ఆపిల్ పండు తినేటప్పుడు తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా? వద్దండి బాబూ. ఆపిల్ తొక్కలో క్యాన్సర్ కణాలను చంపే పన్నెండు రకాల పదార్థాలు ఉన్నాయట. కొర్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడయింది. ఆపిల్ తొక్కలో ఉన్న పదార్థాలను ట్రైటర్‌పెనాయిడ్ అని అంటారు.
ఇవి కాలేయం, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ కణాలను చంపడం లేక పెరగకుండా చేయడం చేస్తాయి. ఎర్రటి ఆపిల్‌పండ్ల నుంచి సేకరించిన తొక్కలపై జరిపిన పరిశోధనలో ఇది రుజువయింది. అంతేకాకుండా ఆపిల్స్‌లో ఫైటో కెమికల్స్, ఫ్లేవానయిడ్స్, ఫెనోలిక్ ఆసిడ్స్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ యాంటీక్యాన్సర్ గుణాలున్నాయి. సో..ఇక నుంచి తొక్కను వదిలేయకుండా తినేయండి.

No comments:
Post a Comment