ఔషద మొక్కల మిశ్రమంతో తయారు చేసిన తైలాలే కాకుండా జంతు శరీర భాగాలను కలిపి చేసే తైలాలు కూడా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో కుట్లు వేయకుండానే గాయాలను మాన్పే శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు, డె ర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, దెబ్బలవల్ల ఏర్పడిన పుండ్లు, వెరికోస్ అల్సర్ల వంటివి ఈ తైలాలతో చాలా త్వరగా మానిపోతాయి.
అలాగే చర్మం ముడతలు, మొటిమల కారణంగా ఏర్పడే సన్నని గుంటలు ఇలా ఎన్నో రకాల సమస్యల నివారణలో ఆయుర్వేద తైలాలు గొప్పగా తోడ్పడతాయి. అలాంటి కొన్ని తైలాల వివరాలు మీకోసం...
తిలల (నువ్వులు) నుండి తీసిన నూనెలను తైలాలు అనడం పరిపాటి. అయితే ఆ తరువాత తిలల వంటి ఇతర నూనె గింజల నుండి తీసిన తైలాలను కూడా తైలాలుగానే పిలవడం మొదలయ్యింది. తైలాలకు ఔషధ మొక్కల కల్కాన్ని కలిపి తైలపాక విధిలో తయారుచేసిన నూనెల్ని కూడా తైలాలుగానే గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేద తైలాలుగా బాగా ప్రసిద్ధి పొందాయి.
అయితే ఔషధ మొక్కలు కాకుండా కొన్ని జంతువుల భాగాలు తీసుకుని నూనెల గింజల నుండి తీసిన నూనెను కలిపిగానీ లేదా కలపకుండా గానీ కొన్ని తైలాలను తయారు చేస్తారు. అందులో భాగంగా ఈము పక్షి కొవ్వు, కాడ్ చేప లివర్ ఇలాంటివి తీసుకుని తైలపాక విధానం లేకుండా తైలాలు తయారు చేస్తారు. ఇందుకు భిన్నంగా అండతైలం (గుడ్డు నూనె), మూషికా తైలాలను మాత్రం తైలపాకవిధిలో తయారు చేస్తారు.
ఈము తైలం
ఈము ఒక ఆస్ట్రేలియన్ పక్షి పేరు. ఈ పక్షి వీపు పైన ఉండే కొవ్వును కరిగించడం ద్వారా ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు చాలా త్వరగా మానిపోయే అవకాశం ఉంది. గాయాలతో ఏర్పడిన మచ్చలు, అలాగే కీలాయిడ్స్‌ను నిరోధించడంలోనూ ఈ తైలాలు ఎంతో తోడ్పడతాయి. * క్రిమి, కీటకాలు కుట్టడం వల్ల కలిగే నొప్పి, దురద, మంట వాపులు ఈ తైలం రాస్తే తగ్గుముఖం పడతాయి. * డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వ్యాధుల్లో చర్మం పైనున్న తేమ తగ్గి పొలుసులుగా రాలుతూ ఉంటుంది. పైగా వాపు, దురద కూడా ఉంటాయి. ఆ భాగాల్లో ఈ తైలాన్ని రోజూ రాస్తే మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంలోని తేమ ఇగిరిపోకుండా ఉంటుంది.
* గాయాలు కండరాల లోతుల్లోకి వె ళ్లినప్పుడు కొందరిలో గాయం పైకి కనిపించకపోవచ్చు. కానీ, కమిలినట్లు నల్లబడుతుంది. అలాంటి వాటి పైన ఈ తైలం రాస్తే వారంలోపే తగ్గిపోతుంది.
* ఈ తైలంతో మర్ధన చేస్తే చర్మ ముడతలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి కొందరిలో వచ్చే అకాల వృద్దాప్య లక్షణాలకు ఈ తైలం సంజీవని లాంటి ది.
* శరీరం బరువు పెరగడం వల్లగానీ, గర్భధారణ వల్లగానీ ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించడంలోనూ ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
* మొటిమలను తగ్గించడంలోనూ, మొటిమల కారణంగా ఏర్పడే పలుచని గుంటలను నివారించడంలోనూ ఈ తైలంతో చేసే ఫేషియల్స్ ఉపయోగపడతాయి.
చేపనూనె:
'కాడ్' అనే చేప లివర్ నుండి తీసిన కాడ్ లివర్ ఆయిలే చేపనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ తైలంలో విటమిన్-ఎ, డిలతో పాటు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉపయోగాలు
* ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మం పొడిబారే వ్యా«ధులకు ఈ తైలం క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటే క్రీముగా చర్మంపై పూతగా వాడితే దురదలు తగ్గుతాయి.
* ఇందులోని విటమిన్లు యాంటిఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ చర్మాన్ని కాపాడ తాయి.
గుడ్డు సొన నూనె
విరివిగా దొరికే అవకాశం ఉన్నందున ఈ తైలం తయారీకి కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. ఈ తైలంలోనూ ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఉపయోగాలు:
చి కాలిన గాయాలకు, దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన పుండ్లకు, వెరికోస్ అల్సర్లకు ఈ తైలంతోవేసే పూత ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలు చాలా త్వరగా కూడా మానతాయి.
చి ఈ తైలానికి తగు నిష్పత్తిలో కొబ్బెరినూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మూషికా తైలం ఎలుక మాంసానికి నువ్వుల నూనె చేర్చి తయారు చేసే తైలమిది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే కండరాలు తెగి వాలిపోయేటంతటి పెద్ద గాయాలు కూడా చాలా త్వరగా మానతాయి. * ఈ తైలం రాచపుండ్లు మానడంలోనూ బాగా తోడ్పడుతుంది.
* చర్మం పైన ముడతలు తగ్గడానికి, జారిన అవయవాలు (ప్రొలాప్స్ యుటెరస్/ రెక్టమ్) బిగువు పొందడానికి కూడా ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

No comments:
Post a Comment