Wednesday, November 10, 2010

బలాన్ని ఇచ్చే బాదం

badam
బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం.

ఎలా వాడితే మంచిది?
వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.

బాదంపాలు: బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.

మంచి టానిక్‌: బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.

కొన్ని సూచనలు: ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.
డాక్టర్‌ గాయత్రీదేవి
ఆయుర్వేద వైద్యనిపుణులు

అలసిన మనసుకు పునరుజ్జీవం ధారా చికిత్స

dhara
ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జీవన వేగం మనిషి పై ఒత్తిడి పెం చుతోంది. ఉన్న దానిలో సంతృప్తి లేక లేని దాని కోసం ఆరాటపడటం అశాంతికి లోను చేస్తోంది. వేగంగా మారుతున్న జీవన వేగాన్ని, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిని మానవుడు అందుకోలేకపోతున్నాడు. దీనితో ఒంటరితనం, తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన, ఆగ్రహం, ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్నాడు.

మనఃశరీరాలు ఎంత అవిభాజ్యమో, పరస్పర ఆధారితమో ఆయుర్వేదం సరి గా కనుగొన్నది. ఉద్వేగాలలో అసమతుల్యత, ఉద్రిక్తత, సంపూర్ణాహారం తీసుకోకపోవడం అనేవి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. త్రిదోషాలలో ఒకటైన వాయు మనసును నియంత్రించి, ప్రోత్సహిస్తుంది. ఉద్వేగభరితమైన వాయు దోషం మనస్సును అతలాకుతలం చేయడం వల్ల భయం, దుఃఖం, నిస్సహాయత, స్తబ్దత, సన్నిపాతం వంటివి ఏర్పడతాయి. మనఃకాయక  పద్ధతికి సంబంధించి స్పష్టమైన వైఖరి కలిగిన తొలి వైద్య విధానం ఆయుర్వేదం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం మానసిక రోగాల వర్గీకరణ ఈ ప్రకారం ఉంటుంది.

dhara2
మానస వికార: అసూయ, భయ, చిత్తోద్వేగ, దైన్య, హర్ష, కామ, క్రోధ, లోభ, మద, మన్న, మోహ, శోక, విషాద, ఈర్ష్య, తమ, అతిప్రలాప, అస్వప్న, అతినిద్ర, భ్రమ.
ఉభయాత్మక మానస వికార: మానస అధిష్ఠాన ఉన్మాద, అపస్మార (epilepsy), అపతాంత్ర (hysteria)ü), అతత్వాభినివేశ (obsessive syndrome), మదత్యయ (alcoholic psychosis)), సన్య (coma)..
శరీర అధిష్ఠాన: కామ జ్వర, క్రోధ జ్వర, భయజ అతిసార, శోకజ అతిసార.
ధారా చికిత్స ప్రాధాన్యత:
పద్ధతి: కేరళీయ పంచకర్మలో ధారా ఒక ప్రత్యేక చికిత్స. ద్రవరూపంలో ఉన్న ఓషధులను నిర్ధిష్ట సమయం పాటు ధారగా శరీరం పై పోసే ప్రక్రియ. ఆయుర్వేద గ్రంథాలు దీనిని మూర్ధ తైల, శేక పరిశేకగా అభివర్ణించారు. దీనిని కేరళ సంప్రదాయ వైద్యులు మరింత మెరుగుపరచి, ప్రయోగాలు చేసి ‘ధారా చికిత్స’లో నైపు ణ్యం సాధించారు. ఇటీవలి కాలంలో కేరళీయ పంచకర్మ పద్ధతులలో ప్రముఖమైనదిగా పేరొందింది. ధారా చికిత్సలో కూడా మూడు రకాలు ఉన్నాయి. అవి:
dhara3
1. మూర్ధాన్య ధార (శిరో ధార)
2. సర్వాంగ ధార (శరీరం మొత్తం)
3. పరిశేక (శరీరంలో ఒక చోట మాత్రమే చేసేది)
మూర్ధన్య ధారే శిరోధారగా ప్రాచుర్యం పొందింది. ద్రవ రూపంలో ఉన్న ఓషధులను నుదిటపై ధారగా పోస్తారు. దీనిని మానసిక రోగాలైన సైకోసిస్‌, పిచ్చి, అపస్మారకం, ఒత్తిడి, ఆందోళన, న్యూరోసిస్‌, అయోమయం, నిద్రలేమి వంటి వ్యాధులకు చికిత్స నిమిత్తం విజయవంతంగా ప్రయోగించారు. అయితే దోషాన్ని బట్టి ఓషధులు మారుతాయి.
శిరోధార రకాలు, సూచనలు:
తక్రధార : గ్లాని, ఓజక్షయ, శిరశూల, హృద్రోగ
క్షీర ధార: అనిద్ర, ఉన్మాద, శిరశూల, ఒత్తిడి
తైల ధార: శిరశూల, మానసిక వ్యాధి
ఘృతధార : అనిద్ర, పిత్త వ్యాధులు
వీటికి అదనంగా నారికేళ జల అరనాల కషాయాలు లేదా శుద్ధమైన నీటిని అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు.

dhara1
ఓషధీ తైలాలను 4-8 ఇంచీల ఎత్తు నుంచి నుదిటిపై ధారగా పడేలా ఏర్పాటు చేస్తారు. వ్యాధిని బట్టి, దోషాన్ని బట్టి 30-90 నిమిషాల పాటు దీనిని కొనసాగిస్తారు.

శిరోగత మర్మాలను ఉత్తేజితం చేయడం, ధ్యానం, చక్రాలను చైతన్యవంతం చేయడం, ధారగా ఓషధులను పోయడం వల్ల ఏర్పడే ఒత్తిడి ప్రభావం, దాని ఫలితాలు మనోవికారాలను నియంత్రించడంలో ఎంత దోహదం చేస్తుందో రుజువు అయ్యాయి.

గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను, ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు.
డా ప్రసాద్‌, ఎం.డి.(ఆయుర్వేద),
డా స్వాతి, ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్‌ మల్టీ స్పెషాలిటీ సెంటర్‌,
101,రామచంద్రనివాస్‌ అపార్ట్‌మెంట్స్‌, 
వెంగళరావ్‌నగర్‌, హైదరాబాద్‌
ఫోన్‌: 93909 57168 / 9666649665 / 09503628150
Prasad _ayur@rediffmail.com
swathi_ayur@rediffmail.com

Saturday, November 6, 2010

అడవిలో ఆసుపత్రి ..... మూలికలే మందులు !

mulikalu5అక్కడ కార్పొరేట్‌ వైద్యానికి సైతం లొంగని వ్యాధులు మటు మాయమవుతాయి. ఆయన హస్తవాసిని చూసి మొండి రోగాలు కూడా తోకముడుస్తాయి. అలా అని ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ వైద్యుడేమీకాదు. ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో ఈ సత్కార్యాన్ని చేపట్టారు. ఇప్పటివరకు కొన్ని వేలమంది రోగులకు వైద్యసేవలందించి వారికి స్వాంతన చేకూర్చిన... చేకూర్చుతున్న ఆ వైద్య‘నారాయణుడే’ జమాల్‌ ఖాన్‌. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని ఓ కుగ్రామం నిమ్మలగూడెంలో... వారసత్వ సంపదగా వచ్చిన వైద్య విధానంతో జమాల్‌ తన ప్రకృతి చికిత్సాలయం ద్వారా ఎంతో మందికి వైద్య సేవ చేస్తున్నాడు. ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితం చెట్లలోని మందు గుణాన్ని క్రోడీకరించింది. ఆయుర్వేదం పరిధిలోకి రాని చెట్టు, మొక్క, తీగ అంటూ ఏదీలేదు. ఆలాంటి అపార వృక్షసముదాయంలోంచి వైద్య సంపదను సృష్టిస్తున్నాడాయన. మన్నెం అటవీ ప్రాంతంలో బీదబిక్కి జనానికి సహజమైన ఓషధులతో తన ప్రకృతి వైద్యశాల ద్వారా సేవ చేస్తున్నాడు. మన రాష్ట్రం నుండే కాక... చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి వచ్చే రోగులకు కూడా తన వైద్య సేవలు అందిస్తున్న జమాల్‌ఖాన్‌... ‘వైద్యో నారాయణో హరి’ అనే ఆర్యోక్తికి అక్షరాల అర్హుడు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చుచేసినా తగ్గని మొండి వ్యాధులను వనమూలికలతో... అదీ ఉచితంగా అందిస్తూ... తన సేవా తత్పరతను చాటుకుంటున్న ప్రకృతి వైద్య నిపుణుడు జమాల్‌ నిస్వార్థ సేవల కథనం.

- మహత్తర వనమూలికలతో మొండి రోగాలకు వైద్యం
- రెండు దశాబ్దాలకు పైబడిన వంశపారంపర్య ఉచిత వైద్య సేవలు
- మూడు రాష్ట్రాల రోగుల ఆశాజ్యోతి ఎండి.జమాల్‌ఖాన్‌
అనాది నుంచి ప్రకృతిలో మమేకమైన మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో ఆ ప్రకృతికి దూరమయ్యాడు. వైద్యరంగం అభివృద్ధి చెందుతున్న కొద్ది మానవుని ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది. అయితే వైద్యరంగంలో అనేక రకాల వైద్య విధానాలతో రకరకాల చికిత్సలు జరుగుతున్నప్పటకీ, అన్నింటికీ మించి, ప్రకృతిలో దొరికే మహత్తర వన మూలికలే మేలైన రోగ వినాశకారులని గుర్తించిన జమాల్‌ఖాన్‌ కుటుంబం వంశ పారంపర్యంగా ఏజెన్సీలో వైద్యం చేస్తూ, ఎందరో రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అడవి నుండి ఔషద గుణాలు ఉన్న మొక్కలను, వేర్లను, దుంపలను సేకరించి, వాటి ద్వారా చికిత్స నిర్వహిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండల కేంద్రానికి సరిగ్గా మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న నిమ్మలగూడెం జమాల్‌ఖాన్‌ మూలికా వైద్య ప్రకృతి కేంద్రం.

