ్రాసనం వేస్తే వెన్నెముక వజ్రంలా తయారవుతుంది. వెన్నునొప్పులు దరిచేరవు. ఇన్సులిన్‌ను కంట్రోల్ చేస్తుంది.
-అధిక బరువుతో బాధపడేవారికి హస్తపాద ఉత్థాన ఆసనం మంచిది. బొజ్జ, ఒబేసిటీ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

యోగా ఏకైక మార్గం..
ఆధునిక కాలంలో ఒత్తిడి తెచ్చే అనర్థాలు అన్నీఇన్ని కావు. సకల రోగాలకు ఒత్తిడే కారణం. "ఇప్పుడు జనం మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేకే యోగాను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాయామంలో ప్రాణశక్తి ఉంది. సాధారణ పరిస్థితుల్లో శ్వాస తీసుకున్నప్పుడు కంటే ప్రాణాయామం చేసినపుడు 10 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ప్రతి కణానికి ఆక్సిజన్ అందినపుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరం గట్టిగా తయారవుతుంది..'' అన్నారు. "శ్వాసను నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదిలితేనే ఆయుష్షు పెరుగుతుంది. పవర్ యోగా అంటూ పతంజలి యోగశాస్త్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు. మేము మాత్రం శాస్త్రీయ పద్ధతుల్లోనే బోధిస్తున్నాం. ఏ కాలానికైనా యోగా ఒక్కటే. యోగాను పదిమందికి ఉచితంగా పంచాలనుకొనేవారు ముందుకొస్తే మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఆరోగ్యవంతమైన సమాజమే మా లక్ష్యం..'' అంటున్నారు ప్రకాష్‌రావు.

ఉపాహారం.. ఇలా తీసుకుందాం

'హెవీగా ఫుడ్ తీసుకోవడం వల్ల విపరీతంగా లావెక్కుతున్నామని ఉపాహారం(స్నాక్స్)తో సరిపుచ్చుతుంటే... బరువు మాత్రం తగ్గడం లేదు'. ఇది మనకు కామన్‌గా నగరవాసుల నుంచి వినిపించే మాట. వాస్తవానికి స్నాక్స్‌ను ఎక్కువ పరిమాణంలో లాగించేయడమే దీనికి కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు. భోజనం ముందు, తర్వాత తీసుకునే ఉపాహారం క్రమపద్ధతిలో ఉంటే బరువు తగ్గడం, ఆరోగ్యం కాపాడుకోవడం చాలా సులువు అంటున్నారు. వయసురీత్యా స్నాక్స్‌ని ఎలా తీసుకోవాలి, ఏ ఏ రూపాల్లో, ఎలాంటి సమయంలో తీసుకోవాలనేది పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

పన్నేండేళ్లలోపు చిన్నారులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. వారికి స్నాక్స్ ఇవ్వాల్సి వస్తే తాజా పండ్లను ముక్కలుగా కోసి ఇవ్వాలి. నట్స్‌రూపంలోనూ స్నాక్స్ ఇవ్వొచ్చు. వీటినే కాస్త రోస్ట్ చేసి ఇస్తే ఆ రుచే వేరు. ఒక వేళ చిన్నారులకు శాండ్‌విచ్ ఇష్టమైతే మధ్యలో ఫ్రూట్ ముక్కలుంచి ఇస్తే సరిపోతుంది. జంక్‌ఫుడ్ తగ్గించేందుకు ఇదో మార్గం. ఉడికిన పచ్చి బఠాణీలు, అటుకుల మిక్చర్, ఫ్రూట్‌జెల్లీ కూడా చిన్నారులతో తినిపించవచ్చు. ప్రోటీన్స్, కాల్షియం కాంబినేషన్స్‌తో స్నాక్స్ ఇస్తే మంచిది.

పన్నెండేళ్లు దాటిన వారికి
ఈ వయసు పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్‌తో కూడిన ఆహారం చాలా కీలకం. డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాల్లో ప్రొటీన్లు కావాల్సిన మోతాదులో లభిస్తాయి. సెనగలు, పెసలు లాంటి సంప్రదాయ స్ప్రౌట్స్‌ని ఇస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది. యుక్త వయసు వారికి పిజ్జా, బర్గర్లపై దృష్టి ఉంటుంది. వాళ్ల టేస్ట్‌కి తగ్గట్టుగా వెజిటబుల్ కట్‌లెట్‌ని ఇస్తే మేలు.

ఈ వయసులో కాల్షియం కూడా అవసరం. సాయంత్రం వేళల్లో స్నాక్స్‌కి బదులుగా మిల్క్‌షేక్స్ లాంటివి తీసుకోవచ్చు. పిజ్జా రూపంలో అయితే తక్కువ కొవ్వున్న చీజ్ ఇవ్వొచ్చు. సాధారణ బరువు ఉండే వారికి వారానికి ఒకసారి చీజ్, సోయా పన్నీర్ ఇవ్వడం మంచిది. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఇది అవసరం లేదు. ఉదయం అల్పాహారం మొదలుకొని లంచ్, డిన్నర్‌తోపాటు మనం తీసుకునే స్నాక్స్ క్యాలరీలు రెండు వేలకు మించకూడదు. ఒకవేళ స్నాక్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తే... మెయిన్ మీల్ తగ్గించుకోవాలి.

టీనేజర్స్ ఇలా తీసుకుంటే చాలు
సమయానికి భోజనం చేయకపోవడం యుక్త వయసు వారిలో ఉండే ప్రధాన సమస్య. ఉదయం టిఫిన్ మొదలుకొని రాత్రి భోజనం వరకు ఏదీ సమయానికి తీసుకోరు. ఇలాంటివారు ఒకేసారి ఆకలితో హెవీ మీల్స్ చేయడం వల్ల అధిక బరువు పెరుగుతారు. వీరు చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి. బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ రూపంలో తాజా పండ్లను తీసుకోవాలి. దీంతో కావాల్సినన్ని క్యాలరీలు లభిస్తాయి. కడుపు నిండినట్లు ఉంటుంది.

మధ్యాహ్న భోజనం తరువాత కూడ ఇదే చేయాలి. మొలకెత్తిన విత్తనాలు, ఫ్యాట్ తక్కువగా ఉండే మజ్జిగ, ఇతర మిల్క్‌షేక్స్, ఫ్లేవర్ మిల్క్‌లాంటివి తీసుకోవాలి. సాధారణంగా మహిళలు 30 ఏళ్లు, పురుషులు 35 ఏళ్లు దాటిన తరువాత బరువు పెరగడం మొదలవుతుంది. అది ఊబకాయానికి దారి తీయవచ్చు. క్రమేణా రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతలకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలోనే నోటిని అదుపులో ఉంచుకోవాలి.

బ్యాలెన్స్ తప్పితే అధిక బరువుతో బాధపడాల్సి వస్తుంది. బరువులేని వారు తగినంత బరువు పెరగాలంటే... మెయిన్‌మీల్‌తో పాటు పాప్‌కార్న్, మరమరాలు, చాక్లెట్ ఫ్లేవర్స్, కొవ్వు పరిమాణం తక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవాలి. బేకరీ ఐటమ్స్‌లో మైదా ఎక్కువగా ఉంటుంది. వీటిని చిన్నారులకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వయసు పైబడిన వారు
వయసుపెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గుతుంది. బీపీ, షుగర్ దరిచేరుతుంది. దీంతో జీర్ణశక్తి సన్నగిల్లుతుంది. పెరిగే వయసురీత్యా స్నాక్స్ రూపంలో బొప్పాయి, దానిమ్మ పండ్లు, కీర దోస, క్యారెట్లు తీసుకోవడం మేలు. ఆహారంలో విటమిన్-ఎ, సి ఉండేటట్లు చూసుకోవాలి. ఓట్స్, బిస్కెట్స్‌లాంటివి కూడా తీసుకోవచ్చు.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. స్నాక్స్ సరైన సమయంలో తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తిన్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తీసుకోవాలి. లంచ్ ఒంటి గంటకు ముగిస్తే 4 గంటల సమయంలో మళ్లీ స్నాక్స్ తీసుకోవాలి. రాత్రి 8 గంటల్లోగా డిన్నర్ తప్పకుండా ముగించాలి. ఈ విధంగా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Thursday, July 8, 2010

కురులు చూడతరమా!

జుట్టు అందానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ప్రతీక. అయితే అలాంటి ఆరోగ్యమైన అందాన్ని పొందేందుకు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టమంటే మీ జుట్టు పోషణ, దానికి తీసుకోవాల్సిన ఆహారం శ్రద్ధ చూపడం, కొన్ని జాగ్రత్తలు పాటించడం మాత్రమే. కొద్దిపాటి శ్రద్ధ మీ జుట్టును బలంగా, ఒత్తుగా, నిండుగా ఉండేలా చేస్తుంది. పలువురిలో మీ ప్రత్యేకతను చాటుతుంది.

hair-style- శిరోజాలు పెరగాలంటే ముఖ్యంగా పోషకాహారం తీసుకోవాల్సి వుంటుంది.
- పొడవాటి జుట్టును ఇష్టపడేవారు, మరింత పొడవు జుట్టు కావాలనుకునే వారు ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నా ఆహారం తీసుకోవాలి.
- పాల పదార్థాలు, గుడ్లు, పప్పు, మజ్జిగ, ప్రొటీన్ల క్యాల్షియం, ఆకు కూరలు, క్యారెట,్‌ చికెన్‌, పనీర్‌, మామిడికాయలు, ఆప్రికాట్‌, మొలకధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందుతాయి.
- జీవనశైలి కూడా జుట్టుమీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వ్యాయామంపై శ్రద్ధచూపాలి.
- ఒక వేళ జుట్టు విపరీతంగా రాలిపోతుంటే కుదుళ్లను బలోపేతం చేసే ట్రీట్‌మెంట్‌ని బ్యూటీపార్లర్‌లో చేయించుకోవచ్చు.
- చుండ్రు ఉన్న వారు ఒక టీ స్పూన్‌ నిమ్మపండు రసాన్ని రెండు టీ స్పూన్‌ల వెనిగర్‌ని కలిపి దానితో తలని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
- ఎండలో బయటికి వెళ్లినపుడు సన్‌స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ఉన్న ఉత్పత్తులను వుపయోగించుకోవచ్చు.
- తలస్నానం చేసిన తరువాత పావుగంట సేపు చిన్నగా వేళ్లతో మసాజ్‌ చేసుకోవాలి.
- చిక్కులతో చిందరవందరగా ఉండే జుట్టు గల వారు గుడ్డులో పచ్చసొనతో మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. అరగంట సేపు ఆగి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తలను మొత్తటి టవల్‌తో జుట్టుని రుద్దేస్తూ తుడుచుకోకుండా, మృదువుగా మెల్లగా తుడవాలి.
gopika- చుండ్రు సమస్యలు ఉన్నవారు సెలీనియా, సలె్ఫైడ్‌ లేదా స్యాలి సిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాంపులను వాడాలి.
- మార్కెట్‌లో తల స్నానానికి సబ్బులూ అందుబాటులో ఉంటాయి. అయిలీ వెంట్రుకలు గల వారు మాత్రమే వారానికి ఒక్క సారి సబ్బులను వాడాలి.
- తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు చిట్టిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి.
- కమలాపండు రసం తీసుకుని, కొన్ని చుక్కల చందనపు నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలను కలిపి మిశ్రమంగా చేయాలి. షాంపూ స్నానం తరువాత ఈ మిశ్రమాన్ని వుపయోగించి జుట్టుపై జారుగా పోయాలి.
- జుట్టు విడిపోతున్నట్లుగా ఉండేవాళ్ళు కొబ్బరినూనెలో తాజా నిమ్మకాయరసం కలిపి జుట్టుకి ‚పట్టిస్తే ఫలితముంటుంది.
- జుట్టుకి మంచి షాంపూ కండీషనర్‌లు రాస్తూ శ్రద్ధ తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవడం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు మంచి సమతులాహారం కావాలి. కీరదోస, దోస వంటివి ఎంతో మేలు చేస్తాయి.

ఆనందమే.. అందం..!

అందం కోసం మహిళలు తరచూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా వారి ఆహారపు అలవాట్లలోనూ మార్పులు, చేర్పులూ చేసుకుంటుంటారు. అయినప్పటికీ తమ అందం మరింతగా పెరగాలని, ఇతరులు తమ అందాన్ని ప్రశంసించాలని కోరుకుంటారు. దీనికి వారు మంచి ఆహారం తీసుకోవడంతోపాటు ఆనందంగానూ వుండాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఆరోగ్యంగా వుండాలంటే..

Happy-Womanఅందంగా వుండాలంటే ముందుగా ఆరోగ్యం గా వుండాలి. ఆరోగ్యంగా వుండేందుకు పోషక విలువలు కలిగిన ఆహారం తీసు వాల్సివుంటుంది. వీలైనంత వరకు నూనెతో కూడుకున్న ఆహారపదా ర్థాలకు దూరంగా వుండేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆహారంలో రైస్‌తో చేసే పదార్థాలు తక్కువగా వుం డేలా చూసుకోవాలి. తీసుకునే ఆహా రంలో పోషక విలువలుండేలా చూసుకో వాలి. కార్పొహైడ్రేట్‌లు తక్కువగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆహారంలో ముఖ్యంగా పీచు పదార్థా లుండేలా చూసుకోవాలి. మాంసా హారు లైతే కోడిగుడ్డు లోని తెల్లసోన మాత్రమే తీసుకోవాలి. కోడి కూర, చేపలు తప్పనిసరిగా తీసుకోవ చ్చు. పొట్టేలు, మేమాంసం కు దూరంగా వుండటమే మంచిది.

సంతోషంగా వుండేందుకు..
ఆరోగ్యంగా వుండేందుకు ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకున్నాం. కాని దీంతో పాటు అందంగా వుండేందుకు సంతోషంగానూ వుండాలి. సంతోషంగా వుండేందుకు ప్రశాంత వదనంతో ఉండేందుకు ప్రయత్నించాలి. మీ చుట్టుపక్కల వున్న వారి గురించి కూడా కాస్త పట్టించుకోవాలి. వారు సంతోషంగా వుంటే మీరు కూడా సంతోషంగా వుండగలరు. మీ కార్యాలయంలో లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్లతో వీలైనంత వరకు సరదాగా వుండేందుకు ప్రయత్నించాలి. సమస్యల్లో వున్న వారికి మీకు తోచిన సాయం చేసేందుకు ప్రయత్నించాలి.

సమస్యలు అనేవి ప్రతి ప్రాణికి వుంటాయి. కాని మనిషికి మరీ ఎక్కువగా వుంటాయి. ఇందులోనూ సంతోషంగా వుండేందుకు స్వతహాగా ప్రయత్నిస్తే సమస్యలు అనేవి దూరమయిపోతాయి. పైగా మానసికపరమైన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మానసికపరమైన ఒత్తిడి శరీరంలో ఉండదో అప్పుడు మీ అందం ద్విగుణీకృత మౌతుందంటున్నారు సౌందర్య, మానసిక నిపుణులు.

happy_womanఒత్తిడి తగ్గించుకునేందుకు..
బత్తిడిని నియంత్రించుకోవడానికి తరచూ స్పాకు వెళ్లండి. వీలైతే వారానికి ఒకసారి శరీరానికి మసాజ్‌ చేయించుకోవడానికి ప్రయత్నించొచ్చు. పగలంతా బాగా పనిచేసి అలసిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు మీకు నచ్చిన సంగీతాన్ని వింటూ నిద్రకు ఉప్రకమించొచ్చు. దీంతో శరీరంలోని అలసటతోపాటు మానసికపరమైన ఒత్తిడి కూడా తగ్గి నిద్రబాగా పడుతుంది. వీలైతే కనీసం మూడు నెలలకు ఒక సారి పర్యాటక ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి. పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా తయారవ్వొచు. ఎప్పుడైతే ఉత్సాహంగా ఉల్లాసంగా వుంటారో అప్పుడు మీరు మరింత అందంగాకనబడే అవకాశాలు వున్నాయంటున్నారు నిపుణులు.

వ్యాయామంతో ఆరోగ్యం

ప్రతి రోజూ ఓ గంట లేదా అరగంట పాటు సేపు చేసే వ్యాయామం ఎన్నో రోగాలను దరి చేయనీయకుండా కాపాడుతుంది. చిన్న చిన్న వ్యాధుల నుండి, అసాధారణ వ్యాధుల వరకూ వ్యాయామం చేసే వారి దగ్గరకు రావా లంటే కాస్త జంకుతాయి. ఎందుకంటే వ్యాయామంతో శరీరంలోని ప్రతి అవ యవానికి ఎంతో లాభం చేకూరుతుంది. అది రోగాలను దూరంగా వుంచడంలో సాయపడుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని ఏ ఏ భాగానికి ఏవిధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

గుండె :
yoga క్రమం తప్పకుండా చేసే వ్యాయామం హై బ్లడ్‌ ప్రెషర్‌ రాకుండా నిరో దిస్తుంది. లోబీపీ ఉన్న వారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేందుకు డాక్టర్‌ సలహా మేరకు వ్యాయామాన్ని ఆశ్రయించవచ్చు. అధి శాతం హై కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ హృద్రోగాలకు, హార్ట్‌ ఎటాక్‌లకు మూలకారణంగా నిలు స్తాయి. క్రమం తప్పని వ్యాయామం ద్వారా వీటికి దూరంగా వుండొచ్చు. వ్యాయామం చేసే వారితో పోలిస్తే వ్యాయామం చేయని వారిలోనే గుండె సంబంధిత వ్యాధులకు ఎక్కువగా అవకాశం వుంటుంది.

ఎముకలకు బలం : వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనమ వుతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌ దశ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇతరత్రా కూడా శరీరం బలహీనం కావడం వంటి కారణాల వల్ల కింద పడి ఎముకలు విరగొట్టుకునే అవకాశం వుంటుంది. వ్యాయామం చేసే వారితో పోలిస్తే, వ్యాయామం చేయని వారిలోనే ఈ రక మైన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం కండర పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఎముకలు కాల్షి యాన్ని నిలిపి వుంచుకునేలా చేస్తుంది. శరీరం శక్తిని కోల్పోకుండా చూస్తుం ది. తద్వారా సాధారణ ప్రమాదాల బారిన పడే అవకాశాన్ని ఒక వేళ ప్రమాదా లకు గురైనా వాటి తీవ్రతనూ తగ్గిస్తుంది.

మధుమేహం :
మధుమేహంతో బాధపడేవారికి ఇచ్చే చికిత్స ఫలితం రోగుల స్థూల కాయం తదితర అంశాల కారణంగా ప్రభావితం అవుతుంది. ఈ నేప థ్యంలో చికిత్స తీసుకునే వారు బరువు తగ్గితే చికిత్స ప్రభావ పూరితంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మైల్డ్‌ డయాబెటిస్‌ను మందు ద్వారా కన్నా కూడా ఆహారం, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం సులభం.

క్యాన్సర్‌ :
శారీరకంగా చురుగ్గా ఉండని వారిలో పెద్దపేగు సంబంధిత క్యాన్సర్‌ వచ్చే అవకాశం అధికంగా వుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, లైంగిక అవయవాల సంబంధిత క్యాన్సర్లు క్రీడాకారిణులకు రావడం తక్కువే.

ఆహారంతో.. ఐరన్‌

శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్‌ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమగ్లోబిన్‌ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా అది రక్తహీనతకు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇనుము లోపం. ఎందుకంటే ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం, విటమిన్‌ బి12 వంటి పోషకాలు కావాలి. ఇవి లోపిస్తే రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య తలెత్తకుండా వుండాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. శరీరానికి అవసరమైన ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.

iron-in-vegitablesవీటిలో ఐరన్‌ పుష్కలం....
చేపలు, కోడిగుడ్లు, కాలేయం, బీట్‌రూట్లు, పండ్లు, ములక్కాడల్లో ఇనుము అధికంగా వుంటుంది. వీటిని తరుచుగా తీసుకోవాలి.
విటమిన్‌-సి ఉన్న ఆహారం తరచుగా తీసుకుంటుండాలి. సి-విటమిన్‌ ఇనుము శోషణ రేటును పెంచుతుంది. జామపండ్ల వంటివి తీసుకుంటే ఆహారంలోని ఇనుమును శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది.
అన్నం లేదా ఏదైనా తిన్న తరువాత టీ, కాఫీ వంటివి తీసుకుంటే అవి మనం తిన్న ఆహారంలోని ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. కాబట్టి కనీసం రెండు గంటల సమయం తరువాత టీ, కాఫీలు తీసుకోవాలి.
చిరుధాన్యాల్లో ఐరన్‌తో పాటు సూక్ష్మ పోషకాలన్నీ తగు మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా సజ్జలు, రాగుల్లో ఇనుము అధిక మోతాదులో ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

ఆకు కూరలు...
అన్నం, పప్పు, ఆకుకూరలను బాగా ఉడికించి, మెత్తగా, మృదువుగా తయారు చేసి తినాలి. మసాలాలు, కారం ఎక్కువగా ఉండకూడదు.
సజ్జల వంటి చిరుధాన్యాలను మొదట రోస్ట్‌ చేసి, పొడిగా తయారుచేసి, మెత్తని పేస్టు రూపంలో తీసుకుంటే సులువుగా జీర్ణం అవుతాయి.
చిన్న పిల్లల్లో ఇది నివారించాలంటే శిశువుకు ఆరు నెలల వయసు వచ్చే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆరునెలల నుంచి తల్లి పాలతో పాటు ఇంట్లోనే తయారు చేసిన కాంప్లిమెంటరీ ఫుడ్‌ ఇవ్వాలి. ఒక్కోక్కటి మెల్ల మెల్లగా అలవాటు చేయాలి.
అన్నం, పప్పు, కూరగాయలు మఖ్యంగా ఆకుకూరలు, కొత్తిమీర, టమాటా, క్యారెట్లు ఎక్కువగా తీసుకుంటే ఇనుము లోపం తలెత్తే అవకాశమే ఉండదు.
సాధారణంగా బయట దొరికే కాంప్లిమెంటరీ ఆహారంలో ఇనుము తగినంత ఉండదు. వాటిని తీసుకోకపోవడమే మంచిది.

కాల్షియం ఇనుము కలపొద్దు...
ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను ఎదుర్కోవచ్చు. టాబ్లెట్ల రూపంలో ఐరన్‌ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మలేరియా వంటి ఇన్ఫెక్షన్లు ఉంటే అవి పూర్తిగా తగ్గిన తరువాతే ఈ మందులను వాడాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్లు మరింత బలోపేతం అవుతాయి.
కాల్షియం, ఇనుము సప్లిమెంట్లను కలిపి తీసుకోకూడదు. రెండింటికి మధ్య కనీసం రెండుగంటల వ్యవధి ఉండాలి.
ఇవి రెండూ ఒక దానితో ఒకటి చర్య జరిపి ఏవీ పనికి రాకుండా పోతాయి.
అయితే చికిత్స గురించి ఆలోచించే కన్నా సమస్య మొదలవకుండా ఎప్పుడూ తగినంత ఇనుము ఉండే పోషకాహారం తీసుకోవడం మేలు.

ఉప్పులో ఇనుము...
పేద, ధనిక తేడా లేకుండా అందరూ వాడే వస్తువు ఉప్పు. అందుకే ఉప్పును ఎంచుకున్నారు.
అయోడైజ్‌ ఉప్పు మాదిరిగా ఉప్పులో ఇనుము కూడా కలుపుతున్నారు. దీనిలో ఇనుము అయోడిన్‌ సమాన పరిమాణంలో ఉంటాయి.
అయితే రెండేళ్ళ కన్నా తక్కువ వయసు పిల్లలకు ఇది ఉపయోగకరం కాదు.
భవిష్యత్తులో మనం రోజూ తినే అన్నం ద్వారా కూడా ఇనుము పొందగలిగే రోజు రానుంది. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా ఇనుము శాతాన్ని పెంచి, ఫైటేట్స్‌ పరిమాణాన్ని తగ్గించి జన్యుపరివర్తిత బియ్యాన్ని తయారు చేస్తున్నారు.
జాతీయ పోషకాహార సంస్థ నేషనల్‌ అనీమీయా కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం సప్లిమెంట్లను సరఫరా చేయాలని సంకల్పించింది. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారానికి ఒక ట్యాబ్లెట్‌ చొప్పున చిన్నారులకు అందివ్వగలిగితే చాలా వరకు ఇనుము లోపాలను అధిగమించవచ్చు. ఒక్కో ఐరన్‌ ట్యాబ్లెట్‌లో వంద మిల్లీగ్రాముల ఐరన్‌, 0.5 మిల్లీగ్రాముల ఫోలిక్‌ ఆమ్లం ఉంటాయి.