మనం తీసుకునే ఆహారంలో నూనె, మసాలా దినుసులు, పాచిపోయిన ఆహారం లేదా హెవీ డైట్ కారణంగా మనసులో కామ, క్రోధాలు, ఒత్తిడి తదితరాలు పెరిగిపోతాయట. ఆకలికి మించి ఎక్కువగా తీసుకోవడం, లేదా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు వైద్యులు.
ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి అందడంతో పాటు ఉత్సాహంగాను ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్లనే శరీరానికి శక్తి, బలం వస్తుందనుకోవడం పొరబాటు. మనం తీసుకునే ఆహారం ఏ మేరకు జీర్ణమయ్యిందనే విషయం తెలుసుకోవాలి. పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం యువత అందులోనూ మహిళలు సరైన ఆహారం తీసుకోవడం లేదనేది వైద్యనిపుణుల అభిప్రాయం.
కొంతమంది యువతులు మాత్రం సమయానికి ఆకలి తీర్చుకుంటున్నప్పటికీ ముఖ్యంగా దారి లో ఏది కనపడితే అది తినేయడం లేదా టీ, స్నాక్స్తోనూ ఓ పూట గడచిందనుకుం టున్నారట. దీంతో వారు తీసుకునే ఆహారం జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి వారు సరైన ఆహారం తీసుకోకపోవడం మూలంగా తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు అంటున్నారు.
కొంత మంది ఆహారం తీసుకోవడానికి ఎలాంటి సమాయాన్ని అనుసరించరు. ఒకరోజు ఒక సమయంలో తీసుకుంటే మరోరోజు మరో సమయంలో తీసు కుంటారు. కానీ అలా కాకుండా తీసుకు నే ఆహారానికి నియమిత సమయం తప్పకుండా ఉండాలి. ఉదయం అల్పా హారం తప్పనిసరిగా తీసుకోవాలం టు న్నారు వైద్యులు. అల్ఫాహారం తరువాత ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య లో భోజనం తీసుకోవాలి. దీంతో పగ లంతా పనిచేసేందుకు శరీరానికి కావల సిన శక్తి లభిస్తుంది. కొందరేమో ఉద యం పూట టీ ఆల్ఫాహారం తీసు కుంటారు. తర్వాత ఏకంగా రాత్రి పూట భోజనం తీసు కుంటారు.
మరికొంతమంది అల్ఫాహారానికి, బోజనానికి మ ద్య సమయం ఉంచరు. ఒకటి తర్వాత ఒకటి తినేస్తారు. దీంతో ఆరోగ్యం పాడవు తుంది. పగటిపూట తీసు కునే ఆహారం శారీరక శ్రమననుసరించి ఉండాలట. రాత్రిపూట తీసుకునే ఆహారం మాత్రం తేలికపాటి భోజనం, లేదా జీర్ణ మయ్యే టువంటి ఆహారాన్ని మాత్రమే తీసు కోవలంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకోవడానికి తప్పకుండా సమయాన్ని పాటించాలి. తీసుకునే ఆహారం కొద్దిపాటిదైనా సమయానుసారం తీసుకోవాలి. సమయానుకూలంగా ఆహారం తీసుకోకపోవడం మూలంగా అది జీర్ణవ్యవస్థ, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సమయానుసారంగానే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.దీంతో శరీరంలోని జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆహారాన్ని ఎలా తీసుకోవాలి
ప్రతిరోజు ఆహారాన్ని తీసుకునే ముందు చేతులు, కాళ్లు, నోరు శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసే టపుడు తూర్పు లేదా దక్షిణ దిక్కును చూస్తున్నట్లు కూర్చోవలట. దీంతో ఆయుష్షు, కీర్తిప్రతిష్టలు పెరు గుతాయని పెద్దలు చెబుతుంటారు. చెప్పులు తొడుక్కుని, నిలబడి ఆహారం తీసుకోవడం మంచిది కాద న్నది వారి అభిప్రాయం.భోజనాన్ని బాగా నమిలి తినాలి లేకుంటే దంతాలు చేయాల్సిన పనిని పేగులు చేయాల్సివస్తుందట.
రుచికోసం కాకుండా ఆరోగ్యం కోసం మాత్రమే బుజించాలని, ఆహారం చాలా రుచిగా ఉందని ఎక్కువ లాగిస్తే దుష్పరిణామాలు తప్పవంటున్నారు వైద్యులు. భోజనం చేసిన వెంటనే నీళ్లు, టీ తాగడం, పరుగెత్తడం, కూర్చోవడం, పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదట. భోజనం చేసిన తర్వాత కాసేపు అటుఇటూ ఆరోగ్యానికి ఆనందదాయకం అంటున్నారు నిపుణులు. మంచి ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేదంటే అనారోగ్యాల పాలవ్వడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు.
No comments:
Post a Comment