mulikaluచుట్టూ గుట్టలు, పచ్చటి ప్రకృతి, ప్రక్కనే జలజలా పారుతున్న శబరి నది ఒడ్డున తనకున్న కొద్దిపాటి భూమిలోనే అనేక రకాల వన మూలికలను పెంచుతూ, దాన్ని కుటీర పరిశ్రమగా చేసి వనమూలికలతో మందులు తయారు చేస్తున్నారు. సుమారు 20 మంది సహాయకులతో ఈయన వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జమాల్‌ఖాన్‌ సేకరించే అరుదైన వన మూలికా ఔషధాలైన తెల్ల మద్ది, ఎర్రచిత్రమూలం, తెలియకండ, బొమ్మల మర్రి, పీడాకుల పాల, అశ్వగంధ, పాతాల గరిడి, అడ్డసార, సత్తావరి తదితర ప్రకృతి నుంచి లభించే చెట్లు, వేళ్లతో ఎన్నో నయం కాని రోగాలను తగ్గించవచ్చని ఆయన రుజువు చేశారు. ఈ వైద్యశాలలో పాము కాటుకు గురై వచ్చే రోగులకు ఉచితంగా చికిత్స నిర్వహించి, అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఈయన వద్దకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది రోగులు వస్తుంటారు. క్యాన్సర్‌, అస్త్మా, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, బిపి, షుగర్‌ వంటి రోగాలను సైతం జమాల్‌ఖాన్‌ నయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అనేక మంది రోగులు తమ రోగాలు పూర్తిగా ముదిరిన తర్వాత చివరి దశలో రావడం, మందులు పనిచేసే వరకు ఓపికగా ఉండలేకపోవడంతో ఈ ప్రకృతి వైద్యం అంతగా గుర్తింపునకు నోచుకోవడం లేదని ఈ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అందుకనే మానవ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో మహత్తర వన మూలికలు నిర్లక్ష్యానికి గురౌతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలగలతో వినూత్న చికిత్స...
mulikalu1 శరీరంపై... ఎన్నో యేళ్లుగా మానకుండా, చికాకు కలిగించి, జీవితంపై విరక్తి పుట్టించే దీర్ఘకాలిక గాయాలకు ఈయన చేసే చికిత్స వినూత్నంగా ఉంటుంది. దీర్ఘకాళికంగా ఉన్న పుండ్ల ప్రదేశంలో బురద నీటి నుండి తెచ్చిన జలగలను వదిలి పుండ్లలో పేరుకుపోయి ఉన్న చెడు రక్తాన్ని పీల్పించడం ద్వారా చికిత్స మొదలుపెడతారు. అలా జలగలు చెడు రక్తాన్ని పీల్చివేసిన అనంతరం వైద్యుడు ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి మందుల ద్వారా 10-15 రోజులలో గాయం మానేటట్లు వైద్యం చేస్తారు. ఈ ప్రక్రియలో చికిత్స కోసం జలగలను ఒక రోగికి ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు.


రోగుల క్షేమమే కోట్ల ఆస్తితో సమానం...: మూలికా వైద్యుడు జమాల్‌ఖాన్‌
mulikalu3 ఒరిస్సాలోని మల్కా న్‌గిరి జిల్లా మోటు ప్రాంతం, మా నాన్నగారికి నేను 23వ సంతానం. నా తర్వాత తమ్ముడు ఖాలిక్‌ఖాన్‌తో కలిసి వంశపారంపర్యంగా వస్తున్న ఈ మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. మా తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ గారు 1920వ సం లోనే శబరి పరివాహక ప్రాంతాలలో వచ్చిన కలరా, డయేరియా వంటి అంటువ్యాధులను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. దాంతో ఆనాడే మా వైద్య విధానానికి మంచి గుర్తింపు లభించింది. మా తాతల కాలం నుండి నేటివరకు వైద్యసేవలకు గాను ఎప్పుడూ, ఎవరి దగ్గర ఒక నయా పైసా కూడా ఫీజు తీసుకోలేదు. 2002లో శబరి నది దాటి ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మూలికలు సేకరించి తెచ్చిన గిరిజనులకు... కూలీ రూపేణా ఇవ్వడానికి మాత్రమే నామ మాత్రపు డబ్బు తీసుకుంటున్నాం. నాకు కాంట్రాక్టులు, వ్యవసాయం తదితర ఆదాయ మార్గాలు ఉన్నాయి. వైద్య సేవలకు ఎటువంటి రుసుము అవసరం లేదు. ఎందరో దేవుళ్లకు మొరపెట్టుకొని నా దగ్గరకు వచ్చే రోగులకు నయమై క్షేమంగా ఉంటే చాలు, అదే నాకు కోట్ల ఆస్తితో సమానం.

mulikalu2 ఏజెన్సీ ప్రాంతంలో ఆయుర్వేద వైద్య సేవల ద్వారా పక్షవాతం, మధు మేహం, కిడ్నిలో రాళ్లు, కిడ్ని ఫెయిల్యూర్‌, కీళ్లవాతం, కీళ్లనొప్పులు, టి.బి., కాలేయ సంబంధిత వ్యాధులు, రకరకాల కామెర్లు, గర్భసంచి క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, సైనస్‌, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, తెల్లపొడ, శూలబాధలు, అల్సర్‌, అర్ష మొలలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, ఎర్రబట్ట, సెక్స్‌ సంబంధ మైన సమస్యలు, హై, లో బి.పి., కుష్టు, ఇంకా అనేక రకమైన వ్యాధులకు చికిత్స వనమూలికల (గింజలు, బెరడు, వేర్లు, కాయలు, పువ్వు, ఆకులు) ద్వారా నయం చేస్తాం. మాకున్న కొద్దిపాటి ఆవరణలోనే ఎన్నో రకాల ఔషద మొక్కల ను పెంచుతున్నాం. సేకరించిన వాటిల్లో చాలావరకు బట్టీల ద్వారా ఆవిరి రూపంలో కషాయం (లిక్విడ్‌) తీస్తాం. అందులో తెల్లమద్ది, వాకుడు, ఉత్త రేణి, తామెరతీగ, పాషానంబేది, కొండపిండి ఆకు, నేల ఉసిరి, బొమ్మల మర్రి, నల్ల ఉమ్మెత్త, తెల్ల చిత్రమూలం, ఎర్ర ఉల్లి, ముల్ల గోరింక, నిమ్మగడ్డి అంజీరా, జీరా, నేలతాడి, పారీజాత, తిప్పతీగ, అడవినాబి, అడ్డసారా, మామి డి అల్లం, తెల్లగన్నేరు ఇలా వందలాది అడవి వన మూలికలతో పొడులు, లేహ్యాలు, ఔషదగుళికలు తయారు చేసి వ్యాధులను నయం చేస్తుంటాం.ఎందరో మేధావుల సందర్శన...

mulikalu4 భద్రాచలం మన్నెంలో ప్రకృతి వైద్యంతో పలు దీర్ఘకాలిక రోగాలను ఎలా నయం చేస్తున్నారో తెలుసుకోవాలని, ఎందరో మేధావులు, విద్యావేత్తలు, విదేశాల నుంచి సైతం ప్రొఫెసర్లు వచ్చి ఇక్కడి వైద్య విధానాన్ని తెలుసుకొని వెళ్లారు. డబ్బు ప్రధానంగా ఈ వృత్తిని ఎంచుకోకుండా, జమాల్‌ఖాన్‌ చేసే వైద్య సేవలు పలువురు కొనియాడారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వనమూలికల సేకరణ చాలా కష్టమైన విషయమని, దానిని ఇంతకాలంగా కొనసాగిస్తూ ఉండటం నిజంగా ప్రశంసనీయమని పలువురు వైద్యులు కొనియాడారు.


ఎన్నో రోజులుగా రాని మార్పు గమనించాను...: కోటగిరి మురళి, ఉద్యోగి, హైదరాబాద్‌
muraliనేను చాలా కాలంగా వెరికోస్‌వెయిన్స్‌ (చీలమండ వద్ద పుండు) అనే వ్యాధితో బాధపడు తున్నా, ఎన్నో రకాల వైద్య చికిత్స ద్వారా రాని మార్పు నాకు ఈ వైద్య విధానం ద్వారా వచ్చింది. గత సెప్టెంబర్‌ 16న ఒక న్యూస్‌ ఛానల్‌ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. జమాల్‌ఖాన్‌ చేసే వైద్యం, ఆయన రోగులతో మెలిగే తీరు నాకు ఎంతగానో నచ్చింది. అందుకే కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండి వైద్యం చేయించుకోవడానికి వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం వుంది.

జన్మజన్మలకు ఋణపడి ఉంటా...: వాసం నాగేశ్వరరావు, నర్సిపట్నం
nageshwaraoనాకు లివర్‌ దెబ్బతిన్నది. గ్యాస్‌ట్రబుల్‌ వల్ల హెచ్‌.బి.ఎస్‌ పాజిటివ్‌ అనే వ్యాధితో ఇక్కడికి వచ్చాను. లివర్‌పై ఉండే పొర పూర్తిగా చెడిపోయిందని, ఇక బ్రతకడం కష్టమని, చాలామంది చెప్పారు. కానీ, ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న తర్వాత, అంతకు ముందు ఉన్న రేచీకటి కూడా పోయింది. ఇప్పుడు నాకు కళ్లు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. జన్మజన్మలకు డాక్టర్‌గారికి రుణపడి ఉంటాను.

మాకు జమాల్‌ ఖానే దేవుడు...: మడివి విజయ్‌, స్థానికుడు
వారం రోజుల కిందట నన్ను కట్లపాము కరి చింది. అదే వేరేచోట అయితే నేను చచ్చిపోయేవాడినే. కానీ మా ప్రాంతం వాళ్లకు పాముకాటు భయం లేదు. ఎందుకంటే మాకు దేవుడు లాంటి జమాల్‌ఖాన్‌ ఉన్నాడు.

జమాల్‌ లేకుంటే అవిటిదాన్న య్యేదాన్ని...: సిద్దోజి పద్మ, చల్లగరిగ గ్రామం, వరంగల్‌ జిల్లా
padmaబోన్‌ క్యాన్సర్‌తో నా కుడికాలి మడమపై పుండు వచ్చింది. హన్మకొండలోని అమృత హాస్పటల్‌కి కూడా వెళ్లి చూపించుకున్నా. నిమ్స్‌ కూడా వెళ్లి చూపిస్తే మోకాలు వరకు తీసేయాలని చెప్పారు. ఇక్కడి రాకుంటే నా కాలు కోల్పోయేదాన్ని. 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పటివరకు సుమారు 70 శాతం నాకు ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా నయమవుతుందనే విశ్వాసం ఉంది. ఈ ఆవరణ, మొక్కలతో ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంది.

జమాల్‌గారివద్ద పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం: ముఖ్య సహయకుడు, ఎస్‌కె.సుభానీ
subaniజమాల్‌ఖాన్‌తో నాకు బంధుత్వం ఉంది. బావగా నాకు చుట్టమే అయినా, ఆయన నాకు గురువుతో సమానం. ఆయన తో కలిసి వైద్య సేవల్లో పాలుపంచుకోవడం నా పూర్మజన్మ సుకృతం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఆయన దగ్గర మిగిలే ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు ఎన్ని రకాల పనులున్నా... వైద్యా న్ని, వైద్యసేవలను ఎంతో గౌరవంగా భావి స్తారు. అది నాకు, మా సహాయకులందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఏదో ఒకరోజు చిరాకు పడటం, అశ్రద్ధగా ఉండడం మనం చూస్తుంటాం... కాని మా జమాల్‌ఖాన్‌ గారిలో అది మేం ఇంతవరకు చూడలేదు.

ఇక్కడికి వచ్చే రోగుల్ని చూస్తే... మనసు చలిస్తుంది...:  -  రమణ, కాంపౌండర్‌
mulikalu6 జమాల్‌ఖాన్‌గారితో 15సంలుగా ఉంటున్నా. ఎన్నో వేలమంది రోగులకు సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కోసారి... బాగా రోగం ముదిరిన తర్వాత వచ్చే రోగులను, వారు పడే బాధలు చూస్తే మనసు చలిస్తుంది, రోగం ముదరక ముందే ఇక్కడికి వస్తే త్వరగా నయం చేస్తాం. కాబట్టి బాగుపడ్డ రోగులు ఇతరులకు చెప్పి, వారి వంతు సహకారాన్ని అందిస్తే... ఈ వైద్యానికి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది.

ఆయన సేవల్లో పాలుపంచుకోవడం మా అదృష్టం : సహాయకులు... సోయం ముత్తమ్మ, సోడే రాములమ్మ, సోడే అచ్చమ్మ, సోడే లక్ష్మి (విద్యార్థిని)
మా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రతి బుధవారం గిరిజనులు సంతకు వచ్చేటప్పుడు, జమాల్‌ఖాన్‌గారు చెప్పినటువంటి వేర్లు, బెరడులు, చెట్లు, ఆకులు తీసుకొస్తారు. వారు తెచ్చిన వాటిని మేం శుభ్రపరుస్తాం. ఎన్నో యేళ్లుగా ఈ పనిలో ఉన్నాం. డాక్టర్‌ గారు చెప్పినట్లు ఆవిరితీయడం, ఔషధ గుళికలు తయారు చేయడం, లేహ్యాలు తయారు చేయడం చేస్తుంటాం. డాక్టర్‌ గారు రోగులకు ఉచితంగా వైద్యం చేస్తున్నప్పటికీ మాకు మాత్రం కూలీ ఇస్తుంటారు. ఆయన చేసే వైద్యంలో మా వంతు సేవ చేస్తూ, ఆయన వెంట ఉండటం పరమానందంగా ఉంటుంది.

వైద్య సదుపాయాలు ఎన్ని ఉన్నా...:మన్నెంలో వనమూలికా వైద్యానికే పెద్దపీట
mulikalu7 మన్నెంలో వనమూలికా వైద్యం చేస్తున్న జమాల్‌ఖాన్‌ వైద్యశాలకు 3 కిలోమీటర్ల దూరంలోని చింతూరు మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా (100 పడకల) హస్పటల్‌ లు అన్నిరకాల అల్లోపతి చికిత్సలు అందిస్తున్నప్పటికీ, నిమ్మలగూడెంలో యం.డి జమాల్‌ఖాన్‌ చేస్తున్న వనమూలికా వైద్యానికే రోగులు, వారి బందువులు పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటిడిఎ సంస్థద్వారా నిత్యం ఈ పరిసర ప్రాంతాల గిరిజన, గిరిజనేతరులను అనునిత్యం అభివృద్ది పరుస్తూ, అన్ని రకాల వైద్యసేవలను వారి వారి ముంగిటకు తెచ్చినా, వనమూలికా వైద్యమే ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల వారందరికి శ్రీరామరక్ష. ఈయన చేసే వైద్యంతో పాటు, పలకరింపు, రోగులతో ఈయన ఉండే వ్యవహర శైలి ప్రతిఒక్కరికి హత్తుకునే విధంగా ఉండడమే దీనికి కారణమని స్థానికులంటారు. హస్తవాసి, వంశపారంపర్య వైద్య విధానముతో జమాల్‌ఖాన్‌ చేసే విన్నూతన ప్రయోగాలతో (జలగలతో చికిత్స) చేస్తున్న వైద్యం కూడా మంచి ఫలితాలను ఇవ్వడం, ఇక్కడకి వచ్చే రోగులకు ఎంతో త్వరగా నయం అవ్వడమే జమాల్‌ఖాన్‌ వైద్య రహస్యమని, పలువురు స్వస్థత చేకూరిన వ్యక్తులు చెప్పడం గమనార్హం.
- మల్లేల సత్యనారాయణ, భద్రాచలం

దంత వైద్య వరం ... లేజర్‌ చికిత్స

కత్తులు లేని చికిత్స - నొప్పి తెలియని వైద్యం లేజర దంత వైద్యం
Root_Canal1 దంత సమస్యలకు చికిత్సలో భాగంగా హార్డ్‌, సాఫ్ట్‌ టిష్యూలకు లేజర్‌ చికిత్స చేస్తుంటారు. లేజర్‌ యంత్రంలో వీటికి చికిత్స చేసే పైప్స్‌ వేరువేరుగా ఉంటాయి. పలు రకాల చికిత్సలను అందించేందుకు వీలుగా పలు రకాల ప్రోగ్రామ్‌లు ముందుగానే అందులో లోడ్‌ అయి ఉంటాయి. ప్రోగ్రామ్‌ మార్చినప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌నివ్వాలి. రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్‌...ఇలా హార్డ్‌ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రామ్‌లుంటే, సాఫ్ట్‌ టిష్యూకోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలో ఉన్న ఎండోడాంటి క్స్‌ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చెయవచ్చు. బాగా లోతుగా ఉన్న ఇన్‌ఫెక్షన్‌ని అరి కట్టవచ్చు. పంటినిగాని, చిగుళ్లనిగాని, ఎముకనిగాని అవస రమైనంత కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్‌ ద్వారా పన్నుపై భాగాలు అ రిగి జివ్వున లాగుతుంటే- ఆ ప్రాంతంలోని అతిస్పందనని, మరో ప్రోగ్రామ్‌ ద్వారా.. లేజర్‌ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించవచ్చు.

Root_Canalసాధారణంగా అధికరక్తపోటు, మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువగా ఉన్న చిగుళ్లని ఇంకో ప్రోగ్రామ్‌తో కత్తి రించవచ్చు. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్‌ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చి వేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసి వేసే ప్రోగ్రామ్‌ ఉంది. కొంతమందిలో రెండు పళ్లమధ్య ఫ్రీనమ్‌ అనే కండరము ఏర్పడుతుంటుంది. దీంతో పళ్లమధ్య సందులు ఏర్పడతా యి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసి వేయ వచ్చు లేజర్‌ కిరణా లతో. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి సాఫ్ట్‌ టి ష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటి కీ సంబంధించిన ప్రోగ్రామ్‌తో ఉన్నాయి ఈ లేజర్‌ చికిత్సా యంత్రంలో.

ఇక హార్డ్‌ టిష్యూ..గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 రకాల వరకూ ఉన్నాయి. డెంటిన్‌ని, ఎనామెల్‌ని కట్‌ చేయవచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చి పోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్‌ అండ్‌ ఫీజర్‌ సీలింగ్‌ పద్ధతి’లో మూసి వేస్తారు. లేజర్‌ కిరణాలతో పన్నునే కాదు, ఎముకనీ కట్‌ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయ వచ్చు. ఫ్లోరోసిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్పడుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సిటి వ్‌నెస్‌ ఎక్కువగా ఉంటే లేజర్‌ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్‌ చేయవచ్చు.

ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్‌..అంటే పాడైపోయిన కణాన్ని కచ్చితంగా అంతవరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌లేజర్‌తో తొలగించవచ్చు.

ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివేయడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చివేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురువాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్‌ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లో ని చిన్నచిన్న పుళ్లమీదకి లేజర్‌ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గిపోతుంది. ఇరవైనాలుగు గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గి పోతాయి. అంతేకాదు...ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది ఎటు వంటి మచ్చపడకుండా.
చిన్నపిల్లల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకురావు. అలాంటి పరిస్థితుల్లో లేజర్‌ కిరణాలతో నొప్పిలేకుండా చిగు ళ్లని కోసి, పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్లమీద జెల్‌ని రాసి,లేజర్‌ కిరణా న్ని నాలుగు నిముషాలు పంపడం తో పళ్లని తెల్లగా చేయవచ్చు. వెస్టిబ్యులోప్లాస్టి. . పెదవి లోపలి వైపు ఎముకని లేజర్‌ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరిభాగం కోసు కుంటుంటే ఆపదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పిలేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్‌ కిరణాలను పంపి నొప్పి లేకుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. ఇలా హార్డ్‌ టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రా మ్‌లున్నాయి.

అన్ని రకాల దంత చికిత్సల్ని లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణా లని చికిత్స చేసి నా, గట్టికణాన్ని కత్తి రించినా నొప్పి ఉండదు. రక్తం కారదు.

చిగుళ్లలో పాడైపోయిన భాగా ల్ని చిగుళ్లని కత్తిరించ కుండా కాంతిని పంపి మాడ్చేయువచ్చు. సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమయం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. ఏ ప్రోగ్రామ్‌ని సెట్‌చేస్తే లేజర్‌ కిర ణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రామ్‌ పెడితే లేజర్‌ కిరణాలు ఆ కణాలనే మాడ్చే స్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టు కోకుండా. ఈ లేజర్‌ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్‌ లేజర్‌ కన్నా ఎన్‌డిఆర్‌ లేజర్‌ శక్తివంతమైంది. అనస్థేషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.

స్టెరిలైజింగ్‌ కోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతు లకన్నా ఈ లేజర్‌ చికిత్స ఎంతో ఉపయోగం. రక్తస్రావం,నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌‌స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు. అనస్తేషి యా లాంటివి అక్కర్లేదు.అవసరమైన చోటికే లేజర్ని పంపడం,ఎంత వేగం తో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.
lessar
దంత అనారోగ్యం కలిగితేనే కాదు - చికిత్స కూడా బాధాకరం అనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ పళ్లు పుచ్చిపోతే లోపలి భాగాల్ని తొలగించడం, దంతాల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్‌ని తొలగిం చడం, నోట్లో గడ్డలు ఎక్కుడున్నా తీసివేయడం, హిమాంజిె మా లవంటి వాటిని తొలగించడం, నోటిలో అల్సర్స్‌ని తగ్గించడం, పళ్ల హైపర్‌ సెన్సిటివిటిలాంటివి తగ్గించడం వంటి చికిత్సల్ని- కత్తి తో సంబంధం లేకుండా కాంతితో, ఏమాత్రం నొప్పి, రక్తస్రావం లేకుండా మన రాష్ట్రంలో చేయగ లుగుతున్నామంటే దంతవైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందో వేరుగా చెప్పనక్కర్లేదు.

లేజర్‌ కిరణాల సాయంతో వినూత్న పరికరం ద్వారా దంతాలు, చిగుళ్లు, నోటి ఎముకకు సంబ ంధించిన అనేక చికిత్సల్ని చేస్తున్నారు...ఇంతకు ముందు మెత్తటి కణాలకి చికిత్స చేసే లేజర్స్‌ మనకు అందుబాటులో ఉన్నాయి.

‘ఔఅఖిఉ’ పదాన్ని విస్తరిస్తే ‘లైట్‌ యాంప్లికేషన్‌ స్టిమ్యులేటెడ్‌ ఎమిషన్‌ ఆఫ్‌ రేడియేషన్‌’.
లేజర్‌ యంత్రం నుంచి హార్డ్‌ టిష్యూ, సాఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌- వేరు వేరుగా ఉం టాయి.
దెబ్బతిన్న సాఫ్ట్‌ టిష్యూని తొలగించే సన్నటి పైప్‌కి చివర్న గాస్‌టిప్‌ ఉంటుంది. దీనిలోంచి లేజర్‌ కిరణాన్ని అవసరమైన ప్రాంతంలోకి ప్రసరించేట్టు చేస్తారు చికిత్సలో. ఇది ఫైబర్‌ ఆప్టిక్‌ ట్యూబ్‌. తర్వాత చికిత్సలో అప్పుడు పైనున్న టిప్‌ని తీసివేస్తే, టిప్‌ని పెంచుతారు. ఇలా క్రమంగా ఈ ఫైబర్‌ ఆప్టిక్‌ ట్యూబ్‌ అయిపోవచ్చు. అప్పుడు కొత్త తీగని వేసుకోవలసి వస్తుంది.

lessar1ఇదే మెషిన్‌కి-హార్డ్‌ టిష్యూకి చికిత్స చేయడానికి వీలుగా ఎక్కువ లేజర్‌ కిరణాన్ని ప్రసరింపజేసే ట్యూబ్‌ ఉంటుంది. ఇవి రెండూ ఒకే మిషిన్‌కి ఉండటం విశేషం. ఈ మెషీన్‌ విద్యుచ్ఛక్తి సాయంతో పనిచేస్తుంది.మామూలుగా వైద్యులకు హస్త వాసి అంటారు. చేతు లతోనే శస్తచ్రికిత్సలు, అన్ని చికిత్సలు చేస్తుంటారు. అందుకని చేతులతో నేర్పుండాలి, అనుకుంటాం. కానీ ఈ లేజర్‌ మెషీన్‌ని ఆపరేట్‌ చేయాలంటే చేతులతో నైపుణ్యమే కాదు, కాళ్లలో నైపుణ్య మూ ఉండాలి. ఎందుకంటే లేజర్‌ కిరణా న్ని ప్రసరింపచేసే పైప్‌ని రోగి నోటిలోని ఆ భాగం వరకూ తీసుకువచ్చినా కింద పాదంతో పెడల్‌ మీద అవసరమైనంత ఒత్తిడిని కలిగించినప్పుడే లేజర్‌ కిరణాలు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడు పాదాన్ని పైకెత్తి తే అప్పుడే లేజర్‌ కిరణాలు బయటికి ప్రసరించడం ఆగిపోతుంది.

లేజర్‌ పనిచేసేది ‘ధెర్మకోయాగ్యులేటివ్‌ ఎఫెక్ట్‌’తో. ఈ లేజర్‌ కిరణాలలో చాలా ఉష్ణముం టుంది. 200 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ ఉంటుంది. కానీ కాలదు. నొప్పి ఉండదు. రక్తస్రావముం డదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఉష్ణము నొప్పి కలిగించని కిరణాల ద్వారా ప్రవహించి చిి త్స తోడ్పడుతోందంటే!
హార్డ్‌, సాఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌ వేరువేరుగా ఉండడమే కాదు ప్రోగ్రామ్‌ మార్చిన ప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌ నివ్వాలి. రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్‌...ఇలా హార్డ్‌ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రా మ్‌లుంటే, సాఫ్ట్‌ టిష్యూ కోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో.

సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలో వున్న ప్రోగ్రామ్స్‌ని కొన్నింటిని చూద్దాం. ఎండోడాంటిక్స్‌ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చెయవచ్చు. బాగా లోతుగా వున్న ఇన్‌ఫెక్షన్‌ని అరికట్టవచ్చు. పంటిని గాని, చిగుళ్లనిగాని, ఎముకనిగాని అవసరమైనంత కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్‌ ద్వారా పన్ను పై భాగాలు అరిగి జివ్వున లాగుతుంటే- ఆ ప్రాంతంలోని అతిస్పందనని మరో ప్రోగ్రామ్‌ ద్వారా.. లేజర్‌ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించే ప్రోగ్రామ్‌ ఉంది.

సాధారణంగా అధికరక్తపోటు, మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువవున్న చిగుళ్లని కత్తిరించవచ్చు ఇంకో ప్రోగ్రామ్‌తో. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్‌ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చివేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసి వేసే ప్రోగ్రామ్‌ ఉంది. కొంతమందిలో రెండు పళ్లమధ్య ఫ్రీనమ్‌ అనే కండరము ఏర్ప డుతుంటుంది. దీంతో పళ్లమధ్య సందులు ఏర్పడతాయి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసివేయవచ్చు లేజర్‌ కిరణాలతో.. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటికీ సంబం ధించిన ప్రోగ్రాంలు ఉన్నాయి ఈ లేజర్‌ చికిత్సా యంత్రంలో.

ఇక హార్డ్‌ టిష్యూ..గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 ఉన్నాయి. డెంటిన్‌ని, ఎనామెల్‌ని కట్‌ చేయ వచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చి పోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్‌ అండ్‌ ఫీజర్‌ సీలింగ్‌ పద్ధతి’ లో మూసి వేస్తారు. లేజర్‌ కిరణాలతో పన్నునే కాదు, ఎముకనీ కట్‌ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయవచ్చు. ఫ్లోరో సిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్పడుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సి టివ్‌నెస్‌ ఎక్కువగా ఉంటే లేజర్‌ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్‌ చేయవచ్చు.

ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్‌..అంటే పాడైపోయిన కణాన్ని ఖచ్చితంగా అంత వరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌లేజర్‌తో తొలగించవచ్చు. ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివేయడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చివేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురువాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్‌ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లోని చిన్న చిన్న పుళ్లమీదకి లేజర్‌ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గిపోతుంది. ఇరవైనాలుగ్గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు...ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది ఎటువంటి మచ్చ పడకుండా.

చిన్నపిల్లల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకు రావు. అలాంటి పరిస్థి తుల్లో లేజర్‌కిరణాలతో నొప్పిలేకుండా చిగుళ్లని కోసి, పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్ల మీద జెల్‌ని రాసి, లేజర్‌ కిరణాన్ని నాలుగునిముషాలు పంపడంతో పళ్లని తెల్లగా చేయవచ్చు. వెసి ్టబ్యూల్‌లోప్లాస్టి....పెదవి లోపలివైపు ఎముకని లేజర్‌ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరి భాగం కోసుకుంటుంటే ఆ పదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పి లేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్‌ కిరణాలను పంపి నొప్పిలేకుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయ వచ్చు. ఇలా హార్డ్‌టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి.

అన్ని రకాల దంత చికిత్సల్ని లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణాలని చికిత్స చేసినా, గట్టికణాన్ని కత్తిరించినా నొప్పి ఉండదు. రక్తం కారదు. చిగుళ్లలో పాడైపోయిన భాగాల్ని చిగుళ్లని కత్తిరించ కుండా కాంతిని పంపి మాడ్చేయువచ్చు. సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమ యం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. కేవలం రెండు నిముషాలలో కావలసిన ప్రోగ్రామ్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్‌ని సెట్‌చేస్తే లేజర్‌ కిరణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రా మ్‌ పెడితే లేజర్‌ కిరణాలు ఆ కణాలనే మాడ్చేస్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టుకోకుండా.
ఈ లేజర్‌ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్‌ లేజర్‌ కన్నా ఎన్‌డిఆర్‌ లేజర్‌ శక్తివంతమైంది. అనస్థీషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.

లేజర్‌ అంటే..?
ఒక పద్ధతి లేకుండా ప్రయాణించే అనేక ఎలక్ట్రోమేగ్నిటిక్‌ వేవ్స్‌ మాములు కాంతిలో ఉంటాయి. దీనిని ‘ఇన్‌కొహెరెంట్‌ లైట్‌’ అంటారు. లేజర్‌కాంతి కిరణాలకు మూడు ప్రత్యేక ధర్మాలుంటాయి. ఇది తిన్నగా ఒకే దారిలో వెళ్తుంది. దూరం ప్రసరింపచేసిన చాలా కొద్దిగా మాత్రమే వంగుతుంది. ఇందుకు భిన్నంగా మామూలు కాంతికిరణాలు విస్తరిస్తాయి. లేజర్‌ కిరణాల రెండవ ధర్మం ఒకటే రంగుని కలిగి ఉంటుంది. మామూలు కాంతిలో ఇందుకు భిన్నంగా ఎన్నో వేవ్‌లెంత్స్‌ రంగులుం టాయి. లేజర్‌ యంత్రంలో లేజర్‌ కేవిటీలో లేజర్‌ కిరణాలు ఉత్పత్తి అవుతుంటాయి. లేజర్‌ కేవిటీలో మూడు ముఖ్యమైన విభాగాలున్నాయి. లేజర్‌ కిరణాలు ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్‌ జన రేటర్‌ ఒక ముఖ్యభాగం. లేజర్‌ కిరణాలని ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్‌ జనరేటర్‌ ఒక ముఖ్య భాగం. లేజర్‌ కిరణాలని ఉత్పత్తి చేసే సోర్స్‌ ఘనరూపంలో ఉండవచ్చు.ద్రవరూపంలో ఉండ వచ్చు.వాయురూపలో ఉండవచ్చు. ఘన రూపంలో ఉండే సోర్‌స సిలెండ్రికల్‌ లేజర్‌ క్రిస్టల్‌ సాధా రణంగా వైద్యంలో వాడే లేజర్‌ క్రిస్టల్స్‌ Nd ; YAG, Er: YAG ( Neodimium yttrium- aluminium ganate, Erbium, yttrium- aluminium Gamate ఈ యాక్టివ్‌ మీడియమే... లేజర్‌నుంచి వచ్చే కాంతి వేవ్‌ లెంత్‌ని నిర్థారిస్తుంది. ఉదాహరణకి ND: YAG వేవ్‌లెంత్‌ 1.06 YM అయితే Er: YAG వేవ్‌లెంత్‌ 2.94.
రెండవది యాక్టివ్‌ మీడియా పరమాణువుల్ని స్టిమ్యులేట్‌ చేసే ఎనర్జీ సోర్స్‌ పల్స్‌డేలో ప్రెజర్‌ జినాన్‌ ఫ్లాష్‌లాంప్‌.
మూడవ ముఖ్యమైన భాగం ఆఫ్టికల్‌ రిజోనేటర్‌. లేజర్‌కేవిటీకి రెండు చివర్లలోనూ రెండు హైలి పాలిష్ట్‌ మిర్రర్స్‌ ఉంటాయి. ఇవి ఉత్పత్తి అయ్యే లేజర్‌ కిరణాలు ప్రక్కలకు వెళ్లకుండా ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తాయి.
లేజర్‌ కిరణాలు ఉత్పత్తి కాగానే లేజర్‌బీమ్‌ డెలివరి సిస్టమ్‌ ద్వారా ముందుకు పంపబడతాయి. అక్కడ నుంచి పైప్‌ ద్వారా ఆ కిరణాల్ని నోటిలో ఏ ప్రదేశంలోకి పంపాలో ఆ ప్రదేశంలోకి పంపడం జరుగుతుంది.
మనుషుల మీద ఈ లేజర్‌ కిరణాల ప్రభావం యంత్రం నుంచి ఉత్పత్తి ఆయ్యే రేడియంట్‌ ఎనర్జీ వేవ్‌ లెంత్‌ని బట్టి ఉంటుంది. విచిత్రమేమిటంటే ఎంతో ఉష్ణము లేజర్‌ కిరణాలలో వున్నా ఏమా త్రం కాలదు, నొప్పి అనిపించదు. శరీరంలో ఏ ప్రాంతంలోనయినా లేజర్‌ కిరణాలు తాకగానే ఆ ప్రాంత అవయవాలు వాటిని పీల్చుకుంటాయి. ఈ పీల్చుకున్న లేజర్‌ కిరణాలు ఖచ్చితంగా ప్రోగ్రా మింగ్‌ ప్రకారమే పనిచేస్తాయి. ఎంత ఎక్కువ ఎనర్జీ లోపలకు తీసుకుంటే అంత ఎక్కువ ఎఫెక్ట్‌ ఉంటుంది.
అవసరమైన చోటికే లేజర్ని పంపడం,ఎంత వేగంతో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.
వైద్యంలో ఉపయోగించే లేజర్స్‌ ప్రధానంగా నాలుగురకాలు. మొదటివి గాస్‌ లేజర్స్‌ (Co2 Argon,Hene etc) రెండో రకం సాలిడ్‌ స్టేట్‌ లేజర్స్‌. ఇవి.Er ; YAG ND: YAG,KTP లాంటివి. మూడవరకం లిక్విడ్‌ (డై) లేజర్స్‌. నాల్గవ రకం డియోడ్‌ లేజర్స్‌.

Er: YAG ని అబ్జార్బ్‌ చేసుకునే క్రోమోఫోర్స్‌ - నీరు, హైడ్రాక్సియాపటైట్‌ హార్డ్‌ డెంటల్‌ టిష్యూ చికిత్సకి ఈ లేజర్‌ కిరణాల్ని వాడతారు. రక్తస్రావం లేకుండా రక్తం గడ్డకట్టకుండా, ఇన్‌ఫెక్షన్‌ రాకుండా సాఫ్ట్‌ డెంటల్‌ టిష్యూని కట్‌ చేయవచ్చు.

ND : YAG లేజర్‌ కిరణాలు మెలనిన్‌, హిమోగ్లోబిన్‌లలోకి నెమ్మదిగా పీల్చబడుతుంది. సాఫ్ట్‌ డెంటల్‌ టిష్యూని కోయడానికి...చికిత్సకి ఇది తోడ్పదుతుంది. ఇన్‌ఫెక్షన్‌ తొలగించడానికి, పళ్లు తెల్లగా మారడానికి కూడా తోడ్పడుతుంది.
KTP లేజర్‌ ND.YAG ఫ్రీక్వెన్సీకి రెట్టింపు, మెలనిన్‌, హిమోగ్లోబిన్‌లో అబ్జార్బ్‌ అవుతుంది. కట్‌ చేయడానికి, ఇన్‌ఫెక్షన్‌ పోగొట్టడానికి తోడ్పడుతుంది.

HO: YAG నీరు అబ్జార్బింగ్‌ క్రోమోఫోర్‌. కటింగ్‌, ఇన్‌ఫెక్షన్‌లను పోగొట్టడానికి ఈ లేజర్‌ కిర ణాలు తోడ్పడతాయి Co2 లేజర్‌కి అబ్జార్బింగ్‌ క్రోమోఫోర్‌ నీరు సాఫ్ట్‌ టిష్యూని కట్‌చేయడానికి ఇన్‌ఫెక్షన్‌ పోగొట్టడానికి తోడ్పడుతుంది. డియోడ్‌కి అబ్జార్బింగ్‌ క్రోమోఫోర్స్‌ మెలనిన్‌, హిమో గ్లోబిన్‌ సాఫ్ట్‌ టిష్యూ కటింగ్‌కి, ఇన్‌ఫెక్షన్‌ పోగొట్టడానికి పళ్లని తెల్లగ చేయడానికి ఈ లేజర్‌ తోడ్ప డుతుంది.

లేజర్‌ పెరామీటర్స్‌ వేవ్‌ లెంత్‌ (NM) పవర్‌ (W) రెపిటేషన్‌ రేట్‌ -ఫ్రీక్వెన్సి (H2) పల్స్‌ డ్యురేషన్‌ (MS OR Ms). లేజర్‌ కిరణాలు ఒక తరంగ దైర్ఘ్యంలో ప్రసరిస్తాయి. అదే వేవ్‌లెంత్‌ లేజర్‌ వేవ్‌లెంత్‌ 400 NM 700NM మధ్య ఉన్నప్పుడే కాంతి కంటికి కనిపిస్తుంది.

లేజర్‌ ద్వారా ఎంత ఎనర్జీ ఉత్పత్తి అయ్యేది అన్నది పవర్‌ వైద్యం కోసం ఉపయోగించే లేజర్స్‌ని ప ల్స్‌మోడ్‌లో ఆపరేట్‌ చేస్తారు. పల్స్‌ రిపిటిషన్‌ రేట్‌ ప్రకారం లేజర్‌ కిరణాలు ప్రసరిస్తాయి. సాధా రణంగా సెకండుకి 10 పల్స్‌స్‌ రేట్‌ ప్రకారం లేజర్‌ కిరణాలు ప్రసరించేట్టు చూస్తుంటారు.

పల్స్‌ డ్యూరేషన్‌ అంటే పల్స్‌ విడ్త్‌. లేజర్‌ పల్స్‌ లెంత్‌ని చెబు తుంది. లేజర్‌ ఎనర్జీని ప్రసరింపచేయడానికి పట్టేకాలం.

పల్స్‌ ఎనర్జి (j) అంటే లేజర్‌ పల్స్‌లో వున్న రేడియంట్‌ ఎనర్జి. పీక్‌ పవర్‌ (w) ఇండివిడ్యువల్‌ లేజర్‌ పల్స్‌తో పవర్‌ స్థాయిని పల్స్‌ ఎనర్జి అంటారు. స్పాట్‌ సైజ్‌ (NM) ఫ్లూయెన్స్‌ (J/ CM2) అంటారు.
థెర్మోకోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌ వల్ల గత ఇరవై సంవత్సరా లు గా లేజర్‌ కిరణాలను దంత వైద్యానికి సంబంధించిన వివిధ చికిత్సలకి ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్‌ టిష్యూ చికిత్సలకి ND : YAG లేజర్‌తో బాగా నిర్వహించవచ్చు - స్టెరిలైజింగ్‌ కోయాగ్యులేటింగ్‌ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతులకన్నా ఈ లేజర్‌ చికిత్స ఎంతో ఉపయోగం.

రక్తస్రావం,నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌‌స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు. అనస్థీషియాలాంటివి అక్కర్లేదు.
డాక్టర్‌ సుధీర్‌ చౌదరిsudir
దంత వైద్యనిపుణులు
అమీర్‌పేట్‌ డెంటల్‌ స్పెషాలిటీస్‌
అమీర్‌పేట్‌, హైదరాబాద్

అమెరికాలో జనం ఏం తింటారు? ఏం వండుకుంటారు? ఏయే పంటలు పండిస్తారు...?

వాళ్లది 'బ్రెడ్డూ కాదు ఫుడ్డూ కాదు'

అమెరికాలో జనం ఏం తింటారు? ఏం వండుకుంటారు? ఏయే పంటలు పండిస్తారు...?
ఆ విషయాలన్నీ మనకెందుకు అంటా వాటి గురించి నేను ఆలోచించటమే కాక మిమ్మల్ని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి మీ బుర్రలెందుకు చెడగొట్టాలి అంటారా? ఎందుకంటే, రాబోయే పది, ఇరవై సంవత్సరాల్లో మన భారతదేశం కూడా అమెరికాలాగే తయారవ్వబోతోంది కాబట్టి! మనమందరం కూడా అమెరికన్ల ఆహారపు అలవాట్లను అలవర్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి. అందుకే మనం అమెరికా ఆహారం, దాని పూర్వాపరాల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిదిఅంటున్నారు ఉమాశంకరి. చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురంలో రైతుమహిళగాను, ఆహార వ్యవసాయ అంశాల మీద కార్యకర్తగానూ పని చేస్తున్నారామె. ఆమె చెప్పిన విశేషాలే ....

ఈ రోజుల్లో ఏం వండుకుందాం, ఏం తిందాం అన్నది మన ఇండ్లలో సైతం అంత తేలికైన విషయం కాదు. మనం రోజూ తినే తిండిలో అన్నం, పప్పు, కూర, పెరుగు వంటివి మాత్రమే ఉండకపోవచ్చు. నార్త్ ఇండియన్ తందూరీ రోటీలు ఉండొచ్చు, బర్గర్‌లు, పిజ్జాలు, నూడుల్స్ ఉండొచ్చు. లేదా మనకు నోరు తిరగని మరేవో విదేశీ వంటకాలు కూడా ఉండొచ్చు. వీటన్నిటినీ ఇప్పుడు పట్టణాలలో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న అనేకానేక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వెరైటీగా, ఫ్యాషన్‌గా ఉండాలని ఈ రకమైన విదేశీ వంటల్ని పెళ్లిళ్లలో, పార్టీల్లో సైతం వడ్డించడం ఇప్పుడు పరిపాటైంది. మిగతా ప్రపంచంలో ఫాస్ట్‌ఫుడ్ మార్కెట్ ఏటా 5 శాతం వృద్ధి చెందుతుంటే మనదేశంలో అది దాదాపు 40 శాతం పెరుగుతుండడం గమనార్హం.

పాశ్చాత్యుల నుంచి, అమెరికన్ల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి-వాళ్లు పని పట్ల చూపే శ్రద్ధ, శారీరక శ్రమ పట్ల గౌరవం, సాహసాల పట్ల ఆసక్తి మొదలైనవి. కాని ఒక రైతుగా నేను అనుకునేదేంటంటే ఆహార వ్యవసాయ రంగాల్లో గుడ్డిగా పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది. అందుకే పాశ్చాత్యుల ఆహార, వ్యవసాయ పద్ధతులను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు అసలు మనుషులు ఏం తింటారు, వారి ఆహార అవసరాలేంటి అనే విషయాలు చూద్దాం.

మానవపరిణామ సిద్దాంతం ప్రకారం మనషులు శాకాహారులు. తర్వాత తర్వాత ఇటు మొక్కలను అటు జంతువులను కూడా తినడం నేర్చుకున్నాం. అంతే కాదు.. వండడం, ఆ వంటలను రుచిగాను సునాయాసంగానూ అరిగేలా చేసుకోవడం నేర్చుకున్నాం. జంతువుల మాదిరిగా ఆకలి తీర్చుకోవడానికే కాకుండా బుద్ధిపూర్వకంగా, అనుభవ పూర్వకంగా ఏం తినాలి, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలిగాము. ఏం తినాలి, ఎలా తయారు చేసుకోవాలనే విషయపరిజ్ఞానమే మనకు పాకశాస్త్రాన్ని అందించింది. అంతే కాదు ఆహార సంబంధిత మరో జ్ఞానం వ్యవసాయ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది. పాత వ్యవసాయ పద్ధతుల్లో ప్రకృతి నుంచి తీసుకోవటం మళ్లీ ప్రకృతిలో కలిపేయటం అనేది ఒక ముఖ్య అంశం. దీని వల్ల 'చెత్త' లేదా 'పనికిరాని గడ్డి, గాదం, మిగులు' అనే ప్రశ్నే రాదు. అవన్నీ కూడా వ్యవసాయంలో విలువైన పెట్టుబడి వస్తువులయ్యాయి.

సాంప్రదాయ వ్యవసాయ శాస్త్త్రం శతాబ్దాల అనుభవ ప్రయోగాల ఆధారిత విద్య, జ్ఞానం. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇట్లాంటి విద్యని 'అశాస్త్రీయం' అని, వ్యవసాయ పని నైపుణ్యం లేని అసాంకేతిక పని అని భావించడం జరుగుతున్నది. అట్లాగే వంట, ఆహార పద్ధతులు కూడా ఈ రకమైన అనుభవ ప్రయోగాధారిత విద్య, జ్ఞానాలే. దీన్ని చిన్నచిన్న మార్పులతో కుటుంబాల అవసరాన్ని బట్టి, సామాజిక సంప్రదాయాల్ని బట్టి, పండుగల్ని బట్టి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి... తమకు చాలా ఇష్టమైన పనిగా మలుచుకున్నారు. ప్రతి సమాజం తమతమ అవసరాలను బట్టి అందుబాటులో ఉండే తిండిని అనేక రకాలుగా తీసుకుంటోంది. రోజూ తినాల్సినవి, పండగ రోజుల్లో తినాల్సినవి, జబ్బు పడ్డప్పుడు తినాల్సినవి, గర్భవతులు తినాల్సినవి, పిల్లలు తినాల్సినవి, ఉపవాసాలు, ప్రయాణాలప్పుడు తినాల్సినవి... అలాగే ఆకులు, కాయలు, పండ్లు, చివరికి చెట్టు కాండం, వేర్లు కూడా ఉపయోగించడం, వైద్యానికి వాడుకోవడం అంతా కూడా ఒక పారంపర్య జ్ఞాన సముపార్జన. ఎవరూ నేర్పకుండానే కొత్త తరాలు పాత తరాల నుండి వీటిని గ్రహిస్తాయి. భారతదేశంలో ఇప్పుడున్న జ్ఞానం జిల్లా జిల్లాది. గ్రామ గ్రామానిది. అది ఒక అలిఖిత భాండాగారం.

ఈ పరిస్థితి పారిశ్రామికీకరణ అనంతరం మారుతూ వస్తున్నది. సాధారణంగా ప్రజలు స్థానికంగా దొరికే వాటిని వండుకుని తినేవారు. మాంసాన్ని చాలా తక్కువగా తినేవాళ్లు. ఎక్కువ భాగం శాకాహారమే తినేవారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇదే రకమైన ఆహార అలవాట్లు ఉండేవి. కానీ ఈ మధ్య మాంసం, తీపి పదార్ధాలు తినడం పెరిగిపోయింది.

మిగిలేది పదిశాతమే...


మాంసం కోసం మనం పెంచే జంతువులకు ఆహారం రూపంలో మనం ఇస్తున్న పోషకాలలో 90 శాతం ఆయా జంతువుల శారీరక అవసరాలకి, ఎముకలకు, చర్మానికి, ఇతరత్రా మనకు ఉపయోగం లేని వాటికే పోతోంది. మిగిలిన 10 శాతం మాత్రమే మనకు మాంసంగా లభ్యమవుతుంది. కాని మొక్కలు సూర్యుని నుండి, ప్రకృతి నుండి శక్తిని గ్రహించి ఆ శక్తిని పోషకాల రూపంలో మనకి నేరుగా అందిస్తాయి. ప్రధానంగా మాంసం తినడమనేది ఒక హంగు ఆర్భాటం. ధనికులకు మాత్రమే సాధ్యమైనది. సమాజం అభివృద్ధి చెందుతున్నకొద్దీ జనం ఎక్కువగా మాంసాహారం, తీపి పదార్ధాలు తింటున్నారు. పెరుగుతున్న మాంసాహారఅవసరాలకు సరిపడా ఆయా జంతువులను, పక్షులను పెంచడానికి మళ్లీ అంత మొత్తంలో మొక్కలను, పంటలను పెంచాల్సిన అవసరం ఏర్పడుతున్నది. మన శాకాహార, మాంసాహార అవసరాలకు, జంతువుల శాకాహార మాంసాహార అవసరాలకు కలిపి మనం పంటలని పండించాల్సిన, జంతువుల్ని పెంచాల్సిన అదనపు భారం భూమిపై పడుతున్నది.

విడగొట్టి...కలుపుతారు

మైఖెల్ పొలాన్ అనే అమెరికా పరిశీలకుడి మాటల్లో... "మన సమాజాలు ప్రస్తుతం రెండు జబ్బులతో బాధ పడుతున్నాయి. అవే నియోఫోబియా, నియోఫీలియా- మొదటిది కొత్త రకాలపై భయం, రెండోది కొత్తవాటిపై వ్యామోహం. అమెరికాలో ఈ పరిస్థితి మరింత దారుణం. ఎందుకంటే అమెరికాలో ఉన్న రకరకాల దేశస్తులు వారివారి ఆహార వ్యవసాయ పద్ధతులను తీసుకొచ్చి అక్కడి స్థానిక పద్ధతులను తుడిచిపెట్టడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైపోయింది. అందుకే ప్రస్తుతం అమెరికాలో మెక్సికన్, ఐరిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇథియోపియన్, ఆఫ్రికన్, చైనీస్, జపనీస్, థాయ్...కాక ఈ మధ్య కాలంలో వచ్చి చేరిన ఇండియన్ వంటలు, హోటళ్లు కనపడతాయి.''

అమెరికన్ సూపర్ మార్కెట్లలో రకరకాల ఆహార పదార్ధాలే కాదు, వాటితో పాటు పోషక విలువల, క్యాలరీల పట్టికలు కూడా కనబడతాయి. కొవ్వు పదార్ధాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, పిండిపదార్ధాలు, ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు, యాంటి-ఆక్సిడెంట్లు, షుగర్ ఫ్రీ, కెఫిన్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ... చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టులుంటాయి. ఆ దేశంలో మొదటగా ఆహార పదార్థాలను విడగొట్టి మళ్లీ వాటిని రకరకాల కాంబినేషన్లలో చేర్చి, కూర్చుతారు. వాటికి రంగుల్ని, కృత్రిమ రసాయనాల్ని, విటమిన్లని, పోషకాలని కూడా చేర్చడం జరుగుతుంది. ఇవన్నీ వింటుంటే తల తిరిగిపోవట్లేదూ? "ఈ విడగొట్టడం మళ్లీ కూర్చడం అనే ప్రక్రియలో అమెరికన్లు అసలైన ఆహారాన్ని మర్చిపోతున్నారు, ఆహారం లాంటి వస్తువులను తింటున్నార''ని మైఖెల్ పొలాన్ అంటున్నారు. పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా? ఇంకొంచెం తరచి చూస్తే కాని ప్రస్తుత అమెరికన్ల ఆహార, వ్యవసాయ పద్దతులు అర్థం కావు.

ఆరుసార్లు తింటారు

ఏం తింటారో చూసేముందు ఎలా తింటారో కూడా చూద్దాం. అమెరికన్లు అసలు ఇంట్లో వంట చేయటమనేదే తక్కువ. వాళ్లు తినే ఆహారమంతా కూడా ముందే వండి, తినటానికి సిద్ధంగా ఉండేదే. సూపర్ మార్కెట్ల నుంచి ప్యాకెట్లలో దొరికే ఆహారం తెచ్చుకొని, ఫ్రిజ్‌లో పెట్టుకొని, తినేముందు మైక్రోవేవ్ ఒవెన్లో వేడి చేసుకుని తినటమే వాళ్లు చేసే పని. చాలా సందర్భాల్లో అక్కడి ప్రజలు ఒంటరిగానే తింటారు. అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసినా ఒకే ఆహారం మాత్రం తీసుకోరు. నాన్న కొవ్వు తక్కువుండే ఒమేగా 3 ఎక్కువ ఉండేవి తింటే అమ్మేమో సలాడ్ తింటుంది. పిల్లల్లో ఒకరు తక్కువ క్యాలరీలున్న చేపలు తింటే ఇంకొకరు ఎక్కువ కొవ్వు ఉన్న చికెన్ ఫ్రై తింటారు. ఇలా ఎవరి ఆహారం వారిదే.

ఈ తినడం కూడా ఎక్కువ భాగం కార్లలోనే జరుగుతుంది. అందుకే కప్పులు, ట్రేలు, బాటిల్స్ పెట్టుకొనడానికి వీలుగా కార్లు తయారు చేస్తారు. కార్లలో ఆహారం నిలవ ఉంచుకోవడానికి చిన్న ఫ్రిజ్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికాలో కారు నడుపుతూ తింటూ తాగుతూ కనబడే వాళ్లెంత మందో! ఒకసారి నేను ఒకాయన కారు నడుపుతూ మామిడిపండు తినడం చూశాను. ఆఫీసుల్లో కూడా ఎప్పుడూ చిరుతిళ్లు తింటుంటారు వాళ్లు. పొలాన్ మాటల్లో అయితే సగటు అమెరికన్లు రోజుకు ఆరు సార్లు తింటారు. మూడు ఫుల్ మీల్స్, రెండు మూడు ఫలహారాలు. సూపర్ మార్కెట్ల నిండా తిండి పొంగి పొర్లుతూ కనిపిస్తుంది. కప్పులు, గ్లాసులు అన్నీ సూపర్ సైజుల్లో కనిసిస్తుంటే స్థూలకాయం మహమ్మారిలా వ్యాపించడంలో ఆశ్చర్యమేముంది?

కార్న్ అండ్ కార్ కంట్రీ

అమెరికాని 'కార్న్ అండ్ కార్ కంట్రీ' అంటారు. ఎందుకంటే ఆ దేశంలో కార్లెంత ఎక్కువో మొక్కజొన్న పంట కూడా అంతే ఎక్కువగా పండిస్తారు. వాళ్ల ప్రధాన పంట మొక్కజొన్నే. అందుకే వాళ్లు మొక్కజొన్నను ఎక్కువగా తింటారు. వాళ్ళు తినే బ్రెడ్డులో ఎక్కువ శాతం గోధుమే ఉంటుంది. మరి ఈ మొక్కజొన్నను ఏ రూపంలో తింటున్నారు? మాంసం ద్వారా. ఆశ్చర్యంగా ఉన్నా నిజం అదే.
అమెరికా ఏటా 10 బిలియన్ల మొక్కజొన్న బుషల్స్ (25 కేజీ సంచి)ను పండిస్తుంది. ఇందులో 70 శాతం పశువులకి, కోళ్ళకి, చేపలకి ఆహారంగా వాడతారు. మిగతా దాంతో అనేక ఉత్పత్తులు తయారవుతాయి. మొక్కజొన్నల్లోని పసుపు పచ్చని పై పొరతో విటమిన్లు, పోషక మందులు, వంటనూనె, సిట్రిక్ ఆసిడ్, లాక్టిక్ ఆసిడ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, హెచ్ఎఫ్‌సిఎస్ (హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్) తయారు చేస్తారు. 19 శాతం మొక్కజొన్న వీటి తయారీకే వెళ్తుంది. వీటన్నిటినీ చాలారకాల అమెరికన్ వంటల్లో వాడతారు. అందుకే ఒక అమెరికన్ బయాలజిస్టు "ఉత్తర అమెరికా వాళ్ళందరం మొక్కజొన్నకి కాళ్ళు మొలిచినట్టు ఉండే మనుషులం'' అని అంటారు. ఈ మధ్య మొక్కజొన్న నుండి కార్లకు ఇంధనం కూడా తయారుచేస్తున్నారు. ఇలా ఇంధనంగా మారుతున్న మొక్కజొన్న 330 మిలియన్ల జనాభాకు ఒక సంవత్సరం పాటు ఆహారంగా ఉపయోగించవచ్చునని ఎర్త్ పాలసీ డైరెక్టర్ లెస్పర్ బ్రౌన్ అన్నారు.

మొక్కజొన్న తరువాత ముఖ్యమైన పంట సోయాబీన్. అక్కడ సంవత్సరానికి 2.8 బిలియన్ బుషల్స్ సోయాబీన్ పండుతుంది. దీన్నుండి వంటనూనె, సోయా పిండితో చేసిన సోయామీల్ తయారవుతాయి. ఆ దేశంలో వాడే వంటనూనెలో 80 శాతం సోయానూనే. ఈ నూనెను పారిశ్రామిక అవసరాలకు వాడతారుకూడా. పశువుల దాణాలో కూడా సోయా పిండిని (మీల్) వాడతారు. అందుకే మొక్కజొన్న, సోయాలను నేరుగా తినకపోయినా మాంసం, నూనె, మిగతా ఆహార పదార్థాల (ప్రాసెస్డ్ ఫుడ్) ద్వారా తింటూ ఉంటారు వాళ్లు.

రసాయనాలు మింగితే పోలా!

ప్రతి దానిపైన పోషక విలువల పట్టిక ఉంటుందని ముందే చెప్పాను కదా! ఉదాహరణకు బ్రెడ్ తీసుకుందాం. మామూలుగా బ్రెడ్ తయారీకి ఏమి కావాలి? పిండి, ఈస్ట్, నీరు, చిటికెడు ఉప్పు. కాని ఇప్పుడు అమెరికాలో దొరికే బ్రెడ్డులో ఏమేమి ఉంటాయో మైఖెల్ పొలాన్ మాటల్లో చూద్దాం...'సారా లీస్' అనే పేరుతో మార్కెట్లో లభ్యమయ్యే 'సాఫ్ట్ అండ్ స్మూత్ హోల్‌గ్రెయిన్ వైట్ బ్రెడ్'లో ఉండే పదార్థాల పట్టిక ఈ విధంగా ఉంటుంది.

పోషకాలతో కూర్చిన, బ్లీచ్ చేసిన గోధుమ లేదా బార్లీ పిండి, నియాసిన్, ఇనుము, లియామిన్, మోనో నైట్రేట్, రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, నీరు, గోధుమ, వరిపిండి, హెచ్ఎఫ్‌సిఎస్, పాలు విరగ్గొట్టి అందులోంచి తెల్లపదార్థాన్ని తీసేస్తే వచ్చే నీరు, గోధుమ బంక, ఈస్ట్, సెల్యులోజ్-ఇన్ని ఉంటాయి. ఇవేకాక కొంత మోతాదులో తేనె, కాల్షియం సల్ఫేట్, సోయా, పత్తిగింజనూనె, ఉప్పు, వెన్న, మోనో, డై గ్లిసరైడ్స్, ఆస్కార్బిక్ ఆసిడ్, ఎంజైమ్స్, ఆజో డైకార్బినమైడ్, గౌర్‌గమ్, కాల్షియమ్ ప్రొపైనేట్, తొమ్మిది రకాల ప్రిజర్వేటివ్స్, డిస్పిల్డ్ వినెగర్, ఈస్ట్ న్యూట్రియంట్స్ అయిన మోనో కాల్షియమ్ ఫాస్పేట్, కాల్షియమ్ సల్ఫేట్, కార్న్ స్టార్చ్, రంగుకోసం బీటా కారోటిన్, విటమిన్ డి3, సోయా లెసిథిన్, సోయాపిండి. ఎన్నున్నాయో చూడండి.
అందుకే "సారీ, సారా లీ గారూ. మీరు తయారుచేసేది బ్రెడ్డూ కాదు ఫుడ్డూ కాద''ని పొలీన్ అంటారు.

పోషకాలే విషపదార్ధాలైతే...

ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా తీసుకునే బ్రేక్ ఫాస్ట్ 'ప్యాకేజ్డ్ సిరీల్స్'తో పాటు పాలు. ఈ మధ్య కాలంలో ఇవి తినడం ఫ్యాషనైపోయింది. అందుకే వాటి గురించి తెలుసుకుందాం.
సిరీల్ పేరుతో డబ్బాల్లో లభ్యమయ్యే ఆహార పదార్థాలను 'ఎక్స్‌ట్రూజన్' అనే పద్ధతిలో తయారుచేస్తారు. ఈ పద్ధతిలో ధాన్యాన్ని అత్యధిక వేడికి, ఒత్తిడికి గురిచేస్తారు. తర్వాత వాటిని రకరకాల సైజుల్లో కత్తిరిస్తారు, కొన్ని పేలాల్లా ఉబ్బి ఉంటే కొన్ని నూనె పంచదార అద్దబడి ఉంటాయి. కొన్ని కరకరలాడే అటుకుల్లా ఉంటాయి. పాలల్లో వేసినా మెత్తబడక కరకరలాడడం వీటి ప్రత్యేకత. పాల్ స్పిట్ అనే ప్రఖ్యాతి గాంచిన పోషక శాస్త్రజ్ఞుడు ఈ పద్ధతిని నిశితంగా విమర్శిస్తూ చెప్పేదేమిటంటే... అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిల మూలాన ధాన్యంలో ఉండే పోషకాలన్నీ నశిస్తాయి. అంతేకాక వాటిలోని ప్రొటీన్లు విషపదార్థంగా మారుతాయి. అయినా ఇట్లాంటి సిరీల్స్‌నే అమెరికన్లు ప్రతి ఉదయం పనిగట్టుకుని తింటారు. హెల్త్‌ఫుడ్ స్టోర్స్‌లో దొరికే సిరీల్స్ కూడా ఇలాంటివే అని న్యూట్రిషన్ జర్నలిస్ట్ శాలీ ఫాలోన్ చెపుతున్నారు.

ఆ పాలవల్ల గుండెజబ్బులొస్తున్నాయట

పాలు మంచి పౌష్టికాహారమే. అయితే ఆ పాలని అనేక రకాలుగా ప్రాసెసింగ్ చేస్తారక్కడ. మొదటగా 'సెంట్రిఫ్యూజ్' అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్‌ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్‌క్రీం కంపెనీలకు అమ్మి, మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని 'పాశ్చురైజేషన్' చేస్తారు. అంటే ఎక్కువ వేడి, వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని,సూక్ష్మజీవులను చంపేయడమనే ప్రక్రియ.

ఇక్కడ మనం 'పాలపొడి'ని వాళ్లు ఎలా తయారుచేస్తారో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తాగే పాకెట్ పాలన్నీ కూడా పాలపొడితో కూడినవే. ఎక్కువ వత్తిడితో ఒక చిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి పిచికారీ చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కాని ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని, గుండె జబ్బులకి, రక్తనాళాల జబ్బులకు కారణమౌతుందని శాలీ ఫాలోన్ చెప్తున్నారు. తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదని వాటిని వాడుతుంటే నిజానికి వాటివల్లే గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి.

చికెన్‌లో కూడా అంతే...

'మాక్ డొనాల్డ్స్' కంపెనీ నడిపే హోటల్స్‌లో మాక్ నగ్గెట్స్ అనే చికెన్ వడ్డిస్తారు. ఇందులో ఏమేమి ఉంటాయో మైఖెల్ పొలాన్ చెపుతున్నారు... "మాక్ నగ్గెట్‌లో మొక్కజొన్న నుంచి సేకరించిన 13 రకాల పదార్థాలుంటాయి. మొక్కజొన్నని తిన్న కోళుతో సహా మోడిఫైడ్ కార్న్ స్టార్చ్‌ను రుబ్బిన కోడి మాంసాన్ని వాడతారు. మోనో, ట్రై-డై గ్లిసరైడ్ లను కొవ్వును నీటిని కలవకుండా ఉంచడానికి, చికెన్ బ్రాత్ అంటే చికెన్‌ను ఉడకబెట్టిన నీటిని సువాసన కోసం ఉంచుతారు. పసుపురంగు మొక్కజొన్న పిండిని మొక్కజొన్న నూనెతో చేసిన వనస్పతి కూడా కలుపుతారు. మాంసం నిలువ ఉంచడానికి సిట్రిక్ ఆమ్లాన్ని కలుపుతారు. ఇవికాక డెక్స్‌ట్రోస్, లెసిథిన్, మరికొన్ని రసాయనాలు కూడా కలుపుతారు.

కొన్ని రసాయనాలు చికెన్‌ను కొన్ని నెలల పాటు కుళ్ళకుండా, చెడిపోకుండా ఉంచుతాయి. అవి సోడియం అల్యూమినియమ్ ఫాస్ఫేట్, మోనో కాల్షియమ్ ఫాస్ఫేట్, సోడియమ్ యాసిడ్ పైరో ఫాస్పేట్, కాల్షియమ్ లాక్టేట్. చికెన్ ముక్కలపై నురుగు రాకుండా ఉంచడానికి 'యాంటి ఫోమింగ్ ఏజెంట్స్' అయిన డి మిథైల్ పాలిసైలాక్సిన్‌ను వంటనూనెలో కలిపి వాడతారు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని, శరీరంలో ట్యూమర్లకు దారితీస్తుందని, పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుందని గుర్తించారు కూడా. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన టెర్షియరీ బ్యుటైల్ హైడ్రో క్వినైన్ (టిబిహెచ్ఆర్)అనే యాంటీ ఆక్సిడెంట్ ను కూడా వాడతారు దీన్లో. దీన్ని పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేస్తారు. దీన్ని నగ్గెట్ పైన చల్లడం వల్ల చికెన్ 'ఫ్రెష్'గా ఉంటుంది. చాలా తక్కువ మోతాదులో వాడతారు కాని అయినా ఒక గ్రాము టిబిహెచ్ఆర్ తీసుకోవడం వల్ల వాంతులు, చెవుల్లో హోరు, మైకం, గాబరా, కళ్ళు తిరగడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఐదు గ్రాముల టిబిహెచ్ఆర్‌తో ఒక మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న తరువాత కూడా చికెన్ నగ్గెట్ ఎలా తింటాం?

అమెరికన్ సూపర్ మార్కెట్లలో రకరకాల పండ్ల రసాలు లభిస్తాయి. క్యారెట్, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, బత్తాయి, నిమ్మ, కొబ్బరి నీళ్లు వాటిలో కొన్ని. బత్తాయి పండ్ల రసం కూడా స్వచ్ఛమైంది కాదని తేలుతోంది. బత్తాయి పంటపై అధిక మోతాదులో పురుగుమందులను పిచికారి చేస్తారు. రసం తీసేటప్పుడు వాటిని తోలుతో సహా పెద్దపెద్ద మెషీన్లలో పిండుతారు కాబట్టి పురుగు మందుల సారం కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. రసం చెడిపోకుండా ఉండడం కోసం వేడి చేసి అందులో యాసిడ్‌ని కలిపి చిక్కదనం తీసుకురావడానికి సోయా ప్రొటీన్‌ను, విటమిన్లు, మినరల్స్ కూడా చేర్చి... పాకెట్లు లేదా బాటిళ్ళలో నింపుతారు. ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ఇంత ప్రయాస అవసరమా? ఇంట్లోనే ఒకటో, రెండో ఆరెంజ్‌ల రసం తీసుకుంటే పోలా!

...అందుకే సేంద్రీయమే గతి

ఇవన్నీ తెలిశాక-ఈ మధ్య అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. రసాయన మందుల్లేకుండా పండిన పంటలను, స్థానికంగా లభ్యమయ్యే వాటిని, అతిగా ప్రాసెసింగ్ కాని ఆహార పదార్థాలనే ఎక్కువమంది కోరుకుంటున్నారు. దాంతో సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారానికి డిమాండ్ పెరిగింది. అక్కడ రెండు రకాలుగా ఈ ఉద్యమం జరుగుతోంది. మొదటి గ్రూపు పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళకి ఉన్న వేలాది ఎకరాల్లో కొంత భాగం మందుల్లేని సేద్యం చేసి, పెద్ద ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారు. వీటిని వ్యతిరేకిస్తూ రెండవ గ్రూపు చిన్నచిన్న పొలాల్లో రసాయన మందుల్లేకుండా సేద్యం చేస్తూ దగ్గర్లో ఉన్న మార్కెట్లకు, చిన్నచిన్న అంగళ్లకు, హోటళ్లకు సరఫరా చేస్తోంది.
ఇదే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆశ. ఈ ఉద్యమం విస్తృతమవ్వాలని కోరుకుందాం.

వ్యాసకర్త ఇ-మెయిల్: umanarendranath@yahoo.co.in
మొబైల్: 99897 98493
అనువాదం : సత్యలక్ష్మి

Tuesday, November 2, 2010

ఆయుర్వేదంలో రసాయన చికిత్స

ayurveda-mసుదీర్ఘ కాలం జీవించడం ఎలా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తూ వచ్చిన ప్రశ్న. కేవలం సుదీర్ఘ కాలం జీవించడమే కాదు జీవితంలో అన్ని సంతోషాలనూ అనుభవిస్తూ జీవించాలని కోరుకుంటాడు. మానవుడు 125-150 ఏళ్ళ వరకూ భౌతికంగా జీవించగలడు. అంత సుదీర్ఘ కాలం మనుషులు జీవించినట్టు రికార్డులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వయసు మీద పడడానికి ప్రాథమిక కారణాలు జన్యుపరమైనవి. వాటిని తప్పించుకోలేం. జన్యుపరంగా భౌతిక స్వరూపం, శరీర తత్వం వ్యక్తులకు ముందస్తుగా నిర్ణయించిన జీవితకాలం ఉంటుంది. నివారించగల ఇతర కారణాలలో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, విటమిన్లు, ఎంజైములు, హార్మోన్లు, ఇతర కీలక పదార్ధాల లోటు. వీటివల్ల ప్రాణాలకు భంగం నేరుగా వాటిల్లకపోయినప్పటికీ కణజాలాన్ని, ధాతువులకు సరిచేయలేని హాని కలిగించి తద్వారా జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.

రసాయన చికిత్స శరీరానికి బలాన్ని, ఉత్తేజాన్ని కలిగించి వ్యాధులను నివారించే చికిత్స. శరీరంలోని రసాది సప్త ధాతువుల సమగ్రతకు దోహదం చేస్తూ సుదీర్ఘ కాలం జీవించేందుకు తోడ్పడుతుంది. జీవక్రియలలో మార్పులను సవరించే సామర్ధ్యం కలిగిన రసాయనం మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ సంపూర్ణంగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతుంది. అది జీవిత కాలాన్ని పొడిగించడమే కాదు జీవితాన్ని గుణాత్మకంగా మెరుగుపరుస్తుంది.

rasayana-chikitsaరసాయన చికిత్సలో ఉపయోగించేందుకు అనేక మందులను సూచించారు. వైద్యపరమైనవి కాని వాటిలో నిత్యం ఆహారంలో నెయ్యి తీసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం వ్యక్తి సుదీర్ఘ కాలం జీవించడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. అష్టాంగ ఆయుర్వేదలో రసాయన చికిత్స కీలకమైన శాఖ. ఆరోగ్యమైన వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, వ్యాధుల బారిన పడిన వారికి శరీర బలం, ఉత్తేజం పెంచడం ద్వారా వ్యాధిని చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. రసాయన చికిత్సలో భాగంగా రస, ఇతర ధాతువులను పరిపుష్టం చేస్తారు. నిర్వహణ దృక్కోణం నుంచి చూస్తే రెండు రకాల రసాయన చికిత్సలు ఉంటాయి:

1. కామ్య రసాయన: ఒక నిర్ధిష్ట లక్ష్యం కోసం చేపట్టినది
2. నైమిత్తిక రసాయన: వ్యాధి తగ్గిన తరువాత కోలుకోవడానికి ఇచ్చే పునరుద్ధరణ టానిక్కులు
3. ఆజస్రిక రసాయన : రోజువారీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
ఆయుర్వేదంలో పేర్కొన్న రసాయన ఓషధులు, సమ్మిళిత ఔషధాలు ఎన్నో ఉన్నాయి. 1.హరితకి 2. ఆమ్లకి 3. విభితకి
దిగువన ఒకటి లేదా రెండు లేదా ఈ మూడు ప్రధాన వస్తువులను మేళవించి చేసిన ఔషధాలు:
బ్రహ్మ రసాయ చ్యవన ప్రాస, ఆమలకా రసాయన, హరితక్యాది రసాయన, హరితక్యాది యోగ, త్రిఫల రసాయన.

విదంగ - విదంగ అవలేహ------------ నాగబల - నాగబల రసాయన
భల్లాతక - భల్లాతక సర్పి, భల్లాతక క్షీర, గుడ భల్లాతక, భల్లాతక తైలం,
లోహ - లోహాది రసాయన, బ్రాహ్మ రసాయన పిప్పలి - పిప్పలి రసాయన, పిప్పలి వర్ధమాన రసాయన
మండూక పర్ణి స్వరస --- యష్టిమధు చూర్ణ --- శంఖపుష్పి కల్క శిలాజిత్‌ --- బాల - బాలకల్ప --- వరాహి కంద
బ్రాహ్మి రసాయ, ---బ్రాహ్మి కల్ప-- వచ వచ రసాయన సువర్ణ ----- శతావరి - శతావరి ఘృత---- అరవింద రసాయన ---- గోక్షుర రసాయన
తువారక రసాయన ---- పునర్నవ, భృంగరాజ రసాయన నరసింహ ఘృత.
వాత ప్రకృతి ఉన్న వ్యక్తులను పాలు, పిత్త ప్రకృతి ఉన్నవారిని నెయ్యి, కఫ ప్రకృతి ఉన్న వ్యక్తులను తేనె, రక్త ప్రకృతి ఉన్నవారిని చల్లటి నీటినీ ఆహారానికి ముందు తీసుకోమని సూచిస్తారు. ఇది అవసరమైన రసాయన ప్రభావాన్ని చూపి వార్ధక్యాన్ని నిరోధించేందుకు ఈ సూచనలు చేస్తారు.
సుదీర్ఘ జీవితానికి, పటిష్టతకు ముందుగా శరీర శుద్ధి చేసుకోవాలని సూచిస్తారు. ఇందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ ఎంతో ఉపయోగపడుతుంది. రసాయన ఔషధాలను ఇచ్చే ముందు శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. వమన, విరేచన, బస్తి, రక్తమోక్షన, స్వేదన అనేవి పంచకర్మలోని శుద్ధి ప్రక్రియలు. శరీర మసాజ్‌లు, పిండ స్వేద, ధారా, పదాభ్యంగన అనేవి శరీరానికి పునశ్శక్తినిచ్చే చికిత్సలు.

గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను, ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు..
డా స్వాతి, ఎం.డి. (ఆయుర్వేద)
డా ప్రసాద్‌, ఎం.డి.(ఆయుర్వేద)

Sunday, October 31, 2010

విటమిన్‌‘బి’తో నిరాశ దరిచేరదు

vitamin-b12-deficiency
గుండెనొప్పికి గురైన వారు క్రమం తప్పకుండా విటమిన్‌ ‘బి’ టాబ్లెట్స్‌ వాడితే నిరాశ(డిప్రెషన్‌) ఛాయలు వారి దరిచేరే అవకాశం చాలా తక్కువుగా ఉంటుంది. అంతేకాకుండా మళ్లీ గుండెనొప్పి వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు ఒక నూతన అధ్య యనంలో కనుగొ న్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా నేతృ త్వంలోని అంతర్జా తీయ పరిశోధకుల జట్టు ఈ విషయాన్ని స్పష్టంగా రుజువు చేయగలి గారు. డిప్రెషన్‌ నుంచి నిశ్చి తమైన కొన్ని విటమిన్లు మాత్రమే సంరక్షిస్తా యని గతంలో చేసిన పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెపోటు నుంచి బయటపడి, ప్రతిరోజూ ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి6, విటమి న్‌ బి12 టాబ్లెట్లను తీసుకునే వారిలో సగం మందికి డిప్రెషన్‌కు గుర య్యే అవకాశము లేకపోలేదు. ‘గుండెపోటు వచ్చిన వారు డిప్రెషన్‌కు లోనవటం సర్వ సాధారణం.ముగ్గురిలో ఒకరు దీని బారిన పడ తారు.


VITAMIN-B-COMPLEX-EU
మళ్లీ గుండెపోటు రాకుండా, డిప్రెషన్‌ దరిచేరకుండా ఉండేం దుకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని’ పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ ఆస్వాల్డ్‌ అల్‌మిదా పేర్కొన్నారు. ఎక్కువ మోతాదులో విటమిన్‌ ‘బి’ తీసుకునే గుండె రక్తనాళాల వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిం చారు. ఎందుకంటే అధిక గాఢత గల అమినో యాసిడ్లు వల్ల డిప్రె షన్‌ పెరిగే అవకాశముంది. ఒక్కొక్కసారి విటమిన్‌ ‘బి’ ఎక్కువుగా తీసుకుంటే గుండె రక్తనాళాల సం బంధిత సమస్యలు వచ్చే అవకాశము ఉంది. ఈ విటమిన్‌ టాబ్లెట్లు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరేళ్ల పాటు విటమిన్‌ టాబ్లెట్లు వాడితే రక్తనాళమయ వ్యవస్థలో క్రమేపి మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.