తల్లిపాలే శ్రేయస్కరం
శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. కానీ కొందరు తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్‌పై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువు, ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టిన కొంతసేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం.
నవమాసాలు మోసే తల్లి తన రక్తమాంసాలను పంచి ఇచ్చి శిశువుకు జన్మనిస్తుంది. తొమ్మిది నెల ల పాటు తల్లి గర్భంలో పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. అనంతరం శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావ డం ప్రారంభమవుతాయి. సృష్టి కార్యంలో ఈ ప్రక్రియ ఓ భాగంగా కొనసాగుతూ వస్తోంది.
తల్లి పాలే ఆరోగ్యం...
శిశువుకు జన్మనిచ్చిన కొంతసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్క రం.సాధారణ కాన్పు జరిగిన వారు ఒకటి, రెండు గంటల్లోపే సిజేరియన్ జరిగిన వారికి నొప్పి తగ్గిన 4,5 గంటల్లోపే బిడ్డకు పాలివ్వవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యంగా, అవసరమైన బరువుతో పెరగగలుగు తుంది.దీంతో పిల్లలకు విరోచనాలు సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్య లు ఎదురుకావు. తల్లి పాలు పిల్లకు తొందరగా జీర్ణమవుతాయి. తల్లిపాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కాల్షియం, పొటాషి యం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగగలుగుతుంది.
తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్‌తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైర స్ ఇన్‌ఫెక్షన్స్, అలర్జీ రాకుండా ఉంటాయి. ఈ పాలల్లో ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ ఉంటాయి. దీం తో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బా పాలివ్వడానికి సమయం పడుతుంది.బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే స్ర్తీలకు వెంటనే ప్రెగ్నెన్నీ రాకుండా ఉంటుంది. పాలివ్వడం మూ లంగా తల్లిలో యూటెరస్ తిరిగి మామూలు సైజు కు చేరుకుంటుంది.
మానసికంగా సిద్ధం చేయాలి...
మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలి చ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి.7,8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీ నివల్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయ త్నించాలి. బిడ్డకు పాలిచ్చే బ్రెస్ట్ నిపుల్‌ను కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నిపుల్ వెనక్కి ఉంటే పు ట్టిన బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బందులు ఎదుర వు తాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరి చేయాలి. పాలిచ్చేటప్పుడు నిపుల్ చుట్టూ శు భ్ర పర్చుకోవాలని తల్లులకు చెప్పాలి.
ఆరు నెలల వరకు తప్పనిసరిగా...
తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు, పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాన్ని అందజేయ డం మంచిది. ఇక బిడ్డకు ప్రతి రెండు, మూడు గం టలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే నాలుగు గంటల కైనా పాలివ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం అయిదు నిమిషాలైన పాలి వ్వాలి. పెరుగుతూ ఉండే శిశువుకైతే 10,15 నిమి షాల పాటు పాలిస్తే మంచిది. కడుపునిండా పాలు తాగగానే పిల్లలు వెంటనే పడుకుంటారు.
తల్లి పాలిచ్చినా ఇంకా ఏడుస్తుంటే బిడ్డకు పాలు సరిపో లేదన్న విషయాన్ని గమనించి బాటిల్‌తో పాలు తాగించాలి. సిజేరియన్ ఆపరేషన్ జరిగిన మగు వలు ప్రారంభంలో పడుకొని పాలిచ్చిన నొప్పి తగ్గిన తర్వాత కూర్చొని పాలివ్వాలి. కూర్చొని పిల్లలకు పాలిస్తేనే మంచి దన్న విష యాన్ని గమనించాలి. దీంతో శిశువు కడుపునిండా పాలు తాగగ ల్గుతాడు. పాలు తాగిన తర్వాత బిడ్డను భుజంపై వేసుకొని కొద్ది గా జో కొడితే పాలతో పాటు వెళ్లే గాలి మూలంగా వాంతులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేస్తే శిశువుకు పాలు వెంటనే జీర్ణం అవుతాయి.
వయస్సు పెరిగిన కొద్ది సమస్యలు...
వయస్సు పెరిగిన తర్వాత డెలివరీ అయ్యే స్ర్తీలల్లో పాలు రావడం తగ్గుతుంది. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత కాన్పు జరిగే వారిలో ఈ సమస్య ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగా గర్భం ధరించడం శ్రేయస్కరం. పిల్ల లకు పాలివ్వడంలో ఎటువంటి టెన్షన్ పడకూ డదు. ప్రశాంతంగా పాలిస్తేనే తల్లి బిడ్డకు సక్రమం గా పాలివ్వగల్గుతుంది. కొందరు స్ర్తీలలో కొన్ని రకా ల ఆరోగ్య సమస్యలతో సరిగ్గా పాలు రావు. బిపి, గుండె సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళల్లో ఈ సమస్య ఉంటుం ది.
పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షి యం, ఇతర మందులను అందజేస్తా రు. ఈ మహిళలు ఎక్కువ క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహా రంతో పాటు పాలు, బ్రెడ్, రొట్టెలు తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు తల్లి బిడ్డకు తగినంత పాలివ్వగల్గుతుంది. తల్లి పాలు కడుపు నిండా తాగిన పిల్లలు అవసరమైన బరువు పెరుగుతారు. కొందరు తమ బిడ్డకు ఎక్కువగా పాలిస్తారు. ఇది మంచిదికాదు. దీంతో శిశువుకు వాంతులు రావడం జరుగుతుంది.
ఆరోగ్య సమస్యలకు వెంటనే వైద్యం...
బ్రెస్ట్‌లో ఇన్‌ఫెక్షన్, గడ్డలు ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సరిగా పాలివ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడే వెంటనే డాక్టర్‌తో చికిత్స చేయించు కో వాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు పట్టేసి పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించా లి. తల్లిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు సోకవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలి.
తీవ్రమైన గుండె వ్యాధుతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్ తో సైకోస్‌గా మారిన వారు సైతం తమ పిల్ల లకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటు వంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం శ్రేయస్కరం.తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమో ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నది. మహిళలు అపోహలు వీడి బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది.
-డా. పద్మావతి
- గైనకాలలజిస్ట్
- గైనకాలలజిస్ట్
No comments:
Post a Comment