Monday, October 4, 2010

డయాబెటిస్, అధిక రక్తపోటు నియంత్రణలో మాత్రల కంటే బీన్స్ బెటర్ .......

మీరు డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? వాటి నియంత్రణకు రోజూ మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. డయాబెటిస్‌ను, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో మాత్రల కంటే బీన్స్ నయమని వెల్లడయింది..

రోజూ బీన్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటాయని పరిశోధనల్లో తేలింది. పన్నెండు వారాల పాటు ఆరకప్పు ఉడికించిన బీన్స్ తీసుకున్న ఆరోగ్యవంతుల కొలెస్టరాల్ సైతం 8శాతం మేర తగ్గింది. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్, ఎ1సి లెవెల్స్ పై బీన్స్ ప్రభావం చాలా ఉంటోంది.

బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో వీటి పాత్ర చాలా ఎక్కువ. అంతేకాకుండా బీన్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. కాబట్టి మీ మెనూలో బీన్స్ ఉండేలా చూసుకుని డయాబెటిస్‌కు, అధికరక్తపోటుకు చెక్‌పెట్టండి.

No comments